
తల్లి కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు
చేరదీసిన అమ్మమ్మ తాతయ్య
జగిత్యాలక్రైం: నవమాసాలు మోసి.. ఇద్దరు పిల్లలను కనిపెంచిన తల్లి ఆ పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన యువతిని మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి గతంలో వివాహం చేశారు. వీరికిద్దరు పిల్లలు జన్మించారు. యువతి భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
పిల్లలను పోషించాల్సిన సదరు మహిళ.. మరో వ్యక్తి మోజులో పడింది. ఈ క్రమంలో యువతి తండ్రి అనారోగ్యంతో జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు కుమారులను తీసుకుని ఆస్పత్రికి వచ్చిన ఆ యువతి కుమారులను అక్కడే వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. తండ్రి ఎందుకు రావడం లేదో.. తల్లి ఎప్పుడొస్తుందో తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనాథలుగా మారి న ఆ పిల్లలను అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు.
Comments
Please login to add a commentAdd a comment