దక్షిణ భారత చలనచిత్రంలో చాలా మంది నటీనటులు అద్భుతమైన నటనతో మిలియన్ల కొద్ది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ప్రతిభావంతులైన నటులకు కొదువ లేదు.. ఒక రకంగా నటీనటుల ఆయుధాగారం అని కూడా చెప్పవచ్చు. వారి నటనా నైపుణ్యాలతో ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఈ నటీనటుల విద్యాపరమైన విషయాలు చాలా మందికి అంతగా తెలియదు. దక్షిణ భారతదేశంలోని కొంతమంది పాపులర్ యాక్టర్స్ విద్యాపరమైన విజయాలను మీరూ తెలుసుకోండి.
సాయి పల్లవి
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి. ఈ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి. ఆమె సహజమైన నటనా శైలికి అనేక రకాల భావోద్వేగాలను చిత్రీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆమె జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల (TBILISI State Medical University) నుంచి MBBS లో పట్టా పొందారు. వైద్యవిద్య పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
ప్రభాస్
సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్‌ను దాటి హాలీవుడ్‌పై కన్నేసిన స్టార్ హీరో ప్రభాస్. మొదట బాహుబలితో తన రేంజ్ ఏంటో భారతీయ సినిమాకు పరిచయం చేశాడు ప్రభాస్. కల్కి చిత్రంతో హాలీవుడ్‌లో కూడా పాగా వేయాలనే ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో టెక్నాలజీ (బీటెక్)లో బ్యాచిలర్ డిగ్రీని పొందారని మీకు తెలుసా..? గోపిచంద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ ప్రభాస్‌కు మంచి స్నేహితులు
రకుల్ ప్రీత్ సింగ్
మనలో చాలా మందికి గణితం ఎప్పుడూ భయంకరమైన సబ్జెక్ట్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. ఆమె జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాదించింది.
రష్మికా మందన్న
నేషనల్ క్రష్ రష్మికా మందన్న సౌత్ ఇండియాలో మొదటి గుర్తింపు వచ్చినా పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంది. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత బెంగళూరులోని M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అలా ట్రిపుల్ గ్రాడ్యుయేట్ సాదించింది.
నాగార్జున అక్కినేని
భారతీయ సినిమాకు నటుడు, నిర్మాత నాగార్జున అక్కినేని అందించిన సహకారం అసాధారణమైనది. ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆయన విద్యా ప్రయాణం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. USAలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.S.) పూర్తి చేశాడు
కార్తీ
తమిళ స్టార్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. అతను చెన్నైలోని క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. USAలోని న్యూయార్క్‌లోని బింగ్‌హామ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
విక్రమ్
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో విభిన్నమైన నటుడిగా చియాన్ విక్రమ్‌కు గుర్తింపు ఉంది. తన సహజమైన నటనా శైలికి ప్రేక్షకులు ఫిదా అవుతారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. చియాన్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి MBA పట్టా పొందాడు.
మాధవన్
రంగనాథన్ మాధవన్ ప్రముఖ భారతీయ నటుడే కాదు ఒక రచయిత, సినీ నిర్మాత కూడా. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు. బీహార్‌లో తమిళ కుటుంబంలో ఆయన జన్మించారు. , కొల్హాపూర్‌లోని రాజారాం కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తర్వాత ముంబైలోని కిషిన్‌చంద్ చెల్లారం కళాశాల నుంచి పబ్లిక్ స్పీకింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పొందాడు ఆయన ఒక వక్త కూడా.
Comments
Please login to add a commentAdd a comment