న్యూఢిల్లీ: ఇరాక్లో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఇరాక్లోని మోసుల్ నగరం నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన భారతీయులను చంపలేదని తెలిపారు. వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాజ్యసభలో సుష్మా చెప్పారు.
ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న హర్జీత్ సింగ్ ప్రభుత్వ రక్షణలో క్షేమంగా ఉన్నాడని తెలిపారు. బందీలుగా ఉన్న భారతీయులతో ప్రభుత్వం నేరుగా సంప్రదించలేదని, అయితే ఆరు రకాల మార్గాల ద్వారా వారందరూ ప్రాణాలతో ఉన్నట్టు సమాచారం అందిందని సుష్మా స్వరాజ్ చెప్పారు.
ఇరాక్లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
Published Fri, Nov 28 2014 12:41 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement