సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. భూ దోపిడీదారుడు జగదీష్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. జగదీష్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ మూడు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయేవ్యక్తి జగదీష్‌రెడ్డేనని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ తర్వాత జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖామమని తెలిపారు.
చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment