
బెంగళూరు : నటి రన్యారావుకు బెంగళూరు కోర్టులో చుక్కెదురైంది. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్యారావుకు బెంగళూరు 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. రన్యా రావు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వడం ఇది మూడోసారి.
అంతకుముందు మార్చి 14న రన్యారావు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం, మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోర్టు సైతం బెయిల్ ఇవ్వలేదు. తాజాగా,64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
విశ్వసనీయ సమాచారం మేరకు రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె తరుఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.