మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌ | Minister Bandi Sanjay Sensational Comments On Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌

May 4 2025 12:15 PM | Updated on May 4 2025 3:08 PM

Minister Bandi Sanjay Sensational Comments On Maoists

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్‌లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు

కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది.

పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement