డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్‌: నాగార్జున | Nagarjuna Akkineni Comments On Satyam Sundaram Movie | Sakshi
Sakshi News home page

డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్‌: నాగార్జున

Sep 30 2024 2:01 PM | Updated on Sep 30 2024 2:56 PM

Nagarjuna Akkineni Comments On Satyam Sundaram Movie

కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసింది. తమిళ్‌లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కుటుంబ కథా చిత్రంగా విడుదలైన  ‘సత్యం సుందరం’ పట్ల ప్రేక్షకులు ఆధరణ భారీగానే ఉంది. పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగార్జున..  చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమాకు ప్రధాన బలం అయిన కార్తీ, అరవింద్‌ స్వామి నటనకు ఆయన ఫిదా అయ్యారు.

'డియర్ కార్తీ, నిన్న రాత్రి 'సత్యం సుందరం' సినిమా చూశాను!! మీరు, అరవింద్ స్వామి చాలా బాగా నటనతో మెప్పించారు. సినిమాలో నువ్వు కనిపించిన ప్రతిసారి నేను నవ్వుతూనే ఉన్నాను. అనంతరం ఆ చిరునవ్వుతోనే ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా ద్వారా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశావ్‌... అలాగే మన సినిమా 'ఊపిరి' రోజులను కూడా గుర్తుచేశావ్‌. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చిత్ర యూనిట్‌ అందరికీ నా అభినందనలు.' అని ఆయన మెచ్చుకున్నారు.

అయితే, కార్తీ కూడా ఇలా స్పందించారు. థ్యాంక్యూ అన్నయా.. మీ మాటలతో అందించే ప్రోత్సాహం మాలో ఆనందాన్ని నింపింది. సినిమా మీకు నచ్చినందుకు సంతోసిస్తున్నాం. ఈ చిత్రంపై మీరు చూపించిన ఆదరణ మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.' అని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement