censor
-
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
కంటెంట్ సెన్సార్: ఓటీటీలకు కేంద్రం ప్రతిపాదన!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌లో అశ్లీలత, హింస లేకుండా కచ్చితంగా స్వీయ సెన్సార్ చేసుకోవాలని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ జూన్ 20న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఓటీటీ సంస్థలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు కూడా తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఫలితంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీటింగ్ రికార్డ్స్, ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌పై ప్రజలు, పౌర సంఘాలు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ ఆయా స్ట్రీమింగ్ సంస్థల ముందుంచింది. వీటిలో ప్రసారయ్యే ప్రముఖ సినీ తారలు నటించిన కంటెంట్ కూడా అసభ్యకర, అశ్లీల, హింసను, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సంబంధించి సెన్సార్ పకడ్బంధీగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ విడుదల సినిమాలను చూసి సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ ఓటీటీలలో ప్రసారయ్యే కంటెంట్‌కు అలాంటి వ్యవస్థ లేదు. ఓటీటీ ప్రసారాలను సమీక్షించేందుకు గాను స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకునే విషయాన్ని ఆలోచించాలని మీటింగ్ సందర్భంగా శాఖ ప్రతినిధులు ఇండస్ట్రీ వర్గాలను కోరినట్లు తెలిసింది. కాగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు భారత్‌లో అత్యంత ఆదరణ సంపాదించుకున్నాయి. దేశ స్ట్రీమింగ్ మార్కెట్ 2027 నాటికి 7 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంటుందని అంచనా. ఇదీ చదవండి: సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్! -
‘మేమ్ ఫేమస్’పై సెన్సార్ ప్రశంసలు!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి వాటిలో ‘మేమ్ ఫేమస్’ చిత్రం ఒకటి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. (చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం) తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ ప్రశంసలు కురిపించారు. సినిమా బాగుందని కితాబు ఇచ్చారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది’అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సినిమా మొత్తం ఓకే ఒక పాత్ర.. ప్రయోగాత్మకంగా ‘హలో మీరా’
ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు ఉంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా గార్గెయి యల్లాప్రగడ నటిస్తున్న హలో మీరా అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతోన్నట్టుగా నిర్మాతలు తెలిపారు. -
వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరం: నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. సినిమాలకు మాదిరిగా వెబ్‌సిరీస్‌కు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో వాటిలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు హద్దు మీరుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నటి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు గౌతమి వద్ద ప్రస్తావించగా వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరమని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. గౌతమి తాజాగా స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రను పోషించారు. ఈమెతో పాటు నటుడు భరత్, శాంతను భాగ్యరాజ్, రాజు, వినోద్ కిషన్, నటి అథితి బాలన్, రితికా సింగ్ నటించారు. చుట్పా ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు జార్జ్ దర్శకత్వం వహించారు. ఐదు స్టోరీస్‌తో రూపొందించారు. శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇదన్నారు. వేయింగ్ స్కేల్, మిర్రర్, కార్, కంప్రెషర్, సెల్యులార్ మొదలగు ఐదు కథలతో కూడిన వెబ్ సిరీస్ అన్నారు. దీన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌లో దెయ్యం లేకపోయినా అలాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో తాను నటించినట్లు గౌతమి తెలిపారు. ఇందులో ఒక్కో స్టోరీ ఒక్కో జానర్లో ఉంటూ వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. తనకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు నటుడు భరత్ చెప్పారు. గౌతమితో కలిసి నటించడం మంచి అనుభవంగా నటి అథితి బాలన్ పేర్కొన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘వాడు ఎవడు’
కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాడు ఎవడు’. రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఎన్నో వైవిధ్యమైన ఉత్కంఠమైన సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్ళు యూఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. త్వరలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.ఇలాంటి విభిన్న సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది’ అన్నారు. రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, డి టి నాయుడు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రమోద్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
వినూత్నమైన క్రైమ్ డ్రామాగా ‘స్పార్క్ 1.O ’
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ సురేష్ మాపుర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పార్క్ 1.O’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై వి.హితేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా స్పార్క్ 1.O తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ లో ఒకరైన భవ్యశ్రీ పేర్కొన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కిరోసిన్’.. సెన్సార్ పూర్తి
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఆడియన్స్ కూడా వైవిధ్యమైన సినిమాలనే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ‘కిరోసిన్’చిత్రాన్ని తెరకెక్కించారు ధృవ. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా, హీరోగానూ నటించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. -
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు' వచ్చేస్తున్నాడు
'వలయం' ఫేమ్ లక్ష్య్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మేజర్, మూవీ టీంపై ప్రశంసలు
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డ్ ప్రశంసిచినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా చివరిలో సెన్సార్ బోర్డు సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సందీప్ ఉన్నికృష్ణన్‌కు సెల్యూట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనులు తెలిపారట సెన్సార్ బోర్డ్ సభ్యులు. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు మేజర్ చిత్రానికి మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ కంటే ముందుగా తొలిసారి పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనుండటం విశేషం. కాగా ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కపటనాటక సూత్రధారి’, త్వరలోనే విడుదల
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ సహా నిర్మాతలు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనీష్ మాట్లాడుతూ ‘‘మా ‘కపట నాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తయ్యింది. మంచి థ్రిల్లర్ మూవీ చేశామని సెన్సార్ సభ్యులు మా టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ క్రాంతి సైన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్‌గారి విజువల్స్, రామ్‌గారి సంగీతం, వికాస్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. కచ్చితంగా సినిమా ఆడియెన్స్‌ను డిఫరెంట్ మూవీగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన డిఫరెంట్ పోస్టర్స్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కు సెన్సార్ పూర్తి
సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేది దగ్గరవుతుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. (చదవండి: వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా: రిలీజ్ డేట్ ఫిక్స్.. టైటిల్ అదేనా!) ఫ్రెష్ కంటెంట్, యాక్షన్, రొమాన్స్ సహా ఇతర అంశాలతో ఇచ్చట వాహనములు చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ సభ్యులు అభినందించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'తిమ్మరుసు'..రిలీజ్ ఎప్పుడంటే..
’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో హీరోగా మారిన సత్యదేవ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ హీరోగా 'తిమ్మరుసు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. 'టాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న ప్రియాంకా జవాల్కర్ ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
సెన్సార్‌పై... మహా సెన్సార్!
వినోదం, వివేచన కోసం ఉద్దేశించిన మాధ్యమం అది. కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు చివరకు వివాదమైతే? సృజనాత్మక ప్రదర్శనల అనుమతి కోసం సదుద్దేశంతో పెట్టుకున్న సర్టిఫికేషన్ వ్యవస్థ చివరకు ఆ ప్రదర్శననే అడ్డుకొనే పరిస్థితి వస్తే? ఇప్పుడదే జరుగుతోందని వాపోతున్నారు సినీ సృజనశీలురు. సినీ మాధ్యమానికి సంబంధించి దశాబ్దాల క్రితం చేసుకున్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం’, పెట్టుకున్న ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు’ (సీబీఎఫ్సీ) మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. కేంద్ర సర్కారు చేపట్టిన తాజా ‘సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు– 2021’ వివాదానికి కేంద్రమైంది. చాన్నాళ్ళుగా ఉన్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం–1951’లో మార్పులు, చేర్పుల ద్వారా రాజ్యవ్యవస్థ సినిమాలపై పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సవరణ బిల్లుపై జూలై 2 లోగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సర్కారు పేర్కొంది. ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, పలువురు సినీ దర్శక, నిర్మాతలు, నటీ నటులు సమష్టిగా ఆదివారం నాడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాయడం గమనార్హం. నిజానికి, మనది ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డే తప్ప, అందరం పిలుచుకొంటున్నట్టుగా సెన్సార్ బోర్డు కాదు! అది సినీ ప్రదర్శనకు అనుమతి ధ్రువీకరణ కోసమే తప్ప, సెన్సార్ ఉక్కుపాదం మోపడానికి పెట్టుకున్నదీ కాదు!! కానీ, వ్యవస్థ తాలూకు భావజాలానికీ, ప్రయోజనాలకు అడ్డం వచ్చే ఏ సినిమానైనా అడ్డుకోవడానికి అదే బోర్డును ఆయుధంగా చేసుకోవడం ఆది నుంచీ ఆనవాయితీ అయింది. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ పాలకుల కాలం నుంచి అదే ధోరణి. స్వాతంత్య్రా నంతరం గద్దెపైనున్న సర్కార్లూ ఆ మార్గాన్నే అనుసరించాయి. అలా నాటి నుంచి నేటి దాకా పార్టీల ప్రమేయం లేకుండా అందరికీ ఈ తిలా పాపంలో తలా పిడికెడు భాగం ఉంది. ఇప్పుడు మళ్ళీ రీ–సెన్సార్షిప్ అనే సవరణ ప్రతిపాదన పాలకులకు మరిన్ని కొత్త కోరలు అందిస్తోంది. కేంద్రాన్ని ఏకంగా సెన్సార్‌కు పైన ఉండే ‘సూపర్ సెన్సార్’గా మారుస్తోంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్వేచ్ఛాభావనల సినీరంగం డిమాండ్ చేస్తోంది. అలాగే, నిన్న మొన్నటి దాకా సెన్సార్ బోర్డు ఇచ్చిన కట్స్‌తో కానీ, దాని పైన ఉండే రివైజింగ్ కమిటీ నిర్ణయంతో కానీ సంతృప్తి చెందని దర్శక, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్‌సీఏటీ)కి వెళ్ళి, న్యాయం పొందే అవకాశం ఉండేది. రాజకీయ కారణాలతో గద్దె మీది పెద్దలు కావాలని ఇబ్బంది పెట్టినా, న్యాయమూర్తులుండే చట్టబద్ధ సంస్థ ట్రిబ్యునల్ దగ్గర దర్శక– నిర్మాతలకు ఊరట లభించేది. ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ (1982), నారాయణమూర్తి ‘లాల్‌సలామ్’ (1992) లాంటి అనేక సినిమాలు అలా సెన్సార్ బోర్డుపై పోరాడి, ట్రిబ్యునల్ దాకా వెళ్లి సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించుకున్నవే. కానీ, ఈ ఏప్రిల్‌లో కేంద్ర సర్కారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చి, ఆ ట్రిబ్యునల్‌నే రద్దు చేసేసింది. అంటే ఇప్పుడిక దర్శక, నిర్మాతలు అందరిలా సాధారణ కోర్టు గుమ్మం ఎక్కి, ఎన్ని నెలలు ఆలస్యమైనా భరిస్తూ, తమ సినిమా సెన్సార్ కష్టాలను కడతేర్చుకోవాల్సిందే. తాజా సవరణ బిల్లు గనక చట్టమైతే–ఇప్పటికే సెన్సారైన సినిమాలను కూడా ప్రభుత్వం వెనక్కి పిలిపించవచ్చు. జనం నుంచి ఫిర్యాదు వచ్చి, అది సమంజసమని ప్రభుత్వం భావిస్తే చాలు– ఇక ఆ సినిమా ప్రదర్శన ఆగిపోనుంది. అంటే, ప్రభుత్వం నియమించిన నిపుణులతో సెన్సారై రిలీజైన సినిమాపైనే మళ్ళీ మరో సెన్సార్షిప్ అన్న మాట. అసలు సెన్సార్ బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని తిరగదోడే అధికారం కేంద్రానికి లేదంటూ కె.ఎం. శంకరప్ప (2001) కేసులో సర్వో న్నత న్యాయస్థానం ఎప్పుడో తేల్చింది. అలా చూస్తే ఈ కొత్త సవరణ ఆ ఆదేశాలకు విరుద్ధమే. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందనుకుంటే రాజ్యాంగ బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ హక్కుకూ కొన్ని పరిమితులుంటాయని మన రాజ్యాంగం పేర్కొంది. ఆ పరిమితులను ఆసరాగా చేసుకొని, సుప్రీం కోర్టు ఆదేశాలకు సైతం కేంద్రం కొత్త క్లాజు పెట్టింది. మరోపక్క ఇప్పటికే ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికల పైనా కొన్ని నియంత్రణ చట్టాలు ప్రభుత్వం తెచ్చింది. నిజానికి, ఇప్పుడొస్తున్న కొన్ని వెబ్ సిరీస్‌లు, చిత్రాల బాధ్యతారాహిత్యం చూస్తుంటే నియంత్రణలు అవసరమనే అనిపిస్తుంది. కానీ అది కక్షసాధింపు కాకూడదు. సమతూకం, సంయమనం అవసరం. ప్రతిపాదిత తాజా బిల్లులోని అంశాలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని సహించలేక చేస్తున్నవేననే అభిప్రాయం ప్రబలుతోంది. ప్రభుత్వ భావజాలానికో, ఏ కొందరి మనోభావాలకో వ్యతిరేకంగా ఉంటే చాలు... కొద్దిమంది కలసి ఓ సినిమా ప్రదర్శనను ఆపేయవచ్చు. సెన్సారైన సినిమానూ వెనక్కి రప్పించవచ్చనేది సృజనశీలురను భయపెడుతోంది. ఆ మధ్య సంజయ్ భన్సాలీ ‘పద్మావత్’, ‘ఉడ్తా పంజాబ్’ సహా అనేక సినిమాల విషయంలో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు సినీసీమకు ఉన్నాయి. అందుకే, సినిమాటోగ్రాఫ్ చట్టంలో కేంద్రం చేయాలనుకుంటున్న సవరణల పట్ల సినీ సమాజంలో నెలకొన్న భయాందోళనలు చాలావరకు అర్థవంతమైనవి. అర్థం చేసుకోదగినవి. ఆ భయాందోళనల్ని పోగొట్టాల్సిన బాధ్యత పాలకుల మీదే ఉంది. లేదంటే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుతూ, పరస్పర భిన్నాభిప్రాయాలను గౌరవించు కొంటూ సాగాల్సిన ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. విమర్శనూ, సృజనాత్మక స్వేచ్ఛనూ సహించ లేక ఉక్కుపాదం మోపుతున్నారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుంది. -
డిస్కో రాజా.. సెన్సార్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక జనవరి 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే ఇప్పటివరకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరుత్సాపడుతున్నారు. అయితే మూవీ మేకింగ్ వీడియోను మాత్రం వదిలారు. ఇక 2019లో రవితేజ నుంచి ఒక్క సినిమా రాని విషయం తెలిసిందే. దీంతో ఆ లోటును ‘డిస్కో రాజా’ను భర్తీ చేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచాలని రవితేజ భావిస్తున్నాడు. ఇక సైన్స్ ఫిక్షన్ జానర్లో రవితేజ తొలిసారి నటిస్తుండటం విశేషం. ‘ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం’ లాంటి భిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వీఐ ఆనంద్.. రవితేజతో ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సైన్స్‌తోపాటు రవితేజ స్టైల్లో కామెడీ జోడించినట్లు సమాచారం. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. -
సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. గురువారం సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ఎలాంటి సీన్లు కట్ చేయకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు 160 నిమిషాల నిడివి గల ఈ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అందరినీ ఆకట్టుకునేవిధంగా, మహేశ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తెరకెక్కించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం ఖామయని జోస్యం చెబుతున్నారు. మామూలుగానే మహేశ్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఈ అంచనాలకు తోడు ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. చదవండి: ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’ నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా! -
త్రిష చిత్రానికి సెన్సార్ షాక్
నటి త్రిష చిత్రానికి సెన్సార్‌బోర్డు షాక్ ఇచ్చింది. 36 ఏళ్లయినా కొంచెం కూడా క్రేజ్ తగ్గని ఈ బ్యూటీ చేతిలో అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి. ఈ మధ్య విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసిన 96 చిత్రం, రజనీకాంత్‌కు జంటగా నటించిన పేట చిత్రాల విజయాలు త్రిషకు మరింత ప్రోత్సహించేలా అమిరాయి. దీంతో ఈ చిన్నది తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారిస్తోంది. కాగా త్రిష నటిస్తున్న పలు చిత్రాల్లో పరమపదం విలయాట్టు చిత్రం ఒకటి. ఇది హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రం. ఇందులో త్రిష తల్లిగా నటించింది. పగ, ప్రతీకారాలతో కూడిన ఈ పరమపదం విలయాట్టు చిత్రం కోసం ఈ అమ్మడు ఫైట్స్ కూడా చేసిందట. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పరమపదం విలయాట్టు చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. కాగా ఇది కుటుంబ కథా చిత్రం కాబట్టి సెన్సార్ నుంచి యూనిట్ వర్గాలు యు సర్టిఫికెట్‌ను ఆశించారు. అయితే సెన్సార్ బోర్డు వారికి షాక్ ఇచ్చింది. యు/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇది పరమపదం విలయాట్టు చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసిందట. ఇది హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అని.. అందుకే యు సర్టిఫికెట్‌ను ఇవ్వలేమని సెన్సార్‌సభ్యులు తెగేసి చెప్పారని సమాచారం. చిత్రంలో త్రిష శత్రువులను ఘోరాతి ఘోరంగా చంపుతుందట. దీంతో యు/ఏ సర్టిఫికెట్‌నే సరిపెట్టుకున్న పరమపదం విలయాట్టు చిత్రాన్ని త్వరలో ట్రైలర్‌ను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ప్రస్తుతం త్రిష రాంగీ అనే మరో హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. -
బిగ్‌బాస్ షోను సెన్సార్ చేయండి
పెరంబూరు: బిగ్‌బాస్‌కు షాకిచ్చారో న్యాయవాది. ఈ రియాలిటీ గేమ్ షోను సెన్సార్ చేయాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విజయ్ టీవీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సెన్సార్ బోర్డుకు రిట్ పిటిషన్ దాఖాలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే విజయ్ టీవీలో ప్రసారం అయిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1, 2 ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పలువురు నటీనటులు ప్రాచుర్యం పొందారు. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షోకు తాజాగా సీజన్–3 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదన్ అనే న్యాయవాది బిగ్‌బాస్–3 రియాలిటీ షోను నిషేధించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో.. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోను పిల్లల నుంచి పెద్దల వరకూ వీక్షిస్తున్నారన్నారు. ఈ రియాలిటీ షోలో నటీనటులు అశ్లీలకరంగా దుస్తులు ధరించడం, ద్వందర్థాల సంభాషణలను మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇవి ప్రేక్షకులను చెడు దారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. వారి మనోభావాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంటున్నాయన్నారు. కాబట్టి ఈ రియాలిటీ షోను సెన్సార్ చేయించి ప్రసారం చేయాలని కోరారు. అంతవరకూ రియాలిటీ షో ప్రసారంపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలను విన్న న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, సుబ్రమణియం ప్రసాద్‌లు ఈ పిటిషన్‌పై రిట్ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విజయ్ టీవీ.నిర్వాహక చైర్మన్‌కు, కేంద్ర సెన్సార్ బోర్డుకు 3 వారాల్లోగా నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదే«శించారు. -
‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్న సాయి ధరమ్ తేజ్ తన పేరును కూడా సాయి తేజ్ మార్చుకున్నాడు. మరి ఈ ప్రయోగం అయిన సాయి తేజ్‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’
విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆ తరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కథలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నా’రు. -
కుటుంబ సమేతంగా..‘హలో గురు..’
ఈ రోజుల్లో సెన్సార్‌బోర్డు నుంచి యు సర్టిఫికెట్‌ను పొందడం సాధారణ విషయం కాదు. చాలా మంది దర్శక, నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అలాంటిది సింగిల్ కట్ లేకుండా.. క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ అందుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సెన్సార్ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్‌ను అందంచడంతో పాటు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే మంచి కథా చిత్రం అంటూ కితాబు కూడా ఇచ్చారట. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ మూవీ కోసం జోడి కట్టారు. ప్రకాష్ రాజ్, పోసాని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నేను శైలజ’చిత్రం తర్వాత భారీ హిట్ లేక సతమతమవుతున్న రామ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీకి సెన్సార్ వాళ్లు ఒక కట్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘అమ్మమ్మ గారిల్లు’ సెన్సార్ పూర్తి
ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో .. ఈ యువహీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షామిలి మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే విడుదల చేసిన అమ్మమ్మ గారిల్లు టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది . స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 25న విడుదలవుతోంది. -
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వెబ్సైట్లూ నియంత్రణ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగంలో అవాంఛిత అంశాల నియంత్రణకు స్కూళ్లు, గ్రంథాలయాలు, వ్యాపార,వాణిజ్ యసంస్థలు వంటివి ‘ఫిల్టరింగ్ టెక్నాలజీ’ ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. ప్రధానంగా అశ్లీలసైట్లు (పోర్నోగ్రఫీ), సమాచారం దొంగిలించే పథకాలు (ఫిష్షింగ్ స్కీమ్స్), రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి విభిన్న అంశాల నియంత్రణకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా దీనిని ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, అంశాలు నియంత్రిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో దాదాపు 1200 ప్రత్యేక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ (వెబ్అడ్రస్, వనరు గా పిలిచే యూఆర్ఎల్ ) బ్లాక్ అయినట్టు యూనివర్సిటీ ఆఫ్ టొరెంటోకు చెందిన ‘సిటిజన్ ల్యాబ్’ తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సెన్సారింగ్ అమలు తీరుపై జరిపిన విస్తృత అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లో ఏయే సైట్లు బ్లాక్ చేశారన్నది సొంతంగా పరిశీలించేందుకు సిటిజన్ల్యాబ్తో ముంబయికి చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక కలిసి పనిచేసింది. ఇంటర్నెట్ను సెన్సార్ చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగిస్తున్న ఇండియాలో ఇటువంటివి జరగడం ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. గతంలో ప్రధానంగా పోర్న్, గేమింగ్ సైట్స్‌పై దృష్టి పెట్టినా, ఇప్పుడు జాతీయ భద్రతపైకి మళ్లింది. మానవహక్కుల బృందాలు, ప్రభుత్వేతర సంస్థల సైట్లు బ్లాకయ్యాయి. బ్లాకవుతున్నాయి’ అని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రీతూ సరీన్ చెప్పారు. ఇదీ పరిశోధన...! కెనడాకు చెందిన వాటర్లూ సంస్థ నెట్స్వీపర్ ‘ఇంటర్నెట్ ఫిల్టరింగ్ టెక్నాలజీ’ సహాయంతో భారత్‌తో సహా పాకిస్థాన్, అప్గనిస్తాన్, బహ్రెయిన్,కువైట్, ఖతార్, సుడాన్, యూఏఈ, యెమన్, సోమాలియా నెట్స్వీపర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ పది దేశాలు కొన్ని ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా ‘సెన్సార్’ చేస్తున్నట్టు తాజాగా తమకు ఆధారాలు దొరికాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా వార్తలు, మతపరమైన, రాజకీయ విమర్శలు, వ్యతిరేక ప్రచారాంశాలు, లెస్బియన్, గే, బై సెక్పువల్, ట్రాన్స్‌జెండర్స్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)ల వనరులు, వంటి విషయాలపై ఇంటర్నెట్ సెన్సార్ అమలవుతున్నట్టు పేర్కొన్నారు. వెల్లడైన అంశాలు... గూగుల్ సెర్చ్‌లో గే, లెస్బియన్ అనే కీ వర్డ్‌లను యూఏఈ, బహ్రెయిన్, యెమన్ బ్లాక్చేశాయి అబార్షన్లు అనే కేటగిరి కింద ఉన్న వెబ్‌సైట్లన్నింటిని కువైట్ పూర్తిగా బ్లాక్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను యూఏఈ, కువైట్లలో పోర్నోగ్రఫీ కింద వర్గీకరించాయి రాజకీయవార్తలు, అభిప్రాయాలు, విమర్శలకు వేదికలుగా ఉన్న వెబ్సైట్లను బహ్రెయిన్, ఖతార్, సుడాన్, సోమాలియా బ్లాక్ చేశాయి యెమన్‌లో అంతర్యుద్ధానికి సంబంధించి ఇంటర్నెట్లో సరైన సమాచారం అందకుండా హౌతి తిరుగుబాటుదారులపై నియంత్రణ ఉంది భారత్‌లో శరణార్థుల సంక్షోభంపై ఫేస్బుక్ గ్రూపుల్లో చర్చ, అల్‌జజీర, యూకే టెలిగ్రాఫ్ కథనాలు, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేక అంశాలపై చర్చను బ్లాక్ చేస్తున్నారు కువైట్‌లో అబార్షన్, సెక్స్ ఎడ్యుకేషన్, అల్కహాల్ సంబంధిత అన్ని సైట్స్ సెన్సార్ బహ్రెయిన్‌లో రాజకీయ, మానవహక్కుల గ్రూపుల, గూగుల్‌లో గే, లెస్బియన్ సెర్చ్‌లపై నియంత్రణ యూఏఈలో రాజకీయ,మానవహక్కులసంఘాలతో పాటు గ్రీన్‌పీస్ వార్తలు,ప్రత్యామ్నాయ జీవనశైలి (ఎల్జీబీటీక్యూ)పై సెన్సార్ యెమన్‌లో ఇంటర్నెట్ ప్రైవేసీ టూల్స్, ప్రతిపక్షరాజకీయపార్టీలు, ప్రతిపక్షాల వార్తలపై ఆంక్షలు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాలను మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలో నటనకు గుడ్‌బై చెపుతున్నట్టుగా ప్రకటించిన లోకనాయకుడు తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నాడు. కమల్ ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించిన సినిమా విశ్వరూపం 2. ముందు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రారంభించారు. కానీ తరువాత రవిచంద్రన్ తప్పుకోవటంతో కమలే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కమల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన విశ్వరూపం 2 ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
సాక్షి, టెక్నాలజీ : ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు పడినా వాహనదారులు ఒక్కోసారి దూసుకుపోవటం.. లేదా వాహనాల మధ్య నుంచే రోడ్డును దాటాలని పాదాచారులు చేసే ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయటం చూస్తున్నాం. అయితే సాంకేతికతకు మరింత ఆధునీకరణ తోడైతే అలాంటి ఘటనలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సెన్సార్ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. దీని ప్రకారం సిగ్నల్ వద్ద ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం వెళ్తుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు నిరభ్యరంతంగా రోడ్డును దాటేయొచ్చు. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించగా.. అది సత్ఫలితాన్ని ఇస్తోంది. త్వరలో దీనిని వివిధ దేశాలకు విస్తరించాలని ప్రాజెక్టును చేపట్టిన యూ-కోరీచన్ సంస్థ ఆలోచన చేస్తోంది.