![Gangster Gangaraju Movie Shooting Completed - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/11/3/gangstar-gangaraj.jpg.webp?itok=wHTujMxf)
'వలయం' ఫేమ్ లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్' పతాకం పై 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతోన్న 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు' చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ... అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇటీవల విడుదలైన `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`ఫుల్ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో దూసుకుపోతుండడం మరో విశేషం. ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ తో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment