Dhruva
-
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
KGF రికార్డును బద్దలు కొడతా అంటున్నధృవ సర్జా..
-
ఇండో–పసిఫిక్ ప్రపంచ మథనం
ఈ నెల మనం వరుసగా కొన్ని ప్రపంచస్థాయి సదస్సులను చూడబోతున్నాం. జీ7; దక్షిణ పసిఫిక్ దేశాలతో భారత్, అమెరికా సమావేశాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలో కొత్త పొత్తులు, భౌగోళిక రాజకీయ పోటీ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పథకాల వంటివి చోటు చేసుకోనున్నాయి. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ లతో; ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో; బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ అంత ర్జాతీయ కార్యకలాపాలు, విస్తృతార్థంలో అంత ర్జాతీయ వ్యవస్థ మారుతున్న స్వభావాన్ని పట్టి చూపే పలు నాయకుల సదస్సులకు ఈ నెల సాక్షీభూతం కానుంది. మొత్తంగా అవి కొంత కాలంగా వ్యక్తమవుతున్న కొన్ని ధోరణుల కలయికను సూచిస్తాయి. వాణిజ్య, ఆర్థిక పరస్పర ఆధారిత విధానాలు, చైనా అంతర్జాతీయ పాత్ర, భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాల సాపేక్ష ప్రాధాన్యత, ప్రపంచ ప్రధాన రాజకీయ లోపాలు వంటివన్నీ నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి. అయితే, ఈ పరిణామాలు నిర్దిష్ట వ్యాఖ్యాతలతో పొసగడం లేదు. అవేమిటంటే, తప్పుడు సమానత్వా లకు అతుక్కు పోతున్న భారతీయులు. న్యూఢిల్లీతో సంబంధాలను క్రమం తప్పకుండా చిన్నచూపు చూస్తున్న అమెరికన్లు, బ్రస్సెల్స్,సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు గత ఆర్థిక, రాజకీయ క్రమాన్ని తిరిగి పొందాలని కోరుకోవడం వంటివి. ఈ వారం హిరోషిమాలో జరగనున్న జి7 దేశాల సమావేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులు సమావేశం కానున్నారు. 1970ల నుంచి వీరు వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతూ వస్తున్నారు. జి7 అజెండాలో, నేటికీ కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా ఉంటుంది, ఈ గ్రూప్ దేశాలు రష్యాపై ఆంక్షలతోపాటు ఉక్రెయిన్ ప్రభుత్వం వెనుక నిలబడటం తెలిసిందే. అయితే అమెరికా, కెనడాలను మినహాయిస్తే తక్కిన దేశాలు సాపేక్ష ఆర్థిక పతనం దశలో ఉంటున్నాయి. అమెరికా యేతర జి–7 సభ్యదేశాల సామూహిక స్థూల దేశీయోత్పత్తి 1992లో ఉన్న 52 శాతం నుంచి నేటికి 23 శాతానికి పడిపోయింది. ఒక ఉమ్మడి శక్తిగా, జీ7 ఐక్యత ఈరోజు మరింత విలువైనదైనా, వాటి బలం తక్కువగా ఉంటోంది. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ తో, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో, బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. సంక్లిష్టభరితమైన జనాభా, స్థూల ఆర్థికపరమైన సంధికాలంలో భారత అభివృద్ధిని, ఆర్థిక భద్రతా లక్ష్యాలను వేగవంతం చేయడం కోసం ఈ యంత్రాంగాలను ప్రభావితం చేయడం ప్రధానమైన అంశంగానే ఉంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం, భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలోనూ, అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్పల్ప మార్పులనే గమనిస్తున్న భారత్‌కు జాతీయ, అంతర్జాతీయ సమస్య లను లేవనెత్తే అవకాశాన్ని జీ7 సదస్సు కల్పిస్తోంది. ఈ సమస్యలు ఏమిటంటే, ఇంధన, ఆహార భద్రత; సరఫరా మార్గాల స్థితిస్థాపకత, వాతావరణం; ఆర్థిక, స్వావలంబన అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, రుణ స్థిరత్వం వంటివి. కాగా, అమెరికా వడ్డీరేట్లు అధికంగా ఉడటం, డిజిటల్ కరెన్సీలు, చెల్లింపుల్లో ఆవిష్కరణలు, నిలకడ లేని వాణిజ్య అసమతుల్యతలు, అంతర్జాతీయ ఆంక్షలు వంటివి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట నున్నాయి. హిరోషిమా సదస్సును దాటి చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు దక్షిణ పసిఫిక్ దేశాల నాయకులతో సమావేశాల కోసం పాపువా న్యూ గినియాను సంద ర్శిస్తారని భావిస్తున్నారు. వాటి చిన్న సైజు, చిన్నచిన్న దీవుల్లోని జనాభా కారణంగా దక్షిణ పసిఫిక్ ప్రాంతాన్ని తరచుగా చిన్నచూపు చూస్తూ వచ్చారు. కానీ ప్రపంచ భూ ఉపరితలంలో ఈ ప్రాంతం ఆరింట ఒక వంతును కలిగి ఉంది. తైవాన్ , అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలపై ప్రభావం చూపే విషయంలో చైనా పోటీ పడటాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కూడా భౌగోళిక రాజకీయ హాట్ స్పాట్‌గా మారుతోంది. పైగా వాతావరణ సంక్షోభం, నిలకడైన రుణ విధానాలు, మత్స్య, ఖనిజ వనరులు వంటివాటికి ఈ ప్రాంతం కీలకమైనది. భారత్ విషయానికి వస్తే, ఫోరమ్ ఆన్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కో–ఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ద్వారా 2014–2017లో ప్రారంభమైన మహమ్మారి సంబంధిత విరామం – వ్యాప్తి తర్వాత పోర్ట్ మోర్స్బీలో జరుగనున్న సదస్సు ఒక సహజమైన కొనసాగింపు. ఈ సంవత్సరాల్లో భారత ప్రధాని ఫిజీలో 14 దక్షిణ పసిఫిక్ ప్రాంత నాయకులను కలిశారు. వారందరికీ జైపూర్‌లో ఆతిథ్యమిచ్చారు. భారతీయ అభివృద్ధి, సహాయ పథకాలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం అవుతుంది. ఫిజీ, పాపువా న్యూ గినియాలలో రుజువైనట్లే, గ్లోబల్ సౌత్‌ని ప్రభావితం చేస్తున్న కొన్ని ఉమ్మడి సవాళ్లకు ప్రస్తుత భారతీయ ప్రతిపాదనలు పరిష్కారాలు కావచ్చు. అదే సమయంలో, అమెరికా భూభాగం కాని ఒక దక్షిణ పసిఫిక్ దేశానికి బైడెన్ ప్రయాణం ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రథమ సందర్శన కానుంది. పైగా, ఒక ముఖ్యమైన ప్రాంతంపై వాషింగ్టన్ చాలాకాలం తర్వాత దృష్టి పెట్టినట్లవుతుంది. చివరగా, ఆస్ట్రేలియాలో క్వాడ్ సదస్సుకు ఈ నెల సాక్షీభూతం కానుంది. గ్రూప్ లీడర్లు మూడోసారి వ్యక్తిగతంగా కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు వార్షిక ప్రాతిపదికన హాజరయ్యే కొన్ని అంత ర్జాతీయ గ్రూప్ సమావేశాలు ఏవంటే, జీ7, జీ20, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్, ఈస్ట్ ఆసియా సదస్సు, ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు. ఈ చిన్న జాబితాలో క్వాడ్ కొత్త చేరిక అన్నమాట. 2021లో అధ్యక్ష స్థాయి సమావేశంగా మొదటిసారి ఉనికిలోకి వచ్చిన క్వాడ్, మూడు కార్యాచరణ బృందాలను ఏర్పర్చింది. కానీ ఇప్పుడు దీని కార్యకలాపాలు 25 కార్యాచరణ బృందాలకు విస్తరించాయి. వీటిలో కొన్ని, క్వాడ్ ఫెలోషిప్స్ వంటి కొన్ని ఫలితాలను ఇప్పటికే ప్రదర్శించాయి. మరి కొన్ని సముద్రజలాల సమస్యలు, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ రుణం వంటి అంశాల్లో సన్నిహిత సహకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కొన్ని కార్యాచరణ బృందాలు ఇప్పటికీ చాలా అస్థిరంగా ఉంటున్నాయి. ఇకపోతే సరఫరా చైన్లు, సంక్లిష్ట టెక్నాలజీలు వంటి ఇతర అంశాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడానికి క్వాడ్ ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చింది. వీటిలో అమెరికా, భారత్‌లతో ముడి పడి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని టెక్నాలజీ సంభాషణ, ఐసీఈటీ వంటివి ఉన్నాయి లేదా, ఇండో–పసిఫిక్ ఎకన మిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈపీ), మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (టిపి– ఎమ్‌డిఎ) వంటి అంశాలపై దేశాల విస్తృత సమితిని తీసు కొచ్చాయి. ఇవి, మరికొన్ని ప్రయత్నాలు సిడ్నీలో జరగనున్న సదస్సు నాటికి కొంత ప్రగతిని చవి చూస్తాయి కూడా. (అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల వల్ల జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవ డంతో క్వాడ్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడింది). ఇక ఈ నెలలో జరగనున్న ఇండో–పసిఫిక్ అత్యున్నత సమావేశం సారాంశాన్ని చూస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో కొన్ని కీలకమైన ప్రకంపనలను అవి ఎత్తిచూపనున్నాయి. ఈ ధోరణులను అభినందించే విషయంలో అనేక ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ఘర్షించ వచ్చు. కానీ ఆర్థిక సంబంధాల నూతన పోకడలు, కొత్త రంగాలు, భౌగోళిక–రాజకీయ పోటీ రూపాలు, ఈ సమస్యలను ఎదుర్కోవడా నికి కొత్త యంత్రాంగాలు సీదాసాదాగా రూపుదిద్దుకుంటున్నాయి. ధ్రువ జైశంకర్ వ్యాసకర్త కార్యనిర్వాహక డైరెక్టర్, ఓఆర్ఎఫ్, అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
ధృవ-2లో ఏజెంట్ !
-
నెల రోజుల్లో 18కేజీల బరువు తగ్గిన హీరో.. ఫోటో వైరల్
పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ హీరో ద్రువ సర్జా. ప్రస్తుతం ఈయన కేడీ-ది డెవిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 18 కేజీల బరువు తగ్గారాయన. ఈ విషయాన్ని స్వయంగా ద్రువ సర్జా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 18కేజీలు తగ్గాను. కేడీ-ది డెవిల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ద్రువ సర్జా పాత ఫోటోలకు, ఇప్పడు చాలా వేరియేషన్ కనిపిస్తుందంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో ఒక్క లుక్‌తో అర్థమవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షోమ్యాన్ ప్రేమ్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్‌ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్‌ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
ధృవ సర్జా హీరోగా తొలి పాన్ ఇండియా చిత్రం..
తమిళసినిమా: ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ త్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777, కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి. 2022లో ఈ 5 చిత్రాలు కలిపి రూ.1,851 కోట్ల వసూళ్లు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. కాగా తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. దీని పేరు కేడీ ది డెవిల్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ కేడీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది. అదేవిధంగా కర్ణాటక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్నారు. ఉదాహరణకు రాముడు ఉన్న కాలంలోనే రావణుడు ఉన్నాడని పేర్కొన్నారు. యాక్షన్, సెంటిమెంట్, వినోదం వంటి జనరంజకమైన అంశాలతో రపొందిస్తున్న చిత్రం కేడీ ది డెవిల్ అని తెలిపారు. కాగా కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల బెంగుళూరులో భారీఎత్తున నిర్వహించినట్లు నిర్మాత తెలిపారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు తెలిపారు. -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'.. విపరీతమైన క్రేజ్..!
సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం 'కిరోసిన్'. ధృవ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిగ్ స్క్రీన్‌పై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. (చదవండి: ‘కిరోసిన్’ మూవీ రివ్యూ) కథ, కథనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి ఈ సినిమా చేయగా అవి ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి . అంతే కాదు స్క్రీన్ ప్లే బాగుందన్న ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సైతం ఈ మూవీ ఆకట్టుకోవడం విశేషం. ఇటీవల కాలంలో ఓటీటీలో కొన్ని చిన్న సినిమాలైనా ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో చిన్న సినిమాల కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17 థియేటర్లలో విడుదలైంది. -
ఆకట్టుకుంటున్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా ‘పుష్పరాజ్’ ట్రైలర్
కన్నడ హీరో ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పరాజ్ ది సోల్జర్’. ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్లో చేతులు మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయించింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఇక ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుష్పరాజ్’ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు’ అని అన్నారు. ఇక టైలర్ చాలా చూశానని, చాలా బాగుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
‘కిరోసిన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరోసిన్ నటీనటులు :ధృవ, ప్రీతిసింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు, కాంచెరపాలెం రాజు తదితరులు నిర్మాణ సంస్థ :బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ దర్శకత్వం : ధృవ విడుదల తేది: జూన్ 17,2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘కిరోసిన్’కథేంటంటే.. జనగూడెం తండాకి చెందిన రామప్ప(సమ్మెట గాంధీ)కూతురు గౌరీ(లావణ్య చెవుల) హత్యకు గురవుతుంది. లోకల్ ఎమ్మెల్యే దొరబాబు(బ్రహ్మాజీ) ఒత్తిడితో నిందితులను పట్టుకోకుండానే.. తప్పుడు ఆధారాలు చూపించి ఈ కేసును క్లోజ్ చేస్తాడు ఎస్సై(జీవిన్). కొన్ని రోజుల తర్వాత పైఅధికారులు ఈ కేసు దర్యాప్తుని ఏసీపీ వైభవ్(ధృవ)కి అప్పజెప్పుతారు. వైభవ్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండా సర్పంచ్ రావుల నాయక్(మధుసూదన్ రావు)తో పాటు పలువురి అనుమానితులను విచారిస్తాడు. ఈ హత్య కేసుకు గతంలో జరిగిన మరో ఇద్దరి యువతల హత్యలకు సంబంధం ఉందని ఏసీపీ ధృవ భావిస్తాడు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో అసలు నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? గౌరీని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలకు గౌరీ హత్య కేసుతో ఎలాంటి సంబంధం ఉంది? చివరకు ఏసీపీ వైభవ్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ చిత్రానికి అసలు కిరోసిన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు ధృవ. ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటించడం విశేషం. ధృవ ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే కథ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఫస్టాఫ్ అంతా గౌరీ కేసు విచారణ చుట్టే తిరుగుతుంది. ఆమెని ఎవరు హత్య చేశారనేది క్లైమాక్స్ వరకు తెలియజేయకుండా సస్పెన్స్‌ని మెయింట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ధృవ ఎంట్రీతో ఫస్టాప్‌లో వేగం పుంజుకుంటుంది. గౌరీ కేసు కంటే ముందు మరో హత్య కేసుని ఏసీపీ వైభవ్ నిమిషాల్లో చేధించే సీన్ ఆకట్టుకుంటుంది. బిడ్డ చనిపోయిన విషయం తెలిశాక తండ్రి రామప్ప ఏడుస్తూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై పట్టించుకోకపోవడం, ఓ అమాయకుడిని ఇరికించి, ఈ కేసుని క్లోజ్ చేయడం పోలీసు వ్యవస్థలో జరిగే అన్యాయాలకు ఎత్తిచూపెడుతోంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. వేరు వేరు ప్రాంతాల్లో జరిగే హత్యలకు గౌరీ కేసుతో ముడిపెడుతూ.. ఏసీపీ చేసిన విచారణ ఆకట్టుకుంటుంది. ఈ వరుస హత్యల వెనుక ఏదో పెద్ద కారణం ఉంటుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించేలా క్లైమాక్స్ ఉంటుంది.అయితే ఇలాంటి సైకోలు కూడా సాధారన వ్యక్తులుగా మన చుట్టూ ఉంటారా? అనేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘కిరోసిన్’ నచ్చుతుంది. ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికొస్తే..ఏసీపీ వైభవ్‌గా ధృవ చక్కటి నటనను కనబరిచాడు. తండావాసి రామప్ప పాత్రలో సమ్మెట గాంధీ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌ని బాగా పండించాడు. ఎమ్మెల్యే దొరబాబుగా బ్రహ్మాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్ర నిడివి తక్కువే. సినియర్ నటుడైన బ్రహ్మాజీని ఇంకాస్త వాడుకుంటే సినిమాకు కలిసొచ్చేది. అగర్ బత్తీలు అమ్ముకునే శివయ్య పాత్ర ఈ సినిమాకు హైలైట్. ఈ పాత్రలో రామారావు జాదవ్ ఒదిగిపోయాడు. సైకోగా తనదైన నటనతో మూడు నిమిషాలు హడలెత్తించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కిరోసిన్’.. సెన్సార్ పూర్తి
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఆడియన్స్ కూడా వైవిధ్యమైన సినిమాలనే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ‘కిరోసిన్’చిత్రాన్ని తెరకెక్కించారు ధృవ. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా, హీరోగానూ నటించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. -
సినిమా ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు: నిర్మాత
Dhruva Kerosene Movie Pre Release Event In Hyderabad: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'కిరోసిన్'. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకంతోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరోగా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి.' అని తెలిపాడు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలని భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఇండస్ట్రీకి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు.' అని నిర్మాత దీప్తి కొండవీటి పేర్కొన్నారు. -
కన్నడ హీరోతో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!
తెలుగులో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొత్తలో పూరి జగన్నాథ్ రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి ‘యువరాజా’ (2001), మరొకటి ‘అప్పు’ (2002). ‘యువరాజా’లో శివరాజ్‌కుమార్ నటించారు. ‘అప్పు’లో ఆయన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ హీరో. ఆ తర్వాత పదిహేడేళ్లకు ఇషాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘రోగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఓ కన్నడ సినిమాకు ప్లాన్ జరుగుతోందని సమాచారం. ధ్రువ సర్జా హీరోగా ఈ సినిమా రూపొందనుందట. ‘పొగరు’లో ‘ఖరాబు మాసు ఖరాబు..’ అంటూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధ్రువ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ సర్జా కన్నడంలో ‘దుబారీ’ అనే సినిమా చేస్తున్నారు. మరి... అతని తదుపరి సినిమా పూరీతోనే ఉంటుందా? వేచి చూడాలి. చదవండి: కొత్త డైరెక్టర్‌తో మూవీ.. షరతు విధించిన మహేశ్‌బాబు! ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్ -
ప్రొడక్షన్ టు డైరక్షన్
సస్పెన్స్ థ్రిల్లర్ ‘యమ్ 6’ చిత్రాన్ని నిర్మించిన విశ్వనాథ్ తన్నీరు దర్శకుడిగా మారారు. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు కూడా. ‘‘సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను.‘యమ్ 6’తో నిర్మాతగా మారాను. దర్శకుడిని కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మంచి కథ కుదిరింది. ఈ సినిమా ద్వారా ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ‘యమ్ 6’లో హీరోగా «నటించిన ధృవ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ధృవ. -
అర్జున్ మేనల్లుడి పొగరు
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పొగరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో బి.కె. గంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. హీరోకు, అంతర్జాతీయ బాడీ బిల్డర్స్‌కు మధ్య వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ బాడీ బిల్డర్ కై గ్రీనే, జాక్ లుకాస్, జో లిన్‌డర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ నటిస్తున్నారు. ‘భైరవగీత’ ఫేమ్ ధనుంజయ్ విలన్‌గా నటిస్తున్నారు. సంపత్ రాజ్, రవి శంకర్, పవిత్రా లోకేష్ కీలక పాత్రధారులు. ‘‘ప్యాన్ ఇండియా సినిమాగా పొగరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కథే హీరో
‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది’’ అని నిర్మాత తన్నీరు విశ్వనాథ్ అన్నారు. ధ్రువ, అశ్విని జంటగా జైరాం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. తన్నీరు విశ్వనాథ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘నటుడు అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ నిర్మించాను. కొంతకాలం దర్శకత్వ శాఖలో కూడా పని చేశాను. ఇప్పుడు ‘యమ్ 6’ చిత్రం నిర్మించా. ఈ చిత్రానికి కథే హీరో. విజయ్ బాలాజీ మంచి సంగీతం అందించారు. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ ముఖ్య తారలుగా జైరామ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అద్భుతమైన కథని జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు జై రామ్‌వర్మ. ‘‘మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉంది’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్, సమర్పణ: పార్వతి. -
ఈ క్షణం.. ఓ హైలైట్
ధ్రువ, అశ్విని జంటగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్ 6’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. చిత్రనిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సినిమాపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించడంతో పాటు నిర్మించాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. నా తమ్ముడు ధ్రువని హీరోగా పరిచయం చేస్తూ ‘యమ్6’ చిత్రాన్ని నిర్మించాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... జైరాం వర్మ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్లో సంవత్సరానికి ఒక సినిమా నిర్మిస్తాం. త్వరలోనే నా డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్, సమర్పణ: స్టార్ యాక్టింగ్ స్టూడియో. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘యం6’
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యం6’. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ - ‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగానికి వచ్చాను. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యం6’ చిత్రాన్ని నిర్మించాను. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ‘యం6’ సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకి ‘యం6’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. -
తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు
ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ రిలీజ్ చేశారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్ మూమెంట్‌లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్‌గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు. సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్ పూజారి, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి. -
‘ధృవ’ మాతృకకు సీక్వెల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ధృవ తమిళనాట ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్. అరవింద్ స్వామి, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. సీక్వెల్‌ను కూడా మోహన్ రాజా దర్శకత్వలోనే తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. -
ధ్రువకు జోడీ కుదిరింది!
తమిళసినిమా: కొన్ని చిత్రాలకు కథానాయికలు త్వరగా దొరకరు. కారణం దర్శక నిర్మాతలకు నచ్చకపోవడం కావచ్చు. కథానాయకులకు సెట్ కాకపోవచ్చు. ఆయా పాత్రలకు నప్పకపోవచ్చు. ఇంకేదైనా కావచ్చు. అలా నవ నటుడు ధ్రువ విక్రమ్‌కు జంటగా నటించే హీరోయిన్ కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతోంది. ధ్రువ విక్రమ్ అనగానే అతను హీరో విక్రమ్ వారసుడని ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ యువ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఈ చిత్రం రీమేక్. విజయ్ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ విక్రమ్ పోషిస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే హీరోయిన్ ఎంపిక కాకుండానే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు దర్శకుడు బాలా. తెలుగులో శాలినీపాండే నటించిన పాత్రను తమిళంలో పోషించే నటి కోసం చిత్ర యూనిట్ తెగ వెతికింది. పలువురు నటీమణులను పరిశీలించారు. చాలామంది పేర్లు ప్రచారమయ్యాయి కూడా. చివరికి బెంగాలీ బ్యూటీకి ఆ అదృష్టం దక్కింది. బెంగాలీలో పలు టీవీ, మూవీ చిత్రాల్లో నటించిన మేఘాచౌదరి వర్మ చిత్రంలో ధ్రువ్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్‌లోనూ నటించింది. మోడల్‌గా రాణించిన మేఘా చౌదరి తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘చిల్లన్ను ఒరు కాదల్’ చిత్రంలో ఆయన కూతురిగా నటించిందన్నది గమనార్హం. తాజాగా వర్మ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మరి ఇక్కడ కథానాయకిగా ఏ పాటిగా నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలో ప్రారంభం కానున్న వర్మ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్లో మేఘా చౌదరి పాల్గొననుందన్నది తాజా సమాచారం. ఇ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజుమురుగన్ సంభాషణలను రాస్తున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. జైరామ్ దర్శకత్వంలో స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో విశ్వనాథ్ తన్నీరు, సురేశ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులోని ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సస్పెన్స్‌తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. చక్కని ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు జైరామ్. ‘‘ఇది నా తొలి చిత్రం. ఓ మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు ధ్రువ. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్.