హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజలకిచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుంది: స్పీకర్ ప్రసాద్‌కుమార్
హుజూర్‌నగర్‌లో మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హుజూర్‌నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్‌హాల్‌లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment