'వలయం' ఫేమ్ లక్ష్య్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment