సాక్షి, పాలేరు: ప్రజా సేవకులుగా ఉన్నాం.. ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాలేరు నియోజకవర్గంలో పలు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పామని కేబినెట్ మీటింగ్‌లో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన రెండు అంశాలు ప్రారంభించామన్నారు.
నిబద్ధతతో పనిచేసి ప్రతీ హామీని నెరువేరుస్తామన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణను ఆర్ధికంగా ఎంతో కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో ప్రతి పక్ష నాయకుల ముందే చర్చ పెట్టామన్నారు. అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి అప్పులు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టాడని మంత్రి విమర్శించారు.
ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో ‘కమలం’ కొత్త ఆశలు
Comments
Please login to add a commentAdd a comment