'ధృవ' మూవీ రివ్యూ | Dhruva Movie Review | Sakshi
Sakshi News home page

'ధృవ' మూవీ రివ్యూ

Published Fri, Dec 9 2016 12:38 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

'ధృవ' మూవీ రివ్యూ - Sakshi

'ధృవ' మూవీ రివ్యూ

టైటిల్ : ధృవ
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : రామ్చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, పోసాని కృష్ణమురళి
సంగీతం : హిప్ హప్ తమిళ (ఆదిత్య)
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్, ఎన్ వీ ప్రసాద్

బ్రూస్ లీ సినిమాతో మెగా అభిమానులను నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రీమేక్ గా తెరకెక్కిన ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో భారీ రికార్డ్ ల మీద కన్నేసిన చరణ్, అందుకు తగ్గట్టుగా లుక్, బాడీలాంగ్వేజ్ విషయంలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. మరి చరణ్ ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధించాడా..? ధృవ ఆశించినట్టుగా రికార్డ్ లను తిరగరాస్తుందా..?


కథ :
ధృవ(రామ్చరణ్)..  దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్‌ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు.

అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు.


సాంకేతిక నిపుణులు :
మరో భాషలో ఘనవిజయం సాధించిన సినిమాను రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. ప్రతీ విషయంలోనూ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తారు. అయితే ఆ రిస్క్ ను తలకెత్తుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి సక్సెస్ సాధించాడు.అదే కథను మరింత రేసీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసిన సూరి, థియేటర్లో ఉన్నంత సేపు ఇది రీమేక్ సినిమా అన్న విషయం మరిచిపోయేలా చేశాడు. హిప్ హప్ తమిళ అందించిన పాటలు వినటానికి సోసోగా ఉన్న విజువల్ గా మాత్రం అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. పి ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెమరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
రామ్చరణ్, అరవింద్ స్వామి
స్క్రీన్ ప్లే
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
పాటలు
సినిమా లెంగ్త్

ఓవరాల్గా ధృవ.. రామ్చరణ్ స్థాయిని పెంచే చేసే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement