hight court
-
రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..
-
హైకోర్టులో పిన్నేల్లికి భారీ ఊరట..
-
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
-
దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై నేడు విచారణ
-
బాబు నిర్లక్ష్యం వల్లే కర్నూలుకు హైకోర్టు తెలేకపోయం
-
హైకోర్టు విషయంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
కోడిపందాలపై హైకోర్టులో విచారణ
-
భూమి విక్రయంపై విచారణ
కోరుట్ల : లే–అవుట్ నిబంధనలు పాటించకుండా భూముల అమ్మకాలు జరిపారని మున్సిపల్ చైర్మన్ శీలం వేణుపై హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో గురువారం మున్సిపల్ ఆర్డీ జాన్ శాంసన్, టౌన్ ప్లానింగ్ ఆర్డీ చంద్రిక గురువారం విచారణ జరిపారు. పట్టణంలోని 735, 756(ఈ) సర్వే నంబర్లలోని స్థలంలో లేఅవుట్ లేకుండా భూమి విక్రయించారని ఏడాదిక్రితం కోరుట్లకు చెందిన కటుకం దివాకర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 9వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ డీఎంఏను హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ కార్యాలయానికి మున్సిపల్ ఆర్డీ జాన్ శాంసన్, టౌన్‌ప్లానింగ్ ఆర్డీ చంద్రిక వచ్చారు. ఫిర్యాదుదారు దివాకర్‌ను విచారించిన అనంతరం భూమిని పరిశీలించారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు చైర్మన్ లేఖ ఇచ్చారని అధికారులు తెలిపారు. శుక్రవారం మరోమారు చైర్మన్‌ను విచారిస్తామని అనంతరం నివేదికను హైకోర్టుకు పంపుతామని చెప్పారు. అనంతరం ఆర్డీ చంద్రిక విలేకరులతో మాట్లాడుతూ లేఅవుట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగి ఉంటే మేలు జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించకుంటే ప్రజలపై భారం పడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి పాల్గొన్నారు. -
కనేరియా జరిమానా చెల్లించేలా చూడండి!
సింధు హైకోర్టును కోరిన ఈసీబీ కరాచీ: పాకిస్తాన్ నిషేధిత స్పిన్నర్ డానిష్ కనేరియా చెల్లించాల్సిన రెండున్నర కోట్ల రూపాయల జరిమానాను రాబట్టుకునేందుకు సహకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సింధు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 2009లో ఎసెక్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో కనేరియా ఫిక్సింగ్, అవినీతికి పాల్పడ్డాడని ఈసీబీ విచారణ చేపట్టింది. చివరకు 2012లో క్రమశిక్షణ కమిటీ అతనిపై లక్ష పౌండ్ల జరిమానా విధించింది. అయితే గతేడాది క్రికెటర్ దీనిపై రెండోసారి అప్పీల్‌కు వెళ్లి విఫలమయ్యాడు. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులను కూడా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నట్లు ఈసీబీ తరఫు లాయర్ ఖాజా నవీద్ వెల్లడించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కనేరియా చెప్పాడు. -
రుణమాఫీ చట్టవిరుద్ధం అంటూ దాఖలైన పిటీషన్ కొట్టివేత
-
సబ్ కమిటీ రద్దు
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సబ్ కమిటీని వేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకో ర్టు కొట్టివేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం చల్లా కోదండ రామ్‌రెడ్డి, నర్సింహారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదే శాలు (ఉత్తర్వు నెంబర్ 5/ 2014) జారీ చేసింది.ఎన్డీఎస్ఎల్ ప్రైవేటీకరణపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించిం ది. దీంతో శక్కర్‌నగర్‌లో కార్మిక నాయకులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడి మాట్లాడుతూ కార్మికుల, రైతుల జీవితాలను కాపాడాలని కోరుతూ ఉదయం హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేశామని సాయంత్రం కోర్టు తీర్పును వెల్లడించిందని అన్నారు. 13 డిసెంబర్ 2013న ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ ప్రైవేటీకరణ విషయమై తెలంగాణ, ఆంధ్ర ప్రాంత మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, దానిని రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వారిలో రైతు నాయకులు అజయ్ వడియార్, మెదక్‌కు చెందిన నాగిరెడ్డి, మెట్‌పల్లికి చెందిన సీడీసీ మాజీ చెర్మైన్ బుచ్చి రెడ్డిలు ఉన్నారని తెలిపారు. -
అజ్ఞాతం ఎన్నాళ్లు?
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: సొంత తమ్ముడు జగన్మోహన్ హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయన 37రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు. ఎమ్మెల్యే ఎక్కడున్నారనే విషయం పోలీసులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయనవైపు చూడటం లేదు. ధన్వాడ మండలం పెద్ద చింతకుంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సతీమణి భవానీ చేత నామినేషన్ వేయించారు. ఆమెకు పోటీగా ఎమ్మెల్యే సొంత తమ్ముడు జగన్మోహన్ తనభార్య అశ్రీత చేత నామినేషన్ వేయించిన విషయం తెలిసిందే. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని పలు రకాలుగా ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్ ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే తన పిస్తోల్‌తోనే కాల్చిచంపాడనే ఆరోపణలు ఉన్నాయి. జూలై 17న జరిగిన ఈ సంఘటనతో దేవరకద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాటినుంచి ఎమ్మెల్యేతో సహా కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాంగ్రెస్ నేతల అండదండలు? ఎమ్మెల్యేకి మూడు రకాల పిస్తోళ్లు ఉన్నాయని అయితే ఆయనను అదుపులోకి తీసుకుంటే తప్ప అసలు విషయం బయటపడదని పోలీసులు పేర్కొంటున్నా రు. పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ పొందేందుకు ఎమ్మెల్యే జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఇదివరకే కొట్టి వేసిన విషయం తె లిసిందే. ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేయడంతో బుధవారం బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇక తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోకతప్పదని భావిస్తున్నారు. మరికొంత కాలం అజ్ఞాతంలో ఉండి మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసేవరకు ఎమ్మెల్యే అజ్ఞాతం వీడే అవకాశం లేదు. ఏ రాజకీయ అండ లేని వారిని వెంట పడి మరీ అరెస్ట్ చేసే పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు మాత్రం సాహసించడంలేదు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల అండదండలు ఉండటంతో ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసుల నుంచి ఎమ్మెల్యేకి ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ముందుకురాని సాక్ష్యులు దేవరకద్ర పాత బస్టాండ్‌లోని సాయిప్రసాద్ హో టల్ ఎదుట నిల్చున్న జగన్మోహన్ను కాల్చి చం పిన సంఘటనను అక్కడున్న వారు కళ్లారాచూసి నా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ సాహసించడంలే దు. జగన్మోహన్ చెంపపై కొట్టడం, వెంటనే రి వాల్వర్ తీసి తలపై గురిపెట్టి కాల్చడం క్షణాల్లో జ రిగిపోయింది. నడిబజారులో జరిగిన ఈ ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిం చింది. హత్యవెనక ఎవరి హస్తం ఉన్నా వదిలేది లే దని అదేరోజు ఎస్పీ నాగేంద్రకుమార్ ప్రకటిం చారు. కాగా, సంఘటన జరిగి 37 రోజులు గడిచి నా పోలీసులు ఈ కేసువిషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు.