
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
Karnataka BJP MLA Basangouda Patil Yatnal-
"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session.
I have complete information about her relationships and how the gold was brought in.
She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025
కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్‌లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment