మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: సొంత తమ్ముడు జగన్‌మోహన్ హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయన 37రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు. ఎమ్మెల్యే ఎక్కడున్నారనే విషయం పోలీసులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయనవైపు చూడటం లేదు.
ధన్వాడ మండలం పెద్ద చింతకుంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సతీమణి భవానీ చేత నామినేషన్ వేయించారు. ఆమెకు పోటీగా ఎమ్మెల్యే సొంత తమ్ముడు జగన్‌మోహన్ తనభార్య అశ్రీత చేత నామినేషన్ వేయించిన విషయం తెలిసిందే. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని పలు రకాలుగా ఒత్తిడి తెచ్చినా జగన్‌మోహన్ ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే తన పిస్తోల్‌తోనే కాల్చిచంపాడనే ఆరోపణలు ఉన్నాయి. జూలై 17న జరిగిన ఈ సంఘటనతో దేవరకద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాటినుంచి ఎమ్మెల్యేతో సహా కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు.
కాంగ్రెస్ నేతల అండదండలు?
ఎమ్మెల్యేకి మూడు రకాల పిస్తోళ్లు ఉన్నాయని అయితే ఆయనను అదుపులోకి తీసుకుంటే తప్ప అసలు విషయం బయటపడదని పోలీసులు పేర్కొంటున్నా రు. పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ పొందేందుకు ఎమ్మెల్యే జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఇదివరకే కొట్టి వేసిన విషయం తె లిసిందే. ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేయడంతో బుధవారం బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ఇక తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోకతప్పదని భావిస్తున్నారు. మరికొంత కాలం అజ్ఞాతంలో ఉండి మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసేవరకు ఎమ్మెల్యే అజ్ఞాతం వీడే అవకాశం లేదు. ఏ రాజకీయ అండ లేని వారిని వెంట పడి మరీ అరెస్ట్ చేసే పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు మాత్రం సాహసించడంలేదు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల అండదండలు ఉండటంతో ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసుల నుంచి ఎమ్మెల్యేకి ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు.
ముందుకురాని సాక్ష్యులు
దేవరకద్ర పాత బస్టాండ్‌లోని సాయిప్రసాద్ హో టల్ ఎదుట నిల్చున్న జగన్‌మోహన్‌ను కాల్చి చం పిన సంఘటనను అక్కడున్న వారు కళ్లారాచూసి నా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ సాహసించడంలే దు. జగన్‌మోహన్ చెంపపై కొట్టడం, వెంటనే రి వాల్వర్ తీసి తలపై గురిపెట్టి కాల్చడం క్షణాల్లో జ రిగిపోయింది. నడిబజారులో జరిగిన ఈ ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిం చింది. హత్యవెనక ఎవరి హస్తం ఉన్నా వదిలేది లే దని అదేరోజు ఎస్పీ నాగేంద్రకుమార్ ప్రకటిం చారు. కాగా, సంఘటన జరిగి 37 రోజులు గడిచి నా పోలీసులు ఈ కేసువిషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు.
అజ్ఞాతం ఎన్నాళ్లు?
Published Thu, Aug 22 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement