suspension
-
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. -
ఐదుగురు రెబెల్స్‌పై ఉద్ధవ్ శివసేన వేటు
ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు -
సద్దుమణగని ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్లోని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్కుమార్జైన్కు లేఖ రాశారు. సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. సివిల్ డ్రెస్‌తో ధర్నా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్‌ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్‌తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. -
TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్‌శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు. పోలీస్స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కులగణనకు ఇంటింటి సర్వే‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు. -
జేపీసీ భేటీలో రసాభాస
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాగ్వాదాలకు వేదికగా నిలిచింది. రసాభాసగా మారిన ఈ సమావేశంలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పట్టరాని ఆవేశంతో గాజు నీళ్లసీసా పగలగొట్టారు. సమావేశాన్ని గలాటాకు వేదికగా మార్చారంటూ బెనర్జీని కమిటీ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత జగదాంబికాపాల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చ సందర్భంగా బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిల్లును బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బెనర్జీ గాజు నీళ్ల సీసాను పగలగొట్టి చైర్మన్ కుర్చీ వైపుగా విసిరారు. ఈ క్రమంలో అది బెనర్జీ కుడి బొటనవేలుకు కోసుకుపోయింది. ప్రథమ చికిత్స చేసి కుట్లువేశాక ఆయన మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బెనర్జీ ఆవేశపూరిత చర్యలను మెజారిటీసభ్యులు ఖండించారు. సభ్యుల ఆవేశాలు చూస్తుంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలాగే రివాల్వర్‌తో కమిటీకి వస్తారేమో అని చైర్మన్ పాల్ అసహనం వ్యక్తంచేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీర్మానాన్ని 10–8 మెజారిటీతో ప్యానెల్ ఆమోదించింది. దీంతో బెనర్జీ కోపంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.న్యాయవాదులు, మాజీ జడ్జీలతో కూడిన రెండు ఒడిశా ప్రతినిధి బృందాలతో ప్యానెల్ మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. వక్ఫ్ బిల్లుతో వీళ్లకు ఏం సంబంధమని బెనర్జీ నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత బెనర్జీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ఆ తర్వాత పదేపదే బెనర్జీ కలగజేసుకోవడాన్ని తప్పుబట్టడం, దీనికి అభిజిత్ గంగోపాధ్యాయ్ మద్దతు పలకడంతో గంగోపాధ్యాయ్‌తో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా బాటిల్‌ను విసిరేయలేదని తర్వాత బెనర్జీ వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అభ్యంతరాల నేపథ్యంలో పరిశీలన నిమిత్తం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెల్సిందే. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్‌పై గాజుగ్లాసును కళ్యాణ్బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి -
ఎస్సై శ్వేత సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం -
ముగ్గురు ఐపీఎస్ లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
-
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
అఫ్ట్రాల్ ఐదుకిలోలు నన్నడిగినా ఇచ్చేవాడినిగా సార్!
-
మైనారిటీ గురుకులాల్లో బదిలీల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. గురుకుల సరీ్వస్ నిబంధనలకు విరుద్ధంగా జూలై 6న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హేమలత సహా మరికొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సరీ్వస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచి్చందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, స్టే ఉండగా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ, బదిలీ మార్గదర్శకాలను 18 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
నాగోలు పీఎస్ ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. -
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేయబడింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరునున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరి డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. -
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రమాదం గురించి వైర్‌లైస్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్, అశ్వినీ అనే ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పు అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయన్నారు.అక్రమాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు, కోర్టులో విచారణ ముగిసేంత వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందుకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అనుమతిని స్తున్నాయన్నారు. వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయన్నారు. అంతేగాక ఆయనపై నమోదైన కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేసేలా కూడా వ్యవహరించారన్నారు. రెండో సారి సస్పెండ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని, అయితే ఈ విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.అవినీతి నిరోధక చట్టం కింద ఏబీ వెంకటేశ్వరరావును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, క్యాట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చిందన్నారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సస్పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
బజరంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. -
ఎవరినీ వదిలిపెట్టను..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తన కేసుపై వచ్చిన ఓ పోస్టుకు.. ‘ఎవరినీ వదిలిపెట్టను’.. అంటూ సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టు పెట్టారని.. ఓ ఉన్నతస్థాయి అధికారి ఇలా మెసేజ్ పెడితే ఆయనపై కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)లో ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఆలిండియా సర్వీసెస్‌లోని నిబంధనల మేరకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిందన్నారు.కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చినట్లు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ‘సుప్రీం’ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్మీట్ల ద్వారా ట్యాపింగ్ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు ఏప్రిల్, 2023లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, నాన్–జ్యుడిషీయల్ సభ్యురాలు శాలినీ మిస్త్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. సాక్షులను బెదిరించే ప్రయత్నం.. ‘రెండుసార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు వాడిన భాష సమర్థనీయం కాదు.. ఫోన్ ట్యాపింగ్, ఆవినీతి కేసుపై ‘ఆవుకథ, నాలుగు కాళ్ల జంతువు’ లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై, కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు, చానల్లో ప్రసారమైంది. కేసుకు ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా.. ఎవరినీ వదిలిపెట్టను అని వెంకటేశ్వరరావు థంబ్‌నెయిల్ పెట్టారు.ఓ సీనియర్ ఐపీఎస్ ఇలా పెడితే సాక్షులు, విచారణాధికారులు ప్రభావితమవుతారు. ఆయనను విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవకాశంలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది’.. అని ఏజీ వాదించారు.రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టులు..‘నిజానికి.. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం.. క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసేవరకు వారిపై సస్పెన్షన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు, ఏపీ, బాంబే, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ హైకోర్టులు తీర్పులిచ్చాయి (వాటిని చదివి వినిపించారు). క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’.. ఏజీ వాదనలు వినిపించారు. అనంతరం వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్.. వెంకటేశ్వరరావు ప్రెస్‌మీట్ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, తీర్పు రిజర్వు చేసింది. -
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్‌గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్‌కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్‌వాష్‌లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్‌కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు