
కలెక్టర్‌పై ‘పొంగులేటి’ మండిపాటు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘వాటిజ్ దిస్ నాన్సెన్స్...వేర్ ఈజ్ సీపీ...వేర్ ఈజ్ ఏసీపీ...కామన్‌సెన్స్ లేదు...ఇదేం పద్ధతి’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో 24/7 నీటి సరఫరాను ప్రారంభిస్తున్న క్రమంలో గన్‌మెన్‌లు కొందరు పదేపదే పొంగులేటిని తోసివేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనలో ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతంటూ కలెక్టర్‌పై మండిపడ్డారు. సీపీ ఎక్కడా, ఏసీపీ ఎక్కడా అంటూ నిలదీశారు. అయితే వారెవరు అక్కడ లేకపోవడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు.
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 24, 2025