
సాక్షి, పుట్టపర్తి: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయిన నిందితుడు గోపీకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ మహమ్మద్ ఇక్బాల్‌కు గోపీకృష్ణ పీఏగా వ్యవహరిస్తున్నారు.
చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: (జట్టుగా 175 సాధిద్దాం)