
బిగ్‌బాస్ షో ఎంతమందితో ప్రారంభమైనా గెలిచేది ఒక్కరే. కానీ మొట్టమొదటిసారి బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 బిగ్‌బాస్ సీజన్లు జరగ్గా ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు విజేతలుగా నిలిచారని తెలిపాడు నాగ్. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు. కప్పు ముఖ్యం బిగిలూ అనుకున్న రేవంత్ డబ్బులను లెక్కచేయకుండా ట్రోఫీ ఎత్తుకుని విన్నర్‌గా అవతరించాడు. అంతేకదా అనుకుంటున్నారేమో!
చివర్లో అసలైన ట్విస్ట్ బయటపెట్టాడు నాగ్. ప్రేక్షకులు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లేసి గెలిపించారని వెల్లడించడంతో అతడి ముఖం మతాబులా వెలిగిపోయింది. అదే సమయంలో ట్రోఫీ నాదే అని షో మొదటి రోజు నుంచే కలలు కంటున్న రేవంత్ ముఖం వెలవెలబోయింది. అయినా నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్‌కేస్ మాయ వల్ల శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకుని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం విజేతగా నిలవగా.. కప్పు అందుకుని రేవంత్ విన్నర్ అయ్యాడు.
చదవండి: ముద్దు పెట్టుకోబోయిన నాగ్.. మెలికలు తిరిగిన ఫైమా
విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలంటే?
Comments
Please login to add a commentAdd a comment