
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స‍్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్‌కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.
మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment