జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: వల్లభనేని పంకజశ్రీ | Vallabhaneni Vamsi Wife Pankaja Sri Serious Comments Over Jail | Sakshi
Sakshi News home page

జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: వల్లభనేని పంకజశ్రీ

Feb 15 2025 11:48 AM | Updated on Feb 15 2025 12:33 PM

Vallabhaneni Vamsi Wife Pankaja Sri Serious Comments Over Jail

సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శారీరకంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి పంకజశ్రీ. అలాగే, తప్పుడు కేసులతో వంశీని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్‌ అయ్యారు. వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉండటంతో ఆమె.. ఈరోజు వంశీని కలిశారు. అనంతరం, పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో  వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్‌లో ఉన్నారు.. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే.

వంశీపై వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్‌ కావాలని రిక్వెట్‌ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని.. మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. మాకు వైఎస్సార్‌సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే సమయంలో సత్యవర్ధన్‌ని పోలీసులు అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు’ అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement