సాక్షి, కరీంనగర్: ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.
కరీంనగర్‌లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్‌లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు
..కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అవినీతే తప్ప మంచి లేదు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయిలో పడినట్లయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండు. డ్రగ్స్ కేసు, ఈ-ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని కేసులు పేర్లతో డైవర్షన్ తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు దావోస్ ఇష్యూ ముందుకు తెచ్చారు.
..గ్రీన్‌కో వంటి సంస్థలపై దాడులు చేస్తే ఇవాళ తెలంగాణాకు వచ్చేందుకు భయపడుతున్నాయి. గ్రీన్‌కో నుంచి కాంగ్రెస్‌కు పైసలు ముట్టినై. 2014 నుంచి ఇప్పటివరకు దావోస్‌లో జరిగిన ఒప్పందాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చియో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
Comments
Please login to add a commentAdd a comment