సాక్షి, సూర్యాపేట: దేశంలో ప్రధాని మోదీ సహకారంతోనే కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్‌పై పెట్టింది ఒక చెత్త కేసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రైతులు నిలదీయాలి అంటూ సూచించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి కేసులు పెట్టారు. మోదీ సహకారంతోనే కేసులు పెడుతున్నారు. బ్లాక్ మనీ వైట్ చేస్తే.. ఈడీ రావాలి. అంతేకానీ.. తీసుకున్నది ఎవడో తెలియదు కానీ.. ఇచ్చినోడి మీద కేసులా?. ఇది తాత్కాలిక ఆనందం.. శునాకనందం తప్ప ఏమీలేదు.
రైతు భరోసా ఎగొట్టడానికే కేసుల వ్యవహారం చర్చ తీసుకువచ్చారు. పక్కదారి పట్టించడానికే ఇవన్నీ చేస్తున్నారు. రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. ఈ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది. ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్రానికి అప్పులు చేసి ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌లో మాట్లాడినట్టు రైతు భరోసా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.
చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. దేశంలోనే చెత్త సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తే రేవంత్‌కు అసలు విషయం తెలుస్తోంది. ఆయనపై దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రైతులు, తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టాలన్న ఆలోచన తప్ప మరేమీ లేదు. కాంగ్రెస్ నేతలు చివరకు సెక్రటేరియట్ కూడా అమ్ముకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి’ అంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment