Sushma Swaraj
-
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్‌కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా?
దేశంలో 18వ లోక్‌సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్‌పైనే నిలిచింది. 12 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అదే సమయంలో పలు లోక్‌సభ సీట్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కోవలో న్యూఢిల్లీ సీటుకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి బీజేపీ తరపున ఈ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె 1996లో తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు చూస్తున్నారు.ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారో వెల్లడికానుంది. ఈసారి బీజేపీ ఢిల్లీ నుంచి పోటీకి అవకాశం కల్పించిన కొత్త వారిలో మాజీ విదేశాంగ మంత్రి , బీజేపీ సీనియర్ మహిళా నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఒకరు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానానికి చెందిన ఎమ్మెల్యే. న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్ తన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓ లాయర్‌పై పోటీకి దిగారు. 1996లో దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున పోటీకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికల రంగంలోకి దూకారు. సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా వృత్తి రీత్యా న్యాయవాది. ఆప్ నుంచి ఎన్నికల బరిలో దిగిన న్యాయవాది సోమనాథ్ భారతితో ఆమె పోరుకు సిద్దమయ్యారు. సుష్మా స్వరాజ్ తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌కు ఎదురుకావడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు నాడు సుష్మాపై కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన కపిల్ సిబల్‌కు అవే మొదటి ఎన్నికలు. ఇప్పుడు బస్సూరి స్వరాజ్‌పై ఆప్ తరపున పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి కూడా ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. -
బాసురీ స్వరాజ్.. డాటరాఫ్ సుష్మ
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్ సెల్ కన్వినర్‌గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు... వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో... బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్‌లోని వారి్వక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరీన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో–కన్వినర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హరియాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు... సుష్మా స్వరాజ్ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అది ఊరికే అన్న మాట కాదు.. సుష్మా స్వరాజ్ కూతురి ధీమా!
‘ఈసారి 400కు పైగా సీట్లు’ అనేది ఊరికే అన్న మాట కాదు.. నిజం అయి తీరుతుంది అంటున్నారు బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి "స్వప్రయోజనం"పై ఆధారపడి ఉందని, తమ పార్టీ అవకాశాలపై ఆ కూటమి ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారామె. ఢీల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలనూ మరోసారి బీజేపీ గెలుచుకుంటుందన్నారు. ఢిల్లీలోని అత్యంత పిన్న వయస్కురాలైన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అబ్కీ బార్ 400 పార్ (ఈసారి 400కు పైగా సీట్లు)" అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ఒక సంకల్పమని అన్నారు. అంకితభావంతో ఉన్న బీజేపీ కార్యకర్తల సహాయం, ప్రజల మద్దతుతో వాస్తవం అయి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నీ చెప్పినట్లే చేసింది. ఆర్టికల్ 370ని తొలగించడం, రామమందిర నిర్మాణం, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడం వంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బన్సూరి స్వరాజ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఇద్దరు మహిళా అభ్యర్థుల్లో బన్సూరి స్వరాజ్ ఒకరు. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేసేందుకు బీజేపీ పోటీపడుతోంది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తోంది. ఆ స్థానం నుంచి సోమనాథ్ భారతిని బరిలోకి దింపింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తనకు ప్రజల నుండి ఎంతో అభిమానం లభిస్తోందని బన్సూరి స్వరాజ్ తెలిపారు. వేదికపై కూర్చొని ప్రసంగాలు చేయడం తనకు ఇష్టం ఉండదని, ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడటమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. -
ఇరకాటంలో సుష్మా స్వరాజ్ కుమార్తె..
న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్‌సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు. అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్‌సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr — Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024 ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్‌ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్లో తన సొంత క్యాడర్‌తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు. -
లోక్‌సభ బరిలో డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్
బీజేపీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి జాబితాలో చర్చనీయాంశంగా మారిన ఓ అభ్యర్థి.. బన్సూరి స్వరాజ్(39). ‘తెలంగాణ చిన్నమ్మ’.. కేంద్ర మాజీ మంత్రి .. దివంగత సుష్మా స్వరాజ్ తనయే ఈ బన్సూరి కావడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్సూరి స్వరాజ్‌కు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది బీజేపీ. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది. ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్ విభాగంలో ఆమె కో-కన్వీనర్‌గాసేవలు అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారి. న్యాయవాద వృత్తిలో మొత్తం ఆమె 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. లండన్‌లోని బీపీపీ లా స్కూల్లో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వర్విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నుంచి పీజీ చేశారు. ప్రాక్టీస్ చేసే సమయంలోనే ఆమె హర్యానా అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ నియమితులు కావడం గమనార్హం. आदरणीय #आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। अनकी दीर्घायु व स्वास्थ्य के लिये ईश्वर से प्रार्थना करती हूँ। उनके आवास पर जाकर आशीर्वाद लेने का अवसर मिला। मेरी माँ @SushmaSwaraj द्वारा स्थापित मीठी प्रथा के अनुसार मैं उनका पसंदीदा चॉकलेट केक ले गई थी।#LKAdvaniBirthday pic.twitter.com/h1x7yjbKKO — Bansuri Swaraj (@BansuriSwaraj) November 8, 2021 సుష్మా స్వరాజ్ బతికుండగా తన రాజకీయ గురువైన.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రతీ పుట్టిన రోజుకి స్వయంగా కేక్ తీసుకెళ్లి అందించేవారు. అయితే ఆమె మరణాంతరం కూతురు బన్సూరి ఆ ఆనవాయితీని తప్పకుండా వస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ సీటును తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరీ స్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | BJP fields former External Affairs Minister late Sushma Swaraj's daughter, Bansuri Swaraj from New Delhi seat, she says, "I feel grateful. I express gratitude towards PM Modi, HM Amit Shah ji, JP Nadda ji and every BJP worker for giving me this opportunity. With the… pic.twitter.com/szfg055rzf — ANI (@ANI) March 2, 2024 -
సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తానెప్పుడూ భారత దేశ రాజకీయాల్లో ప్రముఖమైన నాయుకురాలిగా చూడలేదన్నారు. ఈ మేరకు తాను రాసిన "నెవర్ గివ్ ఏ ఇంచ్ : ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్"లో సుష్మా స్వరాజ్‌ని కొన్ని అమెరికన్ పదాలతో అవమానకరంగా వర్ణించారు. అంతేగాదు సుష్మా రాజకీయం పరంగా ఆమె కీలకపాత్రధారి కాకపోవడంతోనే మోదీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సన్నిహితంగా పనిచేశానని తన పుస్తకంలో రాశాడు. వాస్తవానికి సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆమెతో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇకపోతే తదుపరి భారత విదేశాంగా మంత్రి.. 2019లో కొత్తగా నియమితులైన జైశంకర్‌ని తాను స్వాగతించానని, పైగా అతను తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు పాంపియో. అతను మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, అది తనకంటే బాగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఆయనను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. తన పుస్తకంలో జైశంకర్ వచ్చే 20204 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అతను ఒక గొప్ప ప్రోఫెషనల్, హేతుబద్ధమైన వ్యక్తి మాత్రమే గాదని తన దేశానికే గొప్ప రక్షకుడిగా కూడా అభివర్ణించారు. చివరిగా తాను సుష్మాతో పొలిటకల్‌గా తనతో చాలా ఇబ్బందిపడ్డానని, తనకు ఏవిధంగా సహకరించలేదని చెప్పారు. కానీ జైశంకర్‌తో చాలా సన్నిహితంగా పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వ్యాఖ్యలకు జైశంకర్ స్పందించి..తాను పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్‌ని అవమానిస్తూ రాసిన వ్యాఖ్యలను చూశానన్నారు. ఆమెను తానెప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నానని, అలాంటి ఆమె పట్ల ఇలా అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా, సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆమెను అగౌరపరిచేలా చేసిన సంభాషణనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అంతేగాదు పాంపియో తన పుస్తకంలో భారత్ అమెరికాను నిర్లక్ష్యం చేయడం దశాబ్దాల ద్వైపాక్షిక వైఫల్యంగా పేర్కొన్న విషయంపై కూడా శంకర్ ధీటుగా కౌంటరిచ్చారు. ఇదిలా ఉండగా పాంపియో తన పుస్తకంలో... భారత్ అమెరికా, భారత్ సహజ మిత్రులని నొక్కి చెప్పారు. తమ ప్రజలు ప్రజాస్వామ్య చరిత్ర, ఉమ్మడి భాష, సాంకేతికత తదితర వాటిన్నింటిని భారత్‌తో పంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేగాదు అమెరికా మేధో సంపత్తి ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న మార్కెట్ భారతదేశమేనన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహాత్మకమైన స్థానం చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత్‌తో దౌత్యాని మూలధారం చేసిందని రాశారు. ఆ పుస్తకంలో తాను ఎంచుకున్న భారతదేశాన్ని అమెరికా తదుపరి గొప్ప మిత్రదేశంగా మార్చడంలో సమయం వెచ్చించండి, కృషి చేయండి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. (చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు) -
ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మా.. నువ్వు లేని లోటు!
ఉక్రెయిన్ సంక్షోభాన్ని అంచనా వేయడంలో భారత ప్రభుత్వం తడబడింది. నెలన్నర కిందట.. కేవలం ఉక్రెయిన్‌లోని భారతీయుల క్షేమసమాచారాల సేకరణకే పరిమితం అయ్యింది అక్కడి మన ఎంబసీ. మరోవైపు ఆ సంక్షోభంలోనూ తరగతులు నిర్వహించి ఉక్రెయిన్ యూనివర్సిటీలు తప్పు చేస్తే.. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో భయభయంగానే అక్కడే ఉండిపోయారు భారతీయ విద్యార్థులు. అవే ఇప్పుడు ఆపరేషన్ గంగకు అవాంతరాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చిన్నమ్మ ‘సుష్మాస్వరాజ్’ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన సమయంలో.. భారత ప్రభుత్వం స్పందించి ఉక్రెయిన్‌లోని మన రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులకు సూచించింది. అయితే అప్పటికే చాలా దేశాల పౌరులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆపై పరిస్థితి విషమిస్తున్న.. నాలుగైదు రోజుల ముందు కూడా అమెరికా సహా పలు దేశాలు తిరిగి వచ్చేయాలంటూ ఆయా దేశాల పౌరులకు సూచించాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయిందని, ఆ ఆలస్యమే భద్రత భయాందోళనలకు కారణమన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ భారత విద్యార్థులు ఆమె ఉండి ఉంటేనా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు, సీనియర్ దౌత్యవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా.. వేచిచూసే ధోరణికి ఆమె పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా పని చేసిన టైంలో.. దౌత్యపరంగానే కాదు, సహాయచర్యల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శించేవారు. అనుమతుల కోసం ఎదురు చూడకుండా.. ఎంఈఏ ట్విటర్ హ్యాండిల్ ద్వారా స్వయంగా సుష్మాజీనే రంగంలోకి దిగేవారు. పరిస్థితి ఎలాంటిదైనా.. ఎంతటి క్షిష్టమైన సమస్య అయినా సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించేది ఈ చిన్నమ్మ. అందుకే ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. I have got the report. As per medical advice, your brother cannot travel at this stage.Your mother is with him in Georgia. /1 https://t.co/QOwtXsgmz2 — Sushma Swaraj (@SushmaSwaraj) February 1, 2017 సింగిల్ హ్యాండ్ సుష్మా.. యుద్ధం మొదలైన తర్వాతే భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను మొదలుపెట్టింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలు పంపించి.. వాటి సరిహద్దులకు చేరుకున్న భారతీయులను, విద్యార్థులను తరలిస్తోంది. ఆయా దేశాలతో సమన్వయ చర్చలు ప్రారంభించి.. ఇక్కడి నుంచి నలుగురు కేంద్ర మంత్రుల్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని పంపించింది మోదీ ప్రభుత్వం. అయినా తరలింపులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అఫ్కోర్స్.. అక్కడున్న పరిస్థితులే అందుకు కారణం అనుకోండి. అది వేరే విషయం. అయితే.. సుష్మా స్వరాజ్ ఈ పరిస్థితిలో ఉండి ఉంటే పరిస్థితిని ఎలా డీల్ చేసి ఉండేవారో? అనే చర్చను లేవనెత్తారు పలువురు నెటిజన్లు. I have asked for a report from Indian Embassy in Dubai. Indian Walked 1,000 Km To Dubai Court https://t.co/kbvwVV67QP via @ndtv @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) November 30, 2016 వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా సుష్మాజీ జోక్యం చేసుకునే తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర దేశాలతో డిజిటల్ దౌత్యం ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సుష్మాజీ. తెలంగాణ యువత కేటీఆర్ లాంటి ఎంతో మందికి ఒకరకంగా ఇదే స్ఫూర్తి అనే అనుకోవచ్చు. ఆపదలో ఉన్నామని, సాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే చాలు.. ట్విటర్ ఎంఈఏ హ్యాండిల్ ద్వారా నేరుగా రంగంలోకి దిగేవారామె. అలా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులకు సాయం అందించి.. వాళ్ల ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు అందుకున్నారామె. వ్యక్తిగత సాయాలను పక్కనపెడితే.. 2015 ఆపరేషన్ రాహత్ గుర్తించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆపరేషన్ రాహత్ నాటి ఫొటో ఒకవైపు సౌదీ అరేబియా-మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నడుమ ఐదు వేలమంది భారతీయులను, ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత కచ్చితంగా ఆమె టీందే. ముఖ్యంగా బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించిన తీరు.. విరామం తీసుకోకుండా దగ్గరుండి ఆమె పర్యవేక్షించడంపై అప్పట్లో హర్షం వ్యక్తం అయ్యింది. ఇదే కాదు.. 2018 అగ్నిప్రమాదంలో పాస్‌పోర్టులు తగలబడి పోయి ఇబ్బందులు పడ్డ ఇల్లినాయిస్ యూనివర్సిటీ(అమెరికా) విద్యార్థులను చట్టమైన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్‌కు రప్పించిన ఘటనా గుర్తు చేస్తున్నారు కొందరు. ఉక్రెయిన్ పరిస్థితులు వేరు కావొచ్చు.. కానీ, ఈ పరిస్థితుల్లో గనుక ఆమె ఉండి ఉంటే మాత్రం పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తం అవుతోంది. వీ మిస్ యూ చిన్నమ్మ. Repatriating our diaspora during difficult times is a competence & commitment of India that most citizens will acknowledge.I respectfully recall Smt Sushma Swaraj who became a powerful symbol of this commitment. 🙏🏽 https://t.co/lmmPQhhOm6 — anand mahindra (@anandmahindra) August 22, 2021 ::: సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
మేం పిలుపు ఇస్తే తట్టుకోలేరు.. బీజేపీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌పై చిల్లరగా మాట్లాడటం సరికాదని, మేం పిలుపు ఇస్తే మీరు తట్టుకోలేరని తెలంగాణ అల్లకల్లోలమవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తామని గత ఎన్నికలకు ముందు అప్పటి జాతీయ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పాదయాత్ర లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్‌గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన ‘గీత’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్‌లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు) సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్‌లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. -
తోషఖానా : సుష్మా స్వరాజ్‌దే భారీ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానమంత్రి విదేశాంగమంత్రులు, ఇతర అధికార ప్రతినిధులకు అందించే బహుమతులు, గౌరవసూచికగా ఇచ్చే కానుకల రూపంలో కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.7 కోట్ల రూపాయలు ప్రభుత్వనిధి తోషఖానాకు చేరాయి. వీటిలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లభించిన కోట్ల రూపాయల బంగారు, వజ్రాల ఆభరణాల బహుమతి అతివిలువైనదిగా నిలిచింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో 230మందికి పైగా వ్యక్తులు 2,800 బహుమతులు అందుకోగా, వీటి విలువ సుమారు 17.74 కోట్ల రూపాయలు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఆమెకిచ్చిన 6.7 కోట్ల విలువైన వెండి వజ్రాల పచ్చ ఆభరణాల సెట్ ఈ కాలానికి అత్యంత ఖరీదైన బహుమతిగా నిలిచింది. అలాగే 2015లో ప్రధాని మోదీ అందుకున్న 35 లక్షల విలువైన, హారము, చెవిపోగులు పెట్టె చాలా ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రికి ఖరీదైన బహుమతులు లభిస్తాయి. కానీ 2018-2019 కాలంలో కోట్ల విలువైన వజ్రాల గడియారాలతో చాలామంది అధికారులు టాప్ లో నిలిచారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల తమ తమ విదేశీ పర్యటన సందర్భంగా మెమెంటోలు, సాంస్కృతిక కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఫోటోలు, గాడ్జెట్లు, చీరలు, కుర్తాలతోపాటు మద్యం కూడా బహుమతిగా అందుకున్నారు. ముఖ్యంగా పాలరాయి రాయిపై మోదీ బొమ్మ, హిందీలో పద్యం వంటి వ్యక్తిగతీకరించిన బహుమతి కూడా ఉంది. అంతేకాదు 2014 నుండి తోషాఖానాకు చేరిన వాటిలో రహస్య ఇంటెలిజెన్స్ ఫైల్స్, పశ్చిమ బెంగాల్ నజాఫీ రాజవంశానికి చెందిన 18 వ శతాబ్దపు కత్తి, మహాత్మా గాంధీ డైరీ నుండి ఒక ఫ్రేమ్డ్ పేజీ, గాంధీ చిత్రాలు, అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్,బంతి, ఇత్తడి కంటైనర్‌లో నింపిన మానస సరోవర్ పవిత్ర జలం, బుల్లెట్ ట్రైన్ నమూనా, వెండి ఎద్దుల బండి ఉండటం విశేషం. సాంప్రదాయం ప్రకారం విదేశీ సందర్శనల సమయంలో దేశానికి చెందిన ముఖ్య ప్రతినిధులు అందుకున్న బహుమతులు నేరుగా ప్రభుత్వనిధి తోషాఖానాకు వెళతాయి. ఖరీదైన ఆభరణాలు, గడియారాల, కళాఖండాలు, గాడ్జెట్లు ఇతర వస్తువులు ఈ కోవలో ఉంటాయి. తోషాఖానా వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 2014 - ఫిబ్రవరి 2020 మధ్య లభించిన బహుమతులలో 61శాతం 5,000 కంటే తక్కువ విలువైనవి కాగా, ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి 4శాతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ 650కి పైగా గిఫ్ట్ లు అందుకోగా, ఆ తరువాత వరుసలో సుష్మ స్వరాజ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలకు సమాచార హక్కు నుంచి మినహాయింపు నివ్వడంతో అందుబాటులో లేవు. -
ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా..
న్యూఢిల్లీ : పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశానికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రథమ స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ‘భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటు కూలంకశంగా చర్చించింది. ఉభయసభల ఆమోదం పొందింది. ఇదంతా భారతదేశ అంతర్గత వ్యవహారం. ఇతర దేశాలు (పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశిస్తూ) మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత.. ‘ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానంటూ’ చివరి ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఉపరాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. భారతదేశ ఆలోచనలు, విదేశాంగ విధానాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, హుందాగా అదే సమయంలో బలంగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆమెను ‘ఆదర్శ భారతీయ మహిళ’గా కీర్తించారు. మాటలు, చేతల్లో స్పష్టత.. ఆలోచన, ఆహార్యం, ప్రసంగాల్లో భారతీయతకు ఆమె ప్రతిరూపమన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని.. తను పనిచేసిన ప్రతిచోట తనదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆదర్శంతమైన రాజకీయ నాయకురాలి జీవితాన్ని, ఆమె సాధించిన విజయాలను కొత్తతరం రాజకీయ నాయకులు ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. 1996లో పార్లమెంటులో ‘భారతీయత’పై శ్రీమతి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం తనకింకా గుర్తుందన్నారు. ‘ఓ చక్కటి వక్తగా, కార్యశీలిగా, రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా.. మానవతా విలువలున్న వ్యక్తిగా కూడా సుష్మాస్వరాజ్ అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఆమె పేరుముందు స్వర్గీయ అని పెట్టేందుకు కూడా మనసు అంగీకరించడంలేదు. మిత్రులు, మద్దతుదారులు, ప్రజలు ఇలా ఎవరికేం అవసరం వచ్చి ఆమె తలుపు తట్టినా.. నేనున్నానంటూ వచ్చి సాయం చేసే ఓ మంచి సోదరిని ఇంకా మరిచిపోలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నసమయంలోనూ.. సమస్య ఉందని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు వచ్చిన తక్షణమే స్పందించేవారని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలి కాలంలో నేను చూసిన గొప్ప విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్’ అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏడుసార్లు లోక్‌సభకు, అంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. ప్రజల గుండెల్లో ఆమెకున్న స్థానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘అందరికీ అర్థమయ్యేలా భాషలో స్పష్టత, ఆకట్టుకునే పదాలు వీటికితోడు చక్కటి వక్తృత్వం వెరసి సుష్మాస్వరాజ్ తన ఆలోచనలను చాలా స్పష్టంగా వెల్లడించేవారు. హిందీ, సంస్కృతం, హరియాణ్వీతోపాటుగా కర్ణాటక ఎన్నికల్లో కన్నడ భాషలోనూ స్పష్టంగా మాట్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బహుభాషా కోవిదురాలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘సుష్మాజీ మా కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికొచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నాను. మొన్న రాఖీ పండగ సందర్భంగా సుష్మాజీ గుర్తుకొచ్చి ఉద్వేగానికి గురయ్యాను. ఆమె పేరుకు ముందు స్వర్గీయ అని పిలిచేందుకు ఇంకా మనసు రావడం లేదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. గొప్ప వ్యక్తుల సంస్మరణ సభలు నిర్వహించడం కేవలం వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే కాదని.. వారు చూపిన ఆదర్శాలను అన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్ కుమార్, సుష్మాస్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
-
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి వారి చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్ భరతావని చేత ‘సూపర్ మామ్’ అనిపించుకున్న సుష్మస్వరాజ్ జయంతి సందర్భంగా సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
సుష్మా స్వరాజ్ భర్త భావోద్వేగ ట్వీట్!
ఒక్క ట్వీట్‌తో ఎంతో మంది సమస్యలను తీర్చి.. భారత ప్రజల చేత ‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ మొదటి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ ట్విటర్ అకౌంట్లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్ షేర్ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని ఙ్ఞప్తికి తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసేందుకు చేతిలో నైఫ్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’ రూపం చూసి.. ‘‘ సూపర్ మామ్.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు. కాగా సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది అన్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడే సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. కాగా ప్రేమికుల దినోత్సం రోజున జన్మించిన సుష్మా స్వరాజ్.. మొదటి జయంతి సందర్భంగా ఆమె భర్త కౌశల్ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇక గతేడాది ఆగస్టు 6న.. భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చివరిసారిగా ట్వీట్ చేశారు. -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్‌కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్‌కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
తెలంగాణ చిన్నమ్మ ఉండుంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలి అన్వేషణలో పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన తెలుగు యువకుడు ప్రశాంత్ విషయంలో ఇకపై దౌత్యపరమైన సంప్రదింపులే కీలకం కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే భారత ప్రభుత్వానికి సమాచారం ఉందని ప్రశాంత్ తండ్రి మాటల ద్వారా తెలిసింది. దీంతో ప్రశాంత్‌ను విడుదల చేసేందుకు విదేశాంగశాఖ పాత్ర కీలకం అవుతుందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ అమాయకుడని, అతని మానసిక పరిస్థితిపై పాకిస్తాన్ ముందే అభిప్రాయానికి వచ్చింది కాబట్టే.. అతని ఇంటికి వీడియో సందేశం పంపారని పలువురు భావిస్తున్నారు. కాబట్టి దౌత్య సంప్రదింపులతో ప్రశాంత్ ఇండియాకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ట్వీట్ చేస్తే చాలు.. 2014 నుంచి 2019 వరకు విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించిన సుష్మా స్వరాజ్ భారతీయులను, ముఖ్యంగా విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ముందుండేవారు. చిన్న ట్వీట్ చేస్తే గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేవారు. ‘భారతీయులు అంగారక గ్రహం మీద ఉన్నా సరే.. వారిని క్షేమంగా తీసుకువస్తాం’అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ భారతీయుల సంక్షేమంపై ఆమెకు ఉన్న సంకల్పాన్ని చాటిచెప్పింది. పాకిస్తానీయులకు సైతం అత్యవసర వైద్యం కోసం అభ్యర్థించగానే వెంటనే వీసాలు మంజూరు అయ్యేలా చొరవచూపిన అమ్మ మనసు ఆమెది. గతంలో దారితప్పి పాకిస్తాన్లో ప్రవేశించిన బధిర బాలిక గీత విషయంలో సుష్మా స్వరాజ్ చూపిన చొరవను మాటల్లో అభివర్ణించలేం. తాజాగా ప్రశాంత్ విషయంలో నెటిజన్లు సుష్మా స్వరాజ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఉండి ఉంటే భరోసా ఇచ్చేవారని అంటున్నారు. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తుపెట్టుకోవాలన్న సుష్మా స్వరాజ్‌ను మిస్సవుతున్నామంటూ పలువురు పోస్టింగులు పెడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రశాంత్ తండ్రి బాబూరావు కేపీహెచ్‌బీ కాలనీ: ప్రశాంత్‌ను క్షేమంగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరేందుకు ప్రశాంత్ తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రశాంత్‌ను క్షేమంగా మన దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని భారత దౌత్య కార్యాలయ అధికారులను కోరనున్నారు. అయితే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడంతో బుధవారం దౌత్య కార్యాలయ అధికారులను బాబూరావు కలవలేకపోయినట్లు తెలిసింది. -
‘చిన్నమ్మ’ చివరి కోరిక తీర్చిన కుమార్తె
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్‌భూషణ్ జాదవ్ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్‌తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ) -
జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్
మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సుష్మాస్వరాజ్, అద్వానీని ఒప్పించి రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జైపాల్‌రెడ్డి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో జైపాల్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. చట్టసభల్లో ఆయన నిజాయితీగా, హుందాగా వ్యవహరించి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని కొనియాడారు. ఈ సభకు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1 హయాంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ దాదాపు 20 రోజుల వ్యవధిలో మరణించడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఎన్నికల హామీలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ సర్కారు రద్దు చేసిన మరుసటి రోజే చిన్నమ్మ కన్నుమూయగా... జైట్లీ ఈరోజు మధ్యాహ్నం(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిగా సుష్మ జాతికి చేసిన సేవలను, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ దేశ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులకు సాక్షిగా ఉన్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నాయకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. వీరిద్దరి అస్తమయం పార్టీ పరంగానే గాకుండా వ్యక్తిగతంగా కూడా తమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ అనారోగ్య కారణాల రీత్యా ఆరు పదుల వయస్సులోనే కన్నుమూయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది. ‘అమ్మ’గా అభిమానం చూరగొన్నారు.. గత ఐదేళ్లలో భారతదేశ దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో విదేశాంగ మంత్రిగా సుష్మ ప్రముఖ పాత్ర పోషించారు. 2014లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ దాదాపు 90 దేశాల్లో పర్యటించారు. వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొనడంలో ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే ఇవన్నీ సజావుగా సాగడానికి సుష్మ చతురత, దౌత్యనీతి ముఖ్య కారణాలు అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సి వచ్చినపుడు ఆశువుగా ఉపన్యాసం ఇస్తానని మోదీ ప్రకటించగా.. కాగితం మీద రాసుకుని చదివితేనే చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుందని చిన్నమ్మ చెప్పడంతో మోదీ ఆమె సలహాను పాటించారు. సుష్మ మాట అంటే ఆయనకు అంత నమ్మకం. ఇక విదేశాంగ మంత్రిగా సమస్యల్లో ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులకు సుష్మ అండగా నిలిచారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేగాకుండా ఎన్నికలకు ముందు పుల్వామా ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేగిన సమయంలోనూ సుష్మ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడంలో ఆమె సఫలీకృతులయ్యారు. రష్యాతో పాటు పాక్ మిత్రదేశం అయిన చైనాతో కూడా చర్చలు జరిపి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు కూడగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇక విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ కేవలం తన శాఖకే పరిమితమైపోకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నారై బాధిత భార్యల కోసం చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భార్యలు చేసే ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తలను పట్టుకోవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఈ లక్షణాలన్నీ వెరసి దేశ ప్రజలకు ఆమెను ప్రియమైన మంత్రిగా చేయడంతో పాటు ఆపదలో ఆదుకునే సూపర్ మామ్‌గా కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేగాక ప్రఖ్యాత ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. ఇవన్నీ సుష్మ వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు పొందడమేగాక నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనేలా చేశాయి. ఆయన హయాంలోనే కీలక సంస్కరణలు వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ మోదీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం చేపట్టింది. అదే విధంగా అరుణ్ జైట్లీ హయాంలోనే సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు కూడా. కేవలం విత్త మంత్రిగానే గాకుండా ప్రముఖ న్యాయవాదిగా కూడా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో మోదీ సర్కారుకు న్యాయ సలహాలు ఇచ్చారు. బీజేపీ ట్రబుల్షూటర్గా గుర్తింపు పొందిన ఆయన... ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో దిట్టగా ప్రసిద్ధికెక్కారు. రఫేల్ ఒప్పందంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారును విమర్శించిన సమయంలోనూ జైట్లీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టారు. మోదీకి నమ్మిన బంటుగా ప్రాచుర్యం పొందిన జైట్లీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైన చిక్కుప్రశ్నలను సులువుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించారు. ఇక కార్పోరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచర్ తీరుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాకుండా మోదీకి అనుకూలంగా సమర్థవంతంగా తన వాదనలు వినిపించేవారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ట్విటర్ ద్వారా తన సందేశాలను పోస్ట్ చేస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేవారు. ఈ క్రమంలో ఆయన మరణం మోదీకి తీరని లోటు అని బీజేపీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. -
75 రోజుల పాలనపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలను అమలు చేసిందని, స్పష్టమైన విధానం, సరైన దిశ ఉండటం వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి 75 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఐఏఎన్ఎస్తో మాట్లాడారు. ‘బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలను వేగవంతంగా అమలు చేసింది. ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విధానం, సరైన ఉద్దేశం వల్లే ఇది సాధ్యపడింది. ఈ 75 రోజుల్లో చాలా మార్పులు సంభవించాయి. చిన్నారులకు భద్రత నుంచి చంద్రయాన్–2 వరకు, అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళకు రక్షగా ఉండే ట్రిపుల్ తలాక్ చట్టం వరకు, కశ్మీర్ నుంచి రైతు సంక్షేమం వరకు ఇలా.. ప్రజల తరఫున పనిచేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఏం చేయగలదో అంతకంటే ఎక్కువే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. ‘ప్రజల జీవితావసరం నీరు. అందుకే దేశంలో నీటి సరఫరా, నీటి సంరక్షణ విధానాలను పటిష్టం చేసి, అమలు చేసేందుకు ప్రత్యేకంగా జల్‌శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. 1952 తర్వాత 17వ లోక్‌సభ సమావేశాలు అత్యంత ఫలవంతంగా సాగి చరిత్ర సృష్టించాయి. ఈ సమావేశాల్లోనే వ్యాపారులు, రైతులకు పింఛన్లు అందించే బిల్లు, వైద్య రంగం సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు, దివాలా కోడ్, కార్మిక చట్టాల సంస్కరణల బిల్లుతోపాటు ఎంతో కీలకమైన కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులు సభ ఆమోదం పొందాయి. అదే సమయంలో అనేక వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వం అన్నిటినీ పరిష్కరించింది’ అని ప్రధాని మోదీ తెలిపారు. విదేశాంగ శాఖను మార్చేశారు ! విదేశాంగ శాఖ రూపురేఖలను సుష్మా స్వరాజ్ మార్చేశారని మోదీ కొనియాడారు. నిబంధనలు ఉన్న ప్రొటోకాల్ స్థాయి నుంచి ప్రజల పిలుపునకు స్పందించే కార్యాలయంలా ఆ శాఖను మార్చారన్నారు. పార్టీ నేతలతో కలసి మంగళవారం ఆయన సుష్మాకు నివాళులర్పించారు. 2014లో ఐక్యరాజ్యసమితి సభలో ప్రసంగించాల్సిన ముందు రోజు ఆమెతో మాట్లాడానని, రేపటి ప్రసంగం ఎక్కడ అని అమె అడిగారని తెలిపారు. తను ప్రసంగాలు రాసుకోననగా, అందుకు సుష్మా ‘అది కుదరదు, భారత్ గురించి మీరు చెప్పాల్సిందే. మీకు నచ్చినట్లు మాట్లాడటానికి లేదు’ అన్నారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఎంత గొప్ప వక్తలైనా కొన్ని చోట్ల చూసి చదవాల్సిందేనని ఆమె తెలిపారన్నారు. -
ప్రవాసీల ఆత్మబంధువు
గల్ఫ్ డెస్క్: పొట్ట చేత పట్టుకుని పొరుగుదేశాలకు వలస వెళ్లిన ప్రవాసులకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ సుష్మాస్వరాజ్ అండగా నిలిచారు. విదేశాంగ మంత్రిగా సేవలందించిన సుష్మాస్వరాజ్ ఎన్నారైల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రవాసీల సమస్యలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుని అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా ప్రవాసీల సంక్షేమం కోసం ఆమె ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయని గల్ఫ్‌లోని భారతీయులు అంటున్నారు. లైసెన్సింగ్ విధానంలో మార్పులు.. మన దేశం నుంచి కార్మికులను, ఉద్యోగులను విదేశాలకు ఉపాధికి పంపించేం దుకు గాను రిక్రూటింగ్ లైసెన్సింగ్ విధానంలో సుష్మాస్వరాజ్ పలు మార్పులు తీసుకువచ్చారు. గతంలో లైసెన్సింగ్ ఏజెన్సీ బ్యాంకు గ్యారంటీగా రూ.20 లక్షలు పెట్టాల్సి ఉండగా, దానిని రూ.50 లక్షలకు పెంచారు. అయితే, చిన్న ఏజెంట్లకు ఇబ్బందులు తలెత్తడంతో వంద మంది లోపు పంపడానికి రూ.8 లక్షల డిపాజిట్ విధానాన్ని అమలు చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు ‘మదద్’.. విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న భారతీయులు తమ సమస్యలను విదేశాంగ శాఖ అధికారులకు తెలుపుకునేందుకు గాను ఆన్లైన్లో అవకాశం కల్పించారు. మదద్ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం –భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ) ద్వారా ఎక్కడ ఎవరు ఏ సమస్య ఉన్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే విదేశాంగ శాఖ స్పందిస్తుంది. ఈ వ్యవస్థకు హిందీలో ‘మదద్’ అని పేరు పెట్టారు. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమస్యలు చెప్పుకోవడం, వాటికి రిప్లై రాయడం నెలల తరబడిగా కొనసాగేది. ఆన్లైన్ ఫిర్యాదులతో సమస్యను క్షణాల్లో చెప్పుకునే అవకాశం ఏర్పడింది. ఇలా సుష్మాస్వరాజ్ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు. ట్విట్టర్ ద్వారా స్పందన విదేశాల్లో ఉన్న ప్రవాసీలు ఎవరైనా ఇబ్బం దులు ఎదుర్కొన్నట్లయితే వారు నేరుగా తమ సమస్యను అప్పట్లో నేరుగా మంత్రి సుష్మాస్వరాజ్‌కు చెప్పుకునేందుకు ట్విట్టర్ అకౌంట్‌ను అందుబాటులో ఉంచారు. తమ సమస్యను ట్విట్టర్ ద్వారా చెప్పుకుంటే చాలు.. వెంటనే సమస్య పరిష్కారానికి విదేశాంగ శాఖ రంగంలోకి దిగేది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా ట్విట్టర్లో వచ్చే వినతులను ఆమె పరిశీలించేవారు. గల్ఫ్ కార్మికులకు అండగా... 2014 నుంచి 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సుష్మాస్వరాజ్ గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు సహా యం అందించారు. కేంద్ర మంత్రి హోదా లో గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సందర్భాల్లో ఆమె వలస కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు. 2016లో సౌదీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి పలు కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో సుష్మ వెంటనే స్పందించి విదేశాంగ శాఖ అధికారులను రంగంలోకి దింపి మన కార్మికులను ఒక చోటకు చేర్చి వారికి భోజన సదుపాయాలను సమకూర్చడంతో పాటు కార్మికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయించారు. కువైట్, బహ్రెయిన్, యూఏఈ తదితర దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలోనూ కార్మికులకు సహాయమందించారు. ప్రభావితం చేసిన విధాన నిర్ణయాలు సుష్మాస్వరాజ్ హయాంలో ‘కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన’ విధానంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్)ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్)లో విలీనం చేయడం పై మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. 2003 నుంచి ప్రతిఏటా జనవరి 9న నిర్వహిస్తున్న ‘ప్రవాసీ భారతీయ దివస్’ను రెండేళ్లకోసారి నిర్వహించడం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ విదేశాల్లోని అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ఈ పండుగను నిర్వహించడం పట్ల ప్రశంసలు అందుకున్నారు. ఇ–మైగ్రేట్ ద్వారా ఆన్లైన్ రిక్రూట్మెంట్.. భారత కార్మికులను విదేశీ ఉద్యో గాల్లో భర్తీచేయడానికి ఇ–మైగ్రేట్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు, ఉద్యోగులు, రెండు దేశాల ప్రభుత్వాలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఒకే వేదికపైకి వస్తాయి. దీని ద్వారా వేతన ఒప్పందాల రికార్డుల నిర్వహణ, కార్మికుల సంక్షేమం, భద్రత సులువు అవుతుంది. వేగంగా స్పందించేవారు వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఏ చిన్న సమస్య ఎదురైనా సుష్మాస్వరాజ్ వేగంగా స్పందించేవారు. విదేశాల్లో ఆస్పత్రిపాలైన మన కార్మికులను ఎందరినో స్వదేశానికి చేర్చారు. ప్రవాసుల సంరక్షణలో కొత్త శకానికి నాంది పలికారు. 2015లో ఒమాన్‌లో పర్యటించి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. – రాధ బచ్చు, ఒమాన్ (సికింద్రాబాద్) బహ్రెయిన్‌ను మూడుసార్లుసందర్శించారు సుష్మాస్వరాజ్ బహ్రెయిన్‌ను 2014, 2016, 2018 సంవత్సరాల్లో సందర్శించా రు. ఇరుదేశాల మధ్య ఖైదీల బదిలీ, హెల్త్ కేర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండియన్ ఎంబసీ నూతన భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ చిన్నమ్మకు మా నివాళి. – పడాల రాజేశ్వర్‌గౌడ్, బహ్రెయిన్ (ముచుకూర్, నిజామాబాద్) సౌదీ ‘జనాద్రియా’ పండుగలో పాల్గొన్నారు సౌదీ అరేబియాలోని రియా ద్లో 2018లో జరిగిన సౌదీ జాతీయ వారసత్వ పండుగ ‘జనాద్రియా’లో సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయులను ఆత్మీయంగా పలకరించారు, ప్రవాసుల సమస్యలను ఆలకించారు. – అబ్దుల్ సాజిద్, సౌదీ (జగిత్యాల) -
సుష్మా స్వరాజ్‌కు గల్ఫ్ ఎజెంట్ల నివాళి
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గల్ఫ్‌లో ఉన్న భారతీయులు గురువారం సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలిసి గల్ఫ్‌లోని రిక్రూటింగ్ ఎజెంట్లు సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించి, ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిక్రూటింగ్ ఎజెంట్ అధ్యక్షుడు డీఎస్ రెడ్డి, రైసుద్దీన్, ప్రశాంత్, ఖలీల్ పాషా తదితరులు పాల్లొన్నారు. -
ఉద్వేగానికి లోనైన బన్సూరి స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ గురువారం యూపీలోని హపూర్ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్ కౌశల్ వెంట రాగా బన్సూరి స్వరాజ్ ఈ క్రతువును నిర్వహించారు. 67 సంవత్సరాల సుష్మా స్వరాజ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అధికార లాంఛనాల నడుమ బుధవారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
నల్లగొండతో సుష్మాస్వరాజ్‌కు అనుబంధం
సాక్షి, నల్లగొండ: గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందిన కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ రాయకురాలు సుష్మాస్వరాజ్‌కు నల్లడొండతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నవంబర్ 5న బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ పోరుసభ బహిరంగసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అప్పట్లో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో నల్లగొండకు తొలిసారి వచ్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సుష్మాస్వరాజ్ జాతీయ నాయకురాలు కావడడంతో ఆమెను కలుసుకోవడానికి జిల్లాకు చెందిన అనేకమంది ప్రముఖులు, మేధావులు, యవత పోటీ పడ్డారు. ఆ సమయంలో నల్లగొండలో బీజేపీ కార్యాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడికి వచ్చిన ఆమె నేరుగా స్థానిక బీజేపీ నేత బండారు ప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యారు. అంధవిద్యార్థులతో ఆప్యాయంగా.. సుష్మాస్వరాజ్‌కు జ్ఞాపికను అందిస్తున్న డ్వాబ్ కార్యదర్శి చొక్కారావు (ఫైల్) అనంతరం సుష్మాస్వరాజ్.. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి నల్లగొండ పట్టణంలోని డ్వాబ్చే నిర్వహించబడుతున్న అంధుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చడించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆమెను డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, పాఠశాల సిబ్బందితో కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుష్మాస్వరాజ్ మృతి దేశానికి తీరనిలోటు నల్లగొండ: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోన ?బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే హరియాణలో శాసనసభకు ఎన్నికై 25వ ఏటనే రాష్ట్రమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికై దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో అనుకూలంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్లో చిన్నమ్మగా అందరికి గుర్తుండి పోయారని తెలిపారు. సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు శ్రీరామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, భూపతిరాజు, యాదగిరాచారిచ దర్శనం వేణు, గుండగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు -
సుష్మకు కన్నీటి వీడ్కోలు
-
ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్
బెంగళూరు : బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా, సినీ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో కర్నాటక భవన్లో సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో పాల్గొన్న ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్లోడ్ చేశారు. దీనిపై పలువురు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్లు చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన సుష్మా స్వరాజ్ మృతి చెందితే ఆమెను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఈ ట్వీట్ చేయడం అంత అవసరమా మేడం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. దీంతో బుధవారం ఉదయం సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు అని సుమలత ట్వీట్ చేశారు. ಮಾಜಿ ವಿದೇಶಾಂಗ ಸಚಿವೆ ಶ್ರೀಮತಿ ಸುಷ್ಮಾ ಸ್ವರಾಜ್ ಜಿ ಅವರ ಸಾವಿನ ಸುದ್ದಿ ತುಂಬಾ ದುಃಖಕರವಾಗಿದೆ. ಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಪ್ರೀತಿಪಾತ್ರರಿಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ಸಂತಾಪ.ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ದೇವರು ಚಿರಶಾಂತಿಯನ್ನು ನೀಡಲಿ ಎಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. 🙏🙏🙏 pic.twitter.com/l2ccKtPONp — Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) August 7, 2019 At dinner meeting of Hon'ble CM in Karnataka Bhavan , Delhi @CMofKarnataka @BSYBJP @DVSadanandGowda @SureshAngadi_ #PrahladJoshi Discussed issues & problems faced in various districts pic.twitter.com/6fThr3Wu0V — Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) August 6, 2019 -
బళ్లారి ముద్దుబిడ్డ
బళ్లారి ముద్దుబిడ్డగా కీర్తిగాంచిన బీజేపీ అగ్ర నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మృతి జిల్లవాసులతో పాటు యావత్ కర్ణాటకలో అశేష అభిమానులకు తీవ్ర శోకాన్నిమిగిల్చింది. రాష్ట్రం నుంచి ఎంతో మంది బీజేపీ నాయకులు, అభిమానులు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు.కన్నడనాటతో బలమైన అనుబంధం ఉన్న ఆమె అస్తమయం బళ్లారి ప్రాంతానికి తీరనిలోటుగా అభిమానులు ఆవేదనచెందుతున్నారు. సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో, ముఖ్యంగా బళ్లారిలో బీజేపీకి, నాయకులకు సుష్మాస్వరాజ్ వెన్నుదన్నుగా ఉండేవారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో ఆమెపై పోటీకి సుష్మాస్వరాజ్ సై అన్నారు. దీంతో బళ్లారిలో ఒక్కసారిగా బీజేపీకి గట్టి పునాది ఏర్పడింది. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, హరపనహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకరరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిలు ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ వెంట నడిచి ఆమె గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయడంతో పాటు సోనియాగాంధీ గెలుపొందడంతో సుష్మాస్వరాజ్ ఓటమి చెందారు. ఆమె ఓటమి పాలైనా నిరుత్సాహ పడక బళ్లారిపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. పేదల పెళ్లిళ్లకు పెద్ద అతిథి ఈక్రమంలో గాలి సోదరులు, శ్రీరాములుకు సుష్మాస్వరాజ్ అండ లభించింది. సుష్మస్వరాజ్‌ను గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తల్లిగా భావిస్తూ ఆమెకు అమితమైన గౌరవం ఇవ్వడంతో పాటు ఆమె ఆధ్వర్యంలో బళ్లారిలో ఏటా వరమహాలక్ష్మీ పూజను చేయడం ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి బళ్లారిలో వరమహాలక్ష్మీ వ్రతం రోజున గాలి కుటుంబం జరిపించే ఉచిత సామూహిక వివాహాల్లో సుష్మాస్వరాజ్ పాల్గొంటూ వేలాది పేద జంటలకు ఆశీస్సులు అందించారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారు. సుష్మాస్వరాజ్ ఇక లేరన్న వార్త బళ్లారిలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. -
సుష్మా స్వరాజ్ రోజుకో రంగు చీర
2009–14 మధ్య (15వ లోక్‌సభ) కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఉన్న సమయంలో వారిరువురి మధ్య పలు కవితా యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో 15వ లోక్‌సభ సమావేశాల్లో అనేకసార్లు అసహ్యకర పరిస్థితులు తలెత్తాయి. అయితే కొన్నిసార్లు మన్మోహన్, సుష్మలు.. ఒకరిపై ఒకరు కవితాత్మకంగా చేసుకున్న విమర్శలు సభ్యులను ఉల్లాసపరిచాయి. వారిద్దరి హాస్య చతురత అందరికీ గుర్తుండేలా చేశాయి. ఓ సారి మన్మోహన్ మాట్లాడుతూ, మీర్జా ఘాలిబ్ రాసిన ప్రఖ్యాత కవితను చదివారు. ‘హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్, జో నహీన్ జాన్తే వఫా క్యా హై’ (విశ్వాసం అనే పదానికి అర్థం కూడా తెలియని మనుషుల దగ్గరి నుంచి మేం విశ్వాసాన్ని ఆశిస్తున్నాం) అని మన్మోహన్ అనగా, సుష్మ దీనికి స్పందిస్తూ, బషీర్ బద్ర్ కవితతో సమాధానం ఇచ్చారు. ‘కుచ్ తో మజ్బూరియా రహీ హోంగీ, యూం హీ కోయీ బేవఫా నహీ హోతా’ (కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉండుండాలి. ఏ కారణమూ లేకుండా ఊరికే ఎవ్వరూ నమ్మిన వారిని మోసం చేయరు) అని సుష్మ బదులిచ్చారు. ఆ వెంటనే మన్మోహన్‌ను ఉద్దేశించి సుష్మ మరో కవిత చదువుతూ ‘తుమ్హే వఫా యాద్ నహీ, హమే జఫా యాద్ నహీ; జిందగీ ఔర్ మౌత్ కే తో దో హీ తరణే హై, ఏక్ తుమ్హే యాద్ నహీ, ఏక్ హమే యాద్ నహీ’ (నా విశ్వాసాన్ని మీరు గుర్తుంచుకోరు. మీకు విశ్వాసం లేకపోవడాన్ని నేను గుర్తుంచుకోను. జీవితంలో రెండే పాటలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోరు. ఇంకోటి నాకు గుర్తుండదు) అని చెప్పడంతో సభ్యులంతా ప్రశంసించారు. ఇలాంటి సందర్భాలు 15వ లోక్‌సభలో ఎన్నో ఉన్నాయి. వచ్చి మీ రూపాయి తీసుకోండి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తనకు చేసిన ఫోన్ కాల్‌ను, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని సాల్వే కంట తడి పెట్టారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేకపోయారని అన్నారు. గుండెపోటుకు అరగంట ముందు, మంగళవారం రాత్రి 8:50 గంటల ప్రాంతం లో సుష్మా హరీష్‌కి కాల్ చేసి మాట్లాడారు. . ‘మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉద్వేగపూరితమైనది. ఒక్క రూపాయి నేను నీకు ఇవ్వాల్సి ఉంది. వెంటనే వచ్చి తీసుకోండి’ అని ఆమె చెప్పారని ఆయన అన్నారు. ‘‘నిజంగానే ఆ రూపాయి ఎంతో విలువైనది. ఎందుకంటే అది ఒక లాయర్‌గా నాకు ఆమె చెల్లించే ఫీజు. అందుకే తప్పకుండా వచ్చి తీసుకుంటా’ అని నేను చెప్పాను. ‘ సరే బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ రూపాయి తీసుకోండి’ అని ఆమె చెప్పారు. ‘నేను సరే’ అనడంతో ఆమె ఫోన్ పెట్టేశారు. సుష్మాతో అవే చివరి మాటలవుతాయని ఊహించలేకపోయానని సాల్వే గద్గద స్వరంతో చెప్పారు. ఆ రూపాయి కథేంటంటే.. పాక్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సాల్వే వాదించారు. అందుకు ఆయన భారత ప్రభుత్వం దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఈ కేసులో ఆయన గెలవడంతో జాదవ్ ఉరి ఆగింది. భారత్ తరఫున సాల్వేను నియమించినప్పుడు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఉన్నారు. రోజుకో రంగు చీర సుష్మా స్వరాజ్‌కు ఓ వైవిధ్యమైన అలవాటు ఉంది. వారంలో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలనే దానిపై ఆమె కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. ప్రతి సోమవారం ముత్యపు తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ చీరలు, మంగళవారాల్లో ఎరుపు, కాషాయం లేదా దొండపండు రంగు చీరలు, బుధవారాల్లో ఆకుపచ్చ రంగు, గురువారాల్లో పసుపుపుచ్చ రంగు, శుక్రవారాల్లో బూడిద లేదా వంగపూత రంగు, శనివారాల్లో నీలం లేదా నలుపు రంగు చీరలను ఆమె ధరించేవారు. ఆదివారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలనేదానిపై ప్రత్యేకమైన నిబంధనలేమీ ఉండేవి కావు. దాదాపు గత రెండు దశాబ్దాలపాటు ఆమె ఈ అలవాటును పాటించారు. ఇలా రోజుకో రంగు చీర ధరించేందుకు జ్యోతిష్యం లేదా మూఢనమ్మకాలు కారణం కాదనీ, కేవలం అది తన అలవాటని సుష్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాకు కూడా ఇలాంటి అలవాటే ఉంది. సిక్కు అయిన ఆయన, రోజుకో రంగు తలపాగాను ధరిస్తారు. -
హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!
సాక్షి, హైదరాబాద్: తాను హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేత దుస్తులను మర్చిపోనని అమెరికన్ మాజీ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రస్తుతం కాన్సులేట్‌లో లేనప్పటికీ ఈరోజు చేనేత దుస్తులనే ధరించానని బుధవారం ట్వీట్ చేసి కొన్ని ఫొటోలను జతచేశారు. ఆమె కాన్సుల్ జనరల్‌గా ఉన్న సమయంలో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో సిబ్బంది మొత్తం చేనేత దుస్తుల్లో విధులకు హాజరవడం గమనార్హం. సుష్మ మృతిపై యూఎస్ కాన్సులేట్ దిగ్భ్రాంతి.. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపై యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్‌తో కలసి సుష్మ సమావేశమైన ఫొటోను పోస్టు చేసింది. -
వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ
భారతీయత నిండుదనానికి ఆమె చిరునామా. భారతీయుల స్వప్నానికి ప్రతిబింబం. సాటి లేని వాగ్ధాటి ఆమె సొంతం. ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ... చెప్పాలనుకున్న విష యాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో అందివేసిన చేయి. ఏపనైనా అలవోకగా చేసే ధైర్యం, తెగువ ఆమె సొంతం. రాజకీయంగా... అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించారు. ఒక స్త్రీగా, ఇల్లాలిగా, రాజకీయనాయకురాలిగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సంపూర్ణ మహిళగా ఖ్యాతి పొందారు. ఆమె మరెవరో కాదు భారత వీరనారి, ద గ్రేట్ లెజెండ్ సుష్మ స్వరాజ్. పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనైనా... దక్షిణాదిలో కూడా ఆమె సుపరిచితురాలే. పార్టీ అధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆమె పాపులర్ అయ్యారు. పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా తన మార్క్ ఉండాల్సిందే. హర్యానాలో విద్యా భ్యాసం చేసిన సుష్మ 20 ఏళ్లకే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత బీజేపీలో చేరి అంచ లంచెలుగా ఎదిగారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ జాతీయ నాయకురాలి స్థాయికి చేరుకున్నారు. 25 ఏళ్లకే అంబాలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది 27 ఏళ్లకే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికై ఔరా అన్పించుకున్నారు. నాలుగుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నిక య్యారు. 1999లో బళ్లారి నుంచి లోక్ సభకు పోటీ చేసి సోనియాకు సవాల్ విసిరి.. దేశమంతా తనవైపు చూసేలా ప్రచారం సాగించారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. వాజ్‌పేయి హయాంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సమాచార శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి అప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉంటూ లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సుష్మ కీలక బాధ్యత నిర్వర్తించారు. 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు పొందారు. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కేబి నెట్లో కీలక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మ ఆ శాఖకు ముందెన్నడూ లేని గుర్తింపు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా దేశానికి తరలించడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైంది. కల్లోల దేశాల్లో ప్రజల్ని రక్షించేందుకు తాను నేరుగా ఆయా దేశాల రాయ బార కార్యాలయాలతో చర్చలు జరిపేవారు. పార్లమెంట్ లో సుష్మ చేసే ప్రసంగాలకు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరూ జేజేలు పలికేవారు. భాషపై పట్టు, వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆమె ఇట్టే కట్టిపడేసేవారు. విదేశాంగ మంత్రిగా ఉంటున్న సమయంలో వచ్చిన ఆనారోగ్యం సుష్మను ఊపిరి సలుపుకోనివ్వలేదు. అందువల్లే గత ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తన జీవిత కాలంలోనే చూడాల్సిన ఘట్టంగా, చనిపోయే ముందు చేసిన ట్వీట్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించింది. సుష్మ చనిపోయారన్న నిజాన్ని భారతీయులెవరూ జీర్ణించుకోలేకోపోయారు. సంతాప సందేశాల్లో ప్రపంచదేశాధినేతలు కన్నీటి పర్యంతమయ్యారంటే విదేశాంగ విధానంపై సుష్మ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విదేశాంగ విధానానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ సుష్మ స్వరాజ్ ముందు, సుష్మ స్వరాజ్ తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి నేత మరొకరు ఉండరు. ఉండబోరు. ఆ ఘనత ఒక్క సుష్మకు మాత్రమే దక్కుతుంది. పురిఘళ్ల రఘురామ్: బీజేపీ సమన్వయకర్త, ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
సుష్మకు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ : సహచరులు, మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) అంత్యక్రియలు బుధవారం ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. లోధి రోడ్డులోని శ్మశానంలో ఉన్న విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. త్రివర్ణ పతాకంతో చుట్టిన ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్న బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశానానికి తరలించారు. గుండెపోటు కారణంగా సుష్మ మంగళ వారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అడ్వాణీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర ప్రము ఖ రాజకీయ నాయకులు, సుష్మ కుటుంబసభ్యు లు, స్నేహితులు, ప్రజలు సహా వేలాది మంది సుష్మ అంత్యక్రియలకు హాజరై, విషణ్ణ వదనాలతో తుది వీడ్కోలు చెప్పారు. సుష్మ ఇంటి వద్ద ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పిస్తూ మోదీ కంటతడి పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు జంతర్ మంతర్ లోని సుష్మ ఇంటి వద్ద, 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బీజేపీ కార్యాలయంలోనూ సుష్మ భౌతిక కాయాన్ని ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిం చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ, అమిత్ షా, అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తదితర అనేక మంది నేతలు సుష్మ ఇంటికి వెళ్లి, భౌతిక కాయానికి నివాళులర్పించారు. నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యారి్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్ నేతలు రాహు ల్ గాం«దీ, గులాం నబీ ఆజాద్, సీపీఎం నాయకు రాలు బృందా కారత్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ నాయకురాలు హేమ మాలిని తదితరులు సుష్మ ఇంటికి వెళ్లి నివాళి అరి్పంచారు. కన్నీరు పెట్టుకున్న అడ్వాణీ సుష్మకు గురువుగా పేరుగాంచిన ఎల్కే అడ్వాణీ, సుష్మ భౌతిక కాయం వద్దకు రాగానే కంటతడి పెట్టారు. ఆమె గురించి అడ్వాణీ గుర్తు చేసుకుం టూ, ‘నా ప్రతీ పుట్టిన రోజున నాకు ఎంతో ఇష్టమైన చాకొలేట్ కేక్‌ను సుష్మ తీసుకొచ్చేది. నేను నా బృందంలోకి చేర్చుకున్న నిబద్ధత కలిగిన యువ కార్యకర్త ఆమె. కాలక్రమంలో ఆమె మా పార్టీలో గొప్ప పేరున్న, ప్రఖ్యాత నాయకురాలిగా ఎదిగింది. పారీ్టలోని, బయటి మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలు. ఏవైనా సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆమెకున్న జ్ఞాపక శక్తిని చూసి నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను’అని చెప్పారు. కాగా, సుష్మ మరణంతో ఏర్పడిన లోటును పూడ్చటం చాలా కష్టమని అమిత్ షా అన్నారు. ‘ఆమెను ప్రేమించే కోట్లాది మంది ప్రజలకు ఇది దుర్దినం. మోదీ నాయకత్వంలో ఆమె ఐదేళ్ల కాలం పనిచేసి, భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చారు’అని ఆయన పేర్కొన్నారు. రాఖీ కట్టడానికి నా చెల్లెలు లేదు: వెంకయ్య దయ, ధైర్యం, ప్రేమ, మంచితనాలకు సుష్మా మారుపేరు అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆమె అకాల మరణం విచారకరమనీ, దేశం ఓ గొప్ప పాలనాదక్షురాలిని, సమర్థవంతమైన పార్లమెంటేరియన్ని, ప్రజల గొంతుకగా నిలిచిన నాయకురాలిని కోల్పోయిందన్నారు. సుష్మకు రాజ్యసభ బుధవారం ఘన నివాళి అరి్పంచింది. ప్రధాని మోదీ కూడా ఆ సమయం లో సభలో ఉన్నారు. సభ సమావేశమైన వెంటనే సుష్మ మరణం గురించి ఓ నోట్‌ను వెంకయ్య చదివి సభ్యులకు తెలియజెప్పారు. దేశం అత్యున్నతంగా ఉండాలని ఆమె ఎప్పుడూ కోరుకునేదని అన్నారు. సుష్మ మరణం తనకు వ్యక్తిగతంగా లోటు అని వెంకయ్య చెబుతూ, ఆ గొప్ప నాయకురాలు చెప్పిన మాటలు, చేసిన పనులు ప్రజా జీవితంలో ఉన్న వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ‘ఆమె నన్ను ఎప్పుడూ అన్నా అని పిలిచేది. మా ఇంట్లో జరిగే కుటుంబ, సంప్రదాయ వేడుకలకు అన్నింటికీ హాజరయ్యేది. ప్రతి రాఖీ పండుగకూ నా చేతికి రాఖీ కట్టేది. ఈ సారి నాకు ఆ గౌరవం దక్కదు. ఆమె మరణంతో నా జీవితంలో ఎంతో విలువైన చెల్లెల్ని నేను కోల్పోయాను’అని వెంకయ్య ఉద్వేగంతో చెప్పారు. సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి: చైనా సుష్మా మృతికి చైనా బుధవారం సంతాపం తెలిపింది. ఇండియా–చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రిగా ఆమె పాత్రను చైనా గుర్తుచేసుకుంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఓ ప్రకట న విడుదల చేస్తూ, ‘మేడం సుష్మా స్వరాజ్ ఇండియాలో సీనియర్ రాజకీయ నాయకురాలు. ఆమె మరణం పట్ల మేం సంతాపం తెలుపుతున్నాం. సుష్మ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. సుష్మ విదేశాంగ మంత్రిగా ఉండగా అనేకసార్లు ఆమె చైనాలో పర్యటించారు. చైనా–ఇండియా సంబంధాలను మరింత ముందకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు’అని తెలిపారు. సుష్మా స్వరాజ్ చివరిసారిగా చైనాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెళ్లి, ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొని వచ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన కూతురు సుష్మా స్వరాజ్ అంత్యక్రియలను ఆమె కూతురు బాసురీ నిర్వహించారు. స్వరాజ్ భౌతిక కాయాన్ని విద్యుత్ దహనవాటికలోని ప్లాట్‌ఫాంపై ఉంచిన అనంతరం, ఆ ప్లాట్‌ఫాం చుట్టూ బాసురీ నీటి కుండతో మూడుసార్లు తిరిగారు. అనంతరం కుండను జారవిడిచి పగులగొట్టారు. ప్లాట్‌ఫాం చుట్టూ బాసురీ తిరుగుతున్నప్పుడు ఆమె తండ్రి కూడా తోడుగా ఉన్నారు. వారిద్దరినీ మోదీ ఓదారుస్తూ కనిపించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన బాసురీ, తన తండ్రితోపాటు సుప్రీం కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు. పాలు ఒలికిపోయినా ఏమీ అనేవారు కాదు.. సుష్మా స్వరాజ్ హరియాణాలోని అంబా లా కంటోన్మెంట్లో పెరిగారు. రాష్ట్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. చిన్నతనంలో ఆమెతో అనుబంధం ఉన్న పలువురు.. సుష్మ మరణం నేపథ్యంలో నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. కంటోన్మెంట్‌లోని బీసీ బజార్ ప్రాం తంలో ఆమె ఇల్లు ఉండేది. ఇప్పటికీ అదే ఇంట్లోనే సుష్మ సోదరుడు గుల్షన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. చర్చల్లో పాల్గొనడ మంటే చిన్నప్పటి నుంచి సుష్మకు బాగా ఇష్ట మనీ, బడిలో అనేక పోట్లీలో ఆమె పాల్గొందని చెబుతున్నారు. ‘ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే సుష్మ రాజకీయాలపై ఆసక్తి చూపేది. ఆ దిశలోనే వెళ్లి ఉన్నత శిఖరాలకు చేరింది’అని శ్యామ్ బిహారీ అనే వృద్ధుడు చెప్పారు. ఆమె అందరితోనూ ఆప్యాయంగా ఉండేదనీ, ప్రత్యర్థి పార్టీ వాళ్లకు కూడా సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేదని శ్యామ్ గుర్తుచేసుకున్నారు. 60వ పడిలో ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ చిన్నప్పుడు తాము క్రికెట్ ఆడుతుంటే, ఆ దారిలోనే సుష్మ పాల కోసం వెళ్లేదని చెప్పారు. ఎప్పుడైనా క్రికెట్ బంతి తగిలి పాలు ఒలికినా ఏమీ అనేది కాదనీ, మీరు బాగా ఆడండి అని చెప్పి వెళ్లిపోయేదని తెలిపారు. సుష్మ సోదరుడి ఇంట్లోని పనిమనిషి సుష్మ మరణ వార్త విని తీవ్రంగా విలపించారు. ‘ఆమె కొన్ని నెలల క్రితం ఇక్కడకు వచ్చారు. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసుకుని, వారిద్దరికీ బాగా చదువు చెప్పించాలనీ, వారి కోసం ఏదైనా అవసరం అయితే అడగమని చెప్పారు’ అని ఆమె తెలిపారు. -
గుర్తుండిపోయే నేత!
కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్లాల్ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్‌కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్ పరివార్ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్ నాయకుడు ఎల్కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్ కౌశల్‌ను పెళ్లాడాక ఆమె జనసంఘ్‌కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు. ఆ క్రమంలో ఆమె లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి. బెంగళూరులోని పబ్‌పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్‌పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్‌పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్ పరివార్ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు. విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్‌లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది. ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. -
సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు యావత్ దేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. తీవ్ర గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిండైన భారతీయ రూపంతో, తన వాక్పటిమతో ప్రజలను ప్రేమగా హత్తుకొనే నాయకత్వ శైలితో ప్రజలకు ఎంతో చేరువన ఈ చిన్నమ్మకు కన్నీటి నివాళులర్పించేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆమె నివాసంలో, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు.. ఆమె తనయురాలు బాన్సూరి స్వరాజ్, భర్త స్వరాజ్ కౌశల్ తుదిసారి సెల్యూట్ చెప్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థివ దేహానికి వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కుమార్తె బాన్సూరీ స్వరాజ్ చేతుల మీదుగా ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది
బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై హరియాణా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ వాసి అయిన సుష్మా స్వరాజ్ బాల్యపు రోజులను, ప్రజలతో ప్రేమగా, ఆప్యాయంగా వ్యవహరించే ఆమెతో తమ అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. సుష్మా స్వరాజ్ హరియాణా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చౌదరీ దేవీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1977-82, 1987-90 మధ్యకాలంలో అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనుకోకుండా కలిసివచ్చిన అదృష్టంతోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఎంతో కటోరశ్రమతో ఉన్నతమైన నాయకురాలిగా ఎదిగారని ప్రస్తుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ గుర్తుచేసుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనే సుష్మా ఎమ్మెల్యేగా గెలుపొందారని, అనంతరం హరియాణ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన తెలిపారు. ‘1977లో అంబాలా కంటోన్మెంట్ టికెట్‌ను సోమ్ ప్రకాశ్ చోప్రాకు జనతా పార్టీ ఇచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లి వచ్చిన ఆయన కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేదు. దీంతో ఆ టికెట్ అనూహ్యంగా సుష్మాజీకి దక్కింది. ఆమె గెలుపొందారు. జనతా పార్టీ హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది’ అని అనిల్ విజ్ తెలిపారు. 1990లో సుష్మా రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అప్పటినుంచి అనిల్ విజ్గా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సుష్మా స్వరాజ్ చిన్నవయస్సులోనే తల్లి చనిపోయారని, అప్పటినుంచి అంబాలా కంటోన్మెంట్‌లోని బీసీ బజార్లో ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ఆమె.. స్కూలు రోజుల నుంచే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనేవారని అనిల్ విజ్ తెలిపారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్డీ కాలేజీలో చదివిన సుష్మా అనంతరం చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. ఆమె సోదరుడు ప్రస్తుతం అంబాలా కంటోన్మెంట్‌లోని తన పూర్వీకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. -
‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’
తిరువనంతపురం: చెరగని చిరునవ్వుకు, నిండైన భారతీయతకు నిలువెత్తు నిదర్శనం సుష్మా స్వరాజ్. దేశ ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించగలిగిని అతి కొద్ది మందిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు ఎవరూ సాయం కోరినా తక్షణమే స్పందించేవారు సుష్మా స్వరాజ్. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం చిన్నమ్మ జ్ఞాపకాల్లో తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుష్మకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా హెచ్ఐవీ రోగులంటే చిన్న చూపు ఇంకా పోలేదు. నేటికి ఆ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు. 2020లోనే ఇలా ఉంటే.. 2003 కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకుని.. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించదని సమాజానికి ఓ సందేశం ఇచ్చారు సుష్మా స్వరాజ్. ట్విటర్ యూజర్ పియు నాయర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘తల్లిదండ్రుల కారణంగా ఈ చిన్నారులకు ఎయిడ్స్ వ్యాధి సోకింది. దాంతో వీరు చదువుతున్న పాఠశాల యాజమాన్యం.. ఈ చిన్నారులను స్కూల్ నుంచి తొలగించింది. ఇతర ఏ స్కూల్లో కూడా వీరిని చేర్చుకో లేదు. దాంతో చిన్నారుల తాత ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలాం వారు చదువుకోవడానికి మార్గం చూపడమే కాక ఈ పిల్లల కోసం ఓ ప్రత్యేక ట్యూటర్ని కూడా ఏర్పాటు చేశారు. వీరి గురించి తెలిసిన సుష్మా స్వరాజ్ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా చిన్నారులను కలుసుకుని ప్రేమగా దగ్గరకు తీకున్నారు. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందదని తెలిపారు’ అంటూ నాయర్ ఈ ఫోటోని ట్వీట్ చేశాడు. నేడు సుష్మా స్వరాజ్ చనిపోయారనే వార్త తెలిసి ఈ పిల్లల తాత తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ రోజు సుష్మాజీ నా మనవల పట్ల చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ పిల్లల చదువకు అవసరమైన సాయం అందేలా సుష్మాజీ ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన మేలును జీవితాంతం మరవలేం’ అన్నారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు 2010లో మృతి చెందగా.. మరొకరికిప్పుడు 23 ఏళ్లు. -
‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్ తెచ్చేవారు’
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్ మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీ. బుధవారం ఉదయం ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తూ.. అద్వాణీ కన్నీరు పెట్టుకున్నారు. ‘సుష్మ చాలా చిన్న వయసులోనే పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ... శక్తివంతమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. నేటి తరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలిచారు. సుష్మ గొప్ప వక్త. ఆమె జ్ఞాపకశక్తిని చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయేవాడిని. సుష్మ ప్రతిసంవత్సరం నా పుట్టిన రోజు నాడు నాకిష్టమైన చాకొలెట్ కేక్ తీసుకొచ్చేవారు. ఒక్క సారి కూడా కేక్ తేవడం మర్చిపోలేదు’ అంటూ సుష్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అద్వాణీ. అంతేకాక సుష్మ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆమె తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె మరణం బీజేపీకి తీరని లోటు అంటూ అద్వాణీ కన్నీటి పర్యంతమయ్యారు. -
మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!
‘బన్సూరీ(సుష్మా స్వరాజ్ కుమార్తె)ని నన్ను సెలబ్రిటీ లంచ్ కోసం రెస్టారెంటుకు తీసుకువెళ్తా అని చెప్పారు. కానీ మా ఇద్దరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయారు దీదీ’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఉద్వేగానికి లోనయ్యారు. ‘సుష్మాజీ ఆకస్మిక మరణం వేలాది మంది కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పార్టీ కార్యకర్తగా మహిళా సాధికారతకై మన జీవితాన్ని అంకితం చేసినట్లయితే...అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి’ అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి స్మృతి మరో ట్వీట్ చేశారు. కాగా విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన సుష్మా స్వరాజ్.. అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యర్థి పార్టీలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడుతూనే... తనదైన శైలిలో ప్రసంగాలు చేసి వారిని సైతం ఆకట్టుకునేవారు. కేవలం రాజకీయ నాయకురాలిగానే గాకుండా... మంచి మనసున్న ‘అమ్మ’గా ప్రజలకు దగ్గరయ్యారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. असंख्य महिला कार्यकर्ताओं की प्रेरणा दीदी का आकस्मिक निधन हम सबको स्तब्ध कर गया । आज उनके शोकाकुल परिवार के प्रति सहानुभूति व्यक्त करती हूँ ।एक कार्यकर्ता के नाते महिला उत्थान के प्रति अगर हम अपना जीवन समर्पित करे तो वो दीदी के प्रति सच्ची श्रधांजलि होगी । pic.twitter.com/J7aJTCQtpm — Smriti Z Irani (@smritiirani) August 7, 2019 -
సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులనే తేడా లేకుండా రాజకీయాల్లో ఆమె శాస్వత ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆమె తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేవారు. అయితే ఆమె ఏకంగా ఆరు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, ఆయా రాష్ట్ర ప్రజల్లో గుర్తింపును పొందారు. 1970లలో హర్యానా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం.. అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. హర్యానా: సుష్మా స్వరాజ్ తొలిసారిగా 1977 ఎన్నికల్లో పోటీ చేశారు. హర్యానాలోని అంబాలా నుంచి విజయం సాధించారు. తన 25 ఏళ్ల వయసులోనే సుష్మా హర్యానాలోని దేవీలాల్ సర్కారులో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే హర్యానా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. ఢిల్లీ: 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుష్మ దక్షిణ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తరువాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి ఆమె కేంద్రమంత్రిగా సేవలు అందించారు. అయితే ఆ తరువాత ఆమె తన పదవికి రాజీనామా చేసి, ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్: సుష్మా స్వరాజ్ 2000లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయాక కూడా అక్కడి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సుష్మ కీలకపాత్ర పోషించారు. 2009, 2014 ఎన్నికల్లో విదిశ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. కర్ణాటక: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై 1999 లోక్‌సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. బళ్లారి లోక్‌సభ స్థానంలో సోనియాతో తలపడ్డారు. ఆమె ఓటమి చెందినప్పటికీ అక్కడి ప్రజలతో అప్పుడప్పుడు మమేకమవుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజలతోనూ సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. బిల్లు ఆమోదం సందర్భంగా ‘తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకొండి’ అంటూ సుష్మా చేసిన ప్రసంగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాదు కేంద్ర విదేశాంగ మంత్రిగా వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు -
‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’
న్యూఢిల్లీ: చిన్నమ్మగా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మరిక లేరు. గుండెపోటు రూపంలో మృత్యువు ఆమెను దేశ ప్రజలకు దూరం చేసింది. చెరగని చిరునవ్వుతో భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సుష్మా స్వరాజ్. 25 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు సుష్మా స్వరాజ్. అయితే తన ఎదుగుదలలో భర్త స్వరాజ్ కౌశల్ తోడ్పాటు మరువలేనిది అంటారు సుష్మా స్వరాజ్. ఆయన ప్రోత్సాహంతోనే తాను ఇంత ఎదిగానని చెప్తారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను దాటుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడు సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. వీరికొక కుమార్తె. ఆమె కూడా లాయరే. ఈ ఏడాది సుష్మా స్వరాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సుష్మా స్వరాజ్ భర్త మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో పాల్గొనని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మిల్కా సింగ్ కూడా ఓ ఏదో రోజు పరుగు ఆపాల్సిందే. 25 ఏళ్ల వయసులో.. 1977లో మీ పరుగు ప్రారంభమయ్యింది. 41 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మీతో పాటు నేను కూడా పరిగెడుతున్నాను. నేనేం 19 ఏళ్ల యువకుడిని కాదు. ఇక నాకు పరిగెత్తే ఓపిక లేదు. మీరు మీ పరుగును ఆపుతూ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను’ అంటూ స్వరాజ్ కౌశల్ చమత్కరించారు. సుష్మా స్వరాజ్ కుటుంబ జీవితానికి, వృత్తి బాధ్యతలకు సమాన ప్రధాన్యం ఇచ్చారు. ఈ విషయం గురించి స్వరాజ్ కౌశల్ గతంలో ఓ సారి మాట్లాడుతూ.. ‘మా అమ్మ గారు 1993లో క్యాన్సర్‌తో మరణించారు. ఆ సమయంలో సుష్మ ఎంపీగా ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నా తల్లికి సేవ చేయడానికి సహయకురాలిని నియమించుకోమని సుష్మకు చాలా మంది సలహ ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఏడాది పాటు నా తల్లికి అన్ని సేవలు చేసింది. కుటుంబం పట్ల ఆమె ప్రేమ అలాంటిది. నా తండ్రికి నాకన్నా, సుష్మ అంటేనే అభిమానం. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయనకు సుష్మనే తలకొరివి పెట్టింద’ని తెలిపారు స్వరాజ్ కౌశల్. -
సుష్మా స్వరాజ్‌కు ప్రముఖుల నివాళి
-
‘నన్ను అన్నా అని పిలిచేవారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ దివంగత సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సుష్మ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ...ప్రజల గొంతుక వినిపించే శక్తివంతమైన పార్లమెంటేరియన్ సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. ఆమె అకాల మరణం జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘ ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు. రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టేవారు. అందుకోసం నేనే స్వయంగా వారింటికి వెళ్లేవాడిని. అయితే ఇకపై రాఖీ పండుగ నాడు తానే మా ఇంటికి వస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. కాబట్టి నేనే వచ్చి రాఖీ కడతాను నాతో అన్నారు’ అంటూ సుష్మా స్వరాజ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులతో పంచుకున్నారు. కాగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. -
తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గొంతుక వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ఢిల్లీలో సుష్మాస్వరాజ్‌కు ఆయన నివాళర్పించారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం ఆమెనని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా "తెలంగాణ చిన్నమ్మ"గా నిలిచిపోతారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ యువకులు బలిదానం కావొద్దు..తెలంగాణ చూడాలని భరోసా నింపిన గొప్ప నాయకురాలని చెప్పారు. గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు విదేశాంగ శాఖ మంత్రిగా సాయం చేశారన్నారు. ప్రవాసి భారతీయలకు అండగా నిలవడం కోసం ‘మదద్’ వెబ్ సైట్ పెట్టి వారికి అండగా నిలిచారన్నారు. సుష్మా స్వరాజ్ మృతి దేశానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలిపారు. -
‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మృతిపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడానికి గంట ముందే ఆమె తనతో మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ జాదవ్ తరపున ప్రభావవంతంగా వాదించి భారత్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కులభూషన్ జాదవ్ కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు ఇంటికి రావాల్సిందిగా సుష్మా తనను ఆహ్వానించారని, ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ సుష్మా స్వరాజ్‌తో నేను నిన్న రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి వచ్చి కలవండి’ అని అన్నారు. దానికి నేను, ‘అవును మేడమ్ ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు’’ అని సుష్మాతో సాగిన సంభాషణను హరీష్ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్ వాదనలే కీలకం. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. కానీ ఈ కేసు వాదించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించారు. దీనిపై హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు. (చదవండి : ఉరి.. సరి కాదు) -
ముగిసిన అంత్యక్రియలు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మా స్వరాజ్ మృతి చెందారు. ముగిసిన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. భద్రతా దళాల గౌరవ వందనం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ పార్థివ దేహం వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కడసారి నివాళులర్పించిన ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎల్కే అద్వాణీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా పలువురు బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్ భౌతిక కాయానికి కడసారి నివాళులర్పించారు. కుమార్తె చేతలు మీదుగా అంతిమ సంస్కారాలు సుష్మాస్వరాజ్ అంతిమయాత్ర లోధి రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకుంది. కాసేపట్లో ఆమె అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సుష్మాకు కడసారి వీడ్కోలు పలికేందుకు శ్మశాన వాటిక వద్దకు భారీగా ప్రముఖులు, అభిమానులు చేరుకున్నారు. సుష్మా స్వరాజ్‌కు అంతిమ సంస్కారాలు కుమార్తె బన్సూరీ నిర్వహించనున్నారు. శ్మశాన వాటకకు చేరుకున్న ప్రధాని సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, గులా నబీ ఆజాద్ లోధీ రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకున్నారు. Delhi: PM Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and former Bhutan PM Tshering Tobgay at Lodhi crematorium. #SushmaSwaraj pic.twitter.com/YfIX6o51sp — ANI (@ANI) August 7, 2019 దలైలామా సంతాపం సుష్మా స్వరాజ్ మృతికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజల పట్ల సుష్మాస్వరాజ్ ఎంతో దయ, స్నేహభావంతో మెలిగేవారని ప్రశంసించారు. కడసారి వీడ్కోలు పలికిన మంత్రులు బీజేపీ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితరులు సుష్మా అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. #WATCH Rajnath Singh, JP Nadda, Ravi Shankar Prasad, Piyush Goyal & other BJP leaders give shoulder to mortal remains of #SushmaSwaraj as they are being taken from BJP headquarters to Lodhi crematorium in Delhi. pic.twitter.com/H72kZ3lpQw — ANI (@ANI) August 7, 2019 ప్రారంభమైన అంతిమయాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి సుష్మా స్వరాజ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. కార్యాలయం వద్ద సుష్మా పార్థివదేహానికి ఆమె భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సూరీ శాల్యూట్ చేశారు. ఆ సమయంలో వారు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టిన ప్రధాని మోదీ కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. అలానే మరో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సుష్మా స్వరాజ్‌ను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరి కొద్ది సేపట్లో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున బీజేపీ కార్యాలయం వద్దకు తరలి వచ్చారు. జనసంద్రాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు లోధీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మహిళా సాధికారతకు నిదర్శనం: సచిన్ సుష్మా స్వరాజ్ మృతి పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ‘సుష్మా స్వరాజ్ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయుల క్షేమం గురించి ఆమె ఆరాట పడేవారు. ఆమె మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాను’ అన్నారు సచిన్. బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు నివాళులర్పించారు. అమిత్ షా కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను సుష్మ మృతదేహం మీద కప్పారు. ఏపీ గవర్నర్ సంతాపం మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు మరువలేమన్నారు. సుష్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు గవర్నర్. బీజేపీ ప్రధాన కార్యాలయానికి సుష్మ మృతదేహం పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తమ అభిమాన నాయకురాలిని కడసారి చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. Delhi: Mortal remains of former External Affairs Minister #SushmaSwaraj being taken to BJP headquarters pic.twitter.com/Uv4VE33jIT — ANI (@ANI) August 7, 2019 సుష్మా స్వరాజ్ మృతికి చైనా సంతాపం తెలిపింది. చైనా-భారత్ సంబంధాలు బలపడటంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని చైనా రాయబారి సన్ విడాంగ్ తెలిపారు. దీదీ.. ఆ ప్రామిస్ నెరవేర్చలేదు సుష్మాస్వరాజ్ మృతి పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మా స్వరాజ్ కుమార్తె)ని, నన్ను మంచి రెస్టరెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే వెళ్లిపోయావు’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. I have an axe to grind with you Didi . You made Bansuri pick a restaurant to take me for a celebratory lunch. You left without fulfilling your promise to the two of us. — Smriti Z Irani (@smritiirani) August 6, 2019 కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సోనియా గాంధీ, ఒడిశా సీఎం సుష్మా స్వరాజ్ ఇంటికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. మాకు మంచి స్నేహితురాలు: ఇజ్రాయెల్ అంబాసిడర్ ‘సుష్మా స్వరాజ్ మా దేశానికి మంచి స్నేహితురాలు. నా దేశం, నా దేశ ప్రజల తరఫున సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఇజ్రాయెల్-ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటంలో సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది’ అంటూ భారత్ ఇజ్రాయెల్ రాజబారి రాన్ మల్కా ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. సాయానికి చిరునామ: శత్రుఘ్న సిన్హా ‘నా ప్రియ స్నేహితురాలి మృతి నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఇక లేరనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సాయం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె. ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు సాయం చేయడానికి ఆమె ఎల్లప్పుడు ముందుండేది. వారి బాగోగుల కోసం నిరంతరం కృషి చేసింది. సాయం చేయడంలో ఎన్నడు వెనకంజ వేయలేదు. ఆమె చాలా మందికి హీరో. తప్పును.. తప్పుగా వేలెత్తి చూపే ధైర్యం ఆమె సొంత. ఆమె మృతి కుటాంబానికే కాక దేశానికి కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అంటూ శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. Rudely shocked & deeply saddened by the sudden demise of #SushmaSwaraj, Former External Affairs Minister, a very dear personal friend, an inspirational leader, a brilliant parliamentarian, a most respected, great administrator and a woman par excellence who dedicated her life to — Shatrughan Sinha (@ShatruganSinha) August 7, 2019 సుష్మా స్వరాజ్ నాకు అత్యంత ఆప్తులు సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వాణీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు గల అనుబంధాన్ని అద్వాణీ గుర్తు చేసుకున్నారు. 1980 కాలంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. సుష్మా స్వరాజ్ అప్పటికి చాలా చిన్నది. అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది.. చూస్తుండగానే దేశంలోనే చాలా శక్తివంతమైన రాజకీయనాయకురాలిగా ఎదిగారు. మహిళా నాయకులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె అకాల మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది’ అన్నారు అద్వాణీ సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గౌతమ్ గంభీర్ సుష్మా స్వరాజ్ నివాసం వద్దకు చేరుకుని ఆమె మృత దేహానికి నివాళులర్పించారు. కర్ణాటకలో బీజేపీ శ్రేణుల సంతాప సభ కర్ణాటక సీఎం యడియూరప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం సుష్మా స్వరాజ్ మృతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అలాగే సుష్మ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం అంత్యక్రియలు.. సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె మరణం తీరని లోటని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం, పార్టీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ప్రముఖుల సంతాపం.. సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జేపీ నడ్డా, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నాయకురాలు హేమా మాలిని, యోగా గురువు బాబా రాందేవ్ తదితర ప్రముఖులు సుష్మా స్వరాజ్ నివాసం వద్దకు చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. -
ఆ ప్రసంగం ఓ చరిత్ర: కవిత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో గొప్ప నేతను కొల్పోయామని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమె ప్రసంగాల ద్వారా తాను ఎంతో స్ఫూర్తిని పొందానని కవిత గుర్తుచేశారు. ఈమేరకు 1996లో లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగ వీడియోని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. చరిత్రలో ఇదొక గొప్ప ప్రసంగమంటూ ఆమె పోస్ట్ చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగంపై ప్రసంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. కవిత షేర్ చేసిన వీడియోలో బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని కూడా వాజ్‌పేయీ ఉన్నారు. It’s hard to believe that @SushmaSwaraj Ji is no more. My heartfelt condolences to her family & huge fan base. I have always admired her for her extraordinary oratory skills.This is one of my fav speeches of hers. https://t.co/qR3zWj54kx #RIPSushmaJi — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 7, 2019 -
ట్విటర్ ఫైటర్‌ను కోల్పోయా : పాక్ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా హఠాన్మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ‘ ట్విటర్లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయాను. హక్కుల కోసం పోరాటే గొప్ప దిగ్గజం ఆమె. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను’ అని ఫవాద్ చౌద్రీ ట్వీట్ చేశారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కాగా పాకిస్తాన్లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్లో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ కమిషనర్‌ను సుష్మా ఆదేశించారు. దీనిపై ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. సుష్మాస్వరాజ్ ట్విటర్‌ను వేదిగా చేసుకుని పలు సమస్యలకు పరిష్కారం చూపారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. సుష్మా స్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్రవేశారు. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చి పలువురి అభినందనలు అందుకున్నారు. సుష్మా ఎటువంటి తారతమ్యాలు లేని రీతిలో సేవలు అందించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. Condolences to the family of Smt Sushma Swaraj, ll miss twitter melee with her, she was a giant in her own right, RIP https://t.co/MEVgLAK5jM — Ch Fawad Hussain (@fawadchaudhry) August 6, 2019 -
నేల మీదే పడుకుంటా; సుష్మ భీష్మ ప్రతిఙ్ఞ!
సాక్షి, న్యూఢిల్లీ : నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి అక్కడి ప్రజల చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్ భరతావని చేత ‘సూపర్ మామ్’ అనిపించుకున్న ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు. సుష్మ హఠాన్మరణంతో దేశమంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. తన జీవితకాలంలో (67)... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆమె ప్రజా జీవితంలోనే గడిపిన సుష్మా స్వరాజ్.. చివరి శ్వాస వరకు ప్రజలతో మమేకమయ్యే ఉన్నారు. ‘ఈరోజు నా కోసం జీవితమంతా ఎదురు చూశా’ అంటూ కశ్మీర్ పరిణామాలపై మంగళవారం చివరిసారిగా సుష్మ ట్వీట్ చేశారు. అదే విధంగా తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించారంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు సుష్మ అభినందనలు తెలిపారు. భీష్మ ప్రతిఙ్ఞ! ‘సుష్మా చాలా ఎమోషనల్ లీడర్. అందరికీ అతివేగంగా కనెక్ట్ అయిపోతారు’’ ఈ మాటలు సుష్మా స్వరాజ్ సన్నిహితులకే కాదు ఆమె జీవితం గురించి తెలిసిన, ట్విటర్లో ఆమెను ఫాలో అయ్యే యువతరానికి కూడా బాగా తెలుసు. మంచైనా, చెడు అయినా సరే మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు గొట్టినట్లు చెప్పడం సుష్మకు అలవాటు. అలాగే భావోద్వేగాలను దాచుకోకుండా మాటల తూటాలు వదలడంలోనూ ఆమె ముందుంటారు. మాతృభూమి పట్ల తనకున్న భక్తిని చాటుకోవడంలోనూ ఏమాత్రం సందేహించరు. ప్రతీ విషయాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకుంటారామె. ఉదాహరణకు... 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్న సమయంలో సుష్మ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘ తమ ప్రాణాలను త్యాగం చేసి బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన తర్వాత కూడా దేశాన్ని పాలించడానికి భారతీయులెవరూ దొరకలేదా? పరాయి పాలన అంతమైన తర్వాత కూడా ఓ విదేశీయురాలు పాలకురాలిగా ఎంపిక కాబడితే నిజంగా నా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఒకవేళ అదే గనుక జరిగితే నేను శిరోముండనం చేసుకుంటాను. రోజూ నేలమీదే పడుకుంటాను. పల్లీలు మాత్రమే తింటాను. తెల్లచీరే ధరిస్తాను అంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని కానున్నాన్నరన్న వార్తలపై సుష్మ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆమె వెనక్కితగ్గలేదు. క్షమాపణ చెప్పేది లేదని.. సోనియా గాంధీ ఎప్పుడు ప్రధాని అయినా తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. ఇక 1996 లోక్‌సభ ఎన్నికల్లోనూ బళ్లారి(కర్ణాటక) నియోజకవర్గంలో సోనియా చేతిలో ఓటమి పాలైనపుడు కూడా సుష్మ ఈవిధంగానే స్పందించారు. తాను ఎన్నికల బరిలో ఓడిపోయానే తప్ప యుద్ధంలో కాదని ఓటమిని హుందాగా స్వీకరించిన చిన్నమ్మ.. చివరిదాకా బళ్లారి ప్రజలు, నేతలతో తరచుగా సమావేశమయ్యేవారు. ఇలా ప్రతీ విషయంలోనూ నిక్కచ్చిగా, ఒకింత ఉద్వేగంగా స్పందించే సుష్మ అకాల మరణం పట్ల ఆమె అభిమానులే కాకుండా యావత్ దేశమంతా ‘అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ అంతే భావోద్వేగంగా నివాళులు అర్పిస్తున్నారు. -
ప్రముఖులతో సుష్మాస్వరాజ్
-
చిన్నమ్మ మరిలేరు : చిన్నబోయిన బాలీవుడ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంపై బాలీవుడ్ దిగ్ర్భాంతి చెందింది. సుష్మా హఠాన్మరణంపై బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యావత్‌జాతిని ఆందోళనకు గురిచేసిన సుష్మా మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఓ గొప్ప రాజనీతికలిగిన నేత, దిగ్గజ నాయకురాలు మనల్ని విడిచివెళ్లారన్న విషాద సమాచారం తమను బాధించిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్ సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ అద్భుత పార్లమెంటేరియన్, మంత్రి అంటూ కొనియాడిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అత్యున్నత సేవలు అందించిన ఆమెను మిస్ అవుతున్నామని అన్నారు. సుష్మా స్వరాజ్జీ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అనుష్క శర్మ ట్వీట్ చేశారు. సుష్మాజీ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె తమకు ఎప్పటి నుంచో అత్యంత సన్నిహితురాలిగా మెలిగేవారని, తమ పట్ల ఆప్యాయత కనబరిచేవారని సంజయ్ దత్ గుర్తుచేసుకున్నారు. దిగ్గజ నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఢిల్లీ సుల్తానుల కోటను బద్దలు కొట్టిన సుష్మా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంతో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేరుకున్నారు. దేశ రాజధానికి ఢిల్లీకి స్వాతంత్ర్య భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. 1998 అక్టోబర్ 13న ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. దీంతో 800 ఏళ్ల నాటి ఢిల్లీ సుల్తానుల రికార్డును ఆమె శాస్వతంగా తుడిచేశారు. ఢిల్లీ సుల్తానుల పాలకురాలు రజియా సుల్తానా 1236 అక్టోబర్ 14 నుంచి 1240 వరకు హస్తినను పాలించారు. ఆమె తరువాత ఢిల్లీని పాలించిన మహిళగా సుష్మా చరిత్రలో నిలిచిపోయారు. 1998 ఎన్నికల్లో ఆమె ఓటమి చెందినప్పటికీ మరో మహిళా సీఎంగా షీలా దీక్షిత్ ఆ పదవిని అధిష్టించారు. కాగా ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి మహిళా ముఖ్యమంత్రులుగా సేవలందించింది వీరిద్దరు మాత్రమే. ఇదిలావుండగా షీలా, సుష్మా ఇద్దరూ 15 రోజుల వ్యవధిలోనే మృతిచెంది భారతావనిని శోకసంద్రంలో ముంచారు. 1970లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుష్మా ఇప్పటి వరకు అనేక అత్యున్నత పదవుల బాధ్యతలను స్వీకరించి వాటిని వన్నెతెచ్చారు. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆమె.. ఇటివల ముగిసిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. -
ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంలు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం దిగ్ర్భాంతికి లోనయింది. తీవ్ర గుండెపోటుతో ఎయిమ్స్‌లో మంగళవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. తన రాజకీయ జీవితంలో కీలక పదవులు చేపట్టి వాటికి వన్నెతెచ్చిన సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మదన్‌లాల్ ఖురానా, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్‌లు మరణించడం గమనార్హం. ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ నేత మదన్‌లాల్ ఖురానా 2018, అక్టోబర్ 27న సుదీర్ఘ అనారోగ్యంతో 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1993-96 మధ్య ఖురానా ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ దిగ్గజ నేత షీలా దీక్షిత్ (81) ఈ ఏడాది జులై 20న ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అత్యధిక కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ 2004లో కేరళ గవర్నర్‌గానూ సేవలు అందించారు. జీవితాంతం కాంగ్రెస్ నేతగానే కొనసాగిన షీలా 1984లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. యూపీలోని కన్నౌజ్ ఎంపీగానూ పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. మరో ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ (67) ఆకస్మిక మరణం అటు దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను విషాదంలో ముంచెత్తింది. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సుష్మా స్వరాజ్ 1998లో ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. -
ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను అర్థం చేసుకున్నాం. తల్లికి పురుడు పోసి తెలంగాణ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నుంచి గల్లీ వేదికల వరకు పదే పదే చెబుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి అండదండగా ఉంటూ వచ్చిన మహిళా నేత సుష్మస్వరాజ్. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతి ఆందోళనకు హాజరై రాష్ట్ర ఏర్పాటుకు తొలి నుంచి ఆమె అండగా నిలబడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సందర్భంలో కొందరు బీజేపీ అగ్రనేతలే తెలంగాణలో, పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను తప్పుబట్టినా.. ఇది యూపీఏ ప్రభుత్వం తేల్చాల్సిన అంశమంటూ తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసినా.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనని పట్టుబట్టి మద్దతుగా నిలిచిన సుష్మాస్వరాజ్.. మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అగ్రనేతలు ఎల్.కే.అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, అరుణ్‌జైట్లీను తెలంగాణకు అనుకూలంగా వారిని ఒప్పించడంలో సుష్మ పోషించిన పాత్ర చాలా కీలకం. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుష్మస్వరాజ్ మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో నిలిచిపోతాయి. ‘‘ప్రసవ వేదనను తీర్చే సమయం ఆసన్నమైంది. ఎన్నో త్యాగాల మీద, విద్యార్థుల బలిదానాల మధ్య అనేక మంది ప్రజా పోరాటాలతో పండంటి తెలంగాణ బిడ్డ జన్మించబోతుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. ముందు ముందు తెలంగాణబిడ్డ ఎదిగేందుకు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి’’అంటూ ఆమె చేసిన ప్రసంగం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చదవండి: సుష్మా హఠాన్మరణం -
మాటలన్నీ తూటాలే!
సుష్మా స్వరాజ్ నిలుచుంటే నిండా ఐదగుడుల ఎత్తు కూడా ఉండరు. ఒక అంగుళం తక్కువే ఉంటారు. కానీ రాజకీయాల్లో, వ్యక్తిత్వంలో ఆమె శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 67 ఏళ్ల వయసులో... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ప్రజా జీవితంలోనే!!. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఆమెను విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. సుష్మా రాజకీయ మూలాలు కుటుంబం నుంచే మొదలయ్యాయని చెప్పాలి. తల్లిదండ్రులు వాస్తవంగా పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రాంతంలో పుట్టినా... దేశ విభజన సమయంలో హరియాణాకు వచ్చేశారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆరెస్సెస్ కార్యకర్త. సుష్మ కూడా చదువుకునేటప్పుడే అఖిలభారత విద్యార్థి పరిషత్‌లో చేరారు. ఎమర్జెన్సీ తరవాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో ఆమె తొలిసారి ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. సినిమాలకు ఊపిరి... 1999లో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా ఉన్నపుడు సుష్మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి పరిశ్రమ స్థాయి కల్పించారు. దీంతో సినిమాలకు బ్యాంకు రుణాలు తీసుకోవటం సులభమయింది. అప్పటిదాకా ఫైనాన్స్ కోసం అండర్‌వరల్డ్‌పై భారీగా ఆధారపడిన సినిమా రంగం... ఈ నిర్ణయంతో కొత్త టర్న్ తీసుకుంది. ఫైనాన్షియల్ కంపెనీలు ఈ రంగంలోకి రావటానికి మార్గం సుగమమయింది. ‘డిజిటల్ డిప్లొమసీ’.... 2014 నుంచీ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఆమె సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ప్రతి అంశాన్నీ ట్వీట్ చేయటంతో ఆమెకు ట్విటర్లో ఏకంగా 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్ ద్వారా వెంటనే స్పందించేవారు. ఏ సమయంలోనైనా ట్విటర్లో అందుబాటులో ఉండే నేతగా సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పేరుంది. అందుకే వాషింగ్టన్ పోస్ట్ ఈమెకు ‘సూపర్ మామ్’ ట్యాగ్ కూడా తగిలించింది. ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952 తల్లిదండ్రులు: హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ చదువు: బీఏ – సనాతన్ ధర్మ కాలేజి, అంబాలా ఎల్ఎల్బీ – పంజాబ్ యూనివర్సిటీ భర్త: స్వరాజ్ కౌశల్ (1975లో వివాహం) సంతానం: ఒక కుమార్తె వృత్తి: సుప్రీంకోర్టు లాయర్ రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్‌సభ) - భర్త స్వరాజ్ కౌశల్ పిన్న వయస్సులోనే గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, హరియాణా కేబినెట్లో (1977– 82, 1987–90) అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ దంపతులు విశిష్ట జంటగా లిమ్కాబుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. - ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 13, 1998 నుంచి డిసెంబర్ 3, 1998 వరకు పనిచేశారు. - 1998లో కేంద్ర సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. - 2000– 20003 సంవత్సరాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా - 2003–2004 కాలంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. - 2009లో లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. - 2014– 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. - పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎస్సీసీ ఉత్తమ కేడెట్‌గా, ఉత్తమ విద్యార్థినిగా మూడేళ్లపాటు ఎంపికయి గోల్డ్ మెడల్ సాధించారు. వివిధ స్థాయీసంఘాలు, పార్లమెంట్ కమిటీల్లో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు. హరియాణా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. -
సుష్మా చివరి ట్వీట్ ఇదే..
బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. సుష్మా అకాల మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాధరణ కలిగిన సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సుష్మా.. చివరి శ్వాస వరకు దేశ అభివృద్ది కోసం పాటు పడ్డారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లు పాస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రం ఆమె చివరి ట్వీట్ చేశారు. ఇందు కోసమే తాను చాలు రోజులుగా వేచి చూస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్ షా హుందాగా ప్రవర్తించారని మరొక ట్వీట్లో ప్రశంసించారు. (చదవండి: సుష్మాస్వరాజ్ హఠాన్మరణం) प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime. — Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019 गृह मंत्री श्री अमित शाह जी को उत्कृष्ट भाषण के लिए बहुत बहुत बधाई. I congratulate the Home Minister Shri @AmitShah ji for his outstanding performance in Rajya Sabha. — Sushma Swaraj (@SushmaSwaraj) August 5, 2019 -
సుష్మాస్వరాజ్: ఏబీవీపీ నుంచి కేంద్ర మంత్రిగా..
బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇక లేరు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుష్మా మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె.. అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సుష్మా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా...మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోదీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్ ఏబీవీపీ నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. 2004 ఏప్రిల్‌లో సుష్మా స్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు అదనంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి అంతర్జాతీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. -
సుష్మా హఠాన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లోని ఎమెర్జెన్సీ వార్డ్‌కు తీసుకువచ్చారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రమే ఆమె ట్వీట్ చేశారు. ‘నరేంద్ర మోదీజీ.. చాలా చాలా కృతజ్ఞతలు ప్రధాని గారు. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను’ అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే హుటాహుటిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సుష్మాస్వరాజ్ మృతికి రాష్ట్రపతి కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. ‘సుష్మాజీ మృతి వార్త నన్నెంతో షాక్‌కు గురిచేసింది. ప్రజాజీవితంలో గొప్ప దార్శనికతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నేతను దేశం కోల్పోయింది’ అని కోవింద్ ట్వీట్ చేశారు. ఎన్డీయే 1 ప్రభుత్వంలో తన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (చదవండి: సుష్మా చివరి ట్వీట్ ఇదే..) ‘భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు’ అని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రయోజనాల విషయంలో ఆమె ఎల్లప్పుడూ రాజీలేని పోరాటమే చేశారని మోదీ గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన అన్ని శాఖల్లోనూ అద్భుత పనితీరును కనపర్చారని, విదేశాంగ మంత్రిగా పలు దేశాలతో భారత్ సంబంధాలను మరో ఎత్తుకు తీసుకువెళ్లారని వరుస ట్వీట్లలో కొనియాడారు. విదేశాల్లో ఆపదల్లో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ఎప్పుడూ ముందుండేవారని, ప్రజా సేవలో ఆమె సేవలు మరవలేనియని ప్రధాని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతికి షాక్‌కు గురి చేసిందని కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ మృతి తమనెంతో బాధకు గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. గొప్ప నేత, అద్భుత వక్త, అన్ని పార్టీల్లో ఆప్తులున్న సుష్మాజీ మరణం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రేపు బీజేపీ హెడ్ క్వార్టర్ట్స్‌లో.. సుష్మాస్వరాజ్ మృతదేహాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆ తరువాత లోధీ రోడ్డులో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు లాయర్‌గా 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధాని మోదీ గత మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మోదీజీ! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కోసం నా జీవితమంతా ఎదురుచూశా. – ‘370’ రద్దుపై సుష్మా చివరి ట్వీట్.. సుష్మా స్వరాజ్ మరణించారని తెలిసి తీవ్రంగా షాక్‌కు గురయ్యాను. ప్రజలు అమితంగా ప్రేమించే ఓ మంచి నాయకురాలిని దేశం కోల్పోయింది. ప్రజా జీవితంలో గౌరవం, ధైర్యం, సత్ప్రవర్తనకు ఆమె మారుపేరులా ఉండేవారు. ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలని తపించేవారు. ఈ దేశానికి ఆమె అందించిన సేవల వల్ల ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు. – ప్రధాని నరేంద్ర మోదీ ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. లోక్‌సభలో విపక్ష నేత పాత్రలో బీజేపీ వాణిని గట్టిగా వినిపించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ కార్యకర్తలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. – అమిత్ షా, హోం మంత్రి నా సహాధ్యాయిల్లో అత్యంత విలువైన వ్యక్తి సుష్మా స్వరాజ్ మరణ వార్త విని నేను తీవ్రంగా కలత చెందాను. పార్టీలకతీతంగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె మరణం మనకు భారీ లోటు. కింది స్థాయి నుంచి సుష్మ అనేక బాధ్యతలు నిర్వర్తించి విదేశాంగ శాఖ మంత్రి వరకు ఎదిగారు. ఆమె హయాంలో విదేశాంగ శాఖ పనితీరును పూర్తిగా మార్చేశారు. ప్రజల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో శ్రద్ధ, జ్ఞానంతో సుష్మ ఈ దేశానికి సేవ చేశారు. ఆమె సేవలను దేశం, పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనూహ్యంగా మరణించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఆమె నాకు 1990ల నుంచి తెలుసు. మా భావజాలాలు వేరైనప్పటికీ, పార్లమెంటులో ఎన్నోసార్లు మేం ఇద్దరం ఎంతో స్నేహపూర్వకంగా నడచుకున్నాం. ఎంతో గొప్ప రాజకీయ నాయకురాలు, మంచి మనిషి సుష్మ. ఆమెను మనం కోల్పోయాం. సుష్మ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం సుష్మా స్వరాజ్ మరణించారని తెలియడంతో నేను షాక్‌కు గురయ్యాను. ఆమె ఓ అసాధారణ రాజకీయ నాయకురాలు. వాక్పటిమను బహుమతిగా పొందిన వక్త. పార్టీలకు అతీతంగా ఆమెకు మిత్రులున్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. సుష్మా స్వరాజ్ మరణ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది. ఆమె నన్ను ఎప్పుడూ శరద్ భాయ్ అని పిలిచేది. మనం ఓ గొప్ప రాజనీతిజ్ఞురాలిని, గొప్ప వక్తను, సమర్థవంతమైన పరిపాలకురాలిని.. వీటన్నింటికీ మించి ఓ దయా హృదయురాలిని మనం ఈనాడు కోల్పోయాం. – శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు సుష్మా స్వరాజ్ మరణ వార్త వినాల్సి రావడం బాధాకరం. ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. – సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది సుష్మ అక్క. మనం సంబరాలు చేసుకోవడం కోసం ఓ రెస్టారంట్‌ను ఎంపిక చేయమని బన్సూరీ(సుష్మ కూతురు)కి మీరే చెప్పారు. కానీ మా ఇద్దరికి ఇచ్చిన ఆ మాటను నెరవేర్చకుండానే మీరు ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయారు. – స్మృతీ ఇరానీ, జౌళి శాఖ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నేత ఆమె అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మన్ననలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
‘ఆజం ఖాన్ మానసిక వికలాంగుడు’
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్‌కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. -
‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’
న్యూఢిల్లీ: ట్విటర్లో యాక్టీవ్‌గా ఉండే ప్రముఖుల్లో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో ఉంటారు. ఆపదలో ఉండి సాయం కోరే వారి విషయంలో తక్షణమే స్పందించే సుష్మా స్వరాజ్.. కామెంట్ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ట్విటర్ వేదికగా చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగే రామ్ మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇర్ఫాన్ ఖాన్ అనే ఓ ప్రబుద్ధుడు సుష్మా ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘షీలా దీక్షిత్ లానే మిమ్మల్ని కూడా ఏదో రోజు దేశమంతా తల్చుకుంటుంది అమ్మా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ నెల 20న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. చనిపోయాక సుష్మాజీని కూడా అలానే తల్చుకుంటారని చెప్తూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘నా గురించి ఇంత అత్యున్నతమైన ఆలోచన చేసినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. సుష్మా సమాధానం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడమే కాక ఇర్ఫాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Is bhawana ke liye apko mera agrim dhanyawad. I thank you in anticipation for this kind thought. https://t.co/pbuW6R6gcE — Sushma Swaraj (@SushmaSwaraj) July 21, 2019 -
అధికారిక నివాసం ఖాళీ చేసిన సుష్మాస్వరాజ్
-
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన సుష్మ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ప్రభుత్వ అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేసిన ఆమెకు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ లేన్‌లోని రెసిడెన్సీ-8ను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను ఆ బంగ్లాలో ఉండటం లేదని, అంతకు ముందు ఫోన్ నెంబర్లలో గాని, నివాసంలోగానీ అందుబాటులో ఉండనంటూ సుష్మా స్వరాజ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు సుష్మకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. I have moved out of my official residence 8, Safdarjung Lane, New Delhi. Please note that I am not contactable on the earlier address and phone numbers. — Sushma Swaraj (@SushmaSwaraj) 29 June 2019 -
ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి
అల్గునూర్ (మానకొండూర్): ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ అయిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాధితుడు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ‘సాక్షి’లో ‘ఎడారిలో బందీ’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. వీరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సౌదీ అరేబియాలోని విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు వీరయ్య ఉన్న ప్రదేశానికి చేరుకుని అతడిని వెంటనే భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అక్కడి నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం స్థానికంగా నివాసముండే తెలుగువారికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ప్రత్యేక వీసా వీరయ్య వీసా ముగియడంతో అతడిని స్వదేశానికి పంపించేందుకు అధికారులు ప్రత్యేక వీసా తయారు చేయించారు. ఈనెల 25న విమానం టికెట్ బుక్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముంబై వరకు టికెట్ బుక్ చేయడంతో వీరయ్య ఈ నెల 26న వేకువ జామున సౌదీ అరేబియా నుంచి బయల్దేరాడు. 27వ తేదీన ముంబై చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బస్సులో జగిత్యాలకు వచ్చి శుక్రవారం కరీంనగర్ చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల ఉద్వేగం క్షేమంగా ఇంటికి వచ్చిన వీరయ్యను చూసి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని చూసిన ఆనందంలో వీరయ్య కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తాను మళ్లీ ఇంటికి చేరుతానని అనుకోలేదని ఈ సందర్భంగా వీరయ్య తెలిపాడు. తాను ఇంటికి రావడానికి సహకరించిన కేటీఆర్, సుష్మాస్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై సౌదీ వెళ్లిన తాను అక్కడ నరకం అనుభవించానని, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అన్ని సక్రమంగా ఉంటేనే వెళ్లాలని పేర్కొన్నాడు. తమకు స్థానికంగా ఉపాధి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
ఆ ఇద్దరూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్లు ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తమకు పార్లమెంట్ మాజీ సభ్యులు గల గుర్తింపు కార్డులను మంజూరు చేయాలంటూ. ఈ ఇద్దరు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తొలి సమావేశాలు నిర్వహించేందుకు భేటీ అయిన పార్లమెంట్‌కు వారు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన 17 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మా ప్రకటించగా.. వయో భారంతో మహాజన్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంట్లు.. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులకు సుమిత్ర మహాజన్ విందును కూడా ఏర్పటుచేసినట్లు సమాచారం. తనకు పార్లమెంట్ సభ్యురాలిగా, లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం కల్పించిందుకు బీజేపీ పెద్దలకు ప్రత్యేక ధన్యావాదాలంటూ ఇటీవల ఆమె ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమె ధరఖాస్తును పరిశీలించిన కేంద్రం త్వరలోనే గుర్తింపు కార్డును జారీచేస్తామని చెప్పినట్లు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పంకజ్ కృష్ణసాగర్ తెలిపారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ మధ్యప్రదేశ్ నుంచే లోక్‌సభ ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ కేంద్ర విదేశాంగ బాధ్యతలు నిర్వహించిన సుష్మా స్వరాజ్ విధిశ నుంచి, మహాజన్ ఇండోర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో సుష్మా ఢిల్లీకి సీఎంగా గతంలో పనిచేశారు. కాగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు సుష్మాపేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
గవర్నర్ పదవిపై స్పందించిన సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ నియమితులయ్యారంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సుష్మా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే గవర్నర్‌గా నియమితులైనట్లు వదంతులు వచ్చాయి. ఇదిలావుండగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి కేంద్రమంత్రి హర్షవర్థన్ కూడా సుష్మాకు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా సుష్మాను అభినందిస్తూ.. పోస్టులు చేయడంతో ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అనంతరం కేంద్రమంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. The news about my appointment as Governor of Andhra Pradesh is not true. — Sushma Swaraj (@SushmaSwaraj) 10 June 2019 -
రాజ్యసభకు సుష్మా, అద్వానీ..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలపై ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బిహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోటీకి ముందే ఇదే విషయంపై అద్వానీతో షా, మోదీ చర్చించినట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్‌లోని విదిశ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వన్‌లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. -
మంత్రివర్గంలో ఆమె లేకుంటే ఎలా?
మోదీ కొత్త కేబినెట్లో 10 శాతానికి పైగా మహిళా మంత్రులు ఉన్నప్పటికీ... అదా విషయం! ఆరుని మూడుకు తగ్గించడం గురించి కదా.. మరో సుష్మను కేబినెట్ హోదాలోకి తీసుకోకపోవటం గురించి కదా.. ఇప్పుడు మాట్లాడుకోవలసింది! మాధవ్ శింగరాజు రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మహిళల్లో సుష్మా స్వరాజ్ లేరు! మంత్రివర్గంలో ఆమె లేకపోవడం ఏంటని కాదు ఆశ్చర్యం. ఆమె లేకుండా ఎలా అని! ‘మిస్ యూ సుష్మాజీ’ అని పార్టీలతో నిమిత్తం లేకుండా దేశ నాయకులు, దేశ ప్రజలు ఆమెకు ఇప్పటికీ ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే సుష్మను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినప్పటికీ అది ఏమాత్రం సంభవించవలసిన పరిణామం కాదనే భావన ఈ దేశ ప్రజలు, పూర్వపు మంత్రి వర్గ సహచరులలోనూ ఉంది.మోదీ కొత్త ప్రభుత్వంలో శుక్రవారం నాడు విదేశాంగ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘సుష్మాజీ అడుగుజాడల్లో నడవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మంత్రిగా ఆయన పెట్టిన తొలి ట్వీట్ అది. ప్రస్తుత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్ కూడా ఉండి ఉంటే మోదీ రెండో ఆలోచన లేకుండా ఆమెకు విదేశాంగ శాఖనే ఇచ్చి ఉండేవారు. గత ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మ భారతదేశ దౌత్య సంబంధాలను చక్కబరచడం ఒక్కటే అందుకు కారణం కాదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలతో కలిసి ఎన్నారై బాధిత భార్యల కోసం ఆమె చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ ఉన్న భార్యలు చేసిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తల్ని పట్టి తేవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ‘దేశ ప్రజల ప్రియతమ మంత్రి’ అనే గుర్తింపునిచ్చా యి. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసులో 2016 నవంబరులో మధుమేహం తీవ్రం కావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రిలో సుష్మ అడ్మిట్ అయ్యారు. ఆ వివరాలను ట్వీట్ చేస్తూ.. కిడ్నీ ఫెయిల్ అవడంతో తనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని ఆమె వెల్లడించినప్పుడు అనేక మంది తమ కిడ్నీ ఇస్తామని ముందుకు వచ్చారు! ‘మేడమ్.. మీకు సమ్మతమైతే నా కిడ్నీని డొనేట్ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశానికి మీ సేవలు అత్యవసరం’ ఒక యువకుడు ట్వీట్ చేశాడు. జమ్మూలో ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల ఖేమ్రాజ్ శర్మ అయితే తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను ఆమె కాపాడారు. ఆదివారాలు కూడా ఆమె మంత్రిత్వ శాఖ కార్యాలయం తెరిచే ఉండేది. సుష్మ చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా నేను నా కిడ్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాను’’ అని శర్మ బీబీసీ ప్రతినిధితో అన్నారు. వాటన్నిటికీ ఒకే సమాధానంగా.. ‘‘ఫ్రెండ్స్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మాటలు రావడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సుష్మ ట్వీట్ చేశారు. ఆ ఏడాది డిసెంబరులో సుష్మకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగింది. మరింత ఆరోగ్యకరమైన పరిసరాల పరిశుభ్రత అనివార్యం కావడంతో తనిక పోటీ చేయబోవడం లేదని ఎన్నికలకు కొన్ని నెలల ముందే సుష్మ ప్రకటించారు. సర్జరీ తర్వాత కూడా రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన సుష్మ.. విదేశాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, సహాయం కోసం చేతులు చాచిన ఎందరినో ఒక తల్లిలా జన్మభూమి ఒడిలోకి తీసుకున్నారు. సుష్మ ఇంతగా తన ప్రభావాన్ని చూపించబట్టే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మహిళలకు దక్కని సముచిత స్థానం గురించి కాకుండా, మంత్రివర్గంలో సుష్మ లేకపోవడం అనే విషయమే ప్రాముఖ్యాంశం అయింది. 78 మంది మహిళా ఎంపీలు ఉన్న ప్రస్తుత లోక్‌సభలో మహిళలకు మోదీ ఇచ్చిన కేబినెట్ హోదాలు మూడంటే మూడు మాత్రమే! స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్. ఈ ముగ్గురూ గత లోక్‌సభలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నవారే. అప్పట్లో వీరితో పాటు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమాభారతి.. మొత్తం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ఉండేవారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సహాయ మంత్రులుగా ఉండేవారు. మొత్తం ఎనిమిది మంది. ఆరు కేబినెట్ హోదాలు. రెండు సహాయ పదవులు. అదిప్పుడు మూడు కేబినెట్ హోదాలు, మూడు సహాయ పదవులుగా కుదించుకుపోయింది. 64 మంది మహిళా ఎంపీలు ఉన్న గత లోక్‌సభతో పోలిస్తే అంతకంటే పద్నాలుగు మంది మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత లోక్‌సభలో ఉండాల్సిన మహిళా మంత్రుల సంఖ్య మరీ ఆరైతే కాదు. గత లోక్‌సభలో సుష్మతో సమానంగా మహిళా సంక్షేమం కోసం పని చేసిన మేనకా గాంధీని ప్రస్తుతానికి మోదీ పక్కన ఉంచారు. గంగాజల ప్రక్షాళన సేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఉమాభారతి తనంతట తనే తప్పుకున్నారు. సహాయమంత్రి అనుప్రియా పటేల్ మళ్లీ అదే హోదాలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. సహాయ హోదాలోకి మునుపు అదే హోదాలో ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొత్తగా రేణుకా సింగ్ సరితను, దేవశ్రీ చౌదరిని తీసుకున్నారు. పాత లోక్‌సభలో 6+2 గా ఉన్న మహిళా మంత్రులు కొత్త లోక్‌సభలో 3+3 అయ్యారు. జాతీయవాద మోదీ ప్రభుత్వానికి ‘మానవీయ’ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో లేని కారణంగా ఆమెపై పడుతున్న ఫోకస్.. మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య సగానికి సగం తగ్గడం అనే అంశాన్ని అవుట్ ఫోకస్ చేస్తోందని చెప్పడం కాదిది. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మహిళా ఎంపీలలో సుష్మాస్వరాజ్‌లు లేకుండా పోరు. లేకున్నా, బాధ్యతలు అప్పగిస్తే తయారవుతారు. 1977లో దేవీలాల్ సుష్మపై నమ్మకం ఉంచి పాతికేళ్ల వయసులో ఆ కొత్తమ్మాయికి కేబినెట్ బాధ్యతలు అప్పగించినట్లే మోదీ కూడా కొత్త మహిళా ఎంపీలలో కనీసం మరో ముగ్గురికైనా కేబినెట్ హోదాను ఇస్తే దేశ ప్రయోజనాలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు నిరూపితం కావా! 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 80 వరకు మంత్రుల్ని తీసుకోవచ్చు. కేబినెట్లో ఇప్పుడు 58 మంది ఉన్నారు. ఫస్ట్ టైమ్ మహిళా ఎంపీలలో సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రేణుకా సింగ్, దేవశ్రీ చౌదరి, కాకుండా బీజేపీలో ఫస్ట్ టైమ్‌లు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్లు కాకున్నా సీనియర్లు ఉన్నారు. వాళ్లలోంచి తీసుకోవచ్చు. తీసుకుం టారా?! ∙ -
24 గంటలూ మీ సేవలోనే.. కేంద్రమంత్రి ఫస్ట్ ట్వీట్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అడుగుజాడల్లో ముందుకుసాగడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ బృందం 24 గంటలూ దేశ ప్రజల సేవలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్‌చేశారు. ‘ఇది నా మొదటి ట్వీట్. శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తుండటం గర్వకారణంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మాజీ విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ శుక్రవారం చరిత్ర సృష్టించారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆయన 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత్-చైనా మధ్య తలెత్తిన 73 రోజుల డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్ కీలక పాత్ర పోషించారు. -
సంప్రదాయంలో ‘స్వయంప్రకాశం’
దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరెస్సెస్ మూలాలు మరవని సుష్మా స్వరాజ్ 11 సార్లు రాష్ట్రాల, పార్లమెంటు ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులతో తలపడి నిలిచి గెలిచారు. 2009లో అడ్వాణీ స్థానంలో నరేంద్రమోదీకి బదులుగా ఆయనకంటే చిన్న వయస్కురాలైన సుష్మా స్వరాజ్‌ను బీజేపీ అధినేతగా ఆరెస్సెస్ నిర్ణయించి ఉంటే ఆ పార్టీ చరిత్ర మరొక మలుపు తిరిగి ఉండేదనటం నిర్వివాదాంశం. కానీ క్రికెట్లో లాగే అందరు స్టార్లూ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్లు కాలేరనీ రాహుల్ ద్రావిడ్‌లు కూడా ఉంటారన్నది రాజకీయాల్లోనూ సత్యమే. వారసత్వ రాజకీయాలకు దూరంగా బీజేపీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజయాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ వెలుగొందారు. ఆమె నిష్క్రమణ ఆమె సొంత నిర్ణయమే. జాతిహితం భారతీయ జనతాపార్టీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజ యాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్. ఆమె నిష్రమణతో అనేక అంశాల్లో ముందువరుసలో నిలిచి చరిత్రకెక్కిన గొప్ప భారతీయ మహిళా రాజకీయవేత్తను బీజేపీ కోల్పోనుంది. రాష్ట్రపతి భవన్లో నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వారు కూర్చున్న స్థానాలను దాటి అత్యంత విశిష్ట సందర్శకులు కూర్చున్న చోటికి సుష్మా స్వరాజ్ నడిచి వెళుతున్న దృశ్యం సంచలనం కలిగిం చింది. అక్కడ కూర్చుని ఉన్న సందర్శకుల్లో చాలామందికి ఆమె నూతన మంత్రివర్గంలో చేరవచ్చనే ఆశ అప్పటికీ చావలేదు. తన తొలి మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకుండా నరేంద్రమోదీ తన రెండో దఫా పాలన సాగించడం బహుశా కష్టమే కావచ్చు. సుష్మాకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు రహస్యం కాదు. తాను కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నానని ట్విట్టర్లో స్వయంగా ప్రకటించడం ద్వారా సుష్మా భారత రాజకీయ నాయకులు ప్రజా జీవితంపై కొనసాగుతున్న ముసుగును బద్దలు చేసిపడేశారు. తర్వాత ఆమె వేగంగా కోలుకున్నారనుకోండి. తన శరీరంలో కొత్తగా ఏర్పర్చుకున్న కిడ్నీతో ఆమె రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ వచ్చింది. దాని బలంతోనే ఆమె ఐక్యరాజ్యసమితిలో తన పాకిస్తానీ ప్రత్యర్థులతో తలపడ్డారు, ప్రపంచవ్యాప్తంగా తోటి విదేశీ కార్యాలయాలతో సమావేశాలు ఏర్పరుస్తూ వచ్చారు. అసాధారణమైన గౌరవాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆమె పెదాలనుంచి ఒక్కటంటే ఒక్క తేలికపాటి పదం కానీ వ్యక్తీకరణ కానీ ఎవరూ చూడలేకపోయారు. అలాగే ఆమె ఆగ్రహాన్ని కూడా ఎవరూ చూడలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ శాఖ మంత్రులను కలవడంలో వ్యవహారాలు నడపడంలో సుష్మా పూర్తిగా భిన్నమైన ఒక వినూత్న దౌత్య ప్రక్రియను పాటించారు. నరేంద్రమోదీ విదేశీవిధానాన్ని పూర్తిగా తానే నడుపుతూ వచ్చారని సుష్మా పాత్ర ఏమీ లేదని విమర్శకులు దాడి చేశారు. పాస్‌పోర్ట్, వీసా వలస సమస్యలను ట్విట్టర్లో పరిష్కరించడం తప్ప ఆమె చేసేందుకు ఏమీ లేదని కూడా విమర్శలు వచ్చాయి. కానీ తనపై వస్తున్న ఇలాంటి ఆరోపణలన్నింటినీ ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. మోదీ మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా నిజానికి పెద్దగా పొడిచిందంటూ ఏమీ లేదు. సుష్మా బాధ్యత చాలా కష్టభూయిష్టమైంది. ఒకవైపు తన ప్రధాని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుండగా ఆమె ఏమాత్రం లోటుగా భావించకుండా ఆయనకు దారి కల్పించారు. మీడియాలో ప్రచారం కోసం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు. వెనుక గదిలో తన పాత్ర పోషించడానికి ఆమె సిద్ధపడ్డారు. మోదీని ప్రశంసించడం తప్ప ఆయన గురించి ఒక్క పదం కూడా చెడుగా మాట్లాడలేదు. అతి చిన్నపట్టణమైన చండీఘర్‌లో మేమిరువురం 1977లో ఏకకాలంలో మా వృత్తి జీవితాలను ప్రారంభించాం. దేవీలాల్ నేతృత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వంలో పాతికేళ్ల ప్రాయంలో సుష్మా నవ, యువ కేంద్రమంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నేను ఆ సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సిటీ రిపోర్టరుగా పనిచేసేవాడిని. ఆ కాలంలో చాలా మంది రాజకీయ నేతల కంటే ఆమె ఎక్కువ ఆత్మగౌరవంతో మెలిగేవారు. అలాంటిది.. తన పార్టీ ఇప్పుడు రెండో దఫా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక సందర్శకురాలిగా ఉంటూ అక్కడ ఉన్న వారి అభినందనలు అందుకున్న సందర్భంలో 42 ఏళ్ల పాటు సాగిన ఆమె రాజకీయ జీవితం ఇక ముందు ఎలా సాగనుంది అనే విషయంలో నాకు ఇప్పటికీ అంత స్పష్టత కలగడం లేదు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుష్మా ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు పనిచేసిన ఎస్ జయశంకర్ ఇప్పుడామె స్థానంలో విదేశీవ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన అసాధారణమైన అంతర్గత శక్తి సహా యంతో ఆమె తన రాజకీయ నిష్క్రమణను తాత్వికంగా స్వీకరించవచ్చు. ఆమె ప్రజాజీవితంలో జరిగిన ఈ మలుపు కేవలం మలుపు కాదు.. ఆమె విశిష్టమైన రాజకీయ ప్రయాణంలో ఇది బహుశా ముగింపు లాంటి మలుపు కావచ్చు. 1970ల నాటి భారత రాజకీయాల్లో స్వయంప్రకటిత మహిళా నేతగా ఎదిగిన సుష్మా 27 ఏళ్ల వయసులో ఆమె హర్యానా జనతాపార్టీ అధ్యక్షురాలయ్యారు. అయితే 1979లో జనతాపార్టీ విచ్చిన్నమయ్యాక ఆమె జనసంఘ్ గ్రూప్ వైపు అడుగులేశారు. అప్పటినుంచి ఆమె వంశ పారంపర్యతకు దూరంగా స్వయం సిద్ధ రాజకీయనేతగా ఎదుగుతూ వచ్చారు. జాతీయ క్యాలెండర్లలోంచి నాట్యం చేస్తున్న అజంతా అప్సర చిత్రాలను తొలగించాలని, అశ్లీలతతో కనిపిస్తున్న కండోమ్ ప్రకటనలను నిషేధించాలని, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని సెక్సీ రాధా పాటను తొలగించాలని, దీపా మెహతా సినిమా ఫైర్‌లో షబానా ఆజ్మీ, నందితాదాస్ మధ్య లెస్బియన్ ప్రేమ దృశ్యాలను ప్రదర్శించకూడదని, అత్యాచార బాధితురాలిని సజీవ శవంగా భావించాలని తన జీవితం పొడవునా ప్రకటిస్తూ వచ్చిన సుష్మా బీజేపీ సాంప్రదాయతత్వానికి తాను తలొగ్గినట్లు మనతో నచ్చబలికేవారు. అంతమాత్రాన ఆమెను ఒక మామూలు బీజేపీ సాంప్రదాయిక భావాలు మాత్రమే కలిగిన నేతగా భావించరాదు. ఆమె ఒక విభిన్నమైన మహిళ అని చెప్పడానికి ఆమె జీవితం నుంచి డజన్ ఉదాహరణలను ఎత్తి చూపవచ్చు. ఆమె ఫక్తు మధ్యతరగతి జీవితాన్ని ప్రధానస్రవంతి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈ మూలాలే ఆమె వ్యక్తిగత ఎంపికలను నిర్ణయిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌కి చెందిన పితృస్వామిక వారసత్వాన్ని దూరం పెడుతూ వచ్చారు కూడా. ఈ క్రమంలోనే ఆమె మంగళూరులో కొంతమంది యువతులను అనైతిక కార్యకలాపాలకు దిగుతున్నారని ఆరోపిస్తూ బార్ల నుండి హిందూ ఛాందసవాద శక్తులు బయటకు లాగి అవమానించినప్పుడు ఆ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సుష్మా ఏమాత్రం భయపడలేదు. ఒక ఆధునిక, స్వతంత్ర మహిళగా, ఒక యువతికి తల్లిగా ఆమె ఎంతో స్వతంత్రంగా వ్యవహరించేవారు. మాట్లాడేవారు. దీంతో ఆమె సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తానొక విభిన్నమైన మహిళ అని గుర్తించినందుకే ఆమె అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాజకీయ జీవితం నుంచి తాను నిష్క్రమించబోతున్నానని, ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీపడటం లేదని ఆమె సరైన సమయంలో ప్రకటించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 11 సార్లు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన సుష్మా బలమైన పోటీని, ప్రత్యర్థులతో తలపడటాన్ని ఆమె ఎన్నడూ తప్పించుకోలేదు. కానీ ఇప్పుడామెకు 66 ఏళ్లు. పైగా ఆరోగ్యం ఇప్పుడామె ప్రధాన సమస్యగా మారింది. మధుమేహం తొలి దశ ప్రభావ ఫలితమిది. అయితే చివరవరకు వేచి ఉండకుండా కొత్త మంత్రివర్గంలో తాను చేరబోవడం లేదనే విషయాన్ని ఇంకాస్త ముందుగా ఆమె ప్రకటించి ఉండాల్సిందని నా సూచన. ఏది ఏమైనా ఆమె తన కెరీర్‌ను ఒక విజేతగానే, పార్టీకి అత్యంత విశ్వసనీయురాలిగానే ముగించారని ఆమె ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఆమె తొలినుంచి అడ్వాణీ ఆరాధకురాలు. కానీ 2009లో కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి అడ్వాణీ తిరస్కరించినప్పుడు సుష్మా ఏమాత్రం తొట్రుపాటు చెందకుండా పార్టీకి చెందిన సద్బుద్ధి కలిగిన ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్‘ (వెంకయ్యనాయుడు, అనంతకుమార్, అరుణ్ జైట్లీ )తో చేతులు కలపడమే కాదు పార్టీకి యువ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కోరారు కూడా. దాంతో నితిన్ గడ్కరీ వెలుగులోకి వచ్చారు.గత అయిదేళ్లకాలంలో ప్రధాని కార్యాలయం ఆమెను పక్కనబెట్టి ఉండవచ్చు, కొన్ని అంశాల్లో ఆమె ప్రాధాన్యం తగ్గించి ఉండవచ్చు. కానీ జైట్లీతో భేదాభిప్రాయాలు ఏర్పడిన సమయంలో మోదీ సుష్మాను తన వైపు ఉండాలని ఎంచుకున్నారు. ఆ సమయంలో రాజ్‌నాథ్ సింగ్ చైనాలో ఉండటంతో ఆమెను ఢిల్లీలోనే ఉండాలని మోదీ కోరారు. అప్పటికే ఆమె దుబాయ్‌కు వెళ్లవలిసి ఉంది. సుష్మా విశ్వాసాన్ని, పరిణతిని మోదీ గుర్తించారనడానికి ఇది చక్కటి తార్కాణం. పైగా అది ఆమె రాజకీయ కెరీర్లో కీలకమైన దశ. అద్వాణీకి బదులుగా యువనేతగా సుష్మానే ఎంచుకోవాలని బీజేపీ/ఆరెస్సెస్ నాయకత్వం నిర్ణయించుకుని ఉంటే ఏం జరిగేదన్నది చర్చనీయాంశం. ఆమె నరేంద్రమోదీ కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు. అదే జరిగి ఉంటే ఆమె నాయకత్వంలో ఎలాంటి బీజేపీ అవతరించి ఉండేదన్నది కూడా చర్చనీయాంశం.మోదీకి బదులుగా సుష్మా బీజేపీ నాయకత్వంలోకి వచ్చి ఉంటే అనేది మంచి చర్చకు తావిచ్చి ఉండేది. క్రికెట్‌లాగే రాజకీయాల్లోనూ ప్రతి స్టార్ కూడా ఒక కపిల్ దేవ్లా, సచిన్ టెండూల్కర్‌లా కాలేరు. వదలడానికి వీలులేని వ్యక్తి అయినప్పటికీ కీర్తి, అధికారానికి చేరువ కాలేకపోయిన రాహుల్ ద్రావిడ్ వంటి పాత్రను కూడా కొంతమంది పోషిం చాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నేతగా సుష్మాస్వరాజ్‌కి కూడా ఈ వర్ణనే సరిగ్గా సరిపోతుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekarGupta -
సుష్మాకు నో ప్లేస్ : గుండె పగిలిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నసుష్మా స్వరాజ్ (66)కు మోదీ 2.oలో చోటు దక్కలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు రెండోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సుష్మాకు అవకాశం దక్కలేదు. అయితే మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తరహాలోనే సుష్మా కూడా కేంద్రమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా తానే స్వయంగా తప్పుకున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ముందుగానే సుష్మా స్వరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌కు చోటు దక్కకపోవడంపై ట్విటర్ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వియ్ మిస్ యూ మేమ్ అంటూ విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే మేడం తిరిగి కావాలి..ఈ విషయాన్ని రీట్వీట్ చేయండి.. ట్రెండింగ్ చేయండి..తద్వారా ఆమెను కేంద్రమంత్రిగా వెనక్కి తెచ్చుకుందామటూ ట్వీట్ చేస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు తీరని లోటని మరొక యూజర్ ట్వీట్ చేశారు. కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్‌కు మూత్రపిండ మార్పిడి చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చదవండి : నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్ #sushmaswaraj we want you back mem plzz guys do retweet and make it trending so that mem will return — saksham gupta (@Guptasaksham07G) May 29, 2019 @SushmaSwaraj ji #sushmaswaraj 😢😭😢😭😢😭😢😭 ?????? — Nilesh U.R Dhanure (@DhanureNilesh) May 30, 2019 #SushmaSwaraj will not be part of Modi Cabinet. My heart breaks to hear this.#ModiSwearingIn #ModiSarkar2 — Nidhi Taneja (@nidhitaneja0795) May 30, 2019 Sushma Swaraj is not joining Modi's Cabinet. Huge loss for NRIs and Twitter.#ModiSwearingIn — Jet Lee(Vasooli Bhai) (@Vishj05) May 30, 2019 -
ఆ నలుగుర్ని రక్షించాలంటూ విజయసాయిరెడ్డి లేఖ
హైదరాబాద్: మలేసియాలో చిక్కుకున్న నలుగురు తెలుగు యువకులను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. బాధితులు విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాంకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి నిమిత్తం వారు మలేసియాకు వెళ్లినట్లు తెలిసిందని, మలేసియాకు వెళ్లిన వెంటనే వారి పాస్‌పోర్టులు లాక్కుని ఏజెంట్ చించేశాడని ఆ తర్వాత గదిలో బంధించాడని తెలిపారు. మలేసియాలో చిక్కుకున్న యువకుల్ని సహృదయంతో కాపాలడాలని సుష్మను కోరారు. -
సుష్మా స్వరాజ్‌కు విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. మలేషియాలో ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నవిశాఖకు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్ అనే ఏజెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్‌పార్ట్‌లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ను కోరారు. -
త్వరలో ఇండియాకు.. ‘ఎడారిలో బందీ’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశం కాని దేశంలో ఒంటెల యజమాని వద్ద బందీగా దుర్భర జీవితం గడుపుతున్న కరీంనగర్ జిల్లా వాసి పాలేటి వీరయ్య స్వదేశం రావడానికి మార్గం సుగమమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామం నుంచి వీరయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. రియాద్‌లోని ఎడారిలో ఒంటెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటెల యజమాని పెట్టే బాధలను తాళలేక పోయాడు. ఎలాగోలా తాను పడుతున్న బాధలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు. ఈ మేరకు గురువారం ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఎడారిలో బందీ’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. వీరయ్య పడుతున్న బాధలను తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తక్షణం స్పందించారు. వీరయ్య సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సుష్మాస్వరాజ్ సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్య ఆచూకీ తెలుసుకొని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం వేగంగా స్పందించింది. వీరయ్య ఎక్కడ ఉన్నాడో గంటల్లోనే పూర్తి సమాచారాన్ని సేకరించింది. రియాద్ ఎంబసీ కార్యాలయంలో హైదరాబాద్ వాసి ఉండటంతో వీరయ్య ఆచూకీ తెలుసుకోవడం సులభమైంది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా కేటీఆర్, ప్రశాంత్ పటేల్, దేశ్‌రాజ్‌కుమార్ తదితర 9 మందికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసింది. వీరయ్య ఇండియా వెళ్లడానికి ఎగ్జిట్ వీసా కూడా సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. వీరయ్య రాకపై కేటీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలో కష్టాలు పడుతున్న వీరయ్య సొంత ఇంటికి చేరుతుండటంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరయ్య భారత్‌కు వచ్చేందుకు సహకరించిన రియాద్‌లోని భారత రాయబారి, నగరానికి చెందిన ఆసఫ్ సయీద్‌తోపాటు ఎంబసీ అధికారులకు ట్విట్టర్లో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీరయ్య కోసం ఆయన కుటుంబసభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృం దంలో ఒకరిగా తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న భారతరత్న అబ్దుల్ కలాం స్మారకాన్ని సందర్శించినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
‘త్వరలోనే మోదీ గట్టి చెంప దెబ్బ తింటారు’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన ప్రభుతాన్ని డబ్బు దండుకొనే సిండికేట్లు నడుపుతున్నాయంటూ విమర్శించిన మోదీపై.. దీదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రధాని మోదీని అసత్యాలు పలికే వ్యక్తిగా దీదీ వర్ణించారు. అంతేకాక తాను హిందువుల పండగలు, ఉత్సవాలను అడ్డుకొంటున్నానంటూ బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై కూడా మమతా స్పందించారు. జై శ్రీరాం అంటే.. దీదీ జైలులో పెడుతుందని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా.. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనని.. జై శ్రీరాం బదులు జై హింద్ అని నినదిస్తానని వెల్లడించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభించిన బీజేపీ గత ఐదేళ్లలో ఒక్క చిన్న రామ మందిరాన్ని కూడా నిర్మించలేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుత ఎన్నికల్లో మోదీకి ప్రజాస్వామ్య చెంపదెబ్బ గట్టిగా తగులుతుందని, ఓటమి తప్పదని దీదీ పేర్కొన్నారు. దీదీ హద్దు మీరారు : సుష్మా స్వరాజ్ మమతా బెనర్జీ మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై.. బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో దీదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ममता जी - आज आपने सारी हदें पार कर दीं. आप प्रदेश की मुख्यमंत्री हैं और मोदी जी देश के प्रधान मंत्री हैं. कल आपको उन्हीं से बात करनी है. इसलिए बशीर बद्र का एक शेर याद दिला रही हूँ : दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे, जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों. — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019 -
మాటకు మాట
-
ఆ యువకుడిని భారత్‌కు రప్పించండి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: జర్మనీలోని ఒట్టో–వాన్–జ్యూరిక్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లి తీవ్ర మానసిక సమస్య తో బాధపడుతూ గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన సాయి రాహుల్ అనే యువకుడిని భారత్ రప్పించేలా చొరవ చూపాలని కోరుతూ మాజీ ఎంపీ దత్తాత్రేయ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. సాయి సోదరి హిమబిందు మంగళవారం దత్తాత్రేయను కలిసి సోదరుడి పరిస్థితి వివరించి కన్నీ టి పర్యంతమయ్యారు. దీంతో ఆ యువకుడి జాడ కనిపెట్టి హైదరాబాద్‌కు రప్పించేలా చొరవ చూపాల్సిందిగా దత్తాత్రేయ లేఖలో కోరారు. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
‘ఆత్మహత్యే దిక్కు.. వద్దు నేనున్నాను’
న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేక విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇదే మాట చెబుతుంటారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయులైన సరే తన సమస్య గురించి ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే రెస్పాన్స్ అవుతారు చిన్నమ్మ. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటు చేసుకుంది. అలీ అనే వ్యక్తి సౌదీ వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలు కావోస్తుంది. ఇండియా తిరిగి రావాలని అనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర విక్మా(ఉద్యోగ వీసా) తప్ప పాస్‌పోర్ట్, వీసాలాంటి ఇతర ఐడీలు ఏం లేవు. ఈ క్రమంలో తనకు సాయం చేయమని ఇండియన్ ఎంబసీని కోరాడు. తాను ఇక్కడకు వచ్చి దాదాపు 21 నెలలు కావోస్తుందని.. ఇంతవరకూ సెలవు తీసుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో సమస్యలున్నాయి.. అందుకే ఇండియా వెళ్లాలి అనుకుంటున్నాను అన్నాడు. కానీ వర్క్ వీసా తప్ప మరే ఐడీ తన దగ్గర లేదని సాయం చేయమని కోరాడు. ఇలా ఏడాది నుంచి అభ్యర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆఖరి ప్రయత్నంగా మరోసారి ‘నన్ను ఇండియా పంపించి పుణ్యం కట్టుకొండి. నాకు ఇంటి దగ్గర నలుగురు పిల్లలున్నారు. సంవత్సరం నుంచి సాయం కోరుతున్నాను. కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం నాకు సాయం చేస్తారో లేదో చెప్పండి. మీరు సాయం చేయకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం’ అని ట్వీట్ చేశాడు. అలీ అభ్యర్థన కాస్తా సుష్మా స్వరాజ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ‘వద్దు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయకండి. మేం మీకు సాయం చేస్తాం’ అని తెలపడమే కాక ఈ కంప్లైంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తనకు పంపించాల్సిందిగా రియాద్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. దాంతో మరో సారి నెటిజనుల సుష్మా స్వరాజ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. (చదవండి : అంతా మేడమ్ దయ వల్లే..!) -
‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యాదవ్ భాయ్.. మీరు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్‌పై సోమవారం రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఆజం ఖాన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్ జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఆజాం ఖాన్ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
రాహుల్జీ.. కాస్త మంచి భాష వాడండి
న్యూఢిల్లీ: పార్టీ అగ్ర నేత ఎల్కే అడ్వాణీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడాలని సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కోరారు. శుక్రవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బీజేపీ హిందూత్వ గురించి మాట్లాడుతుంది. హిందుత్వలో గురువే ప్రముఖుడు. గురు–శిష్య సంబంధం గురించి గొప్పగా ఉంటుంది. మోదీకి ఎవరు గురువు? అడ్వాణీ. అలాంటి అడ్వాణీని వేదికపై నుంచి నెట్టిపడేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ‘అడ్వాణీజీ మాకు తండ్రి సమానులు. మీ మాటలతో మా హృదయాలు గాయపడ్డాయి. దయచేసి, మీ ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడండి’ అని పేర్కొన్నారు. -
రాహుల్.. మీ మాటలు బాధించాయి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణా అద్వానీని చెప్పుతో కొట్టి.. స్టేజీ నుంచి దింపేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రాహుల్.. అద్వానీ మాకు తండ్రి లాంటి వారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత పాటిస్తే బాగుంటుంది’ అని సుష్మా ట్వీట్ చేశారు. శుక్రవారం నాగపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. హిందుత్వంలో గురు-శిష్య పరంపరకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూమతంలో గురువును గొప్పగా చూస్తారు. మోదీ గురువు ఎవరు? అద్వానీ. ఆయనను చెప్పుతో కొట్టి స్టేజీ నుంచి దింపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీకి టికెట్ నిరాకరించి.. ఆయన స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే. అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి మోదీ తప్పించారని, గురువుకు గౌరవం ఇవ్వకపోవడం హిందూ సంప్రదాయం కాదని రాహుల్ పేర్కొన్నారు. -
మోదీ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది
-
దేశరక్షణ కోసం బీజేపీని గెలిపించాలి
హైదరాబాద్ : దేశరక్షణ, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీని గెలిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ సికింద్రాబాద్‌లోని హర్యానాభవన్‌లో బీజేపీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో బాంబు పేలుళ్లతో దేశం అల్లకల్లోలమైందని, ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన కొద్ది రోజుల్లోనే దానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 17 దేశాల అధినేతలు మద్దతు ప్రకటించారని, పాకిస్తాన్‌ను ఏకాకిని చేశామని చెప్పారు. ఉగ్రవాదం కంటే నిరుద్యోగమే పెద్ద సమస్య అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ ఉగ్రవాదం లేకుంటేనే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించగలరని అన్నారు. ఉగ్రవాదం సమస్య కాకపోతే రాహుల్ ఎస్పీజీ రక్షణతో ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతివ్యక్తి అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల డబ్బు మొత్తం నేరుగా ఇప్పుడు లబ్ధిదారులకు చేరుతుండటం హర్షించదగ్గ విషయమన్నారు. కళ్లకు గంతలు తీసి చూడాలి... ఆయుష్మాన్భారత్ పథకం ద్వారా దేశంలోని 50 కోట్ల మంది ఏడాది రూ.5 లక్షల మేరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. యువత ఉపాధి కోసం రూ.800 కోట్ల ముద్ర రుణాలు అందించామని తెలిపారు. మోదీ ఏమి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, కళ్లకు గంతలు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నిద్రపోయే వారిని లేపవచ్చని, నిద్ర నటించేవారిని లేపడం కష్టమని విమర్శించారు. గతంలో బండారు దత్తాత్రేయను నాలుగుసార్లు ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలు ఈసారి కిషన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని, లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కావడంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సర్కారు చెప్పే మాటలు కాకుండా ఉగ్రవాది మసూద్ అజార్ చెప్పే మాటలనే కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లపాటు అసెంబ్లీలో ప్రజాగళం విప్పిన తనకు ఎంపీగా పార్లమెంటులో గళం విప్పే అవకాశం కల్పించాలని విన్నవించారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏమి లేదని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దూషించిన వ్యక్తికి సుష్మా సాయం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పరుష పదజాలంతో తనను దూషించిన వ్యక్తికి సాయం అందించేందుకు మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలత వ్యక్తం చేశారు. సకాలంలో పాస్‌పోర్టు అందక పోవడంతో తీవ్ర నిరాశకు లోనైన ఓ వ్యక్తి సుష్మా స్వరాజ్‌ను మీరు కాపలాదారు(చౌకీదార్) కాదంటూ దూషించారు. ఇందుకు స్పందించిన సుష్మా.. ‘మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. మా కార్యాలయం సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు పాస్‌పోర్టు అందేందుకు సాయపడతారు’ అంటూ బదులిచ్చారు. ‘సదరు వ్యక్తి మార్చి 13వ తేదీన అధికారులకు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో అడ్రస్ ధ్రువీకరణ సరిగా లేదు. 20న అడ్రస్ ధ్రువీకరిస్తూ మరో పత్రం జత చేశారు. దీనిపై అంధేరీ పోలీస్‌స్టేషన్ సిబ్బంది విచారణ జరిపారు. నివేదిక అందాల్సి ఉంది’ అంటూ వ్యక్తిగత కార్యదర్శి ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆ పోస్ట్‌కు జత చేశారు. -
ట్వీట్లు చేసేది నేనే, దెయ్యం కాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా ట్విటర్ ఖాతాలో నుంచి ట్వీట్లు చేసేది నేనేనని, దెయ్యం కాద’ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చమత్కరించారు. సమిత్ పాండే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ట్వీట్‌కు ఆమె ఈమేరకు బదులిచ్చారు. ‘సుష్మా స్వరాజ్ అకౌంట్‌ను ఆమె కాకుండా మరెవరో (పీఆర్) నిర్వహిస్తున్నార’ని సమిత్ పాండే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా ‘ట్విటర్లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు మాధానాలిచ్చేది నేనే, నా దెయ్యం కాద’ని సుష్మా తెలిపారు. గతవారం ట్విటర్లో మరోవ్యక్తి ‘మిమ్మల్ని మీరు ఎందుకు చౌకీదార్ (కాపలాదారు)గా పిలుచుకుంటార’న్న ప్రశ్నకు జవాబుగా.. ఎందుకంటే నేను భారత్‌లో, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలకు కాపలా కాస్తున్నానని సుష్మా దీటుగా సమాధానమిచ్చారు. -
జర్మనీలో భారతీయ జంటపై దాడి
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు. -
నెటిజన్ వ్యంగ్యం.. ‘చిన్నమ్మ’ కౌంటర్
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘మై భీ చౌకీదార్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు సహా అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు తమ ట్విటర్ ఖాతాల పేర్లకు ‘చౌకీదార్’పదాన్ని జతచేర్చారు. ‘నేను కాపాలాదారునే (మై భీ చౌకీదార్)’ అనే అర్థం ఉన్న ఈ పదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ చౌకీదార్ క్యాంపెయిన్‌పై నెటిజన్లు కూడా తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్.. ‘ మేడమ్ మీరు మా దేశ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి అని అనుకుంటున్నాను. బీజేపీలో మీరొక్కరే కాస్త మంచి మనసున్న వ్యక్తి. మిమ్మల్ని మీరు చౌకీదార్ అని ఎందుకు అనుకుంటున్నారు’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన సుష్మ.. ‘ అలా ఎందుకు చేశానంటే.. భారతీయుల, ప్రవాస భారతీయుల సమస్యలు తీర్చే కాపలాదారీ పని చేస్తున్నాను కదా. అందుకు మై భీ చౌకీదార్’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. Because I am doing Chowkidari of Indian interests and Indian nationals abroad. https://t.co/dCgiBPsagz — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019 -
జర్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి
మ్యూనిచ్ : జర్మనీలో భారతీయ దంపతులపై ఒక వలసదారుడు దాడికి తెగడ్డాడు. కత్తితో దాడి చేయడంతో భర్త ప్రశాంత్ ప్రాణాలు కోల్పోగా, భార్య స్మిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. జర్మనీలోని మ్యూనిచ్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని జర్మనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే వారి ఇద్దరి పిల్లల భద్రతపై అధికారులకు తగిన సూచనలు చేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి సుష్మా సంతాపం వెలిబుచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Indian couple Prashant and Smita Basarur were stabbed by an immigrant near Munich. Unfortunately, Prashant has expired. Smita is stable. We are facilitating the travel of Prashant's brother to Germany. My heartfelt condolences to the bereaved family. /1 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019 -
పాక్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంతో పాటు మత మార్పిడి చేయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించారు. భారత రాయబారిని నివేదిక కోరిన సుష్మ పాక్‌లో చోటుచేసుకున్న ఘటనపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఈ వ్యవహారంపై ఆదివారం ట్విట్టర్లో వాగ్యుద్ధమే జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. -
‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హోలీ సందర్భంగా ఇద్దరు భారత మైనర్ బాలికలను అపహరించి వారిని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారనే ఆరోపణలపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని పాకిస్తాన్లో భారత రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ పాక్‌లో భారత హైకమిషనర్‌కు దీనిపై వివరాలు పంపాలని కోరుతూ ట్వీట్ చేశారు. హోలీ వేడుకల నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మీడియా కధనాలు వెల్లడించాయి. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన చేపట్టిన హిందువులు నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డివమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల దుస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లో పోటీ చెయ్యని సీనియర్ నేతలు వీరే..
దేశమంతా ఎన్నికల రణరంగంలో హడావిడిగా ఉంటే తలపండిన కొందరూ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దశాబ్దాల కాలంపాటు జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పిన సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కీలకమైన పదవులు అధిరోహించిన వారుసైతం ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు. సుష్మా స్వరాజ్ ముక్కుసూటి తనానికి మారుపేరైన బీజేపీ సీనియర్ నాయకురాలు, ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గతేడాది ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవట్లేదని ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని ఆమె ప్రకటించానని స్పష్టం చేశారు. బీజేపీ తరఫున ప్రచారంలో మాత్రం పాల్గొంటానని చెప్పారు. 1970ల్లోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీలో అనేక కీలక పదవులను అధిరోహించిన సుష్మా.. రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుష్మా.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం బీజేపీ నాయకత్వానికి కొంచె లొటే. మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముకత వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిన పోటీ చేసేదిలేదని తేల్చిచెప్పారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాని హోదాలో ఉన్న అతి కొద్ది మంది ప్రధాన మంత్రుల్లో మన్మోహన్ ఒకరు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవి చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అనూహ్యంగా మన్మోహన్ తొలిసారిగా ప్రధాని పదవిని చేపట్టారు. అస్సోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు కీలకమైన ఈ ఎన్నికల్లో తెర వెనుక నుంచి ఆయన సేవలను ఉపయోగించుకోనుంది. శరద్ పవార్ కొత్త తరానికి అవకాశం ఇవ్వడానికి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇటీవల ప్రకటించారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన పవార్.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 11 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1978లో తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాదా నియోజక వర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనారోగ్యం కారణంగా, వయసుపైబడిన రిత్యా పోటీకి దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహన్ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హెచ్.డీ దేవెగౌడ దక్షిణ భారతదేశ రాజకీయాల్లో దేవెగౌడది చెరగడి ముద్ర. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న గౌడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన హసన్ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. జేడీఎస్‌కు గట్టిపట్టున్న మాండ్యాం నుంచి పోటీచేయలని ఆయన యోచించినా అక్కడ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ బరిలో నిలవడంతో పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన దేవెగౌడ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు 1996-97 వరకు దేశ 11వ భారత ప్రధానిగా ఈయన సేవలందించారు. కర్ణాటకలోని హోళెనరసిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి 1989వరకు ఆరు సార్లు అదే స్థానం నుంచి గెలుపొందారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షానికి సవాలుగా మారారు. 1994-96వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1996-97వరకు ప్రధానిగా పనిచేశారు. 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జైపాల్ రెడ్డి కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినా.. ఆయన పోటీకి ఆసక్తి చూపనట్లు తెలిసిందే. కేంద్ర మాజీమంత్రిగా, సీనియర్ నేతగా జాతీయ రాజకీయాలపై జైపాల్‌కు మంచి అవగహన ఉంది. ఎంపీగనే కాకుండా గతంలో నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ చట్టసభకు కూడా జైపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇక ఆయన పోటీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. ఉమాభారతి గ్వాలియర్ రాజమాత విజయ రాజే సింధియా ప్రోత్సాహంతో ఉమాభారతి బీజేపీకి అడుగు పెట్టారు. 1984లో తొలిసారిగా ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఎల్కే అడ్వాణీతో పాటు రామ్ జన్మభూమి పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో సంఘ్‌పరివార్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. అనంతరం 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతి బీజేపీ 173 సీట్లు సంపాదించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వంలో ఈమెకు జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని భారతి ఇటీవల వెల్లడించారు. రజినీ కాంత్.. తమిళనాట సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రజినీ కాంత్ ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు గత ఏడాదే ప్రకటించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యట్లేదని వెల్లడించారు. రాజకీయానుభవం లేకపోయినప్పటికీ తమిళ రాజకీయాలను శాసించే సత్తా, బలం, ఉన్న వ్యక్తిగా రజినీ గుర్తింపు పొందారు. ఈయన ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజినీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చిచెప్పారు. అయితే తమిళనాడుకు చెందిన మరోనటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కమల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రజనీ మద్దతును కోరే అవకాశం ఉంది. ఎల్కే అద్వానీ బీజేపీ కురవృద్ధుడు, సీనియర్ నేత ఎల్కే అద్వానీ పోటీపై సందిగ్థత కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలని ఎల్కే అడ్వాణీ (91)కి బీజేపీ సూచించింది. 75 ఏళ్లు దాటిన వారికి పదవి దక్కదని చెబుతూనే.. పోటీ చేయాలా వద్దా అనేది వారి ఇష్టమని బీజేపీ పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అద్వానీ పోటీచేయకపోతే గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పోటీ చేయించాలని కొందరు నేతలు భావిస్తున్నారు. అద్వానీతో పాటు మరో సీనియర్‌నేత మురళీ మనోహర్ జోషీ కూడా ఇక పోటీచేయ్యకపోవచ్చని సమాచారం. -
నాడు ఒంటరి.. నేడు ప్రపంచమద్దతు
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింప జేయడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమైందన్న ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ 2009లో యూపీఏ హయాంలో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టిన భారత్ ఏకాకిగా ఉందని, ఇదే అంశంపై తాజాగా భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 14 దేశాలు బాసటగా నిలిచాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ..‘ఉగ్రవాది మసూద్‌పై ఇప్పటికి నాలుగుసార్లు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌కు మద్దతు కరువైంది. తాజాగా, ఇదే విషయమై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానానికి భద్రతామండలిలోని 15 దేశాల్లో 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. భద్రతా మండలిలోని సభ్య దేశాలు కాని బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ మద్దతు తెలిపాయి’ అని సుష్మా అన్నారు. అజార్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఫ్రాన్సు నిర్ణయించింది. ‘కశ్మీర్లో ఫిబ్రవరిలో 40 మంది భారత్ జవాన్ల మృతికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఈ సంస్థను ఐక్యరాజ్యసమితి 2001లోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తాం’ అని ఫ్రాన్స్ తాజాగా ఓ ప్రకటన విడుదలచేసింది. -
‘అతన్ని అప్పగించి మీ మంచితనం చాటుకొండి’
న్యూఢిల్లీ : మేం ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్ మాత్రం ముష్కరుల తరఫున మా దేశంపై దాడి చేసింది. ఈ ఒక్క విషయం ద్వారా పాక్ వక్రబుద్ధి ప్రపంచానికి కూడా తెలిసిందంటూ భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుష్మాస్వరాజ్ ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ బాలాకోట్ మెరుపు దాడులు జరిపింది. కానీ పాక్ సైన్యం మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి ప్రయత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోంది. తీవ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే మేం పాక్‌తో చర్చలు జరుపుతాం. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అంటూ సుష్మాస్వరాజ్ పాక్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాక ‘పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారు. నిజంగా ఆయనకు అంత ఉదారతే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాల’ని సుష్మా డిమాండ్ చేశారు. అప్పుడే ఇమ్రాన్ ఖాన్ ఔదార్యం ఏపాటిదో ప్రపంచానికి తెలుస్తుందని సుష్మా ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఆమె స్పష్టం చేశారు. #WATCH EAM Sushma Swaraj in Delhi: We are ready to engage with Pakistan in atmosphere free from terror. Some people say Imran Khan is a statesman, if he is so generous then he should hand over JeM chief Masood Azhar to India. Let's see how generous he is. (13.03) pic.twitter.com/kgnDfv8gOY — ANI (@ANI) March 14, 2019 -
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది. చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు. చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు. ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. 31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
సాయం చేయండి ప్లీజ్ - సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి ట్విటర్లో బాధితుల పట్ల శరవేగంగా స్పందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఇథియోపియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆచూకీని కనుక్కోవడంలోనూ ఒక పక్క ఎంబసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ, పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ, మరో పక్క వారి బంధువులకు సమాచారం అందించడంలో మానవతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై ఆమె ట్వీట్ చేశారు. శిఖా గార్గ్ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్ అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు. I am trying to reach the family of Shikha Garg who has unfortunately died in the air crash. I have tried her husband's number many times. Please help me reach her family. — Sushma Swaraj (@SushmaSwaraj) March 11, 2019 -
నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్
సాక్షి వెబ్ ప్రత్యేకం : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో ప్రముఖంగా వినిపించే పేరు సుష్మాస్వరాజ్. పలు సందర్భాల్లో పార్టీ కీలక నేతగా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న సుష్మ రాజకీయాల్లోకి ప్రవేశానంతరం వెనుదిరిగి చూడలేదు. హరియాణా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కురాలిగా, ఢిల్లీకి బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా, అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరించిన తొలి మహిళగా, క్రియాశీలకమైన రాజకీయవేత్తగా తనదైన శైలిలో రాణించారు. సుష్మా స్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులను, ముఖ్యంగా ఎమర్జెన్సీ, పదమూడు రోజుల సంకీర్ణ ప్రభుత్వం లాంటి ఒడిదుడుకులను ఆమె చాలా దగ్గరినుంచి పరిశీలించారు. సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలుగా వన్నెకెక్కి తనదైన వాక్పటిమతో విపక్ష నేతలను సైతం ఆకట్టుకునే చాతుర్యం ఆమె సొంతం. అందుకే బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’, ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’. అవార్డులు ఆమెను వరించాయి. దీంతోపాటు విదేశాంగ మంత్రిగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ట్విటర్‌ద్వారా పలు సమస్యలను పరిష్కరిస్తూ స్మార్ట్ లీడర్‌గా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ట్విటర్ ద్వారా ఆమెకు లభించిన సానుభూతి, ఊరట ప్రస్తావించదగింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే స్మార్ట్‌గా సాయం అందించి అనేకమంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2015లో నేపాల్ భూకంపం సందర్భంగా సుష్మ స్పందించిన తీరు, అందించిన సేవలకు గాను స్పెయిన్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డును 'గ్రాండ్ క్రాస్‌ను ఇటీవల అందుకోవడం విశేషం. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బీజేపీ తరపున గట్టిగా వాదించి ‘తెలంగాణ చిన్నమ్మ’ గా పేరు గడించారు. రాజకీయ ప్రస్థానం 1977-82 హర్యానా శాసనసభ సభ్యురాలిగా క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంటు (రాజ్యసభ, లోక్‌సభ) సభ్యురాలిగా కాలిడి, 2014లో 16వ లోక్‌సభకు ఎంపికవరకూ ఆమె రాజకీయ పయనం అప్రతిహతమే. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని స్థానంలో ప్రతిపక్షనేతగా ఎంపికకావడం ఒక ఎత్తు అయితే..పలుమార్లు కేంద్రమంత్రిగా విజయవంతంగా సేవలందించడం మరో ఎత్తు. విప్లవాత్మక నిర్ణయాలు దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేశారు. వ్యక్తిగత వివరాలు సుష్మాస్వరాజ్ తండ్రి హర్దేవ్ శర్మ (ఆర్ఎస్ఎస్ సభ్యుడు), తల్లి లక్ష్మీదేవి. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలో సాగింది. మూడేళ్లు వరుసగా బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డులను సుష్మ గెల్చుకున్నారు. న్యాయవాది పట్టా పొందిన అనంతరం 1973లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితంలో అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా కీలక మార్పులకు నాంది పలికింది. 1975, జూలై 13న సహచర న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకుని సుష్మా స్వరాజ్గా మారడం అందులో ఒకటి. సుష్మ, స్వరాజ్ కౌశల్ దంపతులకు బన్సూరి కౌశల్ కుమార్తె ఉన్నారు. వివాదాలు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా పత్రాలు త్వరగా మంజూరయ్యేలా సిఫారసు చేశారన్న ఆరోపణలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. 2014లో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు ఆమె భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాంసూరి స్వరాజ్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించుకున్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై సుష్మ రాజీనామాను డిమాండ్ చేస్తూ 2015తలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోగ్యరీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ అనూహ్యంగా ప్రకటించారు. ఇష్టాలు సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు. సుష్మ స్వరాజ్‌కు జ్యోతిషశాస్త్రంపై ధృడమైన నమ్మకం. భోంచేసినా, దుస్తులు ధరించినా అన్నీ దీనికనుగుణంగానే చేస్తారట. - టి. సూర్యకుమారి -
ఉగ్రవాదంపైనే యుద్ధం
అబుధాబి: ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ.. దేశాలను అస్థిర పరుస్తోన్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని భారత్ స్పష్టం చేసింది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు 130 కోట్ల మంది భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 18 కోట్ల మంది ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలను ఇక్కడికి తీసుకొచ్చాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేందుకు మా దేశ ముస్లిం సోదరసోదరీమణులే నిదర్శనం. అయితే భారత్‌లోని కొంతమంది ముస్లింలు మాత్రమే విషపూరితమైన ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇస్లాం ధర్మం అంటే శాంతి సూచిక. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస లేదు. అలాగే ప్రతి మతంలో శాంతి, కరుణ, సోదరభావం ఉన్నాయి. భారతదేశం శాంతికి దారి చూపే మార్గంగా ఉంది. అన్ని మతాలకు భారత్ ఇల్లు లాంటిది. మా దేశంలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో భారత్ ఒకటి. అక్కడ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, రుచులు, భాషలను అవలంబిస్తూ తరతరాలుగా జీవిస్తున్నారు. ఎవరి నమ్మకాలను వాళ్లు పాటిస్తూ.. ఇతరులతో సోదరభావంతో మెలగుతున్నారు.’అని సుష్మా స్వరాజ్ అన్నారు. సమావేశానికి పాక్ డుమ్మా.. అయితే సుష్మా స్వరాజ్ రాకతో ఓఐసీ నిర్వహించిన ఈ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత విదేశాంగ మంత్రిని ఓఐసీ సదస్సుకు ఆహ్వానించవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోనందుకు గాను తాను ఈ సమావేశానికి హాజరుకానని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి శుక్రవారం ప్రకటించారు. 57 ముస్లిం దేశాలు హాజరయ్యే ఈ సమావేశానికి భారత్ తరఫున హాజరైన తొలి మంత్రి సుష్మా స్వరాజే కావడం గమనార్హం. గతంలో ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను 1969లో జరిగిన మొరాకో రాజధాని రబాట్‌లో ఓఐసీ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే ఆయన సమావేశం కోసం రబాట్ చేరుకున్న సమయంలో పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటినుంచి ఓఐసీ సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించడంలేదు. -
పాక్ తీరును ఎండగడుతూ..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరివెళ్లారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించడంతో పాటు, మౌలిక వసతులను సమకూర్చుతుందనే ఆరోపణలకు ఆమె మద్దతు కూడగట్టనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతిమిస్తోన్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓఐసీ విదేశాంగ మంత్రుల భేటీలో ముఖ్యఅతిధిగా పాల్గొననున్న సుష్మా స్వరాజ్ పనిలోపనిగా పాక్ దుర్నీతిని అరబ్ దేశాల్లో ఎండగట్టేందుకు ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ భూభాగంలో ఉగ్రవాదులను ఏరివేయాలని ఇప్పటికే పాకిస్తాన్‌ను అమెరికా, చైనా సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. మరోవైపు గురువారం మధ్యాహ్నం ప్రధాని నివాసంలో జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం సుష్మా స్వరాజ్ సౌదీ బయలుదేరివెళ్లారు. పలువురు ఉన్నతాధికారులు, సీనియర్ మంత్రులు సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి గురించి సమగ్రంగా సమీక్షించారు. కాగా అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశాల్లో సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
సుష్మా వస్తే మేం రాం : పాక్
ఇస్లామాబాద్ : అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ తెలిపారు. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. అయితే మంగళవారం నాటి భారత్ మెరుపు దాడులకు నిరసనగా ఖురేషీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఖురేషి మాట్లాడుతూ.. ‘యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడాను. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశానికి హాజరవుతుండడంపై అభ్యంతరాలను వారికి వివరించాను’ అని తెలిపారు. ఐఓసీలో దాదాపు 57 సభ్యదేశాలు ఉన్నాయి. అయితే గతంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని చర్చించడం పై భారత్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్‌కు సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. (ఓఐసీ సదస్సుకు భారత్) -
పాక్‌కు గట్టి షాక్.. చైనా, రష్యాల మద్దతు భారత్‌కే!
బీజింగ్ : పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిచ్చేందుకు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టే విషయంలో భారత్ విజయం సాధించింది. పుల్వామా ఉగ్రదాడి- సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్- పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకే మెరుపు దాడులు చేశామంటూ.. భారత్- చైనా -రష్యా విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఉగ్రవాదుల పట్ల పాక్ అనుసరిస్తున్న మెతక వైఖరి గురించి చైనా వేదికగా ఆమె అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పారు.(పాక్ కుటిలనీతిపై సుష్మా ఫైర్) ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడాల్సిందేనంటూ భారత్- రష్యా -చైనా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా, ఏ దేశాన్నైనా సహించబోమని మూడు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే పాకిస్తాన్‌పై గుర్రుగా ఉన్న అమెరికా... పాక్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యానికి ఇప్పుడు చైనా, రష్యా కూడా తోడవడంతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడంలో భారత్ పైచేయి సాధించింది. భారత్ ప్రతినిధిగా హాజరైన సుష్మా స్వరాజ్ తన కార్యాచరణను అమలు చేయడంలో సఫలీకృతమయ్యారంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
చైనా వేదికగా పాక్ కుటిలనీతిపై సుష్మా ఫైర్
బీజింగ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద మౌలిక వసుతలను ధ్వంసం చేసే లక్ష్యంతోనే సాగాయని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సైనిక స్ధావరాలు లక్ష్యంగా ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. భారత్‌లో జైషే మహ్మద్ మరో దాడికి సన్నద్ధమవుతున్నదన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి చోటుచేసుకోరాదన్నదే భాతర అభిమతమని, తాము బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. జైషే ఆగడాలపై సవివర ఆధారాలతో తాము పాకిస్తాన్‌కు నివేదించినా పాకిస్తాన్ ఉగ్ర దాడులపై తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజింగ్‌లో భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీలో ఆమె పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ సమాజం పిలుపు మేరకు కఠినంగా వ్యవహరించాల్సిన పాకిస్తాన్ దాడిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ నిరాకరించిందని, దాడికి పాల్పడినట్టు జైషే వెల్లడించడాన్నీ విస్మరించిందని సుష్మా ఆక్షేపించారు. -
మెరుపు దాడులపై స్పందించిన అమెరికా
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మరోసారి మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. భారత మెరుపుదాడుల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పాకిస్థాన్ సంయమనంతో వ్యవహరించాలని, తన భూభాగంలోని ఉగ్రవాద తండాలపై వెనువెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ఘాటుగా సూచించింది. భారత్ వైమానిక దళం జరిపిన దాడులు.. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగానే చూడాలని స్పష్టం చేసింది. ‘మెరుపుదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీతో మాట్లాడాను. ‘ప్రస్తుత ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసేలా సైనిక చర్యకు దిగరాదని, పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయనకు నొక్కి చెప్పాను’ అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కూడా మాట్లాడానని, తమ రక్షణపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ.. ఉపఖండంలో శాంతిభద్రతలను కాపాడాలన్న ఉమ్మడి లక్ష్యం గురించి తాము చర్చించామని ఆయన తెలిపారు. ఇరుదేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ మరింతగా ఉద్రిక్తతలు పెంచేవిధంగా వ్యవహరించవద్దని, సైనిక చర్యలకు పాల్పడకుండా చర్చలకు ముందుకురావాలని ఆయన సూచించారు. -
ముగిసిన అఖిలపక్ష సమావేశం
-
ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం
-
మెరుపు దాడులు.. క్లీన్ ఆపరేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. భారత వైమానిక సిబ్బంది జరిపిన దాడిని క్లీన్ ఆపరేషన్‌గా ప్రభుత్వం వర్ణించింది. నాన్ మిలటరీ అపరేషన్ జరిగినట్లు, జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా దాడిచేశామని ప్రభుత్వం ప్రకటించింది. వాయుసేన దాడుల గురించి అఖిలపక్షంలో పాల్గొన్న నేతలకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. భారత దాడులకు ఉగ్రవాదులు ప్రతిదాడికి ప్రయత్నిస్తే ఏవిధంగా స్పందించాలన్న దానిపై కూడా అఖిలపక్షం చర్చించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరిగింది. సుష్మాస్వరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, ఒమర్ అబ్దుల్లా, డీ రాజా, సీతారాం ఏచూరి, విజయ్ గోయల్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా దాడి గురించి ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించిన విషయం తెలిసిందే. -
ఓఐసీ సదస్సుకు భారత్
న్యూఢిల్లీ: ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్‌ను యూఏఈ ఆహ్వానించింది. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. భారత్‌లో నివసిస్తున్న సుమారు 18 కోట్ల మంది ముస్లింలు, దేశ బహుళత్వం, వైవిధ్య పరిరక్షణలో వారి పాత్రను గుర్తిస్తూ ఓఐసీ ఈ ఆహ్వానం పంపింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ను ఏకాకిని చేయాలని భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కశ్మీర్ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్ వైపే మాట్లాడుతోంది. ఐఓసీలో సభ్యురాలిగా చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను పాక్ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఐఓసీ భారత్‌ను ఆహ్వానించడం చరిత్రాత్మకమని మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ అన్నారు. సంబరపడొద్దు: కాంగ్రెస్ ఓఐసీ ఆహ్వానాన్ని మన్నించి భారత్ సంబరపడటం సరికాదని కాంగ్రెస్ సూచించింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇదొక విఫల ప్రయత్నమని పేర్కొంది. భారత్‌ను పూర్తిస్థాయి సభ్యురాలిగా చేర్చుకునేంత వరకు ఓఐసీ సమావేశాలకు హాజరుకావొద్దని గతంలో నిర్దేశించుకున్న వైఖరిని ప్రభుత్వం కొనసాగించాలని కోరింది. -
‘అద్భుతం.. నమ్మలేకపోతున్నా’
న్యూఢిల్లీ : తన నృత్య ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకున్నారు బీజేపీ ఎంపీ హేమ మాలిని.. మంగళవారం ‘ప్రవాసి భారతీయ దివాస్’ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశిలో హేమ మాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో హేమ మాలిని గంగ పాత్రలో నటించారు. కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులు సమక్షంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. దీనిలో హేమ మాలిని గంగా నది ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ప్రస్తుతం అది ఎలా కలుషితమవుతుందో వివరిస్తూ చేసిన నృత్యం అందరిని ఎంతో ఆకట్టుకుంది. హేమ మాలిని నృత్యానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయ్యారు. ప్రదర్శన ముగిసిన వెంటనే సుష్మా వేదిక మీదకు వెళ్లి హేమ మాలినిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ ‘నీ నృత్య ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. నా జీవితంలో తొలిసారి టీవీ కార్యక్రమాల్లో వాడే మూడు పదాలను వాడుతున్నాను. ‘అద్భుతం, నమ్మలేకపోతున్నా, ఊహాతీతం’’ అంటూ కొనియాడారు. ఈ నాటకం కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా దుస్తులను డిజైన్ చేశారు. #WATCH Veteran actor & BJP MP Hema Malini performing at the 'Pravasi Bharatiya Diwas' in Varanasi. (22.01.2019) pic.twitter.com/akP9fVwHKv — ANI UP (@ANINewsUP) January 23, 2019 -
అవినీతిని 85 శాతం తగ్గించాం
వారణాసి: దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అవినీతి నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు శూన్యమని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో 85 పైసలు అక్రమార్కుల చేతుల్లోకే వెళ్తోందని ఆ పార్టీకి చెందిన ప్రధాన మంత్రే (రాజీవ్ గాంధీ) గతంలో స్వయంగా వ్యాఖ్యానించారనీ, అయినా ఆ అవినీతిని అరికట్టే దిశగా కాంగ్రెస్ ప్రయత్నించిన దాఖలాలు లేవని మోదీ ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో 85 శాతం అవినీతికి అడ్డుకట్ట వేసిందనీ, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.5.8 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిందన్నారు. తాను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో 15వ ప్రవాస భారతీయుల దినోత్సవాలను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఎన్ఆర్ఐలే విదేశాల్లో భారత్‌కు ప్రచారకర్తలనీ, దేశ సామర్థ్యాలకు వారే ప్రతీకలని మోదీ ప్రశంసించారు. మోదీ మార్పు తీసుకొస్తున్నారు భారత్ మారజాలదన్న భావనను తమ ప్రభుత్వం తొలగించిందనీ, తాము మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగన్నాథ్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, సహాయ మంత్రి వీకే సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్, హరియాణ, ఉత్తరాఖండ్‌ల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రవీంద్ జగన్నాథ్ మాట్లాడుతూ నైపుణ్య భారతం, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి తదితర పథకాలతో మోదీ భారత్‌లో మార్పు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మోదీ, శుద్ధ ఇంధనాన్ని వాడేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడంలో ముందున్నారని పేర్కొన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వచ్ఛత స్వాతంత్య్రానికి ముందు ప్రజల్లో ఉన్న బాధ్యతా చైతన్యం ప్రస్తుతం హక్కులపై చైతన్యంగా మారిందని మోదీ అన్నారు. మహాత్మా గాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వచ్ఛతను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రజలు, సామాజిక, రాజకీయ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన 150 కిలోమీటర్ల పాదయాత్ర సానోసరా అనే గ్రామంలో మంగళవారం ముగిసింది. పాదయాత్ర చేసి అక్కడకు చేరిన ప్రజలను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘క్లీన్ గంగ’కు నిధులు ప్రధాని మోదీకి వచ్చిన 1,900కు పైగా వస్తువులను వేలం వేసి, తద్వారా సమకూరే నిధులను గంగా నదిని శుభ్రం చేసే పనులకు ఉపయోగించనున్నారు. వేలానికి వచ్చే వస్తువుల్లో వివిధ చిత్రపటాలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, జాకెట్లు, సంప్రదాయిక సంగీత వాద్య పరికరాలు తదితరాలు ఉండనున్నాయి. వీటిని ఈనెల 27, 28 తేదీల్లో వేలం వేస్తారంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రవాస తీర్థ దర్శన పథకం ప్రారంభం విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించా రు. ప్రవాస తీర్థ దర్శన పథకంలో భాగంగా ఏడాదికి రెండుసార్లు ప్రభుత్వ ఖర్చుతో భారత సంతతి వ్యక్తులను తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. ఇప్పటికే తొలి విడతగా 40 మందిని ఈ పథకం లబ్ధి దారులుగా ఎంపిక చేశారు. ప్రవాస భారతీయ దినోత్సవాలు ముగిసిన అనంతరం ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న ప్రవాస భారతీయులు ఈ పథకానికి అర్హులు. -
సాయికృష్ణకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ప్రభుత్వం సహకరించాలని కోరారు. సాయికృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికా వెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని, అయితే పలు శస్త్ర చికిత్సలు అవసరమని అక్కడ ఉన్న సాయికృష్ణ మిత్రులు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్‌కు తెలిపారు. సాయికృష్ణకు అవసరమైన తక్షణ వైద్య సహాయంపై అమెరికాలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని, అవసరమైతే మరింత సహకారం కోసం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడతామని వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనికోసం మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ నేరుగా సుష్మాస్వరాజ్‌ని కలిసినట్లు కేటీఆర్ తెలిపారు. సాయికృష్ణకు ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా వెద్య సహాయం అందుతోందని, అయితే బీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థికంగా సాయం అవసరమవుతుందని వారు కేటీఆర్‌ను కోరారు. ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హెడ్డాతోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. రవా ణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
గల్ఫ్‌లో మృత్యుఘోష!
జగిత్యాల రూరల్: ఉన్న ఊరులో ఉపాధి దొరకక.. ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. కొంత మంది ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమవారి ఆచూకీ లభ్యం కాక వేలాది మంది కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్, మస్కట్, బెహరాన్, దోహఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చెందిన సుమారు 1,523 మంది మృత్యువాత పడటం చూస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 1,450 మంది గల్లంతు రాష్ట్రం ఏర్పడిన నుంచి గల్ఫ్ దేశాల్లో సుమారు 1,450 మంది వరకు గల్లంతయ్యారు. ఇంత వరకు తమతో సత్సంబంధాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడున్న వారితో పాటు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆచూకీ లభ్యం కావడం లేదు. కాగా, అనారోగ్యంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో మరణించిన సుమారు 453 మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా పోయింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినా సరైన ఆధారాలు లేవని అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో అనాథ శవాలుగా మిగిలిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువు మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందక ఆ కుటుంబాలు ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నాయి. 2009లో అప్పటి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేవారు. ప్రస్తుతం ఆ సహాయం కూడా అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థిక సహాయం అందక అల్లాడిపోతున్నాయి. దీంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారికి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులు ఐదేళ్లలో సుమారు 5,435 మంది అక్కడి చట్టాలు తెలియక చేసిన నేరాలకు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ సామాజిక సర్వే అంచనా వేసింది. వీళ్లలో కొంత మంది తెలిసీ తెలియక, మరికొంత మంది క్షణికావేశంలో తప్పులు చేసినవారున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడితే గానీ వీరు స్వరాష్ట్రం రావడం కష్టంగా మారింది. కొంత మందికి అక్కడ న్యాయశాఖ సలహాలు దొరకక చిన్నపాటి నేరాలకు కూడా ఏళ్ల పాటు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇక్కడి కుటుంబీకులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే గానీ వారి ఇంటికి చేరుకోవడం కష్టతరంగా ఉంది. నా భర్తను విడిపించండి రాయికల్ (జగిత్యాల): ‘నా భర్త సౌదీ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని విడిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’.. అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మర్‌పల్లికి చెందిన రాజేశ్వరి వేడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకటి ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సరైన జీతం ఇవ్వకపోవడంతో కల్లివెల్లి అయ్యాడు. ఏడు నెలల నుంచి వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి రావాలంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. వెంకట్ అక్కడ పోలీసులను ఆశ్రయించగా ఆయనకు మూడు నెలల శిక్షను విధించారు. నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తాను జైల్లో తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు వివరించారు. తన భర్తను సౌదీ జైలు నుంచి విడిపించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను రాజేశ్వరి వేడుకుంటోంది. 25 ఏళ్లుగా ఆచూకీ లేదు నా భర్త ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి 2,3 సార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. 25 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. దుబాయ్‌లో ఉన్న మా గ్రామస్తులు కూడా ఆచూకీ కన్పించడం లేదని చెబుతున్నారు. పాతికేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్నాం. – రాగుల ప్రమీల, పొరండ్ల, జగిత్యాల మండలం పదేళ్లుగా ఎదురుచూపులు నా భర్త 20 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో నా భర్త మృతి చెందాడని కంపెనీ వారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని గుర్తుపట్టలేదు. స్వగ్రామానికి పంపించలేదు. – నాదర్బేగం, మోర్తాడ్ ఆర్థిక సహాయం కరువు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా చాలా కంపెనీలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ మృతులకు ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే గానీ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం కష్టతరంగా మారింది. – షేక్ చాంద్ పాషా, గల్ఫ్ సామాజిక సేవకుడు, జగిత్యాల -
జిన్నా హౌస్‌పై సిగపట్లు!
భారత్–పాక్‌ల మధ్య కొనసాగుతున్న వివాదాల్లోకి తాజాగా జిన్నా హౌస్ వచ్చి చేరింది. ముంబైలోని జిన్నా హౌస్ తమదంటే తమదంటూ భారత్, పాకిస్తాన్‌లు వాదిస్తున్నాయి. ఆ హౌస్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని, ఉన్నత స్థాయి అధికార సమావేశాలకు, విందులకు అనువుగా తీర్చిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం తాజా వివాదానికి తెర తీసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ మాదిరిగా జిన్నా హౌస్‌ను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధాకు ఈ నెల 5న రాసిన లేఖలో సుష్మా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధీనంలో ఉంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు దాన్ని విదేశాంగ శాఖకు బదలాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సుష్మా పేర్కొన్నారు. జిన్నా హౌస్ తమ సొంతమని భారత్ స్పష్టంగా చెబుతుంటే.. అది తమదని, దాన్ని సొంతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని పాక్ అంటోంది. గతంలో కూడా జిన్నాహౌస్ తమకివ్వాలని, అందులో పాక్ దౌత్య కార్యాలయం పెడతామని పాక్ చెబుతోంది. అయితే జిన్నా హౌస్ భారత ఆస్తి అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ స్పష్టం చేశారు. పాక్‌కు దీనిపై ఎలాంటి హక్కు లేదని, ఒకవేళ హక్కు కోసం ప్రయత్నిస్తే తామూ పోరాడుతామని పేర్కొన్నారు. మరోవైపు జిన్నా హౌస్‌పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ అన్నారు. పాక్ కర్తార్‌పూర్‌ను ఇస్తుందా..? జిన్నాహౌస్‌ను ఇస్తే కర్తార్‌పూర్‌ను భారత్‌కు ఇస్తారా అన్న ప్రశ్నకు ఫైజల్ బదులిస్తూ అలా ఎప్పటికీ జరగదన్నారు. సిక్కుల కోరిక మేరకు కర్తార్‌పూర్‌కు వీసా లేకుండా వెళ్లివచ్చే అవకాశం కల్పించామని, ఈ నిర్ణయంలో భారత్‌కు కూడా భాగముందని వివరించారు. జిన్నాహౌస్పై తనకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ జిన్నా కుమార్తె దినా వాడియా 2007 ఆగస్టులో ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. జిన్నా ఏకైక వారసురాలిని తానే కాబట్టి తనకు ఆ ఇల్లు అప్పగించాలని కోరారు. ఆమె మరణించడంతో ఆమె కుమారుడు నస్లీవాడియా ఈ కేసును నడిపిస్తున్నారు. ఐరోపా శిల్పశైలికి ప్రతీక పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 1936లో జిన్నా హౌస్‌ను నిర్మించుకున్నారు. ముంబై మలబార్ హిల్‌లో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవంతికి ప్రముఖ ఐరోపా ఆర్కిటెక్చర్ క్లాడ్ బాట్లే ఐరోపా శిల్పశైలిలో అద్భుతంగా రూపకల్పన చేశారు. దేశ విభజన జరిగి పాకిస్తాన్ (కరాచి)వెళ్లే వరకు జిన్నా ఈ ఇంట్లోనే ఉన్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చయింది. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ భవంతి నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయిని వాడారు. 1944 సెప్టెంబర్‌లో దేశ విభజనపై గాంధీ, జిన్నాల మధ్య చర్చలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1946 ఆగస్టు 15న నెహ్రూ, జిన్నాలు ఇక్కడే చర్చలు జరిపారు. -
‘తప్పు నాదే... ఎవరినీ నిందించొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాఘా- అట్టారీ సరిహద్దు గుండా భారత్ చేరిన హమీద్ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. అనంతరం తాను విడుదలయ్యేందుకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘ సుష్మాజీ నన్ను తన కొడుకులా భావించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నిజంగా ఆమె భరతమాత కంటే తక్కువేమీ కాదు. యువతను సన్మార్గంలో నడిపించే మాతృమూర్తి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తప్పు నాదే... ‘ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా వాళ్ల మధ్య.. స్వదేశంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. పాక్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత గొప్ప స్వాగతం లభిస్తుందనుకోలేదు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా బాధను ప్రపంచానికి పరిచయం చేసిన మీడియాకు రుణపడి ఉంటాను. అయితే ఈ విషయంలో తప్పంతా నాదే. నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నా ఉద్దేశం సరైందే. కానీ దానిని అమలు చేసిన విధానంలోనే పొరపాటు జరిగింది. అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది’ అని హమీద్ వ్యాఖ్యానించాడు. కాగా ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించిన పాక్ నిఘా సంస్థలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ క్రమంలో ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు పాక్ మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. కానీ అతడికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా వ్యక్తిని జైళ్లో ఎందుకు ఉంచారని, అతడిని వెంటనే స్వదేశానికి పంపాలని ఆదేశించింది. -
అంతా మేడమ్ దయ వల్లే..!
న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. భారత్ చెరుకున్న హమీద్ అనంతరం తన తల్లిదండ్రులతో పాటు వెళ్లి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు హామీద్. అనంతరం ‘‘మేరా భారత్ మహాన్’, ‘మేరా మేడమ్ మహాన్’. ఇదంతా మేడం వల్లే సాధ్యమయ్యిందం’టూ కన్నీళ్లతో హమీద్ తల్లి ఫౌజియా సుష్మా స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించి పాక్ నిఘా సంస్థలు అరెస్ట్ చేశాయి. 2015లో పాక్ మిలటరీ కోర్టు అన్సారీపై కేసు విచారణ చేపట్టింది. ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. హమీద్‌కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా అన్సారీని జైళ్లో ఎందుకుంచారని పాక్ అడిషనల్ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. స్వదేశానికి పంపాలని ఆదేశించింది. దీంతో హమీద్‌ను మంగళవారం మార్దాన్ జైలు నుంచి విడుదల చేశారు. -
న్యాయం జరిగేలా కృషి చేస్తాం: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: అరేబియన్ మహా సముద్రంలో పాకిస్తాన్ భద్రతా దళాల(కోస్టు గార్డుల)కు చిక్కి కరాచీ జైలులో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల విడుదలకు కృషిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. సోమవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార కార్మిక సంఘం నేత మూగి గురుమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలు విజయసాయిరెడ్డిని కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు. అరెస్టయిన 22 మంద్రి ఆంధ్ర మత్య్సకారులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారంరోజులు గడుస్తున్నా కేంద్ర విదేశాంగ శాఖలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం స్పందించి బందీలైన మత్య్సకారుల విడుదలకు కృషిచేయాలని కోరారు. త్వరలోనే బందీలైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. -
బీజేపీ ‘స్టార్ వార్!’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొంత మంది కీలక నేతలను ఆ పార్టీ రంగంలోకి దించనుంది. ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్ బహిరంగ సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 9 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా హైదరాబాద్‌లోనే మకాం వేసి, పార్టీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడంతోపాటు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంతోష్ గంగ్వార్, పార్టీ సీనియర్ నేతలు మురళీధర్‌రావు, రాంమాధవ్, పురంధేశ్వరి, స్వామి పరిపూర్ణానంద వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ మేడ్చ ల్ అభ్యర్థి మోహన్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. పరిపూర్ణానంద ఇప్పటికే పదుల సంఖ్యలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఐదో తేదీ వరకు కీలకసభలు ఈ నెల ఒకటి(శనివారం) నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే బహిరంగ సభలు తమకు ఎంతో కీలకమైనవని బీజేపీ పేర్కొంటోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో పరిణామాలు మారుతాయని, బీజేపీకి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 2 న అమిత్‌షా నారాయణ్‌పేట్, కల్వకుర్తి (ఆమనగల్), కామారెడ్డి బహిరంగసభలు, ఉప్పల్, మల్కాజిగిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2న భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో, 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 4న కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, రవిశంకర్ ప్రసాద్‌ల సభలు నిర్వహించనున్నారు. శనివారం(నేడు) ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ భద్రాచలం, ఎల్లారెడ్డి, ఖైరతాబాద్ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. -
ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ పెడతాం!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఇందులో భాగంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. (ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్) ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లులో పొందపరచాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను ఇప్పటికే రద్దు చేశామని గుర్తు చేశారు. -
సార్క్ సదస్సుకు భారత్ వెళ్లదు: సుష్మ
హైదరాబాద్: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను విరమించేంత వరకు ఆ దేశంతో చర్చలు ఉండవని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సదస్సుకు భారత్ హాజరు కాబోవడం లేదని ఆమె చెప్పారు. సార్క్ సదస్సు కోసం పాక్‌కు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపుతామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం సుష్మ మాట్లాడుతూ ‘ఆ ఆహ్వానం అందింది. కానీ మేం సానుకూలంగా స్పందించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పాక్ విడిచిపెట్టకుంటే ఆ దేశంతో చర్చలు ఉండవని నేను గతంలోనే చెప్పాను. సార్క్ సదస్సుకు కూడా భారత్ హాజరవ్వదు’ అని చెప్పారు. -
‘తెలంగాణ స్వప్నం సాకారం కాలేదు’
సాక్షి, మేడ్చల్ జిల్లా: అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ స్వప్నం సాకారం కాలేదని, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతోనే ఇది సాధ్యమవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో జరిగిన బీజేపీ మహిళా శంఖారావం ఎన్నికల సభలో ఆమె పాల్గొన్నారు. సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అధికారాన్ని అనుభవిస్తున్నారని తీవ్రంగా ద్వజమెత్తారు. తానే కాకుండా, తన కొడుకు, అల్లుడిని మంత్రులుగా, కూతురును ఎంపీగా, మరొకరిని రాజ్యసభ సభ్యుడిగా చేసి, తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయలేకపోయిందని, ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు తనను కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో బీజేపీ ప్రధాన భూమిక పోషించిందన్నారు. తెలంగాణ కోసం ఎవరూ చనిపోవద్దని భరోసా ఇవ్వడంతోపాటు పార్లమెంట్ బయట, లోపల తాను చేసిన పోరా టాన్ని గుర్తు చేశారు. ఈ సభలో మేడ్చల్ బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మజ్లీస్ భాషలానే.. కేసీఆర్ భాష ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలంగాణలో పర్యటిస్తున్న సుష్మా స్వరాజ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మజ్లీస్.. నేడు టీఆర్ఎస్తో కలిసిందని విమర్శించారు. దేశ ప్రధానిపై కేసీఆర్ వాడే భాష ఎలాంటిందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. మజ్లీస్ భాష ఎలా ఉందో కేసీఆర్ భాష అలానే ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ ఎక్కడ లండన్ అయిందో.. ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. ఇంకా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలిపింది. ఉద్యమం జరుగుతున్న సమయంలో అనేక మంది ఆహుతి అయ్యారు. తెలంగాణలో బలిదానాలు ఆపటానికి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ చూడటానికి బతకాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశాను. అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు వారి సంఖ్యను తక్కువ చేసి చూపడం బాధకరం. తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు మాత్రమే పాల్గొన్నారా?. ఉద్యమం కోసం త్యాగాలు చేసిన వారికి ఏమి దక్కలేదు. యువతకు ఉద్యోగాలు రాలేదు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయ’ని తెలిపారు. -
మహిళా ఓటర్లే లక్ష్యంగా..
సాక్షి,మేడ్చల్ జిల్లా: మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు మహిళా నాయకురాళ్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడంతోపాటు మేడ్చల్‌లో సోనియా గాంధీతో భారీ ఎన్నికల బహిరంగసభ నిర్వహించింది. గ్రేటర్లో సగ భాగంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ బుధవారం కీసర మండల కేంద్రంలోని కేబీఆర్ కన్వెన్షన్‌లో మహిళా కార్యకర్తలు, నాయకురాళ్లతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. మేడ్చల్ అభ్యర్థి కొంపెల్లి(పెద్ది) మోహన్‌రెడ్డి గెలుపు కోసం నిర్వహిస్తున్న ఈ సభకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగనున్న ఈ సభలో మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని 10 మున్సిపాలిటీలు ,61 గ్రామాలకు చెందిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు,స్వయం సహాయక సంఘాల సభ్యులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు బీజేపీ స్థానిక నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ,జిల్లా నాయకులు పాల్గొనున్నారు. బీఎస్పీ అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్ కూడా మేడ్చల్ నియోజకవర్గంలో రెండు ,మూడు రోజుల్లో పార్టీ అధినేత్రి మాయవతితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సునాయిక
సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక.. సునాయిక..సుష్మాస్వరాజ్. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రశంస. ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్. ఓ రోజున సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘మేడమ్ ప్లీజ్ హెల్ప్’ అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్ అనే వ్యక్తి చేసిన ట్వీట్. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు ప్రన్షు సింఘాల్. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్ చేసింది అగర్త. మరికొన్నాళ్లకు.. దేవ్ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్ ట్వీట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్ మహిళ తన సోదరి సబినె హార్మెస్ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్ జాలీ గ్రాంట్ హాస్పిటల్’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా 2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్ సైన్స్ నేర్పించింది. హరియాణా అమ్మాయి సుష్మాస్వరాజ్ పూర్వికులు లాహోర్ (పాకిస్థాన్)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది. సుష్మ... స్వరాజ్ 1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే ఫెర్నాండెజ్ టీమ్‌లో చేరి, పరిచయం అయిన న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు సుష్మాస్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది. భారతీయత– విదేశీయత సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్ సుష్మ పొలిటికల్ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది. నిత్య విద్యార్థి సుష్మా స్వరాజ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్... స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ. ప్రధాని అవుతారా?! సుష్మా స్వరాజ్ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. తొలి మహిళ రికార్డులు ► ఢిల్లీ ముఖ్యమంత్రి ► భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి ► అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ► హరియాణా క్యాబినెట్ మంత్రి ► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు బర్ఖాదత్, సీనియర్ జర్నలిస్టు కూతురు బాన్సూరి కౌశల్‌తో సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ.. భర్త స్వరాజ్ కౌశల్‌తో (పెళ్లి ఫొటో) సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్ పోటీ) – వాకా మంజులారెడ్డి -
‘పాక్ ఆహ్వానానికి ధన్యవాదాలు.. కానీ..’
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ భూభాగంలో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన ఆహ్వానంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం శనివారం సుష్మా స్వరాజ్‌ని ఆహ్వానించింది. దీనిపై సుష్మా ట్విటర్లో స్పందిస్తూ.. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు తనను ఆహ్వానించినందుకు ఆ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషికి ధన్యవాదాలు తెలిపారు. కానీ, నిర్ణయించిన షెడ్యూల్ రోజున ఆ కార్యాక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. భారత్ తరఫున కేంద్ర మంత్రులు హర్ సిమ్రత్ కౌర్, హర్దీప్ సింగ్ పూరీలు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ప్రకటించారు. పాక్ ప్రభుత్వం కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం వేగంగా చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వీలైనంత తొందరగా భారతీయులు గురుద్వార్ కర్తార్‌పూర్ సాహిబ్‌లో ప్రార్థనలు చేసేందుకు ఈ కారిడార్‌ను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికుల సౌకర్యం కోసం గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా పాక్ కూడా సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. కాగా, భారత భూభాగంలో జరిగే రహదారి నిర్మాణానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. -
మోదీకి సుష్మా ప్రత్యామ్నాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. యూరప్ లేదా అమెరికా పార్లమెంటేరియన్లు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారు రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నారని అర్థం. కానీ భారత్‌లో అలా కాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే అందులో ఓ పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు లెక్క. 2019లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన సుష్మా, తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. అంటే రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లో కొనసాగుతారని అర్థం. పార్టీ కోరితే మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. అంటే ఏమిటీ? అలర్జీ కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదంటూ ఆమె చెప్పడం సహేతుకంగా కనిపించడం లేదు. 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి కారణంగా అలర్జీ వచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం ఉండదు. అలర్జీ కారణమే నిజమనుకుంటే ఆమె ఢిల్లీలోనే ప్రకటించి ఉండాల్సింది! మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి అక్కడ ప్రకటించడం ఏమిటీ? డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి గనుక అప్పటి వరకు ఆగనూ వచ్చు, అలా ఎందుకు చేయలేదు? ఈ ప్రకటన వెనక కచ్చితమైన టైమింగ్ ఉందని ఆమె భర్త స్వరాజ్ కౌశల్ ట్వీట్ చేయడంలో అర్థం ఏమిటీ? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్రకటిత నియమం ప్రకారం 75 ఏళ్ల వరకు మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ప్రస్తుతం సుష్మకు 66 సంవత్సరాలే. ఇంకా ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంది. ఆమె నరేంద్ర మోదీ కేబినెట్లో పేరుకే విదేశాంగ మంత్రన్న విషయం తెల్సిందే. ప్రతి విదేశీ పర్యటనకు మోదీనే వెళుతున్నారు. కనీసం ఆమె వెంట కూడా తీసుకుపోవడం లేదు. ఈ విషయంలో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి సురక్షితంగా రప్పించడం కోసం ఆమె కృషి చేయడం ద్వారా ఆమె వార్తల్లో ఉంటున్నారు తప్ప, విదేశాల్లో పర్యటించడమో, విదేశాంగ విధానాల గురించి మాట్లాడడం ద్వారా ఉండడం లేదన్నది సుస్పష్టమే. మొదటి నుంచి ఆమెది బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ శిబిరమన్నది రాజకీయ వర్గాలకు తెల్సిందే. అందుకని మోదీ ఆమెను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారా? అదే నిజమనుకుంటే వచ్చే ఎన్నికల అనంతరం వేటు తప్పదని భావిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీల సరసన ఆమె కూడా చేరిపోతారు. అది ఊహించే ఆమె కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో వ్యూహ, ప్రతివ్యూహాలు మారవచ్చని, అప్పుడు వాటికి అనుగుణంగా పావులు కదపచ్చనే ఉద్దేశంతో అనుమానం రాకుండా ఎన్నికల ఫలితాలను ముందుగానే ఈ ప్రకటన చేశారా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభావం తగ్గి ఎన్డీయే పక్షాల బలం పెరిగినట్లయితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకురాలిగా ముందుకు రావాలన్నది ఆమె వ్యూహమా? మోదీ ఏకఛత్రాధిపత్యం పట్ల పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. అలాంటి పరిస్థితుల్లో తెరమాటుకు వెళ్లిపోయిన అద్వానీ మళ్లీ తెర ముందుకు వస్తే.....? ప్రస్తుతానికి సమాధానాలకన్నా ప్రశ్నలపరంపరే ఎక్కువ! -
2019 ఎన్నికల్లో పోటీకి సుష్మా స్వరాజ్ దూరం
భోపాల్ : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. 66 సంవత్సరాల వయసున్న సుష్మా స్వరాజ్ ఆరోగ్య కారణాలతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా సుష్మా స్వరాజ్‌కు రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఎంజే అక్బర్ మమల్ని లైంగికంగా వేధించాడు!!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రముఖుల గుట్టును మహిళా జర్నలిస్ట్‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. హాలీవుడ్లో సెగలు పుట్టించిన ఈ మీటూ ఉద్యమం, నేడు మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ ఉద్యమ తాకిడి కేంద్ర ప్రభుత్వాన్ని తాకింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్‌పై మహిళా జర్నలిస్ట్‌లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. హోటల్ రూమ్‌ల్లో ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో, పని గురించే చర్చించే సమయంలో మహిళా జర్నలిస్ట్‌లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు తెలిసింది. ప్రియ రమణి అనే జర్నలిస్ట్ తొలుత అక్బర్ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ అనంతరం పలువురు మహిళా జర్నలిస్ట్‌లు కూడా అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ప్రియ రమణి గతేడాదే ఓ మ్యాగజైన్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ సమయంలో పేరును బహిర్గతం చేయలేదు. తాజాగా అక్బరే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ధృవీకరిస్తూ... ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్బర్ అసభ్యకరంగా ఫోన్ కాల్స్‌చేయడంలోనూ, టెక్ట్స్‌లు పంపించడంలోనూ, అసౌకర్యమైన పొగడ్తలు కురిపించడంలో నిపుణుడని రమణి గతేడాదే తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు, దక్షిణ ముంబై హోటల్‌కు తనను జాబ్ ఇంటర్వ్యూకి పిలిచి ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాడో తెలిపారు. అయితే ఆ సమయంలో పేరును వెల్లడించలేదు. తనను మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి చేయడంతోపాటు దగ్గరగా కూర్చోవాలని చెప్పారని ఆమె ఆరోపించారు. ఎలాగో అలా ఆ రాత్రి అక్బర్ నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ప్రియ రమణి ట్వీట్ తర్వాత పలువురు జర్నలిస్టులు కూడా అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. తనతో 17 ఏళ్ల కిందట అక్బర్ ఇలాగే ప్రవర్తించారని, అయితే తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ప్రేరణ సింగ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు. అక్బర్ ప్రస్తుతం నైజిరియాలో ఉండటంతో, ఆయన ఈ ఆరోపణలపై స్పందించలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అక్బర్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. ఆమె ఏమీ పట్టనట్లు వెళ్లిపోవడం గమనార్హం. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు.. ఇవి లైంగిక ఆరోపణలు. మీరు ఆయన శాఖకు ఇన్చార్జ్గా ఉన్నారు. ఈ ఆరోపణలపై విచారణ ఉంటుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. సుష్మా మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్, ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా వ్యహరించారు. -
భారత్, రష్యా భాయి–భాయి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వార్షిక ద్వైపాక్షిక భేటీలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలకగా మోదీ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పుతిన్ విమానాశ్రయంలో దిగిన అనంతరం మోదీ ఇంగ్లిష్, రష్యా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘భారత్‌కు స్వాగతం పుతిన్. భారత్–రష్యాల స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే మన చర్చల కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఏకాంతంగా విందు ఆరగిస్తూ ద్వైపాక్షిక సహకారం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని ఓ అధికారి చెప్పారు. 19వ భారత్–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగనుంది. రక్షణ రంగంలో సహకారం, ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థపై ఒప్పందం, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చించే అవకాశం ఉంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసే ఒప్పందం శుక్రవారం దాదాపుగా ఖరారవనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రష్యా నుంచి ఎవరూ ఆయుధాలు కొనకూడదంటూ ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. అవసరమైనప్పుడు ప్రతేకంగా ఏదైనా దేశం కోసం ఈ ఆంక్షలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కు అధికారం ఉంది. ఆంక్షలున్నా సరే రష్యా నుంచి క్షిపణుల కొనుగోలుకే భారత్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష, వాణి జ్య, ఇంధన, పర్యాటక తదిరత రంగాల్లో ఒప్పందాలు కూడా భారత్–రష్యామధ్య కుదిరే అవకాశం ఉంది. -
ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది: పాక్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పాక్ విమర్శించింది. ఐక్యరాజ్య సమితిలో సుష్మాస్వరాజ్ ప్రసంగానికి పాక్ ప్రతినిధి సాద్ వారైచ్ సమాధానమిస్తూ.. భారత్‌లో ‘ఫాసిస్టు’ ఆరెస్సెస్ కారణంగా మతసామరస్యం దెబ్బతింటోందని.. కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తోందని విమర్శించారు. ‘మా (ఆసియా) ప్రాంతంలో నియంతృత్వ ఆర్ఎస్ఎస్ కేంద్రాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారు. భారత్ నుంచి వచ్చే వారు ఇతరులకు సూక్తులు చేప్పాల్సిన పనిలేదు’అని వారైచ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో మైనారిటీల ఓట్లను తొలగించారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఓ ముఖ్యనేత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామన్నారని విమర్శించారు. -
ఐరాస వేదికపై ఎన్నికల ప్రచారమా..
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సాధారణ సమితిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పెదవివిరిచారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచేలా ఆమె ప్రసంగం నిర్మాణాత్మకంగా సాగలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను ఆకర్షించేలా కేవలం పాకిస్తాన్ అంశంపైనే సుష్మా ప్రసంగం మొక్కుబడిగా ఉందని ఆరోపించారు. ఐరాస సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను 73వ ఐరాస సాధారణ సమితి సమావేశంలో ఆమె సోదాహరణంగా వివరించారు. కాగా ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆసియా ఉపఖండంలో ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్ చేసిందేమీ లేదని సుష్మా సమర్ధంగా చాటిచెప్పారని జైట్లీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పాకిస్ధాన్ ద్వంద్వ వైఖరిని ఆమె సమర్ధంగా ఎండగట్టారన్నారు. -
ఉగ్రవాదులను కీర్తించేవాళ్లతో చర్చలా?
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదులను కీర్తిస్తూ, ముంబై దాడుల సూత్రధారి స్వేచ్ఛగా సంచరించేందుకు అనుమతిస్తున్న దేశంతో చర్చలు ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించింది. ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానంగా కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదని అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లం చేసింది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో శనివారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తూ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత జవాన్లను చంపడం, ఫలితంగా భారత్–పాక్ విదేశాంగ మంత్రుల భేటీ రద్దయిన నేపథ్యంలో ఊహించినట్లుగానే సుష్మ పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా లేవనెత్తారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్ ఎంతో ప్రయత్నించినా, ఆ దేశం ప్రవర్తన వల్లే ఈ విషయంలో ముందడుగు పడలేదని స్పష్టంచేశారు. ఇంకా సుష్మ తన ప్రసంగంలో...ప్రపంచానికి పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన తదితరాలను ప్రస్తావించారు. చర్చలన్నారు.. అంతలోనే రక్తపాతం సృష్టించారు: ‘చర్చల ప్రక్రియకు భారత్ అడ్డంకులు సృష్టిస్తోందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. అత్యంత సంక్లిష్ట సమస్యలను చర్చలు మాత్రమే పరిష్కరిస్తాయని విశ్వసిస్తున్నాం. పాకిస్తాన్‌తో చర్చలు చాలాసార్లు మొదలయ్యాయి. అవి అర్ధంతరంగా నిలిచిపోయాయంటే దానికి వాళ్ల ప్రవర్తనే ఏకైక కారణం’ అని సుష్మ ఆరోపించారు. పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్ భారత ప్రధాని మోదీకి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘చర్చల కోసం పాకిస్తాన్ ప్రధాని చేసిన ప్రతిపాదనను భారత్ అంగీకరించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో ఉగ్రవాదులు ముగ్గురు భారత జవాన్లను చంపిన వార్త వెలువడింది. పాకిస్తాన్‌కు చర్చల పట్ల ఉన్న ఆసక్తి ఏంటో దీంతో తెలిసిపోతోంది’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పదవిలోకి వచ్చిన తొలిరోజు నుంచే పాకిస్తాన్‌తో చర్చల కోసం ప్రయత్నించారని, కానీ పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు పఠాన్‌కోట్ దాడికి పాల్పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని గుర్తు చేశారు. ‘ఉగ్రవాదుల రక్తపాతం నడుమ చర్చలు ఎలా కొనసాగుతాయి చెప్పండి?’ అని ప్రశ్నించారు. 9/11 దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టినా, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంకా పాకిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు మోపడం పాకిస్తాన్‌కు బాగా అలవాటైందని ఆరోపించారు. అందుకే కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని తరచూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను వేగంగా, మరి కొన్నింటిని నెమ్మదిగా తరుముతోందని, కానీ ప్రతిచోటా ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు. సంస్కరణలు తప్పనిసరి ప్రాథమిక సంస్కరణలు లోపించినట్లయితే ఐక్యరాజ్య సమితి బలహీననపడుతుందని, ఫలితంగా ప్రపంచంలో బహుళత్వం అనే భావన అర్థరహితమవుతుందని సుష్మా స్వరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణలు బలవంతంగా ఉండొద్దని, సమకాలీన అవసరాలకు అనుగుణంగా సమూల ప్రక్షాళన జరగాలని పిలుపునిచ్చారు. పర్యావరణ మార్పుల వల్ల అధికంగా నష్టపోతున్నది పేద, వర్ధమాన దేశాలే అని, ధనిక దేశాలు వాటిని సాంకేతిక, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని కోరారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ 17 లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
భారత్ అంటే నాకెంతో ఇష్టం: ట్రంప్
ఐరాస: భారత్ అంటే నాకెంతో ఇష్టం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారాల కోసం సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సదస్సు నిర్వహించారు. ట్రంప్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. సదస్సు తర్వాత ఐరాసలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ సుష్మాను ఆలింగనం చేసుకుని అక్కడే ఉన్న ట్రంప్‌కు పరిచయంచేశారు. వెంటనే సుష్మాతో ట్రంప్ ‘భారత్ అంటే నాకెంతో ఇష్టం. మా అభిమానాన్ని నా ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి తెలియజేయండి’ అంటూ కాసేపు ముచ్చటించారు. -
‘ఎన్నారై ప్రయోజనాలను దెబ్బ తీయొద్దు’
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాల విషయంలో ఇటీవల ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరి తెలిసిందే. దీంతో అమెరికా వెళ్తున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న 2 ప్లస్ 2 చర్చల్లో హెచ్-1బీ వీసాల విషయంలో ఎదురవుతున్న సమస్యలను భారత్, అమెరికా ప్రభుత్వం ముందు ఉంచింది. హెచ్-1బీ వీసాల విషయంలో ఎన్నారైల ప్రయోజనాలను దెబ్బ తీయొద్దని అమెరికా ప్రభుత్వాన్ని, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. అమెరికా, భారత్‌ల మధ్య బలమైన సంబంధాలున్నాయని, హెచ్-1బీ వీసాల్లో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో భారతీయులు నష్టపోతున్నట్టు పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాల దృష్ట్యా హెచ్-1బీ విషయంలో సున్నితంగా, సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. విదేశాంగ, రక్షణ శాఖలతో హాట్‌లైన్ ఏర్పాటుకు తాము సిద్ధమని చెప్పారు. తొలిసారి జరుగుతున్న 2 ప్లస్ 2 చర్చల్లో సుష్మా స్వరాజ్‌తో పాటు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైఖేల్ పాంపీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహం నేపథ్యంలో, తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ఏమీ చేయదని భారతీయులు భావిస్తూ ఉంటారని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఇదే విశ్వాసాన్ని ప్రజలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మైఖేల్ పాంపీని కోరినట్టు సుష్మా స్వరాజ్ తెలిపారు. ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకునేందుకు అమెరికాలోని టెక్ కంపెనీలకు హెచ్-1బీ వీసా ఎంతో కీలకం. టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతేడాది వేలకొద్దీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కానీ ఐటీ కంపెనీలకు ఝలకిస్తూ.. హెచ్-1బీ సిస్టమ్‌లో ట్రంప్ ప్రభుత్వం పలు మార్పులను తీసుకొస్తోంది. -
వియత్నాంలో పర్యటిస్తున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్
-
కష్టం వస్తే.. ఒక్క ట్వీట్‌తో ఆదుకుంటున్నాం
హనోయ్: ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులకు ఇబ్బందులు ఎదురైతే ఒక్క ట్వీట్‌తో సాయం చేస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం వియాత్నం చేరుకున్న ఆమె మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు కష్టాల్లో చిక్కుకుంటే ఒకే ఒక ట్వీట్‌తో సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.. రాయబార కార్యలయాలు ప్రాధాన్యత కాదని ప్రవాసుల క్షేమమే ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులున్నారని తెలిపారు. ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ, విదేశాంగ శాఖపై విశ్వాసం పెరిగిందన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుష్మా స్వరాజ్ ట్విటర్ వేదికగా అనేకమంది సమస్యలను పరిష్కరించారు. ఇటీవల ఓ ప్రవాస భారతీయుడు పాస్ పోర్టు పోగొట్టుకున్నానని ట్విటర్లో సుష్మా దృష్టికి తేగా ఆమె స్పందించారు. ‘సుష్మా స్వరాజ్ జీ.. వాషింగ్టన్లో నా పాస్‌పోర్ట్‌ను పొగొట్టుకున్నాను. నా పెళ్లి ఆగస్టు రెండో వారంలో ఉంది. ఆగస్టు 10న ఇండియాకు వద్దామని జర్నీ ప్లాన్ చేసుకున్నాను. దయచేసి నా తత్కాల్ విజ్ఞప్తిని పరిశీలించి నా పెళ్లి సమయానికి ఇంటికి చేరుకునేలా సాయం చేయండి. ఈ సమయంలో మీ మీదే నా నమ్మకం’ అని ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్‌పై ఆమె స్పందిస్తూ. ‘రవితేజ ఇలాంటి సమయంలో నువ్వు పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం దురదృష్టకరం. నువ్వు పెళ్లి సమాయానికి ఇంటికి చేరుకునేలా సాయం చేస్తాం. నవతేజ్ మానవతా దృక్పథంతో అతడికి సాయం చేయండి’ అంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారుల్ని ఆదేశించారు. ట్విటర్లో అధిక సంఖ్యలోఉన్న మహిళా పొలిటిషన్ కూడా సుష్మానే కావడం విశేషం. -
నెటిజన్ ప్రశ్న.. చిన్నమ్మ చమత్కారం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వటమే కాదు, అవసరమైన మేర సాయం చేస్తుంటారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. అందుకే ఆమె ట్విటర్ ఖాతాకు ట్వీట్లు వెల్లువలా వచ్చి పడతాయి. ఈ క్రమంలో గత రాత్రి ఓ వ్యక్తి ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆమె ఫన్నీ బదులు ఇచ్చారు. ‘బాలీకి వెళ్లటం సురక్షితమేనా. ఆగష్టు 11 నుంచి 17 మధ్య మేం అక్కడ పర్యటించాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? దయచేసి మాకు సలహా ఇవ్వండి’ అని రాయ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి చిన్నమ్మ సమాధానమిస్తూ... ‘అక్కడి అగ్నిపర్వతాన్ని సంప్రదించి మీకు చెబుతాను’ అంటూ ఫన్నీ సమాధానం ఇచ్చారు. ఆమె టైమింగ్‌కు పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, ఇండోనేషియా బాలీ ద్వీపంలోని ‘అగుంగ్ అగ్నిపర్వతం’ గత కొన్నిరోజులుగా క్రియాశీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు మూసేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వెలువడటం తగ్గినప్పటికీ.. స్వల్ప భూకంపాలు మాత్రం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సుష్మాజీని ఆరా తీశాడన్న మాట. I will have to consult the volcano there. https://t.co/bv2atzWtZg — Sushma Swaraj (@SushmaSwaraj) 8 August 2018 -
15 రోజుల్లో పెళ్లి.. పాస్‌పోర్టు పోయింది!
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా సాయం కోరితే ఆమె వెంటనే స్పందిస్తారు. తాజాగా రవితేజ అనే వ్యక్తికి కూడా ఆమె సాయం చేశారు. ‘వాషింగ్టన్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నాను... వచ్చే నెల(ఆగస్టు) 13- 15 మధ్య నా వివాహ తేదీని ఖరారు చేశారు. అందువల్ల ఆగస్టు 10న బయల్దేరాలి కాబట్టి తత్కాల్లో పాస్‌పోర్టు జారీ చేయాలని’ అతడు ట్విటర్ వేదికగా సుష్మాను సాయం కోరాడు. రవితేజ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారు. ‘రవితేజ.. మీరు చాలా రాంగ్ టైమ్‌లో పాస్‌పోర్డు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ మీ పెళ్లి సమయానికి మండపానికి చేరేలా మేము సాయం చేస్తామని’ ట్వీట్ చేసిన సుష్మా.. మానవతా దృక్పథంతో అతడికి సాయం అందించాలంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు. ఆమె ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు మాత్రం.. ‘మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు హ్యాట్సాప్ మేడమ్.. మీరు మా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం’ అంటూ ప్రశసంలు కురిపిస్తున్నారు. Devatha Ravi Teja - You have lost your Passport at a very wrong time. However, we will help you reach for your wedding in time. Navtej - Let us help him on humanitarian grounds. @IndianEmbassyUS https://t.co/wxaydeqCOX — Sushma Swaraj (@SushmaSwaraj) 30 July 2018 -
ఆన్లైన్లోనే ఎన్ఆర్ఐ భర్తలకు నోటీసులు
న్యూఢిల్లీ: భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్ఆర్ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. పోర్టల్ ఏర్పాటుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. పోర్టల్‌లో పొందుపరచిన వారెంట్లను నిందితుడికి జారీచేసినట్లుగానే భావించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్‌పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు. -
శరత్ కుటుంబానికి మంత్రులు, నేతల భరోసా
హైదరాబాద్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు, నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం అమీర్‌పేట జాగృతి ఎన్‌క్లేవ్‌లోని శరత్ నివాసానికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, బండారు దత్తాత్రేయ.. శోకసంద్రంలో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతిలను ఓదార్చారు. శరత్ మృతికి సంతాపం ప్రకటించి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శరత్ మరణం బాధాకరం: కేటీఆర్ దుండగుడి కాల్పుల్లో శరత్ దుర్మరణం చెందడం బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేశారని.. కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఘటనపై అమెరికా దౌత్య కార్యాలయ రీజినల్ పాస్‌పోర్టు అధికారితోపాటు షికాగో కాన్సులేట్ అధికారులతో ఫోన్లో మాట్లాడామన్నారు. భారత దౌత్య అధికారుల వివరాల ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితుడు ఎవరన్నది తెలియరాలేదన్నారు. హత్యకు గల కారణాలు తెలియడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. అమెరికాలో శని, ఆదివారాలు సెలవు అయినందున భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు 4, 5 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ‘కుటుంబ సభ్యులు, బంధువులు అమెరికా వెళ్లాలనుకుంటే ప్రభుత్వపరంగా అత్యవసర వీసాలు, ప్రయాణ ఖర్చులు, ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. వారు ఆలోచించుకుని చెబుతామన్నారు’అని కేటీఆర్ తెలిపారు. కాన్సస్‌లో చాలామంది తెలుగువారున్నారని.. అక్కడి వారితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారని చెప్పారు. మరోవైపు శరత్ కొప్పు మృతిపై అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో శరత్ తల్లిదండ్రులు: కడియం దుండగుడిని పట్టుకోడానికి అమెరికా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి కడియం చెప్పారు. దుండగుడిని గుర్తించిన వారికి నగదు పారితోషికం కూడా ప్రకటించారన్నారు. తీవ్ర దుఃఖంలో ఏం మాట్లాడలేని పరిస్థితిలో శరత్ తల్లిదండ్రులు ఉన్నారని, తల్లి మాలతి మంచినీరు కూడా తీసుకోవడం లేదన్నారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వైద్యులను సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి త్వరగా మృతదేహన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. శరత్ మృతదేహాన్ని రీజినల్ హబ్ సర్చ్ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిల్లు చెల్లింపులో గొడవ! ఎంఎస్ చేస్తూనే అక్కడి ఓ రెస్టారెంట్లో శరత్ పని చేస్తున్నట్లు తెలిసింది. దుండగుడు కాల్పులు జరిపింది కూడా ఆ రెస్టారెంట్లోనేనని శరత్ సోదరికి అతని స్నేహితులు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. బిల్లు చెల్లించే విషయంలో దుండగుడికి శరత్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని, పారిపోయేందుకు శరత్ ప్రయత్నించినా అప్పటికే 5 బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు తెలిసింది. గొడవకు గల కారణాలు తెలుసుకోడానికి విచారణ చేస్తున్నామని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అక్కడి పోలీసులు తెలిపినట్లు సమాచారం. అన్ని విధాలా సాయం చేస్తాం: సుష్మ శరత్ మృతిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వివరాలను పోలీసుల ద్వారా> తెలుసుకుంటున్నామని, విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని ట్వీట్ చేశారు. శరత్ తండ్రితో మట్లాడానని, కుటుంబ సభ్యులు కాన్సస్ వెళ్లాలనుకుంటే వీసా ఏర్పాటు చేస్తామన్నామని పేర్కొన్నారు. భౌతిక కాయాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
నెటిజన్‌కు సుష్మా స్వరాజ్ ఝలక్!
న్యూఢిల్లీ : భిన్న మతాలకు చెందిన ఒక జంటకు పాస్‌పోర్ట్ జారీ కావడానికి సహకరిస్తూ.. ఆ జంటను వేధించిన అధికారిని బదిలీ చేసేలా ఆదేశాలిచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం సుష్మాకు మద్దతుగా నిలిచి, అలా వ్యక్తిగత దూషణలు చేయడం తప్పు అని నెటిజన్లకు సూచించారు. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో.. ఓ నెటిజన్ మంచి రోజులు అంటే ఇవేనా.. అయితే మీరు నన్ను బ్లాక్ చేయండి అని ట్వీట్ చేయగా.. సరే అంటూ మంత్రి సుష్మాస్వరాజ్ తగిన రీతిలో స్పందించారు. సోనమ్ మహాజన్ అనే నెటిజన్.. ‘ఆమె(సుష్మా) మంచి పాలన అందించడానికి వచ్చారు. మీకు మంచి రోజులు వచ్చేశాయి. సుష్మాజీ ఒకప్పుడు నేను మీకు వీరాభిమానిని. మీపై దూషణకు, అసభ్య పదజలానికి దిగిన వాళ్లతో పోరాడాను. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నన్ను మీరు బ్లాక్ చేయండి. రుణం తీర్చుకోండి. ఇందులో ఎదురచూడడానికి ఏం లేదంటూ’ ట్వీట్ చేశారు. సోనమ్ ట్వీట్‌కు తగిన రీతిలో సుష్మా స్పందించారు. ‘ఎదురుచూడటం ఎందుకు? ఇదుగో నిన్ను బ్లాక్ చేసేస్తున్నా’ అంటూ సుష్మా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. Intezaar kyon ? Lijiye block kr diya. https://t.co/DyFy3BSZsM — Sushma Swaraj (@SushmaSwaraj) 3 July 2018 Yeh good governance dene aaye the. Yeh lo bhai, achhe din aa gaye hain. @SushmaSwaraj ji, I was once a fan and fought against those who abused you, ab aap please, mujhe bhi block kar ke, inaam dijiye. Intezaar rahegaa. https://t.co/a2AlYczY5j — Sonam Mahajan (@AsYouNotWish) 2 July 2018 కాగా, లక్నోకు చెందిన మహ్మద్ అనాస్ సిద్ధిఖీ, తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా అధికారి వికాస్ మిశ్రా అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేయగా.. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుష్మా తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు.. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా అంటూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. -
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/చాగల్లు/కాకినాడ: ఆధ్యాత్మిక యాత్రల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కైలాస మానస సరోవరం, అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ కురుస్తున్న మంచు తుపాన్ వల్ల చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న 1,500 మందికి పైగా ఉన్న భారతీయ యాత్రికుల్లో ఎనిమిది మంది మృతిచెందగా.. 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమైన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రముఖ ఇంజినీర్, ఆర్కిటెక్చర్, బిల్డర్ గ్రంధి వీవీఎస్ఎల్ఎన్ సుబ్బారావు (58) టిబెట్ సరిహద్దులో గుండెపోటుతో మృతి చెందినట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేరళకు చెందిన నారాయణం లీలా(56) మృతి చెందినట్టు ఎంబసీ పేర్కొంది. మరోవైపు అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72), అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురానికి చెందిన మరో వ్యక్తి మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కాగా, అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రైల్‌పత్రి, బ్రారిమార్గ్ మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు.. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ఏర్పాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న మంచు తుపాను వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్ర ముందుకు సాగలేదు. బేస్‌క్యాంపుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా(సిమిల్‌కోట్525, హిల్సా550, టిబెట్ 500) యాత్రికులు ఉన్నారు. వీరిలో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన సుమారు 100 మంది, తెలంగాణకు చెందిన 110మంది తెలుగువారు ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి వాతావరణం అనుకూలించడంతో వీరందరినీ సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌కు తరలించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్ ఆర్మీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సిమిల్‌కోట్ నుంచి నేపాల్గంజ్కు 7 ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఏఆర్సీ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు నేపాల్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హిల్సా నుంచి సమికోట్కు అక్కడి నుంచి నేపాల్గంజ్కు తరలించి యాత్రికులను లక్నో చేరుస్తున్నారు. యాత్రికుల తరలింపునకు చర్యలు మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ట్వీటర్లో పేర్కొన్నారు. హాట్‌లైన్ ఏర్పాటు చేసి తెలుగు, మళయాళం, తమిళ్, కన్నడ భాషల్లో యాత్రికుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు వారికోసం 977–9808082292 హాట్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర యాత్రికులు క్షేమం సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 27 నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల యాత్రకు ఆటంకం కలిగింది. కొందరు యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ యాత్రికులకు సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. యాత్రలో ఉన్న కరీంనగర్ వాసి గౌరెశెట్టి మునిందర్తో అధికారులు మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర యాత్రికుల కు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం సిమఖోట్ లో సురక్షితంగా ఉన్నట్లు మునిందర్ చెప్పారు. సిమఖోట్ నుంచి గమ్యస్థానానికి చేర్చేందుకు అక్క డి యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. మూడ్రోజుల్లో రాష్ట్ర యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశముందని తెలిసింది. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి సాక్షి, అమరావతి: మానస సరోవర్ యాత్రకు వెళ్లి హిల్సా శిబిరంలో చిక్కుకుపోయిన తెలుగువారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యాత్రికుల భద్రతపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులను క్షేమంగా తెచ్చే చర్యలను వేగవంతం చేయడంతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్య సేవలు కూడా అందించాలని వైఎస్ జగన్ కోరారు. -
స్త్రీలోక సంచారం
::: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌లో న్యాయం ఉందా అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోలింగ్‌కు 57 శాతం మంది ఆమెను సమర్థిస్తూ, 43 శాతం మంది ఆమెపై వస్తున్న ట్రోలింగ్‌ని సమర్థిస్తూ కామెంట్లు పెట్టారు. మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని చెత్త ప్రశ్నలతో అవమానించారన్న ఆరోపణపై లక్నోలోని పాస్‌పోర్ట్ సేవాకేంద్రం అధికారి వికాశ్ మిశ్రాను అక్కడి నుంచి బదలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ‘అల్పసంఖ్యాకులను బుజ్జగించడం మానకుంటే మీకు తగినశాస్తి జరిగి తీరుతుంది’ అంటూ సుష్మపై మొదలైన ట్రోలింగ్ నేటికీ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా, ‘నీ భార్యను కొట్టి చెప్పు. ముస్లింలను మంచి చేసుకోవడానికి హిందువులను చెడు చేసుకోవద్దని’ అంటూ సుష్మ భర్త స్వరాజ్ కౌషల్‌కు కూడా ట్రోలింగ్లు వస్తున్నాయి ::: చిలక కోసం ఆన్లైన్లో 71 వేల రూపాయలు చెల్లించి, ఆ చిలక ఎంతకూ డెలివరీ కాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీజా (32) అనే పక్షి ప్రేమికురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో ఉంటున్న శ్రీజ.. ‘కొనేందుకు మంచి చిలక ఎక్కడ దొరుకుతుందీ’ అంటూ ఆన్లైన్లో ఆరా తీస్తున్నప్పుడు వాట్సాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న బాబీ అనే వ్యక్తి, తనొక చిలకల వ్యాపారినని, తన అకౌంట్లో డబ్బులు జమ చేస్తే చిలక డెలివరీ అవుతుందని నమ్మించి మోసం చేయడంతో.. అతడు తన ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుకున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు ::: ‘నేను అయ్యంగార్ల అమ్మాయిని’ అని 2014లో శృతీహాసన్ స్పష్టం చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో.. ఆమె తండ్రి, సినీ నటుడు, ‘మక్కల్ నీది మయం’ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కమలహాసన్పై సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ట్విట్టర్లో కమలహాసన్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘‘నా ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు దరఖాస్తు ఫారంలో ‘క్యాస్ట్ అండ్ రిలిజయన్’ కాలమ్‌ని నింపేందుకు తిరస్కరించానని’’ చెప్పడంతో వెంటనే ఆయన ప్రత్యర్థులు శృతీ వీడియోను తవ్వి తీసి ‘దీని సంగతేమిటి?’ అని ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు ::: జమ్ము–కాశ్మీర్లో రాళ్లు రువ్వే నిరసనకారులలో ఇప్పుడు కొత్తగా యువతులు కూడా కనిపిస్తుండడంతో వారిని నిరోధించేందుకు సెంట్రల్ రిజర్వు›్డ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) 500 మంది మహిళా కమెండోలను రంగంలో దించింది. పంప్ యాక్షన్ గన్స్, షాట్ గన్స్, పెలెట్స్ గన్స్ పేల్చడంలో సుశిక్షితులై, స్థానికంగా హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో దారితెన్నులపై అవగాహన ఉన్న ఈ కమెండోలు సమర్థంగా అల్లర్లను అడ్డుకోగలరని విశ్వసిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్. గతంలో నక్సల్స్‌ను నిలువరించేందుకు కూడా కొంతమంది మహిళా కమెండోలను అడవుల్లోని యుద్ధక్షేత్రానికి పంపింది. స్త్రీ మనస్ఫూర్తిగా సమ్మతించనిదే ఆమెతో సంగమించడం కూడా అత్యాచారమే అవుతుందనే చట్ట సవరణ ఒకటి ఒకటి ఈ ఆదివారం నుంచి స్వీడన్లో అమలులోకి వచ్చింది. భయపెట్టి, బలప్రయోగం చేసి, హింసించి స్త్రీని లోబరుచుకున్నప్పుడు మాత్రమే అది ‘అత్యాచారం’ అవుతుందని ఇప్పటి వరకు స్వీడన్ చట్టంలో ఉన్నదానికి భిన్నంగా, ఇలాంటివేమీ జరగకున్నా.. స్త్రీని నిస్సహాయ స్థితిలోకి నెట్టి, ‘వద్దు’ అనడానికి వీల్లేని పరిస్థితులు కల్పించి ఆమెను పొందడం కూడా ‘రేప్’ కిందికే వస్తుందని పేర్కొంటూ.. చూపులు, మాటలు, మరే విధమైన సంకేతాలు ఇవ్వకుండానే మగవాడు స్త్రీ ని శారీరకంగా ఆక్రమించడాన్ని ఇక మీదట నేరంగా పరిగణించడం జరుగుతుందని కొత్త చట్ట సవరణ స్పష్టం చేసింది ::: విక్టోరియా బర్జెస్ అనే ఫ్లారిడా మహిళ క్యూబా నుంచి ఫ్లారిడా వరకు స్టాండప్ పెడల్బోర్డు మీద 160 కి.మీ. ప్రయాణించి ఇలాంటి ఒక సాహసోపేతమైన పర్యటన చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అట్లాంటిక్ జలసంధిపై ఏకబిగిన 28 గంటలపాటు విక్టోరియా ఎంతో ధైర్యంగా, ఒడుపుగా పెడలింగ్ చేశారు :: పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్.. గెడ్డంతో ఉన్న ఒక ఇస్లాం మత పెద్ద ఫొటోను మార్ఫింగ్ చేసి ఫొటోషాప్‌లో ఆయన ముఖం స్థానంలో తన ముఖాన్ని పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనానికి కారణం అయ్యారు. ఈ చర్యతో ఒకవైపు ఆమెపై విమర్శలు కురుస్తుండగానే, ఏ మత పెద్ద ఫొటోనైతే రెహమ్ తనకు తెలియకుండా మార్ఫింగ్‌కి వాడుకున్నారో ఆ జింబాబ్వే మతపెద్ద ట్విటర్లో స్పందిస్తూ అది తన ఫొటో అని చెప్పగానే, ‘మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇది కేవలం సరదాగా, నన్ను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (భర్త ఇమ్రాన్ ఖాన్ పార్టీ) కార్యకర్తలపై సంధించిన విమర్శనాస్త్రం మాత్రమే అని ఆమె సమాధానం ఇచ్చారు ::: యు.కె.లోని ఒక ఇండియన్ రెస్టారెంట్లో భారతీయుల ఉద్దేశించి ఒక బ్రిటిష్ మహిళా పోలీసు అధికారి చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించిన ఇంగ్లండ్ పోలీస్ శాఖ ఆమెను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని నార్తంబ్రియా పోలీస్ శాఖలో పని చేస్తున్న కటీ బ్యారెట్ అనే 22 ఏళ్ల ఆ కుర్ర ఆఫీసరమ్మ న్యూక్యాజిల్ ప్రాంతంలోని ‘స్పైస్ ఆఫ్ పంజాబ్’ అనే ఆ ఫుడ్ ఔట్‌లెట్‌కు తినడానికి వచ్చి, నోరు ఊరుకోక అక్కడ పనిచేస్తున్న భారతీయ వెయిటర్లను ఉద్దేశించి తన సహోద్యోగులతో జాత్యహంకార వ్యాఖ్యల్ని చేసినట్లు, వేరెవరో కస్టమర్ల ద్వారా తెలుసుకున్న బ్రిటన్ పోలీసులు కటీని విధుల నుంచి తొలగించారు ::: -
సుష్మాకు రాజ్‌నాథ్ మద్దతు
న్యూఢిల్లీ : ఓ హిందూ–ముస్లిం జంట పట్ల సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోషల్ మీడియా వేదికగా కొందరు గత వారం రోజులుగా నానా దుర్భాషలాడుతున్న విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాగానీ, ఆ పార్టీలో ఏ ఒక్కరైనాగానీ, ఆఖరికి సుష్మా స్వరాజ్ సహచర మహిళా మంత్రులుగానీ ఆమెకు మద్దుతు తెలపలేదు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆమెకు ఫోన్ చేసి సానుభూతి తెలిపినట్లు మీడియాకు తెలిపారు. సోమవారం ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్స్ వచ్చిన వెంటనే ఫోన్ చేశానని, ఈ ఘటనపై కూడా ఆరా తీసినట్లు చెప్పారు. అయితే ఆమెకు సోషల్ మీడియా వేదికగానే మద్దతు తెలుపవచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజ్‌నాథ్ సింగ్ దాట వేశారు. ఓ హిందూ-ముస్లిం జంటకు పాస్‌పోర్ట్ వివాదంలో లక్నో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అధికారి వికాశ్ మిశ్రాను సుష్మా గోరఖ్పైర్కు బదిలీ చేశారు. దీంతో కొందరు సోషల్ మీడియాలో సుష్మ లక్ష్యంగా అసభ్యకరంగా దూషణలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో ఆమె ఆదివారం ట్విటర్లో నిర్వహించిన పోల్‌కు అనూహ్య మద్దతు లభించింది. ‘ట్విటర్లో నన్ను లక్ష్యంగా చేసుకుని ఇలా దూషించడాన్ని మీరు సమర్థిస్తారా?’ అన్న సుష్మ ప్రశ్నకు 57 శాతం మంది సమర్థించబోమని తేల్చిచెప్పారు. 43 శాతం మంది మాత్రం దూషించినవారికి మద్దతు ప్రకటించారు. ఈ సర్వేలో మొత్తం 1.2 లక్షల మంది పాల్గొన్నారు. అయితే ఏ విషయంలోనైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీజేపీ శ్రేణులు తమ పార్టీ మహిళా మంత్రి పట్ల ఇంత ట్రోల్ జరుగుతున్న స్పందించకపోవడం గమనార్హం. -
సుష్మా స్వరాజ్ ఒంటరి పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ఓ హిందూ–ముస్లిం జంట పట్ల సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోషల్ మీడియా గత వారం రోజులుగా నానా దుర్భాషలాడుతున్నా ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగానీ, అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకుగానీ, ఆ పార్టీలో ఏ ఒక్కరైనాగానీ, ఆఖరికి సుష్మా స్వరాజ్ సహచర మహిళా మంత్రులుగానీ స్పందించకపోవడం విస్మయం, విభ్రాంతికరం. నడి రోడ్డుమీదనా, నలుగుట్లోనా లేదా సోషల్ మీడియాలోనా, మరో మీడియాలోనా అన్నది కాదిక్కడ, ఓ మహిళకు, అందులోనూ కేంద్రంలోనే మంత్రిగా ఉన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా లజ్జా విహీనమే కాకుండా హింసాపూర్వక హెచ్చరికలు చేస్తుంటే ప్రమాదరకరమైన అంశమా, కాదా! నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సుష్మా స్వరాజ్‌కు అండగా వచ్చారే! మరి అధికార పక్షానికి ఏమైందీ? భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతం కలిగిన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓ హిందూ–ముస్లిం జంటకు పాస్‌పోర్టు ఇప్పించడం, ఆ జంటను వేధించిన పాస్‌పోర్ట్ అధికారిని బదిలీ చేయడం సుష్మా స్వరాజ్ చేసిన తప్పా! శరపరంపర ట్వీట్లతో ఆమెను అంతగా వేధిస్తున్నారెందుకు? పైగా తాము బీజేపీ మద్దతుదారులమని, హిందూత్వ మద్దతుదారులమని చెప్పుకుంటూ అసభ్య, అనుచిత దుర్భాషలకు దిగడం ఎంతటి దిగజారుడుతనానిని నిదర్శనం. ‘నీవు ఓ ముస్లిం కిడ్నీని అమర్చుకోవడం వల్లనే ఇలా వ్యవహరిస్తున్నావా?... ఇప్పటి నుంచి నిన్ను సుష్మా బేగం అని పిలవడమే సముచితం’ లాంటి వ్యాఖ్యానాలే కాకుండా, ‘ముస్లింలను మెప్పించేందుకు ప్రయత్నించిన సుష్మాను లాగి లెంపకాయ కొట్టలేకపోయారా?’ అంటూ ఆమె భర్తను ఉద్దేశించి వచ్చిన ట్వీట్లను ఎలా ట్రీట్ చేయాలి! కొట్టలేక పోయారా ? అన్న ట్వీట్‌కు తాను, తన కుటుంబం తట్టుకోలేని బాధకు గురయ్యామని సుష్మా భర్త స్పందించడం ఇక్కడ గమనార్హం. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న దూషణలకు పార్టీ నుంచిగానీ, ప్రభుత్వం నుంచి గానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా సుష్మా స్వరాజ్ మాత్రం చాలా హుందాగా స్పందిస్తూ వచ్చారు. ఆమె హృదయంలో పాకిస్థాన్ జెండా ఉన్నట్లు చిత్రీకరించిన ట్వీట్‌తో సహా పలు ట్వీట్లకు ఆమె లైక్ కొట్టారు. మిగతా లైంగికమైన, హింసాత్మక ట్వీట్ల విషయంలో ‘మీరు వీటిని అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా?’ చెప్పండంటూ సోషల్ మీడియాను ప్రశ్నించారు. 43 శాతం మంది అంగీకరిస్తామంటూ, 57 శాతం వ్యతిరేకిస్తామంటూ స్పందించారు. ఈ ఓటింగ్ వివరాలను కూడా సుష్మానే స్వయంగా మరో ట్వీట్ ద్వారా జూన్ 30న తెలియజేశారు. అదే రోజు సోషల్ మీడియా దినోత్సవం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లతో స్పందించారు. సుష్మాకు జరుగుతున్న అవమానం గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేక పోయారు. ‘సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన విధులను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో ఈ మీడియా కీలక పాత్ర వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, తమ సృజనాత్మక శక్తిని ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో తోడ్పడుతోంది’ అంటూ తొలుత ట్వీట్ చేసిన మోదీ, ఆ తర్వాత మరో ట్వీట్లో ‘సోషల్ మీడియాను వినూత్నంగా ఉపయోగించుకుంటున్న నా యువ మిత్రులకు ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఏ మాత్రం నిర్మొహమాటం లేకుండా మీరు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా తీరు నన్ను మరింతగా ఆకర్శిస్తోంది. ఓ యువకులారా! ఇదే విధంగా మీ అభిప్రాయాలను వెల్లడించండి, స్వేచ్ఛగా చర్చించండి’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే సుష్మాపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను ఆయన సంపూర్ణంగా సమర్థిస్తున్నట్లు ఉంది. అదే నిజమైతే ఆయన అటు సుష్మాను మందలించాలి. అండుకు ఇటు మనం సిగ్గుపడాలి. సోషల్ మీడియా ముందు ఒంటిరిగా నిలబడి పోరాడుతున్న సుష్మా స్వరాజ్, ఇక తన వెంట ఎవరు రారన్న విషయం గ్రహించారేమో! ‘ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండడం అత్యంత సహజం. విమర్శించండి, దుర్భాషలొద్దు. సముచిత భాషలో చేసిన విమర్శలకే ఎప్పుడూ ఎక్కువ బలం ఉంటుంది’ అంటూ జూలై ఒకటిన సుష్మా మరో ట్వీట్ చేశారు. ఇక తేల్చుకోవాల్సింది సోషల్ మీడియానే! Friends : I have liked some tweets. This is happening for the last few days. Do you approve of such tweets ? Please RT — Sushma Swaraj (@SushmaSwaraj) 30 June 2018 Greetings on #SocialMediaDay! The world of social media has played a key role in democratising our discourse and giving a platform to millions of people around the world to express their views and showcase their creativity. — Narendra Modi (@narendramodi) 30 June 2018 I would particularly like to congratulate my young friends for their innovative usage of social media. Their frank method of conveying opinions is extremely endearing. I urge youngsters to continue expressing and discussing freely. #SocialMediaDay — Narendra Modi (@narendramodi) 30 June 2018 In a democracy difference of opinion is but natural. Pls do criticise but not in foul language. Criticism in decent language is always more effective. — Sushma Swaraj (@SushmaSwaraj) 1 July 2018 -
నా తండ్రి చితికి ఆమే నిప్పంటించారు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్‌పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం. ఆ జంట తప్పు చేసిందా? ‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్‌గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా -
ట్విటర్లో పోల్ పెట్టిన సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు పాస్‌పోర్టు జారీ అంశంలో సాయం చేసినందకు గానూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం సుష్మాపై మండిపడుతున్నారు. కొందరైతే ఆమెపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. దీనితో సుష్మా ఈ వివాదంపై ప్రజల అభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించుకున్నారు. తనపై వస్తున్న విమర్శలపై సుష్మా ట్విటర్లో స్పందించారు. ‘నేను కొన్ని ట్వీట్లను లైక్ చేశాను. ఇది గత కొన్ని రోజులగా జరుగుతూనే ఉంది. దీన్ని మీరు సమర్ధిస్తారా.. అంటూ పోల్ క్వొశ్చన్ ఉంచారు. దయచేసి రీ ట్వీట్ చేయండి’ అని తన పాలోవర్లను కోరారు. కాగా ఇటీవల సుష్మా భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై కూడా కొందరు తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. ఆయన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశంగా మారింది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి విదితమే. Friends : I have liked some tweets. This is happening for the last few days. Do you approve of such tweets ? Please RT — Sushma Swaraj (@SushmaSwaraj) June 30, 2018 -
‘సుష్మా స్వరాజ్‌కు నాలుగు తగిలించండి’
సాక్షి, న్యూఢిల్లీ: లక్నోలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఉదంతం తాలూకూ ట్వీట్లు, కామెంట్లు, విమర్శల పరంపర ఆగడం లేదు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బదిలీ చేయడంతో ఆమెపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. సంఘ్‌పరివార్ కార్యకర్తలు సైతం ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. తాజాగా.. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశమైంది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. నేపథ్యం: లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టు ఆఫీసులో గత శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతుల పట్ల పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేశాడని సదరు జంట సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేయడంతో ఆమె స్పందించారు. హుటాహుటిన చర్యలు ప్రారంభించి వికాస్ మిశ్రాను గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. సిద్దిఖీ-తన్వీ జంటకు వెంటనే పాస్‌పోర్టు జారీ చేయించారు. అయితే, సిద్దిఖీ-తన్వీ సమర్పించిన డిక్లరేషన్ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాల వెరిఫికేషన్‌లో బయటపడింది. pic.twitter.com/OIwVL02uoU — Governor Swaraj (@governorswaraj) June 30, 2018 -
భారత్‌కు మరోసారి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్ : భారత్, అమెరికా మధ్య జరగాల్సిన అత్యంత కీలక సమావేశాన్ని (2+2 చర్చలు) అమెరికా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య జులై 6న జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను అనివార్య కారణాలతో మరోమారు వాయిదా వేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సుష్మా స్వరాజ్‌కు ఫోన్లో తెలియజేశారు. కాగా ప్రస్తుతం అదే రోజున(జూలై 6) పాంపియో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం... వచ్చే నెల(జూలై) 6న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. తద్వారా ఉత్తర కొరియాలో పర్యటించనున్న మొదటి అమెరికా మంత్రిగా ఆయన ఘనత సాధించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా అణునిరాయుధీకరణ అంశంలో పురోగతి సాధించేందుకు కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. పాంపియో ఉత్తర కొరియా పర్యటన ద్వారా భారత్ కంటే ఉత్తర కొరియాకే అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోందంటూ అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడం, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకం పెంచడం, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వంటి అంశాలు జీర్ణించుకోలేకే ట్రంప్ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ వారు అభిప్రాయ పడుతున్నారు. కాగా అణునిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య ఈనెల(జూన్) 12న జరిగిన చరిత్రాత్మక భేటీ విజయవంతమైన విషయం తెలిసిందే. అమెరికా ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా తమ దేశ భద్రతకు అమెరికా నుంచి కిమ్ హామీ పొందారు. అమెరికాతో గత వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగుతామని, ప్రపంచం ఒక గొప్ప మార్పును చూడబోతుందని కిమ్ చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగా పురోగతి సాధించేందుకే పాంపియో ఉత్తర కొరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
ఆ పాస్‌పోర్ట్ యాప్ సూపర్ హిట్!
న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేలా కేంద్రం తీసుకొచ్చిన ‘ఎం పాస్‌పోర్ట్ సేవ యాప్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే ఒక మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్లో స్పష్టం చేశారు. ‘ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన పాస్‌పోర్ట్ సేవ మొబైల్ యాప్‌ను అప్పుడే 1 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.’ అని ఆమె ట్వీట్ చేశారు. Passport Seva mobile App launched recently by the Ministry of External Affairs recently has already registered 1 million downloads. https://t.co/P2sQEGWETp — Sushma Swaraj (@SushmaSwaraj) June 29, 2018 ఆరో పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సుష్మా స్వరాజ్ గత మంగళవారం ఈ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పాస్‌పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్మెంట్ షెడ్యూల్ తదితర సౌకర్యాలను ఈ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ విధానం కింద .. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం(ఆర్పీఓ), పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఎస్కే) లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఆర్పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్ పంపొచ్చు. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది. -
ఆ జంట తప్పు చేసిందా?
లక్నో: తీవ్ర దుమారం రేపిన మతాంతర జంట పాస్‌పోర్ట్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికారుల విచారణలో ఆ జంట తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించినట్లు తేలింది. ఈ మేరకు నిఘా వర్గాలు దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా, ఒక్క పేజీతో కూడిన నివేదిక లక్నో పోలీసులకు చేరింది. మంగళవారం సాయంత్రం ఆ నివేదికను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందజేసినట్లు అధికారులు చేశారు. దీంతో ఆ జంటపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌ల కోసం లక్నోలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సంప్రదించటం, అక్కడి అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేసి దురుసుగా ప్రవర్తించినట్లు సదరు జంట ఆరోపించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని వికాస్‌ను గోరఖ్‌పూర్ బదిలీ చేయటం, ఆ మరుసటి రోజే ఆ జంటకు పాస్‌పోర్టులు ఇప్పించటం జరిగిపోయాయి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. సుష్మా స్వరాజ్‌పై వ్యక్తిగత దూషణలు కూడా మొదలయ్యాయి. అటుపై పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు వారిచ్చిన డిక్లరేషన్ తప్పుల తడకగా తేల్చింది. నివేదికలో ఏముందంటే... ‘వివాహ సర్టిఫికేట్లో తన్వీ పేరు సాదియా అనస్‌గా పొందుపరచబడి ఉంది. ఆమె నోయిడాలోని బీటీ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నారు. నోయిడా సెక్షన్ 76, జేఎం అర్చిట్ అపార్ట్మెంట్, బీ604లో ఆమె అద్దెకు నివసిస్తున్నారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఆమె ఆ అడ్రస్ పేర్కొనలేదు. పైగా ఆమె లక్నోలో నివసిస్తున్నట్లు అసలు అడ్రసే సమర్పించలేదు. ఏడాది నుంచి ఆమె నోయిడాలోనే ఉంటున్నారు’ అని నివేదిక పేర్కొంది. దీంతో వాళ్ల పాస్‌పోర్టులను రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారికి రూ. 5 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.