ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్ | dhruva theartrical trailer | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 7:51 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' థిరిటికల్ ట్రైలర్ ఆన్ లైన్లో దూసుకుపోతోంది. శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. నాకొక ఇంపార్టెంట్ గొల్ ఉంది..ఎవడిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో.. ఆ క్రిమినల్నే నేను అంతం చేయాలి...ఐయామ్ కమింగ్...అంటూ 'ధృవ' థిరిటికల్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. నీలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ప్యూచర్ని నామ రూపాలు లేకుండా చేస్తా..అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ప్రజల తలరాతలను నిర్ణయించేది రాజకీయ నాయకుడు కావొచ్చు..కానీ ఆ రాజకీయ నాయకుడి తలరాతను నిర్ణయించేది ఓ బిజినేస్ మ్యాన్ అంటూ మంచి మాస్ ఎలిమెంట్ ఉన్న డైలాగ్తో సినిమా పై అంచనాలు పెంచేశాడు రాంచరణ్.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement