నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా? | Sakshi
Sakshi News home page

Lok Sabha Election-2024: నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా?

Published Fri, Apr 26 2024 12:54 PM

Lok Sabha Election History Repeat With Bansuri - Sakshi

దేశంలో 18వ లోక్‌సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్‌ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్‌పైనే నిలిచింది. 12 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అదే సమయంలో పలు లోక్‌సభ సీట్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కోవలో న్యూఢిల్లీ సీటుకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి బీజేపీ తరపున ఈ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె 1996లో తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులనే ఇ‍ప్పుడు చూస్తున్నారు.

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారో వెల్లడికానుంది. ఈసారి బీజేపీ ఢిల్లీ నుంచి పోటీకి అవకాశం కల్పించిన కొత్త వారిలో మాజీ విదేశాంగ మంత్రి , బీజేపీ సీనియర్ మహిళా నేత,  దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఒకరు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్‌ పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానానికి చెందిన ఎమ్మెల్యే. 

న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్ తన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓ లాయర్‌పై పోటీకి దిగారు. 1996లో దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్‌ బీజేపీ తరపున పోటీకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఎన్నికల రంగంలోకి దూకారు. సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా వృత్తి రీత్యా న్యాయవాది. ఆప్‌ నుంచి ఎన్నికల బరిలో దిగిన న్యాయవాది సోమనాథ్ భారతితో ఆమె పోరుకు సిద్దమయ్యారు. సుష్మా స్వరాజ్‌ తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌కు ఎదురుకావడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు నాడు సుష్మాపై కాంగ్రెస్‌ తరపున పోటీకి దిగిన కపిల్‌ సిబల్‌కు అవే మొదటి ఎన్నికలు. ఇప్పుడు బస్సూరి స్వరాజ్‌పై ఆప్‌ తరపున పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి కూడా ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement