jagadish reddy
-
‘పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం’
సూర్యాపేట జిల్లా: నల్లగొండలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish Reddy)విమర్శించారు. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ(Nalgonda) నుండే ఉద్యమం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు.ఈరోజు(మంగళవారం) సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ఇక్కడ పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది. మంత్రి వెంకట్‌రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫోటో, గులాలీ రంగు చూసినా వెంకట్‌రెడ్డికి భయమైపోతుంది. కాంగ్రెస్ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు. భూపాల్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.నల్లగొండ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తతనల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు., -
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్‌భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్‌ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్‌రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
‘రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ’
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు.‘‘బీఆర్ఎస్ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ సంబురాలు చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసులు పెట్టీ సంబురాలు చేసుకుంటుంది...కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషి గా మల్లెపువ్వు లాగా, కడిగిన ముత్యం లాగ బయటకొస్తాడు...ఈ ఫార్ములా కారు రేస్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్లా పడటం ఖాయం. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి లాయర్లను వెంట బెట్టుకొని వెళ్తారు. కేటీఆర్ లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్ళొద్దా?. రాహుల్‌కి ఒక చట్టం.. కేటీఆర్‌కి ఒక చట్టం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ పనిచేస్తోంది’’ అంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
ఓ చెత్త కేసు కేటీఆర్‌పై పెట్టారు.. ఈడీపై జగదీష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: దేశంలో ప్రధాని మోదీ సహకారంతోనే కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్‌పై పెట్టింది ఒక చెత్త కేసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రైతులు నిలదీయాలి అంటూ సూచించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి కేసులు పెట్టారు. మోదీ సహకారంతోనే కేసులు పెడుతున్నారు. బ్లాక్ మనీ వైట్ చేస్తే.. ఈడీ రావాలి. అంతేకానీ.. తీసుకున్నది ఎవడో తెలియదు కానీ.. ఇచ్చినోడి మీద కేసులా?. ఇది తాత్కాలిక ఆనందం.. శునాకనందం తప్ప ఏమీలేదు.రైతు భరోసా ఎగొట్టడానికే కేసుల వ్యవహారం చర్చ తీసుకువచ్చారు. పక్కదారి పట్టించడానికే ఇవన్నీ చేస్తున్నారు. రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. ఈ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది. ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్రానికి అప్పులు చేసి ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌లో మాట్లాడినట్టు రైతు భరోసా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. దేశంలోనే చెత్త సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తే రేవంత్‌కు అసలు విషయం తెలుస్తోంది. ఆయనపై దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రైతులు, తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టాలన్న ఆలోచన తప్ప మరేమీ లేదు. కాంగ్రెస్ నేతలు చివరకు సెక్రటేరియట్ కూడా అమ్ముకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి’ అంటూ సవాల్ విసిరారు. -
‘తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ మాత విగ్రహం’
సాక్షి, నల్లగొండ: తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, కాంగ్రెస్ పెడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ మాతా విగ్రహమని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ నామస్మరణే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు. కాంగ్రెస్ మాతా విగ్రహం. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు. గాంధీ భవన్లో పెట్టుకోండి. కేసీఆర్ నామస్మరణ చేస్తోందే రేవంత్ రెడ్డి. కేసీఆర్ నా కలలోకి వస్తున్నాడని రేవంత్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ప్రజల హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ నరసింహస్వామిలా బయటకు వస్తాడేమో అని రేవంత్‌కు భయం పట్టుకుంది. మేం ట్రయల్ రన్ చేసిన ప్రాజెక్టును ప్రారంభించారు.కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ చేతకానితనం వల్లనే కరువు, ఫ్లోరైడ్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే జిల్లా నాశనం అయింది. ఫ్లోరైడ్‌ను లేకుండా చేసేందుకు మిషన్ భగీరథ నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాడు. వైటీపీఎస్ని ఆపేస్తా అని ఆనాడు కోమటిరెడ్డి అన్నాడు. అనేక కుట్రలు చేశాడు. నిన్న మంత్రులు మాట్లాడుతుండగానే జనాలు వెళ్లిపోయారు.రేవంత్ చేసిందేమీ లేదు.. బూతులు మాట్లాడటం తప్ప. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 12000 మాత్రమే. మిగతా 50వేలు కేసీఆర్ ఇచ్చినవే. మూసీ మురికి వదిలించేందుకు ప్రక్షాళన మొదలు పెట్టిందే మేము. మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంలో తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ. గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చిందే కేసీఆర్. మంత్రులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంట పండాయి అనడం దారుణం. అభివృద్ధి చేయకపోతే మీ భరతం పడతా. మంత్రులు ప్రజలను ఏవిధంగా లూటీ చేశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ బాధిత సంఘాలు కూడా ప్రారంభం అయ్యాయి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: జగదీష్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కిషోర్, కంచర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. ఈనెల 29న దీక్షా దివాస్‌ను అందరూ ఘనంగా జరుపుకోవాలి. కేసీఆర్ ఎన్నో పథకాలను తెచ్చారు. ప్రజలకు మంచి పాలన అందించారు. ఎంతో సంక్షేమం అందించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్’ అని చెప్పుకొచ్చారు. -
మమ్మల్ని జైల్లో వేస్తారా.. ఆలస్యం ఎందుకు?.: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కమిషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పని చేశారో తమకు తెలియదని.. విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని.. తమ వివరణ ఛైర్మన్ తీసుకోలేదన్నారు.కమిషన్ వేస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తి అయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి. కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరు. మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు?. మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? నివేదికలో ఏమీ ఉండదని ముందే లీకులు ఇస్తున్నారు’’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఆగ్రహం
-
మూసీ కాదు.. రేవంత్, మంత్రుల బుర్రలు ప్రక్షాళన కావాలి: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇదే సమయంలో మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి ఇలా వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా.. అలాగే, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థాయిలేని వారికి మంత్రి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆకతాయిలు సోషల్ మీడియాలో చేసిన పనులకు కేటీఆర్‌కు ఏం సంబంధం ఉంది?. రేవంత్ వెనకుండి మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. హామీలు విఫలమై హైడ్రాను ముందుకు తెచ్చారు. హైడ్రా కూడా విఫలం కావడంతో సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు.రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కనపడటం లేదంటే కొండా మురళీ కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అనడం, అనిపించుకోవడం ఎందుకు. మంత్రి కోమటిరెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ పరిస్థితిపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా?. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక -
‘విద్యుత్’ను బలోపేతం చేసిందే మేము
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతమైందని.. కేసీఆర్ ముందు చూపు కారణంగానే అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ కొరతను తీర్చేందుకే కొనుగోళ్లు చేశామని.. కొత్త ప్లాంట్ల ఏర్పాటును చేపట్టామని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.సోమవారం జగదీశ్‌రెడ్డి శాసనసభలో ‘విద్యుత్’పద్దుపై బీఆర్ఎస్ తరఫున మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీలేరు ప్రాజెక్టును కొట్టేయడానికే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను చంద్రబాబు కుట్రపూరితంగా తీసుకున్నాడు. మనకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటా ఇవ్వకపోగా.. మేం కొనుగోలు చేద్దామనుకున్నా ఇవ్వకుండా ప్రైవేటు ప్లాంట్ల వాళ్లను బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంటే.. ఏదో జరిగిందని ప్రచారం చేయడం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వొచ్చు. అదే సమయంలో ఏపీలో నాటి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు నామినేషన్ పైనే ఇచి్చంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు కోసం మేం ఇచ్చింది యూనిట్‌కు రూ.3.90 మాత్ర మే. ఇప్పుడు ఎనీ్టపీసీ నుంచి రూ.5.70 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు కూడా నామినేషన్‌పై బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టులు ఇస్తే మేం మద్దతిస్తాం. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఏదో వెదుకుతామని చూడటం. పక్క రాష్ట్రంలో తమ బాస్ చేస్తే మాత్రం కరెక్ట్ అనడం ఏమిటి? మా హయాంలోనే విద్యుత్ వ్యవస్థ బలోపేతం మేం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం పెంచాం. 400 కేవీ, 220కేవీ, 132 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు పెరిగాయి. విద్యుత్ ట్రాన్స్మిషన్, పంపిణీ లైన్లు పెరిగాయి. సౌర విద్యుత్ పెరిగింది. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేయడానికి ఉదయ్ పథకంలో చేరాలని కేంద్రం కోరితేనే చేరాం. బిల్లులు వసూలుకాని ప్రాంతాల్లోని సమీప విద్యుత్ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాం. ఉదయ్ పథకం కింద రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై వేసుకున్నాం. తల తెగిపడినా రైతులకు మీటర్లు పెట్టనివ్వలేదు. అప్పుల వాదన అర్థరహితం.. మా హయాంలో అప్పులు అయ్యాయనే వాదన అర్థరహితం. మేం అధికారంలోకి వచ్చేప్పటికే విద్యుత్ రంగంపై రూ.24 వేల కోట్ల అప్పులున్నాయి. అయినా రైతులు, అన్నివర్గాల ప్రయోజనం కోసమే విద్యుత్ రంగాన్ని అప్పులు చేసి అయినా బలోపేతం చేశాం. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది.అదానీకి ఇవ్వాలనేదే మీ ఆలోచనవిద్యుత్ పనులు బీహెచ్ఈఎల్కు వద్దని, అదానీకే ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఓల్డ్‌సిటీలో విద్యుత్ సరఫరా బాధ్యతను అదానీకి అప్పగించే అంశంపై ఎంఐఎం సభ్యులు ప్రశ్నించినప్పుడు.. కాంగ్రెస్ సర్కారు తేలుకుట్టిన దొంగల్లా గమ్మున ఉండిపోయారు. సబ్ కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకోవాలో మీకు తెలిసిన విద్య. మా చుట్టాలెవరూ కాంట్రాక్టు పనులు చేయలేదు. మంత్రివర్గంలో, వారి చుట్టాల్లో ఎందరో కాంట్రాక్టర్లు ఉన్నారు.తప్పుదారి పట్టించే ప్రయత్నాలు..సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంటూ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెచి్చన మెమో ప్రకారం.. సోలార్ విద్యుదుత్పత్తి జరిగేప్పుడు సూపర్ క్రిటికల్ ప్లాంట్లు సైతం ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానితో సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోతుంది. ఎన్జీటీ కేసులు, కరోనాతోనే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. వెనుకబడ్డ నల్లగొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే యాదాద్రి ప్లాంట్ చేపట్టాం.కానీ కొందరు నల్లగొండ జిల్లా నేతలు జిల్లాలో ప్లాంట్ వద్దని మాట్లాడారు. వారి సంగతిని ప్రజలే చూసుకుంటారు. విద్యుత్ సరఫరా సమస్యలపై హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు çపంపుతున్నారు. వారి ఇళ్లకు లైన్మెన్లు పోయి సోషల్ మీడియాలో పోస్టులు తీసేయాలని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన మహిళా జర్నలిస్టు రేవతిపై కేసు పెట్టారు..’’అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.ముందే మాట్లాడుకుని జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్! జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి భూకబ్జాదారుడంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్ ఆందోళన చేశారని.. అలాంటి వ్యక్తిని విచారణ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమించారని జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని.. కమిషన్ చైర్మన్ వ్యక్తిగత విషయాలను, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను సభలో మాట్లాడరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు సీఎం ఈ అంశంపై ఎలా మాట్లాడారని జగదీశ్‌రెడ్డి నిలదీశారు.ప్రభుత్వం వేసింది న్యాయ విచారణ కాదని వ్యాఖ్యానించారు. ‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారణ మొత్తం పూర్తయిందని.. జరిగిన నష్టాన్ని అంచనా వేయడమే మిగిలిందని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుకునే కమిషన్ వేసినట్టు మాకు అర్థమైంది. ఈ అంశంలో కేసీఆర్ వాదన కరెక్ట్ అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుదోవపట్టిస్తున్నారా?’’అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. -
దొంగతనాలు చేసినోడివి.. సంచులు మోసి జైలుకెళ్లినోడివి..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య మాట ల యుద్ధం జరిగింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. కిరాయి హత్యలు, దొంగతనాలు, జైలుకు వెళ్లడాల నుంచి రాజీనామాల సవాళ్ల దాకా వెళ్లింది. సోమవారం సభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..‘‘ఆయనలో ఉక్రోషం చూస్తుంటే.. చర్లపల్లి జైలులో ఉన్నట్టుగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.దీనికి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ.. ‘‘చర్లపల్లి జైలు జీవితం ఆయనకు (రేవంత్‌కు) అనుభవం. కాబట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ తాను అక్కడికే వెళతానని భావి స్తున్నారేమో! నాకైతే ఉద్యమకాలంలో చంచల్‌గూడకు వెళ్లి న జైలు జీవితం గుర్తుకొస్తోంది. సీఎంకు మాత్రం చర్లపల్లి జైలులో గడిపినదే గుర్తుకొస్తోంది’’అని కామెంట్ చేశారు. మిల్లులో దొంగతనం చేస్తే ఏం చేశారో తెలుసు! జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘సూర్యాపేట బియ్యం మిల్లులో దొంగతనం చేస్తే మిల్లర్లు ఎవరిని పట్టుకుని చెట్టుకు కట్టేశారో.. నిక్కరేసుకున్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు..’’అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకట్‌రెడ్డి మరిన్ని వివరాలు చెప్తారన్నారు. వెంటనే మంత్రి వెంకట్‌రెడ్డి లేచి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన గ్రామానికి చెందిన సమితి మాజీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ–2 నిందితుడు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వాళ్ల నాన్న ఏ–6, ఏ–7 నిందితులు.రామిరెడ్డి హత్య కేసులో ఏ–3 నిందితుడు. ఆ సమయంలో నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ పెట్రోల్ బంక్‌లో జరిగిన దొంగతనం కేసులోనూ ఉన్నారు. మద్య నిషేధం సమయంలో కర్ణాటక నుంచి దొంగతనంగా మ ద్యం తెప్పించినందుకు మిర్యాలగూడ పోలీసుస్టేషన్లో ఇ ప్పటికీ కేసు ఉంది. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప ఉద్యమాలు చేశాడా?’’అంటూ ఆరోపణలు గుప్పించారు. నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి! కోమటిరెడ్డి వ్యాఖ్యలతో విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహంగా సీట్ల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన (కోమటిరెడ్డి) మాటలను రికార్డుల నుంచి తొలగించాలి. లేదా ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అలా చూపిస్తే.. ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.రుజువు చేయకపోతే కోమటిరెడ్డితోపాటు సీఎం కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి’’అని సవాల్ విసిరారు. దీనితోపాటు ‘‘చెత్తగాళ్ల మాటలు.. చెత్త మాటలు.. వాటిని రికార్డుల నుంచి తొలగించండి. నాపై వారు చేసిన ఆరోపణలపై సభా కమిటీ వేయండి..’’అని స్పీకర్‌ను కోరారు. తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఆ హత్యకేసులను కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని వివరించారు. కోర్టు చుట్టూ తిరిగినది నిరూపిస్తా.. వెంటనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్‌రెడ్డి హత్య కేసులో కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగారని నిరూపిస్తా. నేను అన్నది నిరూపించకపోతే ఇదే సభలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నల్గొండ ఎస్పీ, కోర్టు నుంచి రికార్డులు తెప్పించండి’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ట్రెజరీ బెంచ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, సబ్జెక్టుపై మాట్లాడాలని జగదీశ్‌రెడ్డికి సూచించారు.జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘‘స్పీకర్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. నేనెక్కడా విషయాన్ని పక్కదారి పట్టించలేదు. సీఎం, కోమటిరెడ్డిలే సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు’’అని పేర్కొన్నారు. దీనిపై సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పారు. సభ్యులను అవమానించేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచులు మోసి జైలుకెళ్లింది మీరేనంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్‌రెడ్డి పదేపదే కోరడంతో స్పీకర్ స్పందించారు. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు. ‘‘మా నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది మీరే’’అని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ఈ దశలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపుశాసనసభలో సీఎం, ఇతరులను ఉద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తర్వాత తాను మాట్లాడుతానంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అనుమతి కోరగా.. స్పీకర్ తిరస్కరించారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయగా.. స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమ కురీ్చల వద్దకు వెళ్లారు. -
'పవర్' ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది. -
కాంగ్రెస్ నేతలు Vs జగదీష్ రెడ్డి
-
రేవంతివి పచ్చి అబద్దాలు.. రెచ్చిపోయిన జగదీష్ రెడ్డి
-
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఈ కేసు విచారణ వేరే (వీలైతే మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి.. తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్‌ను ఇవాళ పరిశీలించిన కోర్టు.. రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. -
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్, బీజేపీ పని
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలతో ఎదురుదాడి చేయడం మినహా కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ సోయి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందన్నారు. దీంతో తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పారీ్టయేనని మరోమారు నిరూపితమైందన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగింత, గోదావరి, కావేరి అనుసం«ధానం సహా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.సింగరేణి బ్లాకుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయన్నారు. శ్రావణి బ్లాక్ వేలంపై డిప్యూటీ సీఎం భట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్‌కు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, మీడియాలో కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ముఖచిత్రం నుంచి ఆయనను అదృశ్యం చేయాలనుకుకోవడం కుదిరేపని కాదని అన్నారు. -
సింగరేణికి ఉరి తాడు
-
వరుస ఘటనలే నిదర్శనం.. కాంగ్రెస్, బీజేపీపై జగదీష్‌రెడ్డి విమర్శనాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ. ఏ సందర్బం వచ్చిన తెలంగాణ హక్కులను పరిరక్షించేది కేసీఆరే. తెలంగాణ హక్కుల్ని కాంగ్రెస్ ధారాదత్తం చేస్తోంది. వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా ప్రవర్తించింది. కేసీఆర్‌పై ఎదురు దాడి చేసి తప్పించుకుందామనుకుంటుంది కాంగ్రెస్. సింగరేణి బొగ్గు గనుల విషయంలో కూడా ప్రత్యక్ష కార్యాచరణ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బొగ్గు గనుల వేలంపై రేవంత్ రెడ్డి మాట మార్చారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎదురు దాడి మొదలు పెట్టారు.’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ ఉన్నప్పుడే సింగరేణి అమ్మారంటూ భట్టి విక్రమార్క చెప్తున్నారు. అబద్ధపు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు. దేనికో లొంగిపోయి బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసిపోయాయి. బహిరంగంగా ఫొటోలు దిగి పెడుతున్నారు కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వెనక కలిసి, ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు.’’ అని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు. -
విద్యుత్ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు.. ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసీఆర్ లేఖ రూపంలో చెప్పారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుంది. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి’’ అని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఐదేళ్ల నుంచి చెబుతున్నాం’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
కేసీఆర్ లెటర్ పై జగదీష్ రెడ్డి రియాక్షన్
-
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్‌కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
దోచుకునేందుకు కష్టపడుతున్నారా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు 18 గంటలు కష్టపడు తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నా రని, దోచుకోవడానికి కష్టపడుతున్నారా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. వందరో జుల్లో సంపద అంతా దోచుకున్నారని, రాష్ట్రం నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు బాధపడుతున్నా..తుక్కుగూడ సభలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం రైతుల గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9నే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. ఇప్పు డు దేశ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నా యకులు శ్రీకారం చుట్టారని, 2014 కంటే ముందు అరాచకాలు మళ్లీ రాష్ట్రంలో మొదలయ్యా యని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కేసుల గురించి ఎన్నడూ మాట్లాడ లేదని, మేము రైతుల గురించి మాట్లాడుతుంటే, కాంగ్రెస్‌వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లా డుతున్నారని చెప్పారు. రైతుగోడు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడన్నారు. ఓ వైపు పార్టీ మారిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని, మరోవైపు పార్టీ మారిన వారిని డిస్ క్వాలిఫై చేయాలని చట్టం తెస్తామని మాట్లాడుతుంటే.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూసి బాధపడి కేసీఆర్ సూచనలు ఇస్తుంటే..అవి పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ నిబంధనలు లేకుండా కృష్ణా జలాలను నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటికి విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.25వేలు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్‌కు వస్తున్నా రని తెలిసే గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి వదులుతున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో చేనేత కారి్మకులను ఆదుకునేందుకు జోలె పట్టిన కేసీఆర్ ప్రస్తుతం రైతులకు ధైర్యం చెప్పేందుకు పంటల పొలాలకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. రైతుబంధు సకాలంలో రాకపోవడం, రైతు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. 3 నెలల్లోనే 200మందికి పైగా రైతులు మరణించారని, 20 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌లోనూ తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యా యని పేర్కొన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. రూ.2లక్షల రుణమాఫీని తక్షణమే అమ లు చేయాలని, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభా‹Ùరెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి ఉన్నారు. ఎన్నాళ్లు కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు? అనంతరం తెలంగాణ భవన్లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందనే సోయి లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పంటలెండుతున్నా పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణం ఇవ్వకున్నా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా.. కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించాలని, కర్నాటక నుంచి 10 టీఎంసీల నీరు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేఆర్ఎంబీ ఉన్నా రైతుల కోసం సాగు నీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు నీళ్ల మీద పరిజ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు వసూళ్లు, ముడుపుల చెల్లింపులు మొదలు పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు బీ టీమ్‌లా పనిచేస్తున్నాయన్నారు. ఈడీ కేసుల పేరిట ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కడం బీజేపీ పనిగా పెట్టుకుందని.. కేజ్రీవాల్, కవిత అరెస్టులే నిదర్శనమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.