'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం' | sushma swaraj statement on kidnapped professors | Sakshi
Sakshi News home page

'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం'

Published Mon, Aug 10 2015 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం'

'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం'

హైదరాబాద్: లిబియాలో ఉన్న తెలుగు ప్రొఫెసర్తు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అక్కడ దౌత్య కార్యాలయం లేదని.. త్వరలోనే వారిని విడిపిస్తామని ఆమె తెలిపారు. లిబియాలో ఉగ్రవాదులు ప్రొఫెసర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుంచి వారి విడుదలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్ నగరం అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు కిడ్నాప్ నకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే ఆరోజు నుంచి విడుదల కాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, వారు క్షేమంగానే ఉన్నారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement