
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డిని సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్‌రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.
‘‘జగదీష్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్‌రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
