డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఆడియన్స్ కూడా వైవిధ్యమైన సినిమాలనే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ‘కిరోసిన్’చిత్రాన్ని తెరకెక్కించారు ధృవ. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా, హీరోగానూ నటించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment