
న్యూఢిల్లీ: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని గాంధీ డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు సీబీడీటీ గుర్తించింది. దీంతో ఆయనను 180 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఇదే ఆరోపణలపై గాంధీ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయనపై గతంలో ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment