Aravindh swamy
-
డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. తమిళ్లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ‘సత్యం సుందరం’ పట్ల ప్రేక్షకులు ఆధరణ భారీగానే ఉంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తుంది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగార్జున.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమాకు ప్రధాన బలం అయిన కార్తీ, అరవింద్ స్వామి నటనకు ఆయన ఫిదా అయ్యారు.'డియర్ కార్తీ, నిన్న రాత్రి 'సత్యం సుందరం' సినిమా చూశాను!! మీరు, అరవింద్ స్వామి చాలా బాగా నటనతో మెప్పించారు. సినిమాలో నువ్వు కనిపించిన ప్రతిసారి నేను నవ్వుతూనే ఉన్నాను. అనంతరం ఆ చిరునవ్వుతోనే ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా ద్వారా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశావ్... అలాగే మన సినిమా 'ఊపిరి' రోజులను కూడా గుర్తుచేశావ్. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు.' అని ఆయన మెచ్చుకున్నారు.అయితే, కార్తీ కూడా ఇలా స్పందించారు. థ్యాంక్యూ అన్నయా.. మీ మాటలతో అందించే ప్రోత్సాహం మాలో ఆనందాన్ని నింపింది. సినిమా మీకు నచ్చినందుకు సంతోసిస్తున్నాం. ఈ చిత్రంపై మీరు చూపించిన ఆదరణ మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.' అని ఆయన అన్నారు. -
మాఫియా నేపథ్యంలో...
మణిరత్నం.. ఈ పేరు చెప్పగానే ‘గీతాంజలి, బాంబే, రోజా, సఖి, ఘర్షణ, దళపతి, యువ’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. ప్రేమకథలే కాదు.. మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్. త్యాగరాజన్ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మంచి యాక్షన్ ప్యాక్డ్గా ఉంటూనే ఎమోషనల్ కంటెంట్‌తో సాగుతుంది. నాగార్జునగారు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ పకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఆనంది, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కరణ్. -
నలుగురిలో నవాబ్ ఎవరు?
నవాబ్.. అనుకున్నంత ఈజీ కాదు అవ్వడం. ఆరాటపడేవారు, పోరాడేవారు, లాక్కోవాలనుకునేవారు, కష్టపడి దక్కించుకునేవారు... అందరూ లిస్ట్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్ట్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర ఉంది. సినిమాలో నవాబ్ ఎవరన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారాయన. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీరావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ్లో ‘చెక్కవంద వానమ్’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అని, తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి.. ఎవరు నవాబ్? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో ఓ ఇద్దరు హీరోలు అన్నదమ్ముల పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించడానికి హీరో శింబు ఆల్రెడీ వర్కౌట్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మదరాస్ టాకీస్ పతాకం, లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
బ్యాక్ టు వర్క్
సముద్రంతో స్నేహానికి సెలవు ప్రకటించారు శ్రియ... ప్రస్తుతానికి మాత్రమే అనుకోండి! మొన్నటివరకూ సముద్రంలో తనకిష్టమైన స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఎంజాయ్ చేశారీ సుందరి. ఇప్పుడు సరదాలను పక్కను పెట్టి, షూటింగుల్లోకి వచ్చేశారు. తమిళ సినిమా ‘నరగసూరన్’లో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, ఇంద్రజిత్ సుకుమాన్ (మలయాళ హీరో), శ్రియ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సెలవులకు చెక్ పెట్టిన శ్రియ స్ట్రయిట్‌గా ఈ సినిమా షూటింగులో ఎంటరయ్యారు. తమిళంలో విమర్శకులతో పాటు ప్రేక్షకులకు ప్రశంసలందుకున్న ‘డి16’ ఫేమ్ కార్తీక్ నరేన్ ఈ చిత్రానికి దర్శకుడు. గౌతమ్ మీనన్ నిర్మాతల్లో ఒకరు. తెలుగులో ‘16: ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్’ పేరుతో విడుదలైన ‘డి16’ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ ‘నరగసూరన్’నూ తెలుగులో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు రెడీ! ‘నరకాసురుడు’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. -
సీన్ రివర్స్!
‘ఏ జాలే లేని మరణం నేనే. ఏ పాపం లేని ప్రళయం నేనే’ అంటూ ‘ధృవ’ సినిమాలో సిద్ధా్దర్థ్ అభిమన్యు క్యారెక్టర్లో స్టైలిష్ విలన్‌గా అదరగొట్టారు అరవింద్ స్వామి. ఈ సినిమాలో రామ్‌చరణ్ ధృవ క్యారెక్టర్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కార్తీక్ నరేన్ దర్వకత్వంలో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ, ఇంద్రజిత్ ముఖ్యపాత్రల్లో ‘నరగాసురన్’ అనే చిత్రం రూపొందు తోంది. తెలుగులో ‘నరకాసురుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి ధృవ క్యారెక్టర్లో నటిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సెప్టెంబర్ 16న స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను బుధవారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ షూట్లో అరవింద్ స్వామి బిజీ. -
'ధృవ' మూవీ రివ్యూ
టైటిల్ : ధృవ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రామ్‌చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, పోసాని కృష్ణమురళి సంగీతం : హిప్ హప్ తమిళ (ఆదిత్య) దర్శకత్వం : సురేందర్ రెడ్డి నిర్మాత : అల్లు అరవింద్, ఎన్ వీ ప్రసాద్ బ్రూస్ లీ సినిమాతో మెగా అభిమానులను నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రీమేక్ గా తెరకెక్కిన ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో భారీ రికార్డ్ ల మీద కన్నేసిన చరణ్, అందుకు తగ్గట్టుగా లుక్, బాడీలాంగ్వేజ్ విషయంలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. మరి చరణ్ ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధించాడా..? ధృవ ఆశించినట్టుగా రికార్డ్ లను తిరగరాస్తుందా..? కథ : ధృవ(రామ్‌చరణ్).. దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్‌ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్‌చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్‌గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : మరో భాషలో ఘనవిజయం సాధించిన సినిమాను రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. ప్రతీ విషయంలోనూ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తారు. అయితే ఆ రిస్క్ ను తలకెత్తుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి సక్సెస్ సాధించాడు.అదే కథను మరింత రేసీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసిన సూరి, థియేటర్లో ఉన్నంత సేపు ఇది రీమేక్ సినిమా అన్న విషయం మరిచిపోయేలా చేశాడు. హిప్ హప్ తమిళ అందించిన పాటలు వినటానికి సోసోగా ఉన్న విజువల్ గా మాత్రం అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. పి ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెమరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్‌చరణ్, అరవింద్ స్వామి స్క్రీన్ ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : పాటలు సినిమా లెంగ్త్ ఓవరాల్‌గా ధృవ.. రామ్‌చరణ్ స్థాయిని పెంచే చేసే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్