ponguleti srinivasa reddy
-
ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని ప్రారంభించిన మంత్రి
-
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు
కూసుమంచి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భా గంగా ప్రభుత్వం మొదటి మోడల్ హౌస్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికా రులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గతనెల 13న నమూ నా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవ లం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తిచేశారు.ఈ ఇంటిని సోమవా రం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి నమూ నా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. కాగా, ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా.. రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.ఆకర్షణీయంగా నమూనా ఇల్లు..కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూంతో బెడ్ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్ వేశారు. అలాగే, డా బా మెట్ల కింద టాయిలెట్‌ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులను రూ.5 లక్షలతోనే పూర్తిచేసినట్లు కాంట్రాక్టర్ కంచర్ల జీవన్‌రెడ్డి తెలిపారు. -
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
హనుమకొండ అర్బన్/నయీంనగర్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్ రీజియన్‌కు కేటాయించిన టీజీఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ‘కార్పొరేట్’ లుక్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.తొలుత పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్‌సిటీలో నిర్మాణంఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు. గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్‌రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్ఆర్నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్‌పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అధికారులతో మంత్రి పొంగులేటి భేటీ
-
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ
-
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్‌ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్‌బుక్‌లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్‌తో ప్రారంభించి 33 మాడ్యూల్స్‌కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్‌లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్‌కు పెంచాం. ధరణి పోర్టల్‌లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
-
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీసంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ కేటీఆర్‌పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖసంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయంరైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం -
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
డిసెంబర్ 1 నుంచి NIC ధరణి బాధ్యతలు చూస్తోంది
-
సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్‌ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారంఅధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకంహైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్‌తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యంఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్‌ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదుఅధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా. ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా. ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్‌లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్‌గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
హరీశ్‌రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్‌రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు.