![Bigg Boss Telugu 6 Diwali Special: Karthi, Anjali Special Guests, Watch Promo - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/23/bigg-boss-diwali.gif.webp?itok=bmD8wZnF)
బిగ్‌బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకు దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. సెలబ్రిటీల రాకతో నేటి ఎపిసోడ్ చిచ్చుబుడ్డిలా పేలనున్నట్లు కనిపిస్తోంది. కార్తీ, అంజలి స్టేజీపైకి వచ్చి హౌస్‌మేట్స్‌తో ముచ్చటించగా హైపర్ ఆది తన పంచులతో కంటెస్టెంట్లను ఓ ఆటాడుకున్నాడు. శ్రీరామచంద్ర పాటలతో ఆకట్టుకోగా రష్మీ, అవికాగోర్ డ్యాన్స్ చింపేశారు.
అంజలి కోసం అద్భుతమైన పాట పాడాడు రేవంత్. హీరో కార్తీ దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్స్ తీసుకొచ్చానన్నాడు. కానీ అది వారు పొందేందుకు గేమ్ ఆడించాడు. అలాగే ఇంట్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల గెటప్‌లు వేసుకుని డ్యాన్స్ చేశారు. ఓవైపు ముఖాన గడ్డం పెట్టుకుని చీర కట్టుతో కనిపించిన వాళ్లను చూసి నాగార్జున ఈ ఘోరం నేను చూడలేను బాబోయ్ అంటూ కళ్లు మూసుకున్నాడు. మరి ఈ పటాకా ఎపిసోడ్ చూడాలంటే నేడు సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూడాల్సిందే!
చదవండి: తమ్మీ, నీకు అడుక్కు తిందామన్నా దిక్కుండదు: ఆరోహి
బిగ్‌బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికుందో చెప్పిన హౌస్‌మేట్స్!
Comments
Please login to add a commentAdd a comment