Dhruva Sarja Undergoes Weight Loss Transformation, Loses 18 Kilos In 30 Days For His Role - Sakshi
Sakshi News home page

Dhruva Sarja : నెల రోజుల్లో 18కేజీల బరువు తగ్గిన హీరో.. ఫోటో వైరల్‌

Published Fri, Jan 13 2023 12:04 PM | Last Updated on Fri, Jan 13 2023 1:18 PM

Dhruva Sarja Loses 18 Kilos In 30 Days For His Role In Kd - Sakshi

పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ హీరో ద్రువ సర్జా. ప్రస్తుతం ఈయన కేడీ-ది డెవిల్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 18 కేజీల బరువు తగ్గారాయన. ఈ విషయాన్ని స్వయంగా ద్రువ సర్జా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 18కేజీలు తగ్గాను. కేడీ-ది డెవిల్‌ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలో ద్రువ సర్జా పాత ఫోటోలకు, ఇప్పడు చాలా వేరియేషన్‌ కనిపిస్తుందంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో ఒక్క లుక్‌తో అర్థమవుతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా షోమ్యాన్‌ ప్రేమ్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement