
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్‌లో పేర్కొన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. తను బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక పిటిషన్.. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో తనకు బ్యారక్‌లో బెడ్ అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. ఇదిలా ఉండగా.. వంశీని కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్‌లో కోరారు.