సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై చీలికలు మొదలయ్యాయా?. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్‌రెడ్డి చేరికలు ఖరారు అయిపోయాయి. అయితే తేదీల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. వీళ్ల చేరికలపై నేతల్లో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఈలోపు మరికొందరి చేరికలపై హడావిడి నడుస్తుండగా.. పలువురు సీనియర్లు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.
నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నయ్యతో ఆయనకు పడదన్న సంగతి తెలిసిందే. అదే టైంలో టికెట్ కూడా దక్కే ఛాన్స్‌లు కనిపించడం లేదు. దీంతో వీరేశంతో పాటు కోదాడకు చెందిన శశిధర్‌రెడ్డి సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఇంటికి ఈ ఇద్దరూ వెళ్లినట్లు సమాచారం.
వేముల వీరేశం
అయితే.. వీరేశం, శశిధర్‌రెడ్డి చేరికల అంశాన్ని నల్లగొండ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి పీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపే ముఖ్యమన్న కోమటిరెడ్డికి ఆయన చేరికలపై నచ్చజెప్పి.. ఆపై ఇద్దరూ పొంగులేటి ఇంటికి వెళ్తారని సమాచారం.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ నుంచి కొత్త మనోహర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 2014లో మహేశ్వరం నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేశారీయన. పొంగులేటితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మనోహర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నారు.
ఇదీ చదవండి: పక్కా.. బీఆర్‌ఎస్ నేతలు పార్టీ మారతారు చూస్కోండి!
Comments
Please login to add a commentAdd a comment