కఠిన చర్యలేవీ తీసుకోవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకూ పొడిగింపు
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి..
ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత
సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు.
వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు.
అంబటి పిటిషన్‌లో పూర్తి వివరాలివ్వండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment