
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్‌ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటి
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయం
అసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment