gopi krishna
-
UNSTOPPABLE లో ప్రభాస్.. ప్రభాస్ తో బాలయ్య రచ్చ..
-
వైఎస్సార్సీపీ నుంచి గోపికృష్ణ సస్పెన్షన్
సాక్షి, పుట్టపర్తి: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయిన నిందితుడు గోపీకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మహమ్మద్ ఇక్బాల్‌కు గోపీకృష్ణ పీఏగా వ్యవహరిస్తున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (జట్టుగా 175 సాధిద్దాం) -
హైదరాబాద్: వివాదంలో సౌత్‌జోన్ డీసీపీ సీసీ గోపికృష్ణ
-
యదార్ధ సంఘటన ఆధారంగా ‘ఎక్కడికో ఈ అడుగు’
గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’.రాజు బొనగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ...చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ "ఇనావర్స్ స్టూడియోకు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో... మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇనావర్స్ స్టూడియో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, సంగీతం: దిలీప్ బండారి. -
తప్పుగా అర్థం చేసుకోరు
గోపీకృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్త్య ముఖ్య తారలుగా ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు, బాంధవ్యాలు, ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్థాల చుట్టూ ఈ చిత్రకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం తగ్గుతుంది’’ అన్నారు. ‘‘ఇద్దరు స్నేహితుల కుటుంబాల మధ్య నడిచే కథ ఇది’’ అన్నారు జి.రామకృష్ణారావు. ‘‘ఈ సినిమాకి మంచి టీమ్ కుదిరింది. ఇదే టీమ్‌తో మేలో మరో చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం’’ అని భీమినేని సురేష్ అన్నారు. -
రుణం తీర్చుకోవాలి
గోపీకృష్ట, మహేంద్ర, ప్రదీప్, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్ జి, రామకృష్ణారావు నిర్మించారు. ఎస్.వి.మల్లిక్ తేజ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కొందరికి రుణపడుతుంటారని, ఆ రుణం తీర్చుకోవాలనే కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సంగీత దర్శకుడు మల్లిక్ తేజ్ ఈ చిత్రంలోని అన్ని పాటలు రాయడంతో పాటు ఓ పాట పాడడం విశేషం. పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ మేం రుణపడి ఉంటాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, తొలి కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఎస్.గుండ్రెడ్డి, ఎస్.వి. మల్లిక్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్. -
ఆసిఫాబాద్ లోనే కొనసాగించాలి
తాండూర్: తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలో ఉంచితేనే మండల యువతకు భవిత ఉంటుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెండ్యాల గోపికృష్ణ అన్నారు. తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలి పేందుకు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పెండ్యాల గోపికృష్ణ, పుట్ట సంతోష్, కాసిపేట కృష్ణ, మల్లయ్య, జ్యోతి, ఇందారపు పద్మ, రాజేశ్వరి, పె ద్దబోయిన లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండ్యాల గోపికృష్ణ మాట్లాడుతూ తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేసిన, మ ద్దతుగా ఉంటామన్న కొందరు ప్రజాప్రతినిధులు నేడు వారి స్వార్థం కోసం తమ ఆందోళనకు వ్యతిరేకంగా వ్యవహరించ డం ప్రజలను మోసగించడమే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మె ప్పు కోసం తాండూర్ మండలాన్ని మంచిర్యాల జిల్లాలో ఉ ంచేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాండూర్ మండలా న్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలిపేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షలకు పలువురు సంఘీభావం వ్యక్తం చేశారు. -
మా అబ్బాయి ఆచూకీ తెలుస్తుందా?
నిరీక్షణ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గొల్లవీధి. తిరువీధుల నారాయణరావు, సరస్వతి దంపతులు. నారాయణ రావుకు ఏడు పదుల వయసు. భార్య సరస్వతికి ఆరుపదుల వయసు దాటింది. ‘మా అబ్బాయి గోపీకృష్ణ ఆచూకీ ఏమైనా తెలుస్తుందంటారా..!’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆశగా అడుగుతుంటారు. ఏడాది క్రితం కిడ్నాపైన తమ బిడ్డ ఏమైపోయాడో తెలియడం లేదని, ఉగ్రవాదుల చెర నుంచి తమ కుమారుడిని విడిపించాలని ప్రభుత్వాలకు వీళ్లు మొరపెట్టుకుంటున్నారు. ఇంతకీ ఏమైందంటే... లిబియా దేశం నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న నలుగురు భారతీయులను కిందటేడాది జూలై 29న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని విడిచి పెట్టగా, హైదరాబాద్‌కు చెందిన బలరాం కిష న్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరువీధుల గోపికృష్ణ ఉన్నారు. దీంతో అప్పట్లో ఆంధ్ర, తెలంగాణాకు చెందిన ప్రభుత్వాలు హడావుడి చేసి ఆ తరువాత వారి గురించి మరచిపోయాయి. కుమారుడి ఆచూకీ కోసం వృద్ధులైన గోపికృష్ణ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతూ ఎదురు చూస్తున్నారు. ‘‘మాకు వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు’’ అంటూ కనపడని దేవుళ్లకి మొక్కుతూ.. తన ఆవేదనను పంచుకున్నారు నారాయణరావు. కళ్ల ముందు ఉండాలని... ‘‘మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు మురళీ కృష్ణ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. రెండవవాడు గోపీకృష్ణ వయసు 39 ఏళ్లు. లిబియా దేశంలో ఉద్యోగం. ఎనిమిదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. వాడికి భార్య కళ్యాణి, 5 ఏళ్ల కొడుకు కృష్ణసాయీశ్వర్, పదేళ్ల కూతురు జాహ్నవి... ఉన్నారు. పిల్లల చదువుల కోసం కళ్యాణి మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది. అప్పటి వరకు అంతా లిబియాలోనే ఉండేవారు. గోపీకృష ఏడాదికి ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లేవాడు. ‘ఎందుకురా అంతంత దూరాలు మమ్మల్ని అంతా వదిలి వెళ్లి! నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇక్కడ రాదా..!’ అని అంటుండేవాడిని. ‘ఈ ఏడాది వరకు బాండ్ ఉంది నాన్నా! అది పూర్తవగానే వచ్చేస్తాను..’ అనేవాడు. నాకు ఆరేళ్ల క్రితం గుండెపోటు వచ్చి బైపాస్ సర్జరీ అయ్యింది. పిల్లలు కళ్లముందు ఉండాలని నా మనసు ఆరాటపడుతోంది. నాన్నెప్పుడు వస్తాడు? నా మనమడు, మనవరాలు.. ‘అమ్మా, తాతయ్యా.. నాన్న ఎప్పుడొస్తారు?’ అని అడుగుతున్నారు. ‘ఇప్పుడు నాన్నకు సెలవుల్లేవు రా.. అయిపోగానే వచ్చేస్తాడు’ అని అబద్ధం చెబుతుంటాం. సరైన ఆదాయం లేక పిల్లల పోషణకు, చదువులకు కావల్సిన సర్దుబాట్లు చేయలేక మా కోడలు కళ్యాణి ఎన్నో ఇబ్బందులు పడుతోంది. నేను కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్ అయ్యి పదేళ్లు అయ్యింది. నాకు పెన్షన్ రాదు. నిలకడగా వచ్చే ఆదాయమూ లేదు. నా మందుల ఖర్చులు, కుటుంబ పోషణ వాడే చూసుకునేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ‘ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా! సమయానికి మందులు వేసుకుంటున్నారా!’ అని అడిగేవాడు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో.. ఎక్కడ ఉన్నాడో తలుచుకుంటేనే దుఃఖం పొంగి వస్తోంది. ఈ వయసులో కొడుకు ఆసరాతో జీవితాన్ని గట్టెక్కించేద్దాం అనుకున్నవాడిని. ఇప్పుడు వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో! వాడిని తీసుకెళ్లినవాళ్లు ఒక్క ఫోన్ అయినా నా కొడుకుచేత చేయిస్తే బాగుండేది. ఏం ఫర్వాలేదు అని... ధీమాగా ఉండేవాడిని. (నారాయణరావు మాట్లాడుతున్నంతసేపూ కన్నీరే తప్ప సరస్వతి ఏమీ మాట్లాడలేకపోయారు). మా కోడలు, పెద్ద కొడుకు మురళీ కృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిసి విషయాన్ని చెప్పి, మా అబ్బాయిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించమని కోరారు. వారు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి ధీమా రాలేదు. ఎం.పీలను కలుస్తున్నాం... ఎవరైనా హామీ ఇస్తున్నారే తప్ప ఎప్పటికి మా అబ్బాయి విషయం తెలుస్తుందో చెప్పడం లేదు. మా రోదన అరణ్యరోదనే అవుతోంది. మీరంతా పూనుకొని మా కష్టం ప్రభుత్వాలకు తెలియజేస్తే.. వారు త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే మా అబ్బాయి మాకు దక్కుతాడు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయగలిగితే మాలాగా ఏ కుటుంబానికీ ఇంత కష్టం రాదు’’ అంటూ చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు నారాయణరావు. - ఎల్.వి.రమణ, సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
ప్రొఫెసర్ కిడ్నాప్‌నకు ఏడాది
గత ఏడాది జూలై 29వ తేదీన లిబియా దేశంలో ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. అప్పట్లో మన దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఇద్దరు కర్ణాటక వాసులు కాగా మరొకరు హైదరాబాదుకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ ఉన్నారు. వీరిలో కర్ణాటక వాసులను విడుదల చేసిన తీవ్రవాదులు బలరాం, గోపీకృష్ణలను మాత్రం బందీలుగానే ఉంచుకున్నారు. గోపీకృష్ణ లిబియాలో స్రిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురైన తరువాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు తదితరులు అతని తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదీకి ఏడాది పూర్తవుతున్నప్పటికీ గోపీకృష్ణ నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పట్లో గోపీకృష్ణ భార్య కల్యాణి, సోదరుడు మురళీకృష్ణ రాష్ట్రపతిని సైతం కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉండగా గోపీకృష్ణ విడుదల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వాలు ఆయా కుటుంబ సభ్యులకు ఇటీవల కాలంలో పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. -
ఫేస్బుక్లో కామెంట్లపై వివాదం ముదిరి...
తుర్కయంజాల్: ఫేస్బుక్లో ఇద్దరు క్లాస్మేట్లు చేసుకున్న కామెంట్ల వ్యవహారం ముదిరి.. ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. బుధవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. వనస్థలిపురం శక్తినగర్‌లో నివాసముండే గుండా గోపికృష్ణ (20) కొత్తపేటలోని శ్రీరాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇతడి క్లాస్మేట్ అఖిల్.. ఫేస్బుక్ అకౌంట్లో ఉంచిన ఫొటోపై అసభ్యకరంగా కామెంట్లు చేసుకున్నారు. అంతటితో ఆగక అఖిల్... గోపికృష్ణకు ఫోన్ చేసి తిట్టాడు. మనస్తాపం చెందిన గోపీకృష్ణ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకై వెళ్లాడు. ఎస్ఐ సైదులు వద్దకు వెళ్లి విషయం చెబుతుండగానే గోపికృష్ణను కొట్టుకుంటూ బయటకి తీసుకువచ్చాడు. మరో హోంగార్డు పద్మారావు గోపీకృష్ణపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటికి వెళ్లి కిరోసిన్, అగ్గిపెట్టెతో ఈరోజు మధ్యాహ్నం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చాడు. పోలీసు జులుం నశించాలని నినాదం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. పూర్తి వివరాలను తెలుసుకుని విచారణ చేపడతామని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు.. -
గోపీకృష్ణ ఎక్కడ?
►ఆచూకీ కోసం కుటుంబసభ్యుల గగ్గోలు ► పట్టించుకోని జిల్లా యంత్రాంగం, నాయకులు ► ఓదార్పుతోనే సరంటున్న గోపీకృష్ణ బంధువులు ► పుట్టినరోజూ మాట్లాడలేకపోయామంటున్న సోదరుడు ► తండ్రి సంరక్షణ కోసం పిల్లల ఎదురుచూపు ఉపాధి కోసం పొరుగు దేశం వెళ్లి అక్కడి ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌నకు గురైన తిరువీధుల గోపీకృష్ణ (40) ఆచూకీ దొరక్క ఏడు నెలలవుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. టెక్కలికి చెందిన రిటైర్డ్ కో- ఆపరేటివ్ విభాగ ఉద్యోగి టి.వి.నారాయణరావు రెండో కుమారుడు గోపీకృష్ణ లిబియా దేశంలో ఓ సంస్థలో కంప్యూటర్ సైన్స్‌లో ఫ్యాకల్టీగా ఉద్యోగం చేస్తూ గతేడాది జూలై 29న కిడ్నాపయిన విషయం తెలిసిందే. మొత్తం నలుగుర్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయగా కొన్నాళ్ల తరువాత ఇద్దర్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ ఉగ్రవాదుల చేతిలోనే గోపీకృష్ణ ఆయన సహచరుడు, తెలంగాణకు చెందిన బలరాంలు ఉన్నారు. ఇన్నాళ్లవుతున్నా గోపీకృష్ణ అచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడం, మేమున్నామంటూ జిల్లా యంత్రాంగం గోపీ కుటుంబసభ్యులకు భరోసా ఇవ్వలేకపోవడంపై బంధువులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గోపీకృష్ణ కిడ్నాప్ సంఘటన జరిగిన తరువాత కొన్నాళ్లకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు బాధితుని తల్లిదండ్రుల్ని పరామర్శించారు. వారి ఓదార్చి వీలైనంత త్వరలో విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఏడు నెలలవుతున్నా ఇప్పుడు కనీసం స్పందించకపోవడంపై గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవర్ని కలవాలో చెప్పండి గోపీకృష్ణ, బలరాంలు క్షేమంగానే ఉన్నారని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పీఏ ద్వారా గోపీ బంధువులు తెలుసుకుంటున్నారు తప్పితే ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితిలో బాధిత కుటుంబసభ్యులున్నారు. తెలంగాణ ఎంపీ రంగారెడ్డి కూడా భరోసా ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తన కుమారుడి ఆచూకీపై బెంగ పెట్టుకున్న గోపీ తండ్రి, సోదరుడు మురళీకృష్ణ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌కు మరోమారు ఫిర్యాదిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానిక ఎంపీ రామ్మోహన్నాయుడు పార్లమెంట్ సమావేశంలో ఒకేసారి ఈ విషయం చర్చించినా, తరువాత జరిగిన రెండు సమావేశాల్లో విషయాన్ని ప్రస్తావించలేకపోయారని గోపీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంపీ కార్యాలయంలోనూ సమాచారం కరువైందని మదనపడుతున్నారు. జిల్లా మంత్రి మరింత చొరవ చూపి గోపీకృష్ణ విడుదల విషయం మేం చూసుకుంటామని హామీ ఇచ్చి ఇన్నాళ్లవుతున్నా ఆయన నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు. ఎవర్ని కలవాలో, ఏం చేయాలో, తన కొడుకు ఏమయ్యాడోనని గోపీ తల్లిదండ్రులు నారాయణరావు, సరస్వతి కన్నీరు రాల్చని రోజు లేదు. నాలుగేళ్లకోసారి పుట్టినరోజు ఇటీవలే 40 యేళ్లు పూర్తిచేసుకున్న గోపీకృష్ణ లీప్ ఇయర్లో జన్మించారు. ఉద్యోగం కోసం 2007లో లిబియా వెళ్లారు. నాలుగేళ్లకోమారు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆనందోత్సవాల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. ఫిబ్రవరి 29, 2016న కూడా ఇక్కడకు వచ్చి వేడుకలు జరుపుతారని, మరి లిబియా వెళ్లేది లేదని గతంలో అంతా నిర్ణయించారు. ఆ సంతోషకరమైన రోజు రానే వచ్చింది. కానీ గోపీ తమ మధ్య లేకపోవడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపీ భార్య కల్యాణి, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం హైద రాబాద్‌లోనే ఉన్నారు. గోపీ సోదరుడు మురళీకృష్ణ ప్రస్తుతం వారి సంరక్షణ చూస్తున్నారు. గోపీ సోదరి విశాఖలో ఉంటున్నారు. తల్లిదండ్రులు టెక్కలిలో ఉంటున్నారు. ఉద్యోగం నిమిత్తం లిబియా వెళ్లిన గోపీ కిడ్నాప్ కాకముందు కూడా జీతం తీసుకోలేకపోయారు. కిడ్నాప్ తరువాత ఏడు నెలలుగా గోపీ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ పోషణకూ ఇబ్బందవుతోందని బంధువులు చెబుతున్నారు. తండ్రి సంరక్షణ కోసం పిల్లలు పడిగాపులు కాస్తున్నారు. తమవాడెప్పుడు వస్తాడోనని కుటుంబసభ్యులు, బంధువులు ఆతృతగా చూస్తున్నారు. అయినా జిల్లా మంత్రి, ఎంపీల నుంచి ఎలాంటి సమాచారం లేదని వారంతా వాపోతున్నారు. లిబియాలో ప్రస్తుతం ప్రభుత్వం దిగిపోవడం, కొత్త ప్రభుత్వం ఏర్పడకపోవడం, ఇతర దేశస్తులకు వీసా కూడా ఇవ్వకపోవడంతో తాము లిబియా వెళ్లేందుకూ ప్రయత్నించలేకపోయామని వారంటున్నారు. ఒకటి రెండు సార్లు ఫోన్ రింగయినా ప్రస్తుతం గోపీ ఫోన్ స్విచాఫ్ వస్తోందన్నారు. ఉగ్రవాద శిక్షణ కోసమే లిబియా తీవ్రవాదులు తమ వద్ద గోపీ, ఇంగ్లిషు ఫ్యాకల్టీ బలరాంలను ఉంచేసుకున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకే కిడ్నాప్ విషయం తెలిసిందని బంధువులు చెబుతున్నారు. నేతలే చొరవ చూపాలి గోపీకృష్ణ ఆచూకీపై నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చొరవ చూపాలి. గోపీ భార్య, పిల్లలకు ఆర్థికంగా కూడా ఇబ్బంది వస్తోంది. ఎవర్ని కలవాలో, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. పుట్టినరోజు కూడా చేసుకోలేకపోయాం. నాయకులు వచ్చి ఓదార్చి వెళ్తున్నారు తప్పితే ఏం చేయలేకపోయారు. తిరువీధుల మురళీకృష్ణ, గోపీకృష్ణ సోదరుడు -
తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?
న్యూఢిల్లీ: ఇంట్లో ఆర్థిక సమస్యలు. మాతృదేశంలో ఉద్యోగాలు కరువు.. కళ్లముందు బోలెడు సమస్యలు వెరసి ఎలాగైనా ఓ ఉద్యోగం చేయాలనే తపన వారిని ప్రమాదభరిత ప్రాంతాల్లో సైతం ఉద్యోగాలకు వెళ్లేలా చేసింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే లిబియాలో ఉద్యోగం వచ్చింది. సిర్తీ విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. సెలవుల్లో భాగంగా తిరుగు ప్రయాణం అయినవారిని దురదృష్టం వెంటాడింది. దాదాపు రెండు నెలలుగా వారి గురించి ఇసుమంత జాడకూడా తెలియకుండా పోయింది. ఇది లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ. బలరాం, గోపికృష్ణలు గత ఏడాది జూలై చివరి వారంలో భారత్ కు తిరిగి వచ్చేందుకు ట్యునిషియా ఎయిర్ పోర్టుకు వస్తుండగా వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి వారి జాడ కరువైంది. కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉగ్రవాదులు తమకు పాఠాలు చెప్పించుకుంటున్నారని తాజాగా తెలిసింది. వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతూ పాఠాలు చెప్పించుకుంటున్నారని, ఈ కృతజ్ఞతాభావంతోనైనా ఆ ఉగ్రవాదులు తమవారిని విడిచిపెడతారని ఆశిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీరితోపాటు ఎంతోమందిని ఇలాగే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాఠాలు చెప్పించుకుంటున్నారట. బలరాం భార్య శ్రీదేవీ ఈ విషయంపైనే ఓ మీడియాతో మాట్లాడుతూ 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమవారితో బలవంతంగా పాఠాలు చెప్పించుకుంటున్నారని నాకు మూడు నెలల కిందట భారత దౌత్య కార్యాలయం, స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. నేను ప్రతి రోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పీఏకు ఫోన్ చేస్తున్నాను. వారు సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసాతో ఉంటున్నాను. ఈ సమయంలో నా కుటుంబం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నా కొంత గుబులుగానే ఉంది' అని చెప్పింది. ఇక గోపి కృష్ణ సోదరుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. తమ సోదరుడిని సెప్టెంబర్ 2014లో చూశామని, ఫిబ్రవరి 29 తన పుట్టినరోజని ఆ నాటికైనా తాను వస్తాడని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన ఎస్ విజయ్ కుమార్, లక్ష్మీ కాంత్ రామకృష్ణ అనే ఇద్దరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినా అనంతరం విడిచిపెట్టారు. -
గోపికృష్ణ కిడ్నాపై 100 రోజులు..
హైదరాబాద్: లిబియాలో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ అపహరణకు గురై 100 రోజులు అవుతున్నా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నగరంలోని నాచారం ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సమాచారం లేదని గోపీకృష్ణ భార్య కళ్యాణి సోమవారం మీడియా ముందు ఆవేదన చెందారు. మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. గోపీకృష్ణ మీద మూడు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ కుటుంబాలు గత మూడు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నట్లు సోదరుడు మురళి కృష్ణ చెప్పారు. అపహరణకు గురైన వారిని విడిపిస్తామని ప్రధాని నరెంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ విడుదలలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తమ్ముడు గోపికృష్ణ విడుదలకు కృషి చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కూడా మరోసారి కలుస్తామన్నారు. -
'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం'
హైదరాబాద్: లిబియాలో ఉన్న తెలుగు ప్రొఫెసర్తు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అక్కడ దౌత్య కార్యాలయం లేదని.. త్వరలోనే వారిని విడిపిస్తామని ఆమె తెలిపారు. లిబియాలో ఉగ్రవాదులు ప్రొఫెసర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుంచి వారి విడుదలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నగరం అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు కిడ్నాప్ నకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే ఆరోజు నుంచి విడుదల కాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, వారు క్షేమంగానే ఉన్నారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. -
గోపీకృష్ణ విడుదలకుకేంద్రంపై ఒత్తిడి
ఎంపీ రామ్మోహన్నాయుడు టెక్కలిరూరల్: గత నెల 29న లిబియాలో ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురైన టెక్కలికి చెందిన గోపికృష్ణను సురక్షితంగా విడుదల చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం టెక్కలిలో గోపీకృష్ణ తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించి ఓదార్చారు. గోపీకృష్ణ విడుదలపై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని..ఢిల్లీ వెళ్లిన వెంటనే దీనిపై కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్‌తో చర్చిస్తానని ఎంపీ చెప్పారు. లిబియాలోని భారత ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపి గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువస్తామని అన్నారు. కాగా... తాము కూడా ఢిల్లీ వస్తామని గోపీకృష్ణ తల్లిదండ్రులు కోరగా, దీనికి ఎంపీ సమాధానం చెప్పలేదు. కనీసం ఫోన్లో మాట్లాడించాలని అభ్యర్థించినప్పటికీ ఎంపీ నుంచి స్పందనలేదు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో చర్చిస్తా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో చర్చిస్తానని ఎంపీ చెప్పారు. టెక్కలిలో విలేకర్లతో మాట్లాడారు. మిత్ర పక్షం లో ఉన్నాం కావునా కేంద్రానికి స్నేహ పూర్వకంగా విన్నవించి ప్రత్యేక హోదా తీసుకువస్తామని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రత్యేక హోదా లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. -
గోపీకృష్ణ విడుదలకు చర్యలు
టెక్కలి: లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఉన్న టెక్కలికి చెందిన గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో నివాసముంటున్న గోపీకృష్ణ తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతిలను ఆదివారం ఆయన ఓదార్చారు. నేరుగా ఢిల్లీకి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. గోపీకృష్ణను ఉగ్రవాదుల నుంచి విడిపించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని ఎలాంటి భయాందోళనలూ చెందవద్దని బాధిత తల్లిదండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లిబియాలో ఉగ్రవాదుల కిడ్నాప్‌కు గురైన గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి లిబియా దేశం ప్రతినిధులతో చర్చలు జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆయనవెంట ఎల్.ఎల్.నాయుడు, హనుమంతు రామకృష్ణ, చాపరా గణపతి, మామిడి రాము తదితరులు ఉన్నారు. అండగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునా అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని గోపీకృష్ణ తల్లిదండ్రులకు వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గొల్లవీధిలో ఉంటున్న గోపీకృష్ణ తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ విడుదలకు ప్రభుత్వం స్పందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఎ.తాతారావు, విశ్వనాథం, గోపీ తదితరులు పరామర్శించారు. -
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
రెండు రోజులైనా తెలియని ఆచూకీ సాక్షి, హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు. విడుదలకు కృషి చేస్తున్నాం: వెంకయ్య నాచారంలోని గోపీకృష్ణ కుటుంబసభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారు క్షేమంగానే తిరిగొస్తారన్న నమ్మకముందని భరోసా ఇచ్చారు. కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి క్షేమంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాని, లిబియాలోని సిర్త్‌యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి సమాచారం రావడం లేదని బలరాం కుటుంబసభ్యులు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే తమకు సమాచారం తెలుస్తోందని వాపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వారినీ కాపాడండి: సుష్మాకు దత్తన్న ఫోన్ సాక్షి, హైదరాబాద్: ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పటికే ఇద్దరిని కాపాడిన తీరు అభినందనీయమని, మిగిలిన ఇద్దరినీ కాపాడాలని దత్తాత్రేయ శనివారం ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సుష్మ సానుకూలంగా స్పందించారని, బందీలుగా ఉన్నవారు క్షేమంగా విడుదల అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బలరాం, గోపీకృష్ణ విడుదలయ్యేలా చూడండి * కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ లిబియాలో కిడ్నాప్‌నకు గురైన రాష్ట్రానికి చెందిన బలరాం విడుదల విషయంలో చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖరాశారు. లిబియా కిడ్నాప్ ఉదంతంపై సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు సైతం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బలరాంతో పాటు ఏపీకి చెందిన గోపీకృష్ణ సైతం క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. -
దళితులపై నేరాలను నియంత్రించాలి
ఆదిలాబాద్ క్రైం : దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న నేరాల ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ గోపికృష్ణ ఆదేశించారు. శుక్రవారం వివిధ జిల్లాల ఎస్పీల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కేసుల వివరాలను ఎస్పీ గజరావు భూపాల్ డీజీపీకి వివరించారు. 2012లో 123, 2013లో 113 కేసులు నమోదయ్యాయని, 2014లో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో 74 కేసులు ఉ న్నాయని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతామని తెలిపారు. పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైన వెంటనే డివిజన్ స్థాయి పోలీసు అధికారుల సమక్షంలో దర్యాప్తు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా నిర్వహించే నే ర సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎ స్టీ కేసులకు సంబంధించి ప్రత్యేక సమయం కేటాయించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీ సీతారాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ప్ర భాకర్‌రావు, కమ్యూనికేషన్ ఎస్సై సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంది రెండు నాల్కల ధోరణి
తిరుపతి అర్బన్ : ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోని 300 పడకల గర్భిణుల ఆస్పత్రి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు నాల్కల ధోరణిగా ఉందని జూనియర్ డాక్టర్ల సంఘం పీజీ, యూజీ విభాగాల కార్యదర్శి డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ కార్తీక్, హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ ఆరోపిం చారు. ఆస్పత్రి భవనాలను మెటర్నిటీకే కేటాయించాలన్న డిమాండ్‌తో జూ.డా ల సంఘం నాయకులు చేపట్టిన ఆందోళనలు గురువారం 16వ రోజుకు చేరాయి. వీరికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మునీశ్వర్‌రెడ్డితో పాటు ఐఎన్టీయూసీ, మహిళా, సీఐ టీయూ కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీ వో ప్రతులను, ప్రభుత్వ దిష్టిబొమ్మను రుయా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీ సర్కిల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చా రు. సీఎంకు, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్యవిద్య డెరైక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వివేకానంద విగ్రహం వద్ద దిష్టిబొమ్మ తలను పగులగొట్టారు. చివరగా జీవో ప్రతు లు, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జూ.డాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మొన్నటి రాష్ట్ర విభజనలో లాగా ఆస్పత్రుల అంశంలోనూ చంద్రబాబు నాయుడు రెండునాల్కల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన జూ.డాల నాయకులతో సమన్యాయం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు లేబూరి రత్నకుమార్ ఆధ్వర్యంలో రుయా ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టి జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యార్థులు, మెడికోలు 16 రోజులుగా నిర సన చేస్తున్నారన్నారు. అయితే, జిల్లాలోని కార్పొరేట్ వ్యక్తుల ఫంక్షన్లకు వచ్చిన రాష్ట్ర మంత్రులు విద్యార్థుల ఆందోళనల వద్దకు రాకుండా వెళ్లడం చూస్తే వారికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన 300 పడకల భవనాలను మెటర్నిటీకే ఉంచాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుంటూరు రాజేశ్వరి, జూ.డాల సంఘం నాయకులు డాక్టర్ హిమజ, డాక్టర్ సత్యవాణి, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సహజ్, సీఐటీయూ నాయకులు మురళి, పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు రవితేజ, సునీల్, నవీన్‌చంద్ర, భరత్, పలువురు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. -
చిన్నారులపై గోపీకృష్ణ కీచకపర్వం
-
చిన్నారులపై గోపీకృష్ణ కీచకపర్వం
విజయవాడ : అనాథ బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న షిర్డీ సాయి ఆశ్రమ నిర్వాహకుడిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యర్రంశెట్టి గోపీకృష్ణ అనే వ్యక్తి గతంలో రైల్వేలో టీటీఈగా పనిచేశాడు. ఏలూరులో ఇతడిపై హత్యాయత్నం కేసు నమోదవడంతో 2005లో ఉద్యోగం నుంచి తొల గించారు. ఇతడికి ముగ్గురు భార్యలు. గోపీకృష్ణ ఖుద్దూస్‌నగర్ మట్టిరోడ్డులో ఆరేళ్ల కిందట శ్రీ షిరిడీ సాయిబాబా ఆశ్రమాన్ని స్థాపించాడు. ముగ్గురు భార్యలకు పుట్టిన పిల్లలతో పాటు కొందరు అనాథ బాలలను చేర్చుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అందులోని అనాథలకు భోజనం పెట్టి పాఠశాలకు పంపిస్తుంటాడు. వారు రాత్రిళ్లు ఆశ్రమంలోనే ఉంటారు. దీని నిర్వహణకు నలుగురు ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా చందాలు సేకరించి, ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అందులోని బాలికలతో పనులు చేయిస్తుంటాడు. రాత్రివేళల్లో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. దీనిపై చైల్డ్‌లైన్‌కు కొంతమంది సమాచారం అందించారు. వారు ఆశ్రమానికి వచ్చి బాలబాలికల నుంచి వివరాలు సేకరించారు. అ నంతరం చైల్డ్‌లైన్‌కు తరలించారు. గోపీకృష్ణపై జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మైనర్ బాలికపై వేధింపులు: నిందితులు అరెస్ట్
గుంటురు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో మైనర్ బాలికపై ప్రేమ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక పటేల్ నగర్‌లోని మైనర్ బాలికను తమను ప్రేమించాలంటూ గత కొద్దికాలంగా గోపికృష్ణ, కొండరెడ్డిలు వేధిస్తున్నారు. ఆ క్రమంలో తమను ప్రేమించకుంటే ముఖంపై యాసిడ్ పోస్తామని వారిరువురు గురువారం మైనర్ బాలికను బెదిరించారు. దాంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దీంతో వారు బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ మైనర్ బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గోపికృష్ణ, కొండారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై నిర్భయ కేసు నమోదు చేశారు.