central jail
-
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: వల్లభనేని పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శారీరకంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి పంకజశ్రీ. అలాగే, తప్పుడు కేసులతో వంశీని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చారు.విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ అయ్యారు. వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉండటంతో ఆమె.. ఈరోజు వంశీని కలిశారు. అనంతరం, పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్‌లో ఉన్నారు.. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే.వంశీపై వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్ కావాలని రిక్వెట్ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని.. మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. మాకు వైఎస్సార్సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే సమయంలో సత్యవర్ధన్‌ని పోలీసులు అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు’ అని ప్రశ్నించారు. -
కూటమి ప్రభుత్వం యాక్షన్ ఫెయిల్.. జైల్లోనే గంజాయి సాగు!
-
జైల్లో మరో సెల్‌ఫోన్ గుర్తించిన అధికారులు
-
లంచ్ బాక్స్ లో గంజాయి.. ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు
-
విశాఖ సెంట్రల్ ఖైదీలకు గంజాయి సరఫరా
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
సెంట్రల్ జైలు గేటు వద్ద రౌడీషీటర్ హల్చల్
-
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
జైల్లో ఓ అధికారి పైసా వసూల్..!
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో వసూళ్ల రాజాలు చెలరేగుతున్నారు. జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వాటిని అమలు చేయాల్సిన జైల్ అధికారుల్లో కొందరు ఆ విధానాలను విస్మరిస్తున్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల నుంచి ఓ అధికారి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జైల్ లోపల ఖైదీల లీడర్లతో డబ్బులను వసూలు చేయించి జేబులు నింపుకొంటున్నారు. ఇక్కడ జైల్లో నర్మదా, తపతి, గోదావరి, పెన్నా, కావేరి, గోస్తని, గంగా, తదితర నదుల పేర్లతో బేరక్లున్నాయి. సాధారణ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు, తీవ్ర నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు, మావోయిస్టులు తదితర ఖైదీలను వేర్వేరుగా ఆయా బేరక్‌లలో పెడతారు.ప్రతి బేరక్లకు సీనియర్ ఖైదీలు మేసీ్త్రలు (లీడర్లు)గా ఉంటారు. వారు మిగిలిన ఖైదీలను నియంత్రిస్తూ జైల్ సిబ్బందికి సహాయకులుగా ఉంటారు. జైల్‌కు వెళ్లే రిమాండ్ ఖైదీలను తక్కువ రద్దీ గల బేరక్‌లలో పెట్టాల్సి ఉంది. అలాంటి బేరక్‌లలో పెట్టడానికి రిమాండ్ ఖైదీల నుంచి ఓ అధికారి మేసీ్త్రల సాయంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి మేసీ్త్రల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేసుకొని తర్వాత విత్‌డ్రాలు చేస్తున్నట్లు తెలిసింది. అలా డబ్బులు ఇవ్వని ఖైదీలను కరుడు కట్టిన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న బేరక్‌లు, రద్దీగా ఉండే బేరక్‌లలో వేస్తామని, అక్కడ ఆ ఖైదీల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, శిక్ష పూర్తిచేసుకొని బయటకు వచ్చిన వారు, బెయిల్‌పై బయటకు వచ్చిన వారు ఆవేదన చెందుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు దీనిపై వారిని నిలదీస్తే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఫిర్యాదు చేయలేకపోయామని అంటున్నారు. ఖైదీల కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ 5,000 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఆ అధికారి గతంలో పనిచేసిన జైల్లో కూడా ఇదే తీరు కనబరిచాడని, ఉన్నతాధికారులు పలుసార్లు మందలించినా ఆయన తీరు మారలేదని ఇక్కడ సిబ్బందిలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జైల్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకట్టవేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదు జైల్లో ఖైదీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఖైదీలను ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేం ప్రతిరోజు జైల్లో రౌండ్స్‌కు వెళుతుంటాం. ఆ రౌండ్స్‌లో ఖైదీల సమస్యలు కూడా అడుగుతుంటాం. అలాంటిప్పుడు ఖైదీలు నిర్భయంగా ఏ సమ స్య గురించైనా చెప్పవచ్చు. కానీ ఇంతవరకు ఎవరూ డబ్బులు అడుగుతున్నట్లు మాకు చెప్పలేదు. అధికారులు, సిబ్బందిని పిలిపించి దీని పై సీరియస్‌గా హెచ్చరిస్తాం. ఒకవేళ డబ్బులు తీసుకున్నట్టు వెల్లడైతే చర్యలు తీసుకొంటాం. –కిశోర్‌కుమార్, కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ -
అబద్దం చెప్పిన నానమ్మ..
-
జైలు గోడల మధ్య ఇదీ చంద్రబాబు నాయుడి విన్యాసం..!
పచ్చి అబద్ధాలు. తలా తోకా లేని సాకులు. మభ్యపెట్టే మాటలు. మేకపోతు బిల్డప్పులు. తప్పుదోవ పట్టించే ఆలోచనలు. తీరు మార్చుకోని విధానాలు. దశాబ్ధాలుగా అలవాటైపోయిన కుట్రలు. ఇవీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు సంధిస్తోన్న ఆయుధాలు. అవినీతి కేసులో అడ్డంగా దొరికి జైలుకొచ్చిన చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చేయచ్చనుకున్నారు. అయితే ఇప్పటికీ బెయిల్ రాకపోవడంతో ఆయన చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. మాయదారి వేషాలు వేస్తున్నారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించి ఎలాగైనా సరే జైలు గోడలు దాటి బయటకు వచ్చేయాలని పరితపిస్తున్నారు. 371 కోట్ల ఘరానా దోపిడీ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.ఆయన జైలుకొచ్చి 50 రోజులు కావస్తోంది. ఏడు వారాలు దాటినా చంద్రబాబు నాయుడికి బెయిల్ రాలేదు. బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసుకున్నారు. న్యాయమూర్తులు వాటిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోతోంది. దానికి ఒంటరి తనం తోడవుతోంది. జైలు గోడలు దాటి ఎప్పుడు బయట పడతానో అన్న ఆలోచన ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉండచ్చు. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుండి బయటకు రావడానికి రక రకాల సాకులు వెతుక్కుంటున్నారు. ముందుగా కుటుంబ సభ్యుల చేత జైల్లో తనకు రక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ప్రచారం చేయించారు. తన బరువు 5 కిలోలు తగ్గిపోయిందని చెప్పించారు. అది నిజం కాదు..ఆయన జైల్లో కిలో బరువు పెరిగారని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఇచ్చి తనని చంపేయడానికి కుట్ర చేస్తున్నారని లోకేష్ చేత ఆరోపణలు చేయించారు. అందులోనూ నిజం లేదని అధికారులు స్పష్టత ఇచ్చారు. నీళ్లు కలుషితంగా ఉన్నాయని బురద జల్లించారు. అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇలా ఏదో ఒక అబద్దంతో ఏదో ఒక సాకుతో చంద్రబాబు నాయుడు చిత్ర విచిత్ర వేషాలు వేస్తూనే ఉన్నారు. ఏదీ వర్కవుట్ కాకపోవడం చంద్రబాబుకు మంట పుట్టిస్తోంది. దీనికి తోడు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ప్రజల నుండి స్పందన రాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజల మాట దేవుడెరుగు తమ పార్టీ కార్యకర్తలు, నేతలే పట్టించుకోవడం లేదని తన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందడంతో చంద్రబాబు కుత కుత లాడిపోతున్నారు. గుండెల్లో రగిలిపోతున్నారు. ఎవరిని దూషించాలో ఆయనకు అర్ధం కావడం లేదు. దీనికి ఎవరిని ద్వేషించాలో కూడా అర్దం కావడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలే తనని జైలుకు పంపేలా చేశాయని తమ పార్టీ నేతలే సమాచారం ఇచ్చినా చంద్రబాబు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి గజ గజ వణికిపోతున్నారు. అటు కేంద్రంపైనా..ఇటు తమ పార్టీ సీనియర్ల అచేతనత్వంపైనా ఉన్న కోపం అంతా ఏపీ ప్రభుత్వంపై చూపిస్తున్నారు. పాలక పక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జైలు నుండి చంద్రబాబు నాయుడు ఏసీబీ న్యాయమూర్తికి జైలు అధికారుల ద్వారా ఓ లేఖను పంపారు. అందులో తన భద్రత గురించి ఏపీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. తనను జైల్లోనే అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వామపక్ష తీవ్రవాదులు తనను అంతమొందిస్తామని హెచ్చరిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి లేఖ రాసినా పోలీసులు కనీసం దానిపై దర్యాప్తు కూడా చేపట్టలేదని ఆరోపించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ అయిన కరడు గట్టిన నేరగాళ్లు జైల్లో ఉన్నారని వారి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇందులో ఏ ఒక్కటీ నిజం కాదని అధికారులు తేల్చి చెప్పారు. చంద్రబాబు చెబుతున్నట్లు వామపక్ష తీవ్ర వాదులని చెబుతోన్న లేఖ నకిలీదని తేలిందన్నారు. చంద్రబాబుకు జైల్లో అత్యంత పటిష్ఠమైన భద్రత కల్పించామన్నారు. చంద్రబాబు ఉన్న బ్యారక్‌కు దరిదాపుల్లో ఎవరూ వచ్చే వీలే లేకుండా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రంలో ప్రజల్లో విద్వేష బీజాలు నాటాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి సాకులు వెతుకుతున్నారని పాలక పక్ష నేతలు అంటున్నారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నారని..వాటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!
సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు. కాకపోతే దురదృష్ట వశాత్తూ అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ► నిజానికి స్కిల్ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం ► మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం ► సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం ► 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం ► చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం. ► జైల్లో సరఫరా అవుతోన్న నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం ► తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది అబద్ధం ► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం. ► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు. ► అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం. 371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే వారు పరారయ్యారు. కిలారు రాజేష్ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి రాజేష్ మాయమయ్యాడు. పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో ఎన్నో అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం వంటివి క్యూలో నిలబడ్డాయి. చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్ స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న నేతని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని పాలక పక్ష నేతలు అంటున్నారు. -
చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పడికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం
-
అనారోగ్యం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా
-
రాజమండ్రి సెంట్రల్ జైలు 46వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
-
జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, టీడీపీ తీరు..
-
జైలు నుంచి ప్రజలకు తమ అధినేత లేఖ రాశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం
-
నిలకడగానే ఉన్న చంద్రబాబు ఆరోగ్యం
-
జైల్లో బాబు మాస్టర్ ప్లాన్..
-
చంద్రబాబు రిమాండ్ పొడగింపు..!?
-
బాబు లీగల్ ఇంటర్వ్యూలు రోజుకు ఒకటి మాత్రమే !
-
చంద్రబాబుకు వచ్చింది స్కిన్ అలర్జీ మాత్రమే..కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు
-
నారా ఫ్యామిలీ నటనా చాతుర్యం
-
చంద్రబాబు ఆరోగ్యాంగా ఉన్నారు: జైలు అధికారులు
-
నేడు మూలాఖత్ లో చంద్రబాబును కలవనున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి
-
ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..!
తమిళనాడు: పెరోల్‌పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు వచ్చిన జీవిత ఖైదీ సంచలన ఆరోపణలు చేశాడు. జైలులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. వివరాలు.. సేలం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ, చైన్నె తండయార్‌పేటకు చెందిన హరి అలియాస్ హరికృష్ణన్ (35) గతేడాది జూన్‌న్‌లో 3 రోజుల పెరోల్‌పై వెళ్లాడు. అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన వార్డెన్ రామ కృష్ణన్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసులో జీవిత ఖైదీ హరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి సేలం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఖైదీ హరి అపస్మారక స్థితికి చేరుకోగానే జైలు అధికారులకు వాయిస్ మెసేజ్ పంపాడు. పెరోల్‌పై వెళ్లి తిరిగి వచ్చినందుకు అధికారులకు డబ్బులు చెల్లించాలని.. చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నాడు. కోయంబత్తూరు జైలు శాఖ డీఐజీ షణ్ముగసుందరం విచారణ చేపట్టారు. విచారణ జరిపి పెరోల్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మెమో ఇచ్చారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో పెరోల్‌పై వచ్చిన ఖైదీని 3 రోజుల పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు వార్డెన్లు కూడా పట్టుబడ్డారు. వారిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పెరోల్ తర్వాత జైలుకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు చెల్లించినట్లు ఖైదీ హరి అధికారులకు తెలిపాడు. -
రాజమండ్రీ జైల్లో 24వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
రాజమండ్రి జైల్లో 22వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
సీఐడీ లోతైన విచారణ..బాబుకు నో ఛాన్స్..
-
చంద్రబాబు విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా
-
చంద్రబాబు సీఐడీ కస్టడీకి కోర్టు విచారణలో కీలక విషయాలు..!
-
రాజమండ్రి జైల్లోనే విచారించాలని కోర్టు ఆదేశాలు సీఐడీ
-
పాపం సినబాబు.. ఉత్త అనుమానాలతో నవ్వులపాలు
‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు🦟 కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు.. ఇది టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు. ఓ రిమాండ్ ఖైదీ మరణాన్ని తెరపైకి తెచ్చి.. దోమలతో🦟 చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారాయన. అయితే.. రాజమండ్రి జైళ్ల శాఖ ఇప్పటికే లోకేష్ అనుమానాల్ని నివృత్తి చేసింది. మరోవైపు చినబాబు దోమల రాజకీయంపైనా విమర్శలు, అదే టైంలో సెటైర్లు పేలుతున్నాయి. 🦟సోషల్ మీడియాలో నారా లోకేష్ తాజా చీప్ స్టేట్మెంట్పై సెటైర్లు పేలుతున్నాయి. స్కిల్ స్కాంలో సిల్లీ ఆరోపణలతో నవ్వులపాలవుతున్నారాయన. దోమలతో తన తండ్రిని చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడమే తర్వాయి.. యెల్లో మీడియా వాటిని హైలైట్ చేస్తూ కథనాలు ప్రచురించింది. పైగా ఓ దోపిడీ కేసులో రిమాండ్ ఖైదీ మృతిని ప్రముఖంగా ప్రచురించింది. బహుశా.. ఆ దోపిడీ దొంగను చంద్రబాబుతో సమానంగా చూస్తోందేమో!. 🦟 స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ ప్రజల్లో మొదటి నుంచి సానుభూతి కనిపించడం లేదు. కనీస సంఘీభావానికి సైతం టీడీపీ కార్యకర్తలు సైతం దూరంగా ఉంటున్నారు. రెండేళ్లపాటు విచారణ తర్వాత పక్కా ఆధారాలతో అరెస్ట్ అయ్యాక.. అరెస్ట్ అక్రమం అంటున్నారే తప్పా, తాము తప్పు చేయలేదని ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా సాంకేతిక కారణాలను చూపిస్తూ.. రాజకీయ కక్షతోనే అరెస్ట్ జరిగిందనే లైన్ మీదే ఉంటున్నారు. అంటే.. దొంగ తప్పు ఒప్పుకున్నట్లే కదా అని బలంగా ఫిక్సయిపోయారంతా. ఇక ఇప్పుడు దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాకపోగా.. లోకేష్ నవ్వులపాలవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 🦟దోమా.. దోమా.. మా నాన్నోరి ఎందుకు కుడతావ్ అంటే.. మా జోలికి వస్తే కుట్టమా? అందట. కొంపదీసి అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర చేసినందుకు దోమలు పగబట్టాయా?.. లేకుంటే ఆ మధ్య లోకేష్ మాట్లాడుతూ.. ఊ.. ఆ అంటే అని అలవాటులో పొరపాటుగా డెంగీ బదులు.. ‘బీప్ పదం’ ఒకటి ఉపయోగించాడు.. బహుశా ఆ విషయంలో దోమలు హర్ట్ అయ్యి ఉంటాయేమో. అందుకే నారా వారి మీద పగ బట్టాయేమో అనే సెటైర్లు పడుతున్నాయ్. జైళ్ల శాఖ చెప్పినా వినరా? బాబు భద్రతపై ఎలాంటి ఆందోళన ఆందోళన అవసరం లేదని రాజమండ్రి జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు భద్రత గురించి టీడీపీ, ఆ పార్టీ నేత నారా లోకేష్ అభ్యంతరాలను ఖండించింది. సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు. జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక సూపరింటెండెంట్ రవికిరణ్ స్పందిస్తూ.. జైల్లో దోమల నివారణ కోసం సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని... ఫాగింగ్ చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు. జైల్లో దోమల లార్వాల ఆనవాళ్లేమీ లేవని చెప్పారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడం పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు బ్యారక్ లో కూడా దోమలు ఉన్నాయి ఆయన ఆరోగ్యం పై అనుమానాలున్నాయని అంటున్నారు. దోపిడీ కేసులో అరెస్టై జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూతో మృతి చెందాడు. సత్యనారాయణ ఆరో తేదీన జైలుకు వచ్చారు. వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ లో ఫీవర్ తో బాధపడుతున్నట్టు తేలింది. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించాము ...ఈనెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతి చెందారు. చంద్రబాబుతో పాటు జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే మా లక్ష్యం’’ అలా అయితే టీడీపీ వాళ్లనే అనుమానించాలి! చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని ట్వీట్ చేశారాయన. అలాగే.. లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారమని, అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అనే అనుమానాల్ని వ్యక్తం చేశారాయన. లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్లరా? మరోవైపు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌సైతం సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదని ఎద్దేవా చేశారు. ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా?. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది. చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
దోమలకు విషం ఇచ్చి ట్రైనింగ్..నవ్వకండి సీరియస్ మేటర్..!
-
10వ రోజు జైలులో చంద్రబాబు దినచర్య ఇదే..
-
స్కిల్ స్కాం దొంగలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి
-
ఈనాడు సైకో రాతలు
-
చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి పెట్టుకున్న ములాఖత్ తిరస్కరణ
-
పవన్ కళ్యాణ్ గాలి తీసిన పేర్నినాని..!
-
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల కీలక భేటీ
-
రాజమండ్రి జైలులో అత్యంత భద్రత ఉంది
-
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
జైల్లో చంద్రబాబును కలవనున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి..!
-
పోరాటం పక్కనపెట్టి రామోజీలోనూ భయం!
ఈనాడు రామోజీరావు కూడా భయపడుతున్నట్లే ఉన్నారు. ఎందుకంటే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కుంభకోణానికి సంబంధించి సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పైశాచికంగా, అరాచకంగా రాసిన సంపాదకీయం కింద ఆయన సంతకం కనిపించలేదు. సాధారణంగా మొదటి పేజీలో ఇలా ప్రత్యేకంగా రాసినప్పుడు ఛీప్ ఎడిటర్ హోదాలో సంతకం చేస్తుంటారు. దీనిని ఒక కథనంగా ఇచ్చారా?లేక వ్యాసంగా మొదటి పేజీలో ఇచ్చారా?లేక సంపాదకీయంగా రాశారా? అంటే చూడడానికి ఫ్రంట్ పేజీ ఎడిటోరియల్ మాదిరే కనిపిస్తుంది. కానీ రామోజీ సంతకం లేదు. దీంతో ఆయన భయపడుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఆయన తరపున పనిచేసే సంపాదకులు ఎవరైనా సంతకం చేసి ఉండవచ్చు. అదీ చేయలేదు. మరో విశేషం ఏమిటంటే అత్యంత ప్రముఖమైన ఘటన జరిగితేనే మాస్ట్ హెడ్ ను పక్కకు జరుపుతారు. చంద్రబాబు అరెస్టు వార్తకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. దానికి అరాచక అరెస్టు అని హెడింగ్ పెట్టారు తప్పితే, అసలు స్కామ్ ఏమిటో, ఎందుకు చంద్రబాబును అరెస్టు చేశారన్నదానిపై మొదటిపేజీలో వార్తనే ఇవ్వలేదు. ఇందులో ముఖ్యమంత్రి జగన్ పై విషం చిమ్మడం , చంద్రబాబు అత్యంత నిజాయితీపరుడు అని ప్రజలు అనుకోవాలన్న భావనతో రాయడం మినహా వేరే కనిపించలేదు. తమ విలేకరులతో రాయించిన పలు విషయాలనే మళ్లీ వాడుకుంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించి వికృతానందాన్ని ఈనాడు పొందినట్లు అనిపిస్తుంది. ✍️ అవినీతి ఎక్కడ ఉన్నా పోరాడాలని ఉపన్యాసాలు ఇచ్చిన రామోజీ ఇప్పుడు ఇలా దిగజారిపోవడం అర్దం అవుతూనే ఉంది. తానే స్వయంగా మార్గదర్శి స్కామ్ లో చిక్కుకుని విలవిలలాడుతుండడంతో.. ఇప్పుడు అవినీతికి మద్దతుగా చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్ లనే సమర్ధించే దుస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు ఇదే రామోజీ తన పత్రికలో చంద్రబాబుపై కార్టూన్లు వేస్తూ పది, పరకకు లొంగుతారా అంటూ కామెంట్ చేసిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబుతో ఏర్పడిన అవగాహనతో ఆయన ఏమి చేసినా సమర్దించడానికి రామోజీ అలవాటు పడ్డారు. నైపుణ్యాభివృద్ది సంస్థ స్కామ్ లో చంద్రబాబుకు పాత్ర లేదని ప్రచారం చేయడానికి ఆయన నడుం కట్టారు. ఇదే కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు అయిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టి నలుగురిని అరెస్టు చేసిన విషయాన్ని విస్మరిస్తున్నారు. చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్న వ్యక్తి అని ,అర్దరాత్రి వెళ్లి ఇబ్బంది పెడతారా అని రాసిన రామోజీకి, సీఐడీ పోలీసులు తెల్లవారిన తర్వాత 5.30 గంటల వరకు చంద్రబాబుకోసం వేచి ఉన్న విషయం తెలియదా?. మరి అంత వయసు ఉన్న వ్యక్తిని హెలికాప్టర్ సౌకర్యవంతంగా తీసుకువెళతామంటే ఆయన ఎందుకు ఒప్పుకోలేదో, రోడ్డు మార్గంలోనే వెళ్లాలని ఎందుకు పట్టుబట్టారో రామోజీ వివరించాలి కదా! అంటే మార్గ మధ్యంలో గొడవలు చేయించాలనే కదా! ✍️ చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో.. ఆశించిన మేర టిడిపి కార్యకర్తలు ఎవరూ పెద్దగా రోడ్లపైకి రాకపోవడం ఈనాడుకు నిరాశ కలిగించి ఉండొచ్చు. అయినా ఏదో జరిగిపోయినట్లు పిక్చర్ ఇవ్వడానికి ఈనాడు నానా పాట్లు పడింది. కొంతకాలం క్రితం న్యాయమూర్తులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా సిబిఐ అరెస్టు చేసినవారిలో కూడా డెబ్బై ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఈనాడుకు అప్పుడు అలాంటివారి వయసు గుర్తుకు రాలేదు. తనకు గిట్టనివారిపై సీఐబీ ఏదైనా దర్యాప్తు చేస్తే ‘అబ్బో బ్రహ్మాండం.. అలా జరిగింది.. ఇలా జరిగింది’ అని ఊదరగొట్టిన ఈనాడుకు సీఐడీ దర్యాప్తు మాత్రం తప్పుగా కనిపిస్తుంది. సీబీఐని చంద్రబాబు ఎపికి రావద్దని ఆర్డర్ ఇస్తే వెంటనే రామోజీ కూడా సిబిఐ తోకను చంద్రబాబు కట్ చేస్తున్నట్లు కార్టూన్లు వేశారు. గతంలో జగన్ కేసులో సీబీఐ ఏ రకంగా కేసును టేకప్ చేసింది.. ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. అయినా ఆనాడు జగన్ ఎక్కడా ఏమి మాట్లాడలేదు. మరి చంద్రబాబు కేసులో సీఐడీ అనేక ఆధారాలు చూపిస్తున్నా రామోజీకి సరిపోవడం లేదు. గతంలో జగన్ కుటుంబ సభ్యులంతా రాజ్ భవన్ రోడ్డులో ఫుట్ పాత్ మీద కూర్చుంటే కూడా పోలీసులు అంగీకరించని సన్నివేశం చూశాం. బలవంతంగా వారందరిని అక్కడ నుంచి తరలించారు. మరి ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను సాదరంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) కార్యాలయంలో కూర్చోబెట్టి మర్యాద చేసిన విషయం మర్చిపోకూడదు. దీనిని బట్టి ఎవరు ఎలా వ్యవహరించారో అర్దం అవుతుంది. ✍️చంద్రబాబు హెలికాప్టర్ లో విజయవాడకు వచ్చి ఉంటే సీఐడీ వారి విచారణ, రిమాండ్ రిపోర్టు కూడా తొందరగానే తయారయ్యేవి కదా? ఆయన ఎందుకు అలా చేయలేదు?. చంద్రబాబు మీద ఏదో రకంగా బురద జల్లాలన్న జగన్ ఉన్మాద ఆలోచనే కుట్ర అని రామోజీ తేల్చేశారు. ఈ కేసు పూర్వాపరాలు స్టడీ చేసి రెండు వైపులా రాస్తే ఫర్వాలేదు. అలాకాకుండా సీఐడీనే తప్పు పడుతూ, అది ప్రభుత్వానికి వంత పాడిందని రాశారు. ఈ కేసులో 371 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిఐడి అంత నిర్దిష్టంగా చెబుతుంటే దానికి విలువ ఇవ్వకుండా తెలుగుదేశం చేసే విమర్శలనే తన సంపాదకీయంగా రాసుకోవడం ఎంత దౌర్బాగ్యమో చెప్పనవసరం లేదు. గవర్నర్ అనుమతి లేకుండానే సిఐడి చంద్రబాబు ను అరెస్టు చేసిందని గగ్గోలు పెడుతున్న రామోజీరావుకు.. ప్రజాధనం రూ. 371 కోట్లు కొల్లగొట్టారన్న బాధ కించిత్ కూడా లేదన్న మాట. ప్రస్తుతం చంద్రబాబు ఒక ఎమ్మెల్యే మాత్రమే. పనిలో పని లోకేష్, పవన్ కల్యాణ్ లకు కూడా వత్తాసు పలుకుతూ తన విధేయతను చాటుకున్నారు. యువగళం వలంటీర్లను కొట్టారట. ఆ వలంటీర్లు వాహనాలపైకి ఎక్కి రాళ్లు వేసిన విషయాన్ని మాత్రం దాచేయాలని ఎంత తాపత్రయపడుతున్నారు. అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయరాదని సుప్రీం కోర్టు చెప్పిందట. మరి అదే సుప్రీం కోర్టు ఎవరు అవినీతికి పాల్పడ్డా పర్వాలేదని ఏమైనా చెప్పిందా? అనేది కూడా రామోజీ వివరించి ఉంటే బాగుండేది. చంద్రబాబుపై అవినీతి బురద వేయడానికే తప్ప ఇందులో కేసే లేదని రామోజీ తన దృతరాష్ట్ర ప్రేమను దాచుకోలేకపోతున్నారు. ఈయనే ఫిలిం సిటీలో కూర్చుని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ✍️ యావద్దేశం జి 20 సమావేశాలపై దృష్టి పెడితే.. ఏపీ పోలీసులు చంద్రబాబుపై పెట్టారని అంటున్న రామోజీ రావు తెలంగాణ ఎడిషన్ లో కూడా గుండెలు బాదుకుంటూ చంద్రబాబు కోసం విలపిస్తూ పేజీల కొద్ది విషపు రాతలు రాశారెందుకు? ఆయన జీ 20 సమావేశాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? పాపం పండిన రోజు ఎంతటి నిరంకుశ ప్రభువైనా ప్రజాగ్రహ ఉద్దృతిలో కొట్టుకుపోక తప్పదని రామోజీ సెలవిచ్చారు. అంటే ఆ రకంగానే చంద్రబాబు 2019 ఎన్నికలలో ప్రజాగ్రహానికి కొట్టుకుపోయారని రామోజీ చెబుతున్నారా?.. నిత్యం జగన్ ప్రభుత్వంపై దారుణమైన చెత్తవార్తలు రాస్తున్న ఈనాడు నుంచి ఇంతకు మించి విలువలను ఎలా ఆశించగలం. ఎందుకంటే రామోజీ స్వార్దం రామోజీది. తన మార్గదర్శి అక్రమాలను బయటపెట్టారన్న అక్కసుతో తన చేతిలో పత్రిక, టివి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఒక ముఖ్యమంత్రిపైన ,ఆంధ్రప్రదేశ్ పైన నిత్యం విషం చిమ్ముతున్న రామోజీకి అందులో పాపం కనిపించలేదా? కర్మ సిద్దాంతం తనకైనా అదే రీతిలో వర్తిస్తుందన్న సంగతి రామోజీ ఈ వయసులో కూడా గుర్తించలేకపోతున్నారా?.. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆఖరి ఉరికి 48 ఏళ్లు
రాష్ట్రంలో ఉరిశిక్ష అమలు చేసి అర్ధ శతాబ్దం సమీపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఔను నిజమే. వివిధ పరిస్థితుల నేపథ్యంలో శిక్షల అమలులో ఆలస్యం అనివార్యమవుతోంది. దేశంలో కేంద్ర కారాగారాలన్నింటిలోనూ ఈ శిక్ష పడిన ముద్దాయిలు వివిధ అప్పీళ్లతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఉరి తీసేందుకు వీలున్న ఏకైక సెంట్రల్ జైలు ఇక్కడే ఉంది. ఎక్కడ ఉరి శిక్ష పడినా ముద్దాయిని ఇక్కడి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. ఈ జైలులో ఇప్పటివరకూ 48 మందిని ఉరి తీసినట్లు సమాచారం. స్వాతంత్య్రం వచ్చాక 27 మందిని ఉరి తీశారు. ఆఖరిసారిగా 1976 ఫిబ్రవరి 22న అనంతపురానికి చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. అప్పటి నుంచి అంటే ఈ 47 ఏళ్ల కాలంలో ఉరి శిక్ష అమలు కాలేదు. 1997 మార్చిలో ఇద్దరిని ఉరి తీయాల్సి వచ్చినా అనూహ్య పరిణామాల మధ్య సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్ష అమలు కాలేదు. – డెస్క్, రాజమహేంద్రవరం 1602లో డచ్‌వారి హయాంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ హయాంలో 1864లో దీనిని జైలుగా మార్చారు. 1870లో దీనికి పూర్తి జైలు రూపం వచ్చింది. 1990లో దీనిని ఆధునీకరించారు. పాత కట్టడం ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపు ఉరి (హ్యాంగ్) సెల్ ఉండేది. తర్వాత కొత్తగా నిర్మించిన జైలు పరిపాలనా భవనం కింది భాగంలోకి దీనిని మార్చారు. దేశంలో భూగర్భ హ్యాంగ్ సెల్ ఇదొక్కటేనని చెబుతారు. తలారీ కోసం తలనొప్పులు ఉరిశిక్షను అమలు చేసే తలారీ (హ్యాంగ్‌మన్) పోస్టు అంటూ ప్రత్యేకంగా ఉండదు. శిక్ష అమలు చేసినప్పుడల్లా తలారీ ఎంపిక తలనొప్పిగానే పరిణమిస్తుంది. ఈ శిక్ష అమలు చేసేవారికి మనో నిబ్బరం ఉంటాలి. అనారోగ్యం లేదా గుండె సంబంధ సమస్యలు ఉండకూడదు. సాధారణంగా ఉరిశిక్షను అమలు చేసే వ్యక్తి కుటుంబం నుంచి వారసత్వంగా ఎవరో ఒకరు ముందుకు వస్తుంటారు. 1997లో ఇక్కడి జైలులో ఉరి శిక్ష అమలు కావాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కృష్ణా జిల్లా తిరువూరు సబ్‌జైలులో పని చేసిన ధర్మరాజు సంసిద్ధత తెలిపారు. అధికారులు ఆయనను రాజమహేంద్రవరానికి డిప్యుటేషనుపై తీసుకువచ్చారు. తీరా వచ్చాక ఆఖరి సమయంలో ఉరి అమలు కాలేదు. అచ్చం సినిమా తరహాలోనే.. 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతిరావు, విజయ వర్ధన్‌లకు 1995లో గుంటూరు సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. 1997 మార్చి 14న ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్‌ను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ తిరస్కరించారు. దీంతో అదే నెల 29న వీరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. శిక్ష అమలుకు ముందు రోజు మార్చి 28న రాష్ట్రపతి శంకర్దయాళ్శర్మను జ్ఞాన్‌పీట్ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవితో పాటు మరికొందరు ప్రముఖులు కలిశారు. క్షమాభిక్ష వినతిని మరోసారి పరిశీలించాలని అభ్యర్థించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించారు. దీంతో వారు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఆ రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసు విచారించి రాష్ట్రపతి నిర్ణయం వెలువడేంత వరకూ శిక్ష అమలు చేయవద్దని ఆదేశించింది. అర్ధరాత్రి దాటాక నిర్ణయం రావడంతో సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్షను నిలిపివేశారు. తర్వాత రాష్ట్రపతి నారాయణన్ వీరి ఉరి శిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చాలని నిర్ణయించారు. ముద్దాయిల్లో విజయ వర్ధన్ ఇప్పటికీ 30 ఏళ్లుగా రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. చలపతిరావు మరో జైలులో ఉన్నారు. రోజూ ప్రాణ సంకటమే.. ఉరి శిక్ష అమలు చేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. కానీ శిక్ష అమలవుతుందో లేదో తెలియక ఏళ్ల తరబడి ఆశనిరాశల మధ్య నలిగిపోతున్నారు ఉరి శిక్ష ఖైదీలు. 2021లో ఉరి శిక్ష పడిన మున్నా గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇక్కడి కేంద్ర కారాగారంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది ఉరి శిక్ష ఖైదీలున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. పై కోర్టులకు అప్పీలు వంటి వివిధ దశల్లో వీరి కేసులు కొనసాగుతున్నాయి. 1997లో తన ఉరి శిక్ష యావజ్జీవ ఖైదుగా మారిన నేపథ్యంలో 30 ఏళ్లకు పైబడి కారాగారంలో ఉంటున్నానని చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఖైదీ విజయ వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రత్యామ్నాయ విధానాలపై కమిటీ ఉరి శిక్షకు ఇకపై ఉరి పడుతుందా.. మరణ శిక్ష అమలులో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. సున్నితమైన ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. మరణ శిక్ష కింద ఉరి కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలని 2017లో న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాల ధర్మాసనం ఈ ఏడాది మార్చి చివరిలో విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి దీనిపై సమాధానం చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు. ఆ రాత్రి ఎప్పటికీ గుర్తే.. 1975లో జైళ్ల సర్వీసులో చేరాను. రాజమండ్రిలో ఇద్దరిని ఉరి తీయాలని తెలిసింది. తీస్తానని ముందుకు వచ్చాను. తిరువూరు నుంచి డిప్యుటేషనుపై రాజమండ్రికి బదిలీ చేశారు. తెల్లవారితే ఉరి అనగా ఆ రాత్రి జైలులోనే ఉన్నాను. నిద్ర పట్టలేదు. మనసంతా ఆలోచనలే. నా చేతుల మీదుగా ఇద్దరు ప్రాణాలు పోతాయనే ఆలోచన ఇబ్బంది పెట్టేది. కర్తవ్యం కదా అని సమాధానం చెప్పుకునేవాడిని. ఒంటిగంటన్నర తర్వాత కలత నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో సహచరులు వచ్చి లేపి శిక్ష అమలు కావడం లేదన్నారు. ఆ సమయంలో ముద్దాయిల కంటే ఎక్కువగా సంతోష పడ్డాను. 2007లో రిటైరయ్యాను. ఇప్పటికీ రామమండ్రి జైలులో ఉరి రాత్రి గుర్తుకొస్తూనే ఉంటుంది. – ధర్మరాజు, కాపవరం, కోరుకొండ మండలం ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు ప్రస్తుతం కేంద్ర కారాగారంలో మరణ శిక్ష పడిన ఖైదీలు 18 మంది వరకూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ శిక్ష పడినా అమలుకు ఇక్కడికే తీసుకువస్తారు. 47 ఏళ్లుగా శిక్ష అమలు చేయనప్పటికీ హ్యాంగ్ సెల్లో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపడుతుంటాం. ఉరికంబం గదిలో ఐరన్ లివర్, కింద నిలబడే ఐరన్ పలకలను జాగ్రత్తగా ఉండేలా చూస్తాం. ఆదేశాలొస్తే అమలుకు సిద్ధంగా ఉంటాం. – రాహుల్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం జాప్యం అనివార్యం శిక్ష పడిన తర్వాత ఖైదీలకు వివిధ పై కోర్టుల్లో అప్పీలుకు అవకాశం ఉంటుంది. తర్వాత హోం శాఖ ద్వారా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంటుంది. ఈ దశలు దాటడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి జీవితానికి సంబంధించిన అంశాలు పైకోర్టులు పరిశీలిస్తాయి. ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మరీ క్రూరం, అత్యంత అమానవీయ సంచలన కేసుల్లో మినహా మిగిలిన కేసులన్నింటికీ ప్రొసీజర్ వల్ల జాప్యం అనివార్యం. – ఎం.విశ్వేశ్వరరావు,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్‌జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
సత్ప్రవర్తనతో రెండు నెలల ముందే... సిద్ధూ విడుదల
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది. -
పంజాబ్ జైల్లో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మృతి
అమృత్సర్: పంజాబ్‌లో తరన్‌తరన్ జిల్లా గోవింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మృతి చెందారు. వీరికి గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యతోపాటు పలు కేసులతో సంబంధముందని అధికారులు తెలిపారు. ఈ కేసు నిందితులు మన్దీప్ సింగ్, మన్మోహన్ సింగ్, కేశవ్, మరికొందరు ఇదే జైల్లో ఉన్నారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మన్దీప్, మన్మోహన్ చనిపోగా కేశవ్ తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు ఆదివారం చెప్పారు. -
జిందాల్‌కు బెదిరింపు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సెంట్రల్ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు. ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్పూర్ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు. -
పొలిటికల్ కారిడార్ : తారుమారైన పచ్చ వ్యూహాలు
-
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
ఖైదీలపై అనంతబాబు దాడి పూర్తి అవాస్తవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు. ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్‌కు వస్తున్న వారి ఫోన్‌తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు. -
మధురై జైల్లో మాయ.. అసలేం జరిగిందంటే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై సెంట్రల్ జైల్లో చోటుచేసుకున్న భారీ గోల్మాల్ బట్టబయలైంది. ఖైదీల కష్టాన్ని కొందరు అధికారులు కూడబలుక్కుని కాజేశారు. బూటకపు లెక్కలు చూపి, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి రూ.100 కోట్లను స్వాహా చేసినట్లు తేలడంతో ప్రభుత్వ గణాంకాల విభాగం విచారణ చేపట్టింది. డాక్యుమెంట్ల పునఃపరిశీన మొదలు కావడంతో జైలు అధికారుల్లో గుబులు మొదలైంది. నేపథ్యం ఇదీ.. మధురై సెంట్రల్ జైల్లో వెయ్యిమందికి పైగా శిక్ష, విచారణ ఖైదీలున్నారు. ఖైదీల ప్రయోజనాల కోసం వైద్యపరమైన బ్యాండేజ్, ఫైళ్ల తయారీ సహా పలు వృత్తులకు ఖైదీలతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలకు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు రాసి రూ.100 కోట్లు కాజేసినట్లు గత ఏడాది ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. 2016–21 మధ్య కాలంలో ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2021 జూన్ మధ్యకాలంలో మాత్రమే రూ.30 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ కూడా జరగడంతో ఈ గోల్‌మాల్‌లో ఉన్నతాధికారులకు కూడా వాటా వెళ్లినట్లు తెలుసుకున్నారు. 2019 జూలైలో జైలు నుంచి రెండు సైజుల్లో పదివేల కాగితపు కవర్లు, 250 ఫైళ్లు పొందినట్లు మ«ధురై జిల్లా కోర్టుల్లో రికార్డుల్లో నమోదై ఉంది. అయితే జైలు రికార్డుల్లో మాత్రం రెండు లక్షల కవర్లు సరఫరా చేసినట్లు ఉంది. ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భారీఎత్తున ఉత్పత్తులను సరఫరా చేసినట్లు బూటకపు లెక్కలు రాసుకున్నట్లు గణాంకాల విభాగం అధికారులు గత ఏడాది జరిపిన విచారణలో గుర్తించారు. దీంతో కంగారుపడిన జైలు అధికారులు జైల్లోని రికార్డుల్లో లెక్కలను తారుమారు చేస్తూ.. ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ అవినీతి వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించాల్సిందిగా ఖైదీల హక్కుల సంఘం సంచాలకులు పుహళేంది మద్రాసు హైకోర్టులో గత ఏడాది నవంబర్‌లో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేశారు. అయితే తగిన ఆ«ధారాలు లేకుండా పిల్‌ను స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మధురై సెంట్రల్ జైల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు సమాచార హక్కుచట్టం కింద డాక్యుమెంట్లు పొందినట్లు పిటిషనర్ కోర్టుకు చెప్పుకున్నారు. పూర్తి ఆధారాలతో కొత్తగా మరో పిల్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు సవివరమైన ఆధారాలతో పుహళేంది మరోసారి పిల్ వేశారు. ఈ కుంభకోణంలో అప్పటి మధురై జైలు సూపరింటెండెంట్, డీఐజీల పాత్ర ఉన్నందున రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, జైళ్లశాఖ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్లో పేర్కొన్నారు. ఈ కారణం చేత ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. తాము జారీ చేసిన ఉత్తర్వులు ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని కూడా తమ ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ముమ్మరంగా పరిశీలన ఫోర్జరీకి గురైన డాక్యుమెంట్లను గణాంకాల విభాగం అధికారులు జవహర్, శ్రీధర్ తదితరులు మధురై జైల్లో తిష్టవేసి పునఃపరిశీలన చేస్తున్నారు. గోల్మాల్ను కప్పిపుచ్చుకునేందుకు డాక్యుమెంట్లలో దిద్దుడుకు పాల్పడిన విషయం పునఃపరిశీలనలో తేలింది. ఏ మూల నుంచి ఎలాంటి ముప్పు మూడుతుందోనని జైలు అధికారులు కంగారుపడుతున్నారు. -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు
నౌగావ్: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
Photo Feature: జైలెళ్లి పోతోంది..
సాక్షి, వరంగల్: ముందు పోలీస్ వాహనం..వెనుకే ఆమె పరుగు.. వాహనంలో నుంచి బేలగా వెనక్కి చూస్తూ ఓ ఖైదీ.. చివరకు కనుమరుగైన వాహనం.. బరువెక్కిన గుండెలతో ఇంటిముఖం పట్టిన మహిళ.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను మంగళవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలిస్తున్నపుడు కనిపించిన భావోద్వేగమిది. దగ్గర్లోనే ఉంటే ములాఖత్‌లో కలుసుకోవడం సులువయ్యేదని.. ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్లగలమని ఆమెతో పాటు పలువురు ఖైదీల బంధువులు, భార్యపిల్లలు విలపించారు. -
Warangal: ఖైదీల తరలింపు షురూ
సాక్షి, వరంగల్: ప్రస్తుతం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలాన్ని రీజినల్ కార్డియాక్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో వైద్యశాఖకు స్థలాన్ని కేటాయించాలన్న ఆదేశాలతో ఖైదీల తరలింపు చేపట్టామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. సెంట్రల్‌జైలు నుంచి ఖైదీల తరలింపు మంగళవారం మొదలుకాగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు ఇస్తున్నందున కొత్తగా జైలు నిర్మించేందుకు ప్రభుత్వం మామునూరులో స్థలం కేటాయించిందని చెప్పారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన నూతన జైలు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. మొత్తం 956 మంది ప్రస్తుతం సెంట్రల్ జైలులో 956 ఖైదీలు ఉండగా, వీరిని హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించనున్నట్లు డీజీ రాజీవ్త్రిదేవి వెల్లడించారు. తొలివిడతగా మంగళవారం 119 మందిని భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. మిగతా వారి తరలింపు ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న 267 మంది సిబ్బందికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కాగా, జైలు ఆవరణలో ఉన్న పెట్రోల్ పంపులు యథావిధిగా నిర్వహిస్తామని, విచారణలో ఖైదీలను ఎక్కడకు తరలించాలనే విషయమై న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా, ఖైదీలను సామగ్రితో తరలించే క్రమంలో కొందరి బంధువులు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి తరలిస్తుండడంపై పలువురు ఖైదీల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా వచ్చి చూసేందుకు అనువుగా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు ఎన్.మురళీబాబు, వై.రాజేష్, జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డి.భరత్, అమరావతి, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
సాక్షి, కంబాలచెరువు: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం సెంట్రల్ జైలుకు తరలించారు. సొంత బావ హత్యకు కారకుడిగా భావిస్తూ ఆయనను అరెస్టు చేసిన పోలీసులు తొలుత కాకినాడ సజ్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయనకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాకినాడ మేయర్ సుంకర పావని, జ్యోతుల నవీన్, కాశీ నవీన్, ఆళ్ల గోవింద్ జైలు వద్దకు ముందుగా చేరుకున్నారు. -
19 మంది మహిళా ఖైదీల విడుదల
రాజమహేంద్రవరం : మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల అవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. (చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్ హర్షం) బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్ జైల్ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన మహిళలకు ఎంపీ మార్గాని భరత్ రామ్ నిత్యావసరాలు ,దారి ఖర్చులు అందించగా, చిన జీయర్ ట్రస్ట్ కుట్టుమిషన్లు, చందనా బ్రదర్స్ నిర్వాహకులు చందనా నాగేశ్వర్ మహిళలకు చీరలు అందచేశారు.(చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..) గర్భవతిగా జైలుకు వచ్చి పసిబిడ్డతో విడుదల రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక మహిళా ఖైదీ గర్భవతిగా జైలుకు వచ్చింది. శిక్ష అనుభవిస్తూ అక్కడే పురుడు పోసుకుంది. ఆమెకు జన్మించిన పాపకు ప్రస్తుతం నాలుగేళ్లు. పసి పాపతోనే ఆ మహిళ జైలులో డిగ్రీ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో తల్లి బిడ్డ శుక్రవారం విడుదల అయ్యారు. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్లు తయారీ, బేకరీ, తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు. ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సంస్ధల సహకారం తో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జైల్ అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళ ఖైదీలు విడుదల అయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలు గల్లేలా కాంతమ్మ (శ్రీకాకుళం జిల్లా) నీలపు రోజా (విశాఖపట్నం). సీఎం జగన్ మహిళ ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
సెంట్రల్ జైలులో 265 మందికి కరోనా!
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్లో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెంట్రల్ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్ సోకింది. పాజిటివ్ వచ్చిన జైల్ సిబ్బంది 24 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్ఎల్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. అయితే వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరారీ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేయడంతో (8 మంది బెయిల్‌పై విడుదలయ్యారు), మిగిలిన 10 మంది ఖైదీలను రాజ మహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్యతో పాటు భారీ స్థాయిలో బెడ్లు ఏర్పాటు చేయవలసి ఉంటుందని దీంతో ఖైదీలను సెంట్రల్ జైల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. -
జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు
సాక్షి, అనంతపురం : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గురువారం అత్యుత్సాహం చూపించారు. కడప కేంద్ర కారాగారం నుండి జేసీ, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహనాల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ వర్గీయులు హంగామా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీ కాన్వాయ్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప నుంచి తాడిపత్రి చేరుకున్నారు. తాడిపత్రికి వెళ్లే సమయంలో కడప బైపాస్‌లో భారీ కాన్వాయ్ కారణంగా 108 అంబులెన్సు వాహనం నిలిచిపోయింది. జేసీ అనుచరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు
-
కరోనాతోనే మొద్దు శ్రీను హంతకుడు మృతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యన మృతదేహానికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి) -
అస్సాం: గౌహతి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం
-
కరోనా : కోలుకున్న సెంట్రల్ జైలు ఖైదీలు
ఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రోహిణి జైలులోని 10 మంది ఖైదీలు, ఒక ఉద్యోగి బయటపడ్డారని మంగళవారం అధికారులు పేర్కొన్నారు. మే 15న హెడ్ వార్డెన్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈయనకు జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలేవీ బయటపడలేదు. ఇది జైలులో కరోనా వ్యాప్తి అధికం కావడానికి మరొక కారణమని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో అందరితో మామూలుగానే ఉండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు ) మే15న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమై జైలు అధికారులు మిగతా సిబ్బంది, ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మంది ఖైదీలు, నలుగురు సిబ్బంది వైరస్ బారినపడినట్లు గుర్తించారు. దీంట్లో ఎక్కువగా జైలులోని కరోనా సోకిన ఖైదీతో బ్యారక్ పంచుకున్న వాళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ స్థానిక సోనిపేట్ ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో పదిమంది ఖైదీలు, ఒక ఉద్యోగి కోలుకున్నారని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. వీరికి మంగళవారం కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడ్డ మిగతా ఖైదీలు కూడా తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. (6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్ఐవీ పేషెంట్ ) -
కరోనా: 250 మంది ఖైదీల తాత్కాలిక విడుదల?
ఆరిలోవ (విశాఖ తూర్పు): కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. విశాఖ కేంద్రకారాగారం నుంచి 250 మందికి తాత్కాలిక విడుదలకు ఆస్కారం కలుగుతోంది. కరోనా జోరు పెరుగుతున్న వేళ.. జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్యను తగ్గించాలని, తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు జైళ్ల శాఖకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సూచనలను గమనంలోకి తీసుకుని జైళ్లలో ఖైదీల విడుదలకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ) విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్షపడిన ఖైదీలు, ఎక్కువ కాలం రిమాండ్‌లో ఉన్న ఖైదీల జాబితా సిద్ధం చేస్తున్నామని, వీరంతా కలసి 250 మంది వరకు తాత్కాలికంగా విడుదలయ్యే అవకాశం ఉందని జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జైళ్లలో ఎక్కుమంది ఖైదీలుండడంతో, వారి సంఖ్య తగ్గించాలనే నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలు 1,350 మంది వరకు ఉన్నారని తెలియజేశారు. ఆరుగురు బంగ్లా దేశీయుల విడుదల విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఆరుగురు బంగ్లా దేశీయులు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి కొందరు బెంగళూరుకు కూలి పనుల కోసం వచ్చారు. వారిలో ఆరుగురు తిరిగి వెళ్తూ దారితప్పి విశాఖ చేరుకొని ఇక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కంచరపాలెం పోలీసులు విశాఖ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి సుమారు 5 నెలల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి వారు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంగళవారం వారి శిక్షా కాలం ముగియడంతో వారిని విడుదల చేసి కంచరపాలెం పోలీసులకు అప్పగించినట్టు జైలు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ వారిని ఎలా బంగ్లాదేశ్ పంపాలో పోలీసులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. -
వారి సంగతేంటో తేల్చండి..
సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మందికి ఎయిడ్స్ ఉందో! లేదో! జైలు అధికారులు నిర్ధారించాలని బుధవారం హై కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన ఏడు కొండలు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హై కోర్టుకు విన్నవించడంతో కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఎంత మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారు? వారికి ఆరోగ్యపరంగా ఇస్తున్న వైద్యం, పౌష్టికాహారం తదితర వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జైలు అధికారులు ఖైదీలకు ఇస్తున్న ఆహారం మందుల వివరాల నివేదికను అందజేశారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు గుడ్డు, 250 మిల్లీ గ్రాముల పాలు, వారంలో వంద గ్రాముల మాంసం, ప్రోటీన్స్, ఇతర ఏఆర్టీ మందులు ఇస్తామని హై కోర్టుకు తెలిపారు. అలాగే ఇతర జైళ్ల నుంచి కూడా హెచ్ఐవీ రోగులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపుతున్నారన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండడంతో గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని హెచ్ఐవీ రోగులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ నాలుగు జిల్లాలు హైవే కు ఆనుకొని ఉండడంతో లారీ డ్రైవర్లు, కూలీలు, రోడ్డు ప్రమాదం చేసి, హత్యలు చేసి హెచ్ఐవీ రోగులుగా జైలుకు వస్తున్నారని జైలు అధికారులు హై కోర్టుకు వివరించారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ రోగులు 19 మంది బయట నుంచి వచ్చారని, అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్ఐవీ టెస్ట్‌లలో బయటపడ్డాయని కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఆగస్టు రెండో తేదీకి వాయిదా వేసింది. -
27 మంది ఖైదీలకు ఎయిడ్సా?
సాక్షి, అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ ఉందా? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా? అనే విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీరందరికీ అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో కూడా తమకు తెలియచేయాలంది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 2018లో జీవిత ఖైదును విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి 2019లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్నానని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రి జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. అసలు జైల్లో ఎంత మంది ఖైదీలు ఉంటారని ధర్మాసనం ఆరా తీసింది. 1500 మంది వరకు ఉండొచ్చునని పీపీ చెప్పగా, ఇంతమంది ఎయిడ్స్‌తో బాధపడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లోకి వచ్చే ముందు ఖైదీలకు తప్పనిసరిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేసింది. ఆ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని తెలిపింది. అసలు వారికి వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించింది. జైల్లోకి వచ్చాక వీరు ఎయిడ్స్ బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తప్పవని హెచ్చరించింది. -
అతి తక్కువకు బిర్యానీ కాంబో ప్యాక్
వేడి వేడి బిర్యానీ తినాలనుందా? వెరైటీగా అరిటాకులోనా? అది కూడా కేవలం 127 రూపాయలకే. అయితే కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలుకి ఆర్డర్ ఇవ్వాలి. అక్కడి జైలు అధికారులు ఖైదీలతో నోరూరించే వేడి వేడి బిర్యానీలను తయారుచేయించి స్థానిక ప్రజలకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో బిర్యానీ కాంబో ధరని 127 రూపాయలుగా నిర్ణయించారు. నాణ్యత కు నాణ్యతా, రుచికరమైన బిర్యానీ అతి తక్కువ ధరలో అం దుబాటులోకి రావడంతో కేరళలోని వియ్యూరు ప్రజలు జైలు బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. 300 గ్రాముల బిర్యానీ, ఒక రోస్టెడ్ చికెన్ లెగ్ పీస్, మూడు చపాతీలూ, ఒక కప్ కేక్, సలాడ్, పచ్చడి, ఒక లీటర్ వాటర్ బాటిల్‌తో పాటు సాంప్రదాయబద్ధంగా అరిటాకుని కూడా ప్యాక్ చేసి కాంబో ప్యాక్‌లో ఇస్తారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తో ఒప్పందం చేసుకుని జైలు నుంచి పార్శిళ్లను వినియోగదారుల ముంగిళ్లలోకి చేర్చే ఏర్పాటు చేశారు జైలు అధికారులు. కేరళ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ ఎంటర్ప్రైజెస్ ద్వారా 2011 నుంచే అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఆన్లైన్లో అమ్మకాలు మాత్రం ఇదే తొలిసారి అని వియ్యూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నిర్మలానందన్ నాయర్ వెల్లడించారు. 2011 నుంచి ఖైదీలు చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 100 మంది ఖైదీలు రోజుకి 25,000 చపాతీలు, 500 బిర్యానీలు తయారు చేస్తుండటం జైలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
‘ఆ జైల్లో కత్తులు, సిగరెట్లు, మొబైల్ ఫోన్లు’
లక్నో : ప్రయాగరాజ్‌లోని సెంట్రల్ జైల్లో ఖైదీల విశృంఖల ప్రవర్తన వెలుగుచూడటంతో యూపీ పోలీసులు సదరు జైలులో దాడులు చేపట్టారు. ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలులో పోలీసులు జరిపిన దాడుల్లో సిగరెట్లు, మొబైల్ ఫోన్లు, లైటర్లు, కత్తులు వంటి మారణాయుధాలు సైతం లభ్యమవడం కలకలం రేపింది. మూడు గంటల పాటు పోలీసులు జైలులో చేపట్టిన తనిఖీల్లో పలు నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ జైలులో కొద్ది రోజుల కిందట ఖైదీలు పార్టీ చేసుకున్న సందర్భంలో వారి విచ్చలవిడి ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మద్యం సేవించిన ఖైదీలు కత్తులతో వీరంగం వేసిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తనిఖీలు చేశారు. కాగా గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్‌ను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్‌కు బదిలీ చేయడంతో నేరస్తులైన షార్ప్ షూటర్లు ఉదయ్ యాదవ్, రనూ, రాజ్ కుమార్, గదూ పశి వంటి ఖైదీలు సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు వెలుగు చూశాయి. ఉన్నావ్ జైలులోనూ ఖైదీలు వీరంగం వేసిన దృశ్యాలు కలకలం రేపాయి. జైలు బ్యారక్ల్లోనే వారు మద్యం సేవించి పార్టీ చేసుకున్న దృశ్యాలు వెల్లడయ్యాయి. -
జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని లుథియానా సెంట్రల్ జైల్లో పోలీసులకు, ఖైదీలకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు, ఆరుగురు ఖైదీలు గాయపడ్డారు. సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన జైలు అధికారులు పోలీసులు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు, నలుగురు ఖైదీలను మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలతో పాటు జైల్లో ఉనన్న మరికొంత మంది ఖైదీలు పోలీసులపై ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు బలగాలు పరిస్థితిని మొత్తం అదుపులోని తీసుకొని ఖైదీలను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలను తిరిగి తీసుకొచ్చి జైలుకు తరలించారు. -
విశాఖ అడవివరం సెంట్రల్ జైల్ వద్ద అగ్నిప్రమాదం
-
గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం: గుండె పోటుతో సెంట్రల్ జైల్ జీవిత ఖైదీ మృతి చెందాడు. పోలీసులు, జైలు అధికారులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన తాతపూడి సత్యనారాయణ (49) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు లేచిన సత్యనారాయణ గుండెల్లో నొప్పిగా ఉందని అనడంతో జైలులో ఉన్న వైద్యులకు చూపించారు. వారి సూచనల మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జైలు గేటు వద్దకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మృతుడు 2017 మే నెలలో భార్య హత్య కేసులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదీ విధించడంతో శిక్ష నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యను హత్య చేయడంతో శిక్షపడి జైలుకు వచ్చినప్పటి నుంచి కుమారులు, కుటుంబ సభ్యులు, బంధువులు పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై అస్వస్థతతో ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. జైలు అధికారులు మృతుడి కుమారుడు తాతపూడి శ్రీను కు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగించారు. సబ్ కలెక్టర్ సమక్షంలో పంచనామా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ సమక్షంలో సెంట్రల్ జైల్ ఖైదీ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. సబ్ కలెక్టర్ మృతుడి కుమారుడు శ్రీను, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సెంట్రల్ జైల్లో మృతుడు ఉన్న బ్యారక్‌లో ఉన్న ఖైదీల నుంచి వివరాలు సేకరించారు. గుండు నొప్పి వచ్చినపుడు హాస్పిటల్‌కు తరలించినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వన్‌టౌన్ ఎస్సై జుబేర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జైల్లో చెక్క పరుపుపై సల్మాన్
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం రాత్రి ఇక్కడి సెంట్రల్ జైలులో గడిపారు. బెయిల్‌పై ఆశలతో శుక్రవారం ఉదయం మేల్కొన్నారు. రాత్రికి ఆయన నిద్రించేందుకు జైలు అధికారులు నాలుగు దుప్పట్లు ఇచ్చారు. విలాసవంతమైన బెడ్‌పై నిద్రించే సల్మాన్ చెక్క పరుపుపై నిద్రించడం కష్టమైనా బెయిల్ లభిస్తే ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే ముంబయి తిరిగి వెళ్లేందుకు సల్మాన్ కోసం చార్టర్డ్ ఫ్లైట్ సిద్ధంగా ఉండగా, శిక్ష ఖరారు కావడంతో పోలీసు వాహనంలో ఆయనను జైలుకు తరలించారు. జైలుకు చేరుకున్న వెంటనే భావోద్వేగానికి గురైన సల్మాన్‌కు రక్తపోటు అధికమైంది. ఆ తర్వాత సాధారణ స్ధాయికి చేరుకుందని జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ చెప్పారు.సాధారణ ఖైదీలాగే సల్మాన్‌ను పరిగణిస్తున్నామని ఆయన వెల్లడించారు. రోటీ..దాల్ జైలులో రాత్రి సల్మాన్‌కు పప్పు, రోటీ అందించగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. సల్మాన్ పక్క సెల్లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూ ఉన్నారు. మరోవైపు సల్మాన్‌కు బెయిల్ దక్కేలా ఆయన న్యాయవాద బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ హైకోర్టులో సవాల్ చేయనున్నారు. తక్షణం బెయిల్ పొందేందుకే తొలుత సల్మాన్ లీగల్ టీం ప్రయత్నాలు సాగిస్తోంది. -
శ్రీనగర్ జైలులో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలులో జాతీయ దర్యాప్తు విభాగం (ఎన్ఐఏ) జరిపిన ఆకస్మిక సోదాల్లో పెద్ద మొత్తంలో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఐపాడ్, పెన్‌డ్రైవ్, పాకిస్తాన్ జాతీయ జెండా బయటపడ్డాయి. ఈ జైలులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. డ్రోన్ల నిఘా మధ్య, సిబ్బంది జైలు బ్యారక్లతోపాటు ఆవరణను క్షుణ్నంగా గాలించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద 25 సెల్ఫోన్లు, కొన్ని సిమ్ కార్డులు, 5 మెమరీ కార్డులు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక ఐపాడ్, జిహాదీ సాహిత్యంతో కూడిన కీలక పత్రాలు, పాక్ జాతీయ పతాకం లభ్యమయ్యాయి. -
జైలులోనూ ఎమ్మెల్యే కొడుకు అదే దూకుడు
సాక్షి, బనశంకరి: యుబీ సిటీలో ఒక రెస్టారెంట్ వ్యాపారవేత్త కొడుకు విద్వత్‌పై దాడికి పాల్పడిన కేసులో శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కొడుకు మహ్మద్ హ్యారిస్ నలపాడ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు అక్కడ కూడా తన దుందుడుకు తనం ప్రదర్శించాడు. జైలులో స్నేహితుడిపై దాడికి దిగాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఐదవ నిందితునిగా ఉన్న తన మిత్రుడు అబ్రాస్.. ‘నేను జైలుకు రావడానికి మీరే కారణం’ అని మహ్మద్ తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అబ్రాస్ పై మహ్మద్ కోపం పట్టలేక దాడికి దిగాడు. సెల్లో ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగిన విషయం తెలుసుకుని జైలు అధికారులు ఇద్దరిని విడిపించారు. అబ్రాస్ను మరో సెల్‌కు తరలించారు. విలపిస్తూనే భోజనం విద్వత్‌పై దాడి కేసులో నగరంలోని 8 వ ఏసీఎంఎం కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో బుధవారం సాయంత్రం మహ్మద్, మరో ఐదుగురిని పరప్పన జైలుకు తరలించడం తెలిసిందే. జైల్లో పెట్టిన అన్నం సాంబారును మహ్మద్ ఏడుస్తూనే తిన్నట్లు తెలిసింది. స్నేహితునితో గొడవతో అతని సెల్ వద్ద భద్రత పెంచారు. మిత్రులను వేర్వేరు గదులకు తరలించారు. మహ్మద్ హ్యారిస్‌పై గతంలో కూడా ఇటువంటి దుందుడుకు ఘటనలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. 2016వ సంవత్సరం జూన్‌లో యూబీ సిటీలోని పార్కింగ్‌లో కారు తీయడంలో ఆలస్యం చేసినందుకు మహ్మద్ ఒక యువకునిపై దాడికి పాల్పడగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, తండ్రి, ఎమ్మెల్యే హ్యారిస్ రాజకీయ పలుకుబడితో ఘటనను పెద్దది కాకుండా చేశారని సమాచారం. అదే సంవత్సరం ఆగస్ట్‌లో శాంతినగర లోని ఓ పబ్‌లో, కొద్దిరోజుల అనంతరం బౌరింగ్ క్లబ్లో బౌన్సర్లపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దయానంద కాలేజీ విద్యార్థి సౌరవ్‌పై తన తమ్ముడు ఒ మర్తో కలసి దాడి చేయడమే కాకుండా రూ.10లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా, ఒక కార్పోరేట్ రంగంలోకి దిగి మహ్మద్‌ను చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ కుమార్తెను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కు తగ్గాడు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలతో పార్టీలు... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల çకుమారులతో కూడా మహ్మద్‌కు మంచి సంబంధాలున్నాయని సమాచారం. ప్రతీనెలా వీరంతా యూబీ సిటీలో పార్టీలు విందు వినోదాల్లో మునిగి తేలుతుంటారు. -
విదేశీ ఖైదీల విడుదల
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఫీల్ ది జైల్’లో భాగంగా సంగారెడ్డి జిల్లా పాత కేంద్ర కారాగారంలో రెండు రోజుల పాటు గడిపిన ఇద్దరు మలేషియా దేశస్తులు సోమవారం విడుదలయ్యారు. రోజుకు రూ.500 చొప్పున చెరో రూ.వేయి చెల్లించిన వీరు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో సాధారణ ఖైదీలకు కల్పించే సౌకర్యాలనే జైలు అధికారులు వీరికి కూడా కల్పించారు. ప్రపంచంలో ఈ రకమైన అవకాశం ఎక్కడా లేనందునే.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని మరీ వచ్చామని ‘సాక్షి’కి వెల్లడించారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ యజమాని కెల్విన్ ఇద్దరూ స్నేహితులు. మలేషియాలోని జైలు మ్యూజియాన్ని సందర్శించిన వీరు ఇతర దేశాల్లోనూ జైలు మ్యూజియాల గురించి ఇంటర్నెట్లో శోధించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారం (పాత)లో ‘ఫీల్ ది జైల్’ అనే వినూత్న అవకాశం ఉన్నట్లు తెలిసింది. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌ను ఫోన్లో సంప్రదించిన వీరు.. ఫీల్ ది జైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన వీరు.. ఈ నెల 27న సంగారెడ్డికి చేరుకుని ‘ఫీల్ ది జైల్’ కోసం రూ.500 చొప్పున రెండు రోజుల కోసం ఇద్దరూ కలిసి రూ.2వేలు రుసుం చెల్లించారు. అనంతరం జైలు అధికారులు వీరికి సాధారణ ఖైదీల తరహాలో దుస్తులు, దుప్పట్లు తదితర సామగ్రి అందజేశారు. రెండు రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరూ సోమవారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు.. ‘సాధారణ ఖైదీల తరహాలోనే రెండు రోజుల పాటు జైలు దుస్తులు ధరించాం. ఖైదీలకు ఇచ్చే అన్నం, పప్పు జిల్లా జైలు నుంచి తెప్పించి అందించారు. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు. సెల్‌ఫోన్, ఇతర కమ్యూనికేషన్ సాధనాలేవీ మాతో పాటు అనుమతించలేదు. దినచర్యలో భాగంగా మొక్కలకు నీళ్లు పట్ట డం, జైలు ఆవరణ శుభ్రం చేయడం వం టి పనుల్లో పాల్గొన్నాం. రెండు రోజుల పాటు ఒక ఇంగ్లిష్ దినపత్రికను అందించారు. 48 గంటల పాటు మేం అనుభవించిన జైలు జైవితాన్ని ఇంటర్నెట్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఐదురోజుల పర్యటనలో భాగంగా రెండు రోజులు జైలులో గడిపాం. మరో మూడురోజులు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి స్వదేశానికి తిరిగి వెళ్తాం’ అని వెల్లడించారు. కాగా ఫీల్ ది జైల్లో ఇప్పటి వరకు 47 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇందులో ఏడుగురు మహిళలు సైతం ఉన్నారు. కర్ణాటక, మహా రాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా రాగా, తొలిసారి ఇద్దరు విదేశీయులు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. -
సెంట్రల్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
వరంగల్: వరంగల్ సెంట్రల్‌జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌ను కలెక్టర్ అమ్రపాలి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలు చదువుతో పాటు కంప్యూటర్ నేర్చుకోవాలని సూచించారు. విడుదలైన ఖైదీలకు రుణాలు, డబుల్బెడ్రూం ఇళ్లు, మహి ళా ఖైదీలకు కుట్టు మిషన్లు, సిబ్బంది ఉండే క్వార్టర్స్‌లో చిల్రన్స్‌పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జైలు సూపరింటెండెంట్ మురళీబాబు మాట్లాడుతూ జైళ్ల శాఖ డీజీపీ వినోయ్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ అనే ఖైదీ స్వయంగా గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్ అమ్రపాలికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జైలు ఉప పర్యవేక్షణ అధికారి జీఎం.శ్రీనివాస్, జైలర్లు నిరంజన్‌రెడ్డి, నర్సింహస్వామి, సక్రూ, అరుణ్‌కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్, ఎం.శ్రీధర్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వేలూరు కోర్టుకు మురుగన్
వేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించాడని నమోదైన కేసులో మురుగన్ అనే నిందితుడిని మంగళవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది మార్చి 26వ తేదీన జైలు అధికారుల తనిఖీ సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గదిలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. వేలూరు జేఎం -1 కోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నది. ఈనెల 2వ తేదీన నిందితుడిని నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అరక్కోణం డీఎస్పీ కుందలింగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి అలిసియా ముందు హాజరుపరిచారు. జైలు వార్డర్లు నందకుమార్, పెరుమాల్, బాగాయం ఎస్ఐ ప్రభాకరన్‌లను న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేయగా పోలీసులు బందోబస్తు నడుమ మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. కాగా, ఈ కేసులో జైలులోని ఏడుగురు సాక్షులను విచారణ జరపాలని కోరుతూ మురుగన్ తరపు న్యాయవాది అరుణ్‌కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కారాగారంలో కలకలం
రాజమహేంద్రవరం క్రైం: సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కోటనందూరు మండలం, అల్లిపూడికి చెందిన చింతకాయల రవి (21) గంజాయి కేసులో ఈ నెల 10వ తేదీన తుని రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని ఆ మర్నాడు సెంట్రల్ జైలుకు రిమాండుకు తరలించారు. శనివారం రాత్రి ఖైదీలను లాకప్‌లో వేస్తుండగా రవి లేనట్టు గార్డులు గుర్తించారు. అతడి కోసం గాలించగా, అదే బ్లాక్ మెట్లపై ఉన్న రేకుల షెడ్డుకు టవల్‌తో ఉరి వేసుకొని కనిపించాడు. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వన్‌టౌన్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్సై రాజశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు సిబ్బందిని జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ సస్పెండ్ చేశారు. చీఫ్ హెడ్ వార్డర్ రమణ, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించే పవన్, దామోదర్‌తోపాటు, మరో ఇద్దరు సస్పెండైనవారిలో ఉన్నారు. రిమాండు ఖైదీ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ చెప్పారు. ఎన్నో అనుమానాలు.. రవి ఆత్మహత్యపై అతడి మేనమామ బత్తిన శ్రీను, అల్లిపూడి ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, మరో మేనమామ, సర్పంచ్ అంకంరెడ్డి సత్యంమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవి ఆత్మహత్యకు పాల్పడేంతటి పిరికివాడు కాదని వారంటున్నారు. వారి కథనం ప్రకారం.. రవి హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రూ.వెయ్యి తీసుకున్నాడు. హైవే మీదకు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు కారు ఎక్కాడు. తుని రూరల్ పరిధిలో పోలీసులు కారును ఆపి తనిఖీ చేస్తుండగా, కారుకు సంబంధించినవారు పారిపోయారు. రవి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై గంజాయి రవాణా కేసు నమోదు చేసి జైలులో పెట్టారని వారు చెబుతున్నారు. మరెన్నో ఆరోపణలు ఇదిలా ఉండగా, వారు చెబుతున్నదాని ప్రకారమే.. జైలులో రిమాండు ఖైదీలను ఒక బ్లాక్‌లో ఉంచి, మూడు నాలుగు రోజులు పరిశీలిస్తారు. రవిని చోరీ కేసుల నిందితులను ఉంచిన బ్లాక్‌లో ఉంచారు. అంతేకాకుండా రిమాండు ఖైదీలను జైలులో జరిగే నిర్మాణ పనులకు ఉపయోగించారు. తనకు ఒంట్లో బాగోలేదని అన్న రవిని జైలు అధికారులు వేధించారని అతడి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రవి మనస్తాపానికి గురయ్యాడని అంటున్నారు. రవి ఆత్మహత్యపై జైలు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలులో ఉరి వేసుకున్న ప్రాంతం కూడా చేతికి అందేంత ఎత్తులోనే ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ రాదన్న ఒత్తిడితోనే.. రవి ఆత్మహత్యపై జైలు అధికారులు భిన్న కథనం వినిపిస్తున్నారు. గంజాయి కేసులో బెయిల్ రాదనే ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్లు రాజారావు, రఘు చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారు విలేకర్లతో మాట్లాడుతూ.. గంజాయి కేసులలో సాధారణంగా బెయిల్ రాదని, దీనితో మనస్తాపం చెందిన రవి ఆత్మహత్యకు ప్పాడ్డాడని అన్నారు. సమగ్ర విచారణ జరుపుతాం : సబ్ కలెక్టర్ రవి మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ అతడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీలో రవి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా అనే అంశాన్ని బంధువుల సమక్షంలో పరిశీలించారు. వారిని ఓదార్చారు. వారు వ్యక్తం చేసిన అనుమానాలపై సమగ్ర విచారణ జరుపుతామని, సెంట్రల్ జైలులో సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరాగా ఉంటాడనుకుంటే.. అనంత లోకాలకు.. అల్లిపూడికి చెందిన సత్యవతి, కన్నాపాత్రుడు దంపతులకు కుమారుడు రవితోపాటు, ఉమ, మరో కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందడంతో రవి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు అతడి మృతితో తమ కుటుంబం వీధిన పడిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లి సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
చెరగని ముద్ర..
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం : జిల్లాలో ఏడు సబ్‌జైళ్లు ఉండగా, జిల్లా కేంద్రం కాకినాడలోని సబ్‌జైలును స్పెషల్ సబ్‌జైలుగా ఆధునికీకరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఖైదీలకు ఆధునాతన వసతులు కల్పిస్తున్నారు. ఖైదీల మనస్సులు నిర్మలంగా ఉండేలా వారితో యోగా చేయిస్తున్నారు. అంతేకాదు ఓంశాంతి వారి శాంతిసందేశాలను అందిస్తున్నారు. న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి ఖైదీలు సత్ప్రవర్తన కలిగేలా వారికి వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. లీగల్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీల కోసం స్పెషల్ సబ్‌జైలులో మినరల్ వాటర్, రైస్ కుక్కర్లు, డైనింగ్ టేబుళ్లు, గార్డెన్, çషవర్‌బాత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సబ్‌జైలు ఆవరణ పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. అలాగే ఖైదీల కోసం వచ్చే బంధు, మిత్రులు కూర్చోవడానికి షెల్టర్, తాగడానికి మంచినీరు కల్పించారు. లోపలికి వెళితే ఇదొక జైలులా కాకుండా ఆశ్రమానికి తలపించేలా తీర్చిదిద్దారు. సువిశాలమైన గదులు, గదులన్నింటిలో ఫ్యాన్లు అమర్చారు. ఆటవిడుపుగా కేరమ్స్, చెస్, చదువుకోవడానికి పుస్తకాలు, చూడడానికి టీవీ సౌకర్యాలను కల్పించారు. ఖైదీలను ఎమర్జెన్సీగా ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. సబ్‌జైలులో ఉండే ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో వారానికి రెండుసార్లు మాట్లాడే అవకాశాన్ని జైల్ అధికారులు కల్పించారు. ఖైదీల ఆరోగ్యం సబ్ జైలులో ప్రత్యేకంగా ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేశారు. మెనూలో మార్పులు ఉదయం టిఫిన్, వారంలో రెండు రోజులు చపాతి, అందులో బంగాళదుంప కూర, మరో రెండు రోజులు గోధుమనూక, వరినూక ఉప్మా, రెండు రోజులు పులిహోర, ఒక రోజు పొంగలి పెడుతున్నారు. నెలలో మొదటి ఆదివారం మధ్యాహ్నం మేక మాంసం, రెండు, మూడు, నాలుగు వారాలు కోడిమాంసం, మంగళవారం కోడిగుడ్డు ఇస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో పాటు ఆకు కూర పెడుతున్నారు. సాయంత్రం కాయగూరల భోజనం పెడుతున్నారు. సీసీ కెమెరాల నిఘా ఖైదీల కదలికలు, వారి మానసిక పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు సబ్‌జైలులో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారి సత్ప్రవర్తనను కూడా తెలుసుకుంటున్నారు. ‘‘జైళ్లు సంస్కరణాలయాలుగా ఉండాలి. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి’’ ఇదీ మహాత్ముడి ఆశయం. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు. ‘‘సెంట్రల్ జైలైనా.. సబ్ జైలైనా.. ఒక్కసారి అందులోకి వెళితే నరకం అనుభవించాల్సిందే..’’ అనే ఒకప్పటి మాటను కూడా జైలు అధికారులు మరచిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం చెరసాలలను అధునాతన మార్పులతో ఖైదీల్లో పరివర్తన తెచ్చే శాలలుగా మార్చేస్తున్నారు. తమదైన శైలిలో ‘చెర’గని ముద్ర వేస్తున్నారు. -
సెంట్రల్ జైలును గెస్ట్‌హౌస్‌లా మార్చేశారు !
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును తమిళనాడు గెస్ట్‌హౌస్‌లా మార్చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్రంలో నిజాయితీ అధికారులకు ఆత్మహత్య భాగ్యం, బదిలీ భాగ్యం కలిగిస్తున్న కీర్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ అన్నారు. ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలను మీడియా వీడియోలు, ఫొటోల రూపంలో ప్రసారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు. ఇలా అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తెచ్చే అధికారులను బదిలీ చేయడం, వేధించడం చేస్తే రాష్ట్రంలో ఏ అధికారి విధులు సరిగ్గా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే నెల 12,13,14 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగళూరు విచ్చేయనున్నారని, రాష్ట్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే దిశలో ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశనం చేయనున్నారన్నారు. 150 అసెంబ్లీ సీట్లు గెలిచే విధంగా ఆపరేషన్ 150 లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు. -
కన్నీటితో వెళుతున్నా..
కుమారుడిని చూసేందుకు అనుమతించలేదని మురుగన్ తల్లి ఆవేదన వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెళుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్ తల్లి చోమని అమ్మాల్ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్ విసాతో తమిళనాడు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది. అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేధించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళినిని చూసేందుకు కూడా అనుమతించలేదన్నారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు. -
పరారే...పరారీ !
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారం నుంచి 2014 డిసెంబరు 28వ తేదీన నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది. నలుగురు జీవిత ఖైదీలు పరారైన సమయంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులను బలవంతంగా సెలవుపై పంపించారు. ఒక డిప్యూటీ సూపరింటెండెంట్‌ను, ఇద్దరు జైలర్లను, ఇద్దరు హెడ్ వార్డర్లను కలిపి మొత్తం ఆరుగురిని సస్పెండ్ చేశారు. ఆ సంఘటనలో ఏడాదిపాటు గాలింపు చర్యలు చేపడితే పరారైన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే రామచంద్ర, రవికుమార్, దేవలు పట్టుబడ్డారు. మరో ఖైదీ హనుమంతు ఇంకా పోలీసులకు చిక్కలేదు. తాజాగా కడప కేంద్ర కారాగారం పెట్రోలు బంకులో ఓపెన్ ఎయిర్ జైలు విధానంలో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్.యల్లప్ప కూడా రూ. 10 వేలు డబ్బులతో జైలు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఎవరిపైన చర్యలు తీసుకుంటారోనని జైలు శాఖ సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు పరారైన జీవిత ఖైదీ యల్లప్ప కోసం ఇప్పటికే ఒకవైపు జైలు అధికారులు, సిబ్బంది, పోలీసులు వేట ప్రారంభించినట్లు సమాచారం. -
ఈ ఏడాదీ క్షమాభిక్ష లేనట్టే?
నిరుత్సాహంలో జీవిత ఖైదీలు అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన రిపబ్లిక్ డే సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది ఖైదీల విడుదల లేనట్టేననిS జైల్ వర్గాల పేర్కొంటున్నాయి. గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 110 మంది పురుష ఖైదీలు, 14 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వం క్షమా భిక్ష ప్రసాదిస్తే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి కనీసం 100 మందికి పైగా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉండేది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఖైదీల కుటుంబాలకు నిరాశే మిగిలింది. – రాజమహేంద్రవరం క్రైం సాధారణంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తే కనీసం 90 రోజుల సమయం పడుతుందని జైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలకు సంబంధించిన నియమ నిబంధనలు వివరిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుంది. దాని ప్రకారం జైల్ అధికారులు ఖైదీల నేర వివరాలు, శిక్ష అనుభవించిన రోజులు, క్షమాభిక్షకు ఉన్న అర్హత, తదితర వివరాలు ఆధారంగా ఖైదీల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను ఐదు అంచలుగా పరిశీలించి చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి పంపుతారు. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం 90 రోజుల సమయం అవసరమని జైలు వర్గాలు చెబుతున్నాయి. అయితే రిపబ్లిక్ డేకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఈ ఏడాదికి ఖైదీల క్షమాభిక్ష ప్రకటించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. వరకట్న వేధింపుల కేసులోను, ప్రభుత్వ అధికారుల హత్యా కేసులలో శిక్ష పడి జైలుకు వచ్చిన ఖైదీలు ఏళ్లు తరబడి శిక్ష అనుభవిస్తున్నారు. సాధారణ కేసులలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ప్రభుత్వం ఈ రెండు కేసులలో మాత్రం ఇప్పటి వరకూ క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయలేదు. దీనితో 15 నుంచి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు. వయసు మళ్లడంతో అనారోగ్యంతో బాధపడుతున్నామని ఇప్పటికైనా తమకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకుంటున్నారు. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుంది. జీఓ విడుదల చేస్తే దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలలు పడుతుంది. రిపబ్లిక్ డే కే విడుదల చేయాలని నిబంధనలు లేవు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి విడుదలకు అవకాశం ఉది. ఇంకా 11 నెలలు ఉంది. ఈ ఏడాది క్షమాభిక్ష లేదని చెప్పలేం. – ఎం.చంద్రశేఖర్, కోస్తా రీజియ¯ŒS జైళ్ల శాఖ డీఐజీ -
భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వరంగల్ అర్బన్ పోలీస్‌లు ఇద్దరి కోసం నగరమంతా జల్లెడ పడుతున్నారు. భోపాల్ జైలు నుంచి సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న మాదిరిగానే దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి ఖైదీలు పరారయ్యారు. రెండు నెలల క్రితమే ఈ ఇద్దరిని చర్లపల్లి జైలు నుంచి ఇక్కడికి తరలించారు. సైనిక్ సింగ్ అనే ఖైదీ ఏకే-47 ఎత్తుకెళ్లిన కేసులో ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. మరొక ఖైదీ రాజేష్ యాదవ్ రంగారెడ్డి జిల్లాలో ఓ మర్డర్ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. ఈ ఇద్దరు చర్లపల్లి జైలులో సిబ్బందితో గొడవ పెట్టుకోవడంతో పాటు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో.. వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యారు. జైలులోని సీసీ కెమెరాలతో పాటు పెద్ద లైట్స్ కూడా పనిచేయకపోవడంతో వారి పని సులువైనట్లు తెలుస్తోంది. -
సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీ
-
పరారైన 8మంది ఉగ్రవాదుల హతం
-
సెంట్రల్ జైలును పరిశీలించిన అధికారులు
రాజమహేంద్రవరం క్రైం: తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్(ఆఫ్‌కా) ఉన్నతాధికారి సౌమ్య నాయకత్వంలో ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురేసి సభ్యుల బృందం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును సందర్శించింది. సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌ను, ఓపెన్ ఎయిర్ జైలును పరిశీలించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఖైదీలకు ఇస్తున్న వృత్తి విద్యల శిక్షణను పరిశీలించారు. జైలుæ పనితీరు, ఖైదీలకు అనుసరిస్తున్న సంస్కరణలు తదితర అంశాలను జైల్ సూపరిటెండెంట్ ఎం. వరప్రసాద్ వారికి తెలియజేశారు. -
మూడేళ్లలో ... ముప్పై మంది మృతి
సకాలంలో అందని వైద్యం మృతి చెందుతున్న ఖైదీలు జైలు ఆవరణలో ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితం రాజమహేంద్రవరం క్రైం: సకాలంలో వైద్యం అందక రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మృత్యువాత పడుతున్నారు. పోలీస్ రికార్డులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ముప్పై మంది మృతి చెందారు. అంటే ఏడాదికి పది మంది చొప్పున అసువులు బాస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సకాలంలో ఆసుపత్రులకు తీసుకువెళ్లకపోవడమే. కనీస సౌకర్యాలు కరువు... రెండు వేల మందికిపైగా ఖైదీలున్న ఈ కారాగారంలో ఉన్న ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలానే పైపై వైద్యానికే పరిమితమవుతోంది. ఖైదీల ఆరోగ్యం విషమించిందంటే రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందే. అక్కడ పరిస్థితి విషమిస్తే కాకినాడ ప్రభుత్వ హాస్పటల్‌కు రిఫర్ చేస్తారు. ఇక్కడా చేయి దాటిపోతే హైదాబాద్‌కు పంపించేవారు. రాష్ట్ర విభజన తరువాత విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఈ జాప్యం కారణంగా ఖైదీలు అర్థంతరంగానే మరణిస్తున్నారు. 50 పడకల ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితం... రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీలకు వైద్య చికిత్సలు అందించేందుకు రూ.10 కోట్లతో 50 పడకల ఆసుపత్రిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు న్నాయి. అయితే ఈ నిధులు నెల్లూరు జైలుకు తరలించడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎస్కార్ట్ కోసం పడిగాపులు... జైల్ నుంచి బయటకు తెచ్చి ఆసుపత్రికి తరలించాలంటే నిబంధనలు పాటించాల్సిందే. జైలు సిబ్బంది కాకుండా సివిల్ పోలీసుల ఎస్కార్ట్‌తో ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఇందుకోసం ఖైదీ వివరాలతో ఎస్పీకి లేఖ రాసి అనుమతి తీసుకోవాలి. ఈ తతంగా పూర్తయ్యే సరికి ఒకటి, రెండు రోజులు పడుతుంది. ఇవన్నీ కుదిరినా అంబులెన్స్‌లు లేకపోవడం, అవి ఉన్నా డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో రోగి రోగం విషమించి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రత్యేక ని«ధులు కేటాయించైనా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం... పరిస్థితిని బట్టి ప్రత్యేక నిధులు కేటాయించైనా ఖైదీలకు వైద్యం అందిస్తున్నాం. జైలు ఆవరణలోనే రూ.10 కోట్లతో ఆసుపత్రి నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు సాకారమైతే మంచి వైద్య సేవలను అందించవచ్చు. ఎం. వరప్రసాద్,రాజమహేంద్రవరం, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ -
సెంట్రల్ జైలును సందర్శించిన డీఐజీ
పోచమ్మమైదాన్ : వరంగల్ కేంద్ర కారాగారాన్ని డీఐజీ టి.ప్రభాకర్‌రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, పర్యవేక్షణాధికారి న్యూటన్ తదితరులు డీఐజీకి స్వాగతం పలకగా.. ఆయన జైలులోని పలు విభాగాలను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, వారి రోజు వారీ కార్యకలాపాలు తెలుసుకున్నారు. అలాగే, ఖైదీలు తయారుచేస్తున్న ఉత్పత్తులను డీఐజీ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షణాధికారి శ్రీనివాస్, జైలర్లు అశోక్‌రెడ్డి, నరసింహాస్వామి, డిప్యూటీ జైలర్లు సుభాష్, లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కారాగారాలు కిటకిట
రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగాలతో మొదలుకొని మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం ఇవి పనిచేస్తున్నాయి. కేంద్ర కారాగారాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది సామర్థ్యం కాగా ప్రస్తుతం 3,500 మంది ఉన్నారు. అలాగే, మహిళా కేంద్ర కారాగారం కెపాసిటీ 220 ఉండగా... ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్‌జైళ్లలో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నారు. అయితే, జైళ్ల శాఖ మాత్రం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకు గాను 1500 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. -
జైలు నుంచి 70మంది ఖైదీల విడుదల
వరంగల్ జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన సుమారు 70 మంది ఖైదీలు విడుదల అయ్యారు. ఖైదీల విడుదల విషయం తెలియడంతో ఖైదీల బంధువులు జైళ్ల వద్దకు చేరుకున్నారు. విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
నలుగురు ఖైదీల పరారీ
కలబురగి జైలులో ఘటన హుబ్బళ్లి : కలబురగి నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి నలుగురు విచారణ ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. హత్య ఆరోపణలతో అరెస్ట్ అయిన శివకుమార్, పోస్కో చట్టం కింద అరెస్ట్ అయిన సునీల్ కుమార్, నాగేంద్రప్ప, తాజుద్దీన్, లక్ష్మణలు ఒకే బ్యారక్ ఉంటున్నారు. నిందితులు పథకం ప్రకారం ఇనుప రాడ్లు విరగ్గొట్టి గోడపై విద్యుత్ ప్రసారం కోసం ఏర్పాటు చేసిన తీగల కింద రాళ్లను తొలగించి ఆ సందులోంచి పరారయ్యారు. ఈశాన్య రేంజ్ పోలీసు ఐజీ బీ.శివకుమార్, కలబురగి ఎస్పీ అమిత్‌సింగ్, రూరల్ డీఎస్పీ విజయ్ అంచి, ఫర్హతాబాద్ పోలీసు స్టేషన్ ఏఎస్పీ జైలు వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం కేంద్ర బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను, చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి నిఘా పటిష్టం చేశారు. తప్పించుకున్న విచారణ ఖైదీలను సత్వరం పట్టుకుంటామని ఈశాన్య రేంజ్ ఐజీ శివకుమార్ మీడియాకు తెలిపారు. -
సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
కడప: కడప సెంట్రల్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ మంగళవారం ఉదయం జైలు ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడిని కిందికి దించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యం, మానసిక కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. -
కడప సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ కలకలం
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్..
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
కడప: కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో వైపు పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. కాగా నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు సోమవారం సాయంత్రం అధికారుల కళ్లుగప్పి తప్పించుకు పోయారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పైకి ఎక్కారు. గోడపై ఉన్న విద్యుత్ తీగలపై గోనె సంచి పట్టలు వేసుకుని అవతలి వైపు దూకి పరారయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రవి, దేవ, అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్ర, కర్నూలు జిల్లాకు హనుమంతు అనే జీవిత ఖైదీలు పరారైనట్టు గుర్తించారు. -
సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రవి, రామచంద్ర, దేవ, హనుమంతు అనే జీవిత ఖైదీలు పారిపోయినట్లు తెలిసింది. -
రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దక్కిలి మండలం వెంగుళూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గానుగ శ్రీను(35) ఎర్ర చందనం స్మగ్లింగ్ పాల్పడుతుండగా.. పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో శనివారం అనారోగ్యానికి గురైన శ్రీనును పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట అతను మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులు హింసించడం వల్లే శ్రీను మృతిచెందాడని ఆరోపిస్తున్నారు. -
జైలు వార్డర్ కిడ్నాప్
రాజమండ్రి రూరల్ : రాజమండ్రి సెంట్రల్ జైలు వార్డర్ను కిడ్నాప్ చేసి రూ.10 వేలు డిమాండ్ చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగంపేట గ్రామానికి కంటిపూడి నరేంద్ర ఉద్యోగాలు వెతుక్కునేందుకు హైదరాబాద్ వెళ్లే నిమిత్తం సోమవారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలోని స్నేహితుడు, రాజమండ్రి సెంట్రలు జైలు వార్డర్ అయిన మురళీకిషోర్ ఇంటికి వచ్చాడు. స్నేహితులు ఫణి, ఆనంద్‌లతో కలిసి దివాన్‌చెరువులోని ఓ ధాబాకు వెళ్లాడు. అదే ధాబా వద్ద రాజమండ్రికి చెందిన పైడి శాండీ, కరుటూరి చాణక్య, షకిల్ సునందబాబు, అనిరుది శ్యామ్‌కుమార్‌లు అప్పటికే మద్యం తాగి ఉన్నారు. తాగిన మైకంలో వారు నరేంద్ర, అతడి స్నేహితులను పరుషపదజాలంతో తిడుతూ గొడవపడ్డారు. ఈలోగా నరేంద్ర జైలు వార్డర్ మురళీ కిషోర్‌కు ఫోన్లో విషయం తెలిపాడు. దీంతో ఆయన హుటాహుటిన దివాన్‌చెరువులోని ఆ ధాబావద్దకు వచ్చాడు. ఆయనను శాండీ, అతడి స్నేహితులు బీరు బాటిల్‌తో కొట్టి, బెదిరించి కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నరేంద్రకు వార్డర్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి రూ.10 వేలు ఇస్తే కానీ కిషోర్‌ను వదిలేది లేదని చెప్పారు. ఆ డబ్బులు తీసుకుని ఏవీ అప్పారావు రోడ్డులోకి కానీ, సెంట్రల్ జైల్ పెట్రోలు బంకు వద్దకు కానీ రావాలని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. దీంతో ఈ విషయాన్ని నరేంద్ర బొమ్మూరు పోలీసులకు తెలిపాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తామని చెప్పి పెట్రోలు బంకు వద్దకు పోలీసులతో కలిసి వెళ్లాడు. పోలీసులను గమనించిన నిందితులు వార్డర్ మురళీకిషోర్ను విడిచిపెట్టి పరారయ్యారు. నరేంద్ర ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కిషోర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డర్ కిడ్నాప్ కేసులో శాండీతోపాటు అతడి స్నేహితులు చాణక్య, సునందబాబు, శ్యామ్కుమార్లను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారినుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు యువకులూ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. -
గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం
రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన టి.మోహన వెంకట దుర్గా ప్రసాద్ ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, తనకు న్యాయవాదిని కేటాయించలేదంటూ దుర్గా ప్రసాద్ సోమవారం మధ్యాహ్నం స్నానాల గది తలుపు రేకుతో పీక కోసుకున్నాడు. రక్తస్రావం అవుతున్న అతన్ని జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. -
రేపిస్ట్‌ను కొట్టిచంపిన జనం
దిమాపూర్: నాగాలాండ్‌లో మహిళపై అత్యాచారం జరగడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన సుమారు నాలుగు వేలమంది జనం ఏకంగా సెంట్రల్ జైలులోకి చొచ్చుకెళ్లారు. నిందితుడిని బయటికి లాక్కొచ్చి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అనంతరం విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన గురువారం దిమాపూర్‌లో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని భావిస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్ (35) ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్. ఇరవయ్యేళ్ల నాగా యువతిపై ఫరీద్‌ఖాన్ గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా ఫరీద్‌ఖాన్‌ను సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌తో సుమారు నాలుగువేల మంది గుమిగూడి గురువారం సెంట్రల్ జైలుపై దాడికి దిగారు. పటిష్ట భద్రత ఉండే జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్‌ఖాన్‌ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ ముఖ్యకూడలి అయిన సిటీ టవర్ వరకూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పది వాహనాలకు నిప్పంటించారు. సిటీ టవర్ వద్ద ఫరీద్‌ఖాన్‌ను తీవ్రంగా కొట్టి చంపేశారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హింస ప్రబలకుండా దిమాపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించినట్లు ఎస్పీ జమీర్ తెలిపారు. -
నియంత్రణా? నియంతృత్వమా?
పిఠాపురం : అది సెంట్రల్ జైలూ కాదు, మరో రకంగా నిషేధిత ప్రాంతమూ కాదు. అత్యంత ప్రముఖులు ఉండే హై సెక్యూరిటీ జోన్ కాదు, రక్షణ రహస్యాలేవో పదిలపరిచిన చోటూ కాదు. నిత్యం పట్టణ ప్రజలు అనేక పనుల నిమిత్తం వచ్చిపోయే కార్యాలయం. అయితే.. ఎక్కడా లేనట్టు ఆ కార్యాలయంలో ప్రజలు ప్రవేశించడానికి నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు ఏ పని నిమిత్తమైనా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మాత్రమే తప్ప ఆ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం అటువైపు వెళ్లనే వెళ్లరాదు. ప్రజలతో పాటు పురపాలక సభ్యులకు సైతం ఈ సమయపాలన తప్పదు. ఈ వేళల్ని ఉల్లంఘించకుండా కార్యాలయం గేటు మూసివేసి నిరంతరం సెక్యూరిటీ గార్డుల కాపలా ఏర్పాటు చేసారు. నిర్ణీత సమయం(3 నుంచి 5 మధ్య)లో లోపల అడుగు పెట్టాలన్నా గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఏపని మీద, ఎవరి కోసం వచ్చారు చెప్పి తీరాలి. ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారు, తిరిగి ఎప్పుడు బయటకు వెళ్లారు అనే వివరాలను కచ్చితంగా ఇచ్చి తీరాలి. నూతన సంవత్సర కానుకగా ఈ కఠిన నిబంధనలను జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల సమీక్ష నిర్వహించగా దళారుల బెడద ఎక్కువగా ఉందని కొందరు అధికారులు చెప్పారని, దానిని నివారించడానికి ఆయన ఆదేశంతోనే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అనేక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ‘ఫీల్డ్ వర్క్’ అంటూ మధ్యాహ్నం మూడు దాటితే సిబ్బందిలో అనేక మంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏపని చేయించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను ఇక్కడ విధించడమేమిటని దుయ్యబడుతున్నారు. సుమారు 70 వేల మంది ఉన్న పిఠాపురం ప్రజల సేవకు కేవలం రెండుగంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ లాంటి ఉన్నతాధికారిని కలవడానికి సమయాల్ని నిర్దేశిస్తే అర్థముంటుంది తప్ప ఏ పని చేయించుకోవాలన్నా ఇలా పరిమిత సమయం ఇవ్వడమేమిటని ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తమకు కూడా ఈ వేళల్ని విధించడం పట్ల పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మరో నలుగురికి ఉరి
-
మరో నలుగురికి ఉరి
ముషార్రఫ్‌పై దాడి కేసులో ఉగ్రవాదులకు శిక్ష అమలు లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం మరో నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేసింది. పదకొండేళ్ల క్రితం మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై దాడి కేసుకు సంబంధించి జుబైర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి, రష్యా పౌరుడైన అఖ్లాక్యూ అహద్‌లను పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లా జైలులో అధికారులు ఆదివారం ఉరి తీశారు. షెషావర్‌లోని సైనిక పాఠశాలపై తాలిబాన్ ఉగ్రవాదుల మారణహోమం తర్వాత పాక్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే జైలులో ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీశారు. ఫైసలాబాద్ సెంట్రల్ జైలులో మరణశిక్ష అమలుకు అవకాశం లేకపోవడంతో వీరిని కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు లాహోర్‌లో సెంట్రల్ జైలులో మరో నలుగురు ఉగ్రవాదులకు సోమ, మంగళవారాల్లో ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. -
సెంట్రల్ జైల్లో వ్యభిచారం చేయమని వేధిస్తున్నారు!
బెంగళూరు: ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఆశ్యర్యకరమైన అంశం. మహిళలకు ఎక్కడకు వెళ్లినా సరైన రక్షణ లేదనేది ఈ తాజా ఉదంతంతో మరోసారి రుజువైంది. నగరంలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నకొంతమంది మహిళా ఖైదీలను లైంగికంగా వేధిస్తున్నఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధిత మహిళా ఖైదీలు రాసిన రెండు లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. హైకోర్టు అడ్రస్ తో రాసిన ఆ లేఖలు ఫిర్యాదు బ్యాక్స్ లో వెలుగుచూడటంతో పెద్ద దుమారం రేపుతోంది. జైల్లో జరిగే ఆకృత్యాలపై బాధిత మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను మగ ఖైదీలతో వ్యభిచారం చేయాలని స్వయంగా జైలు వార్డన్లే వేధిస్తున్నారని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మగ ఖైదీల నుంచి జైలు వార్డెన్లు రూ.300 నుంచి 400 వరకూ తీసుకుంటున్నట్లు బాధిత ఖైదీలు పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తమను పెరోల్ పై బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించినట్లు మహిళా ఖైదీలు పేర్కొన్నారు. అయితే ఆ లేఖలపై తేదీ తదితర వివరాలు లేకపోయినా.. ఆ లేఖలు వచ్చి 10 నెలలుగా పైగా అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైధీల నిరాహర దీక్ష
-
ఆరేళ్ల తర్వాత వెలుగు చూసిన హత్యోదంతం
ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి నిందితులను విచారణ జరుపుతుండగా ఆరేళ్ల క్రితం జరిగిన మరో హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు మృతదేహాన్ని వెలికితీయించి దర్యాప్తు చేపట్టారు. వివరాలు మారళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. తాలూకాలోని నారసింగనహళ్లి సమీపంలోని అడవిలో కాలువ ఒడ్డున పూడ్చి పెట్టిన మృతదేహాన్ని గత నెల మే 30న డీవైఎస్పీ కోనప్పరెడ్డి, హసీల్దార్ సిద్ధలింగయ్యల సమక్షంలో గ్రామీణ పోలీసులు వెలికి తీశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నారాయణ స్వామి,రామాంజి అనే వ్యక్తులను విచారిస్తుండగా చంద్రశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణప్ప..ఆరేళ్ల క్రితం ఆనందకుమార్ అనే వ్యక్తిని హత్య చేసి మారళ్లి గ్రామం శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టాడని, తాము సురేశ్,హరీశ్,వెంకటేశ్‌తో కలిసి మృతదేహాన్ని మోయడానికి సహక రించినట్టు నిందితులు గుట్టు విప్పారు. దీంతో ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తహశీల్దార్ రమేశ్‌కుమార్, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్ఐ నవీన్‌కుమార్ శుక్రవారం మారళ్లి శ్మశానానికి వెళ్లి ఆనంద్(38) మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రధాన నిందితుడు కృష్ణప్ప సెంట్రల్ జైలులో ఉన్నాడని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటామన్నారు. హతుడు ఆనంద్‌కుమార్ భార్య లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త కృష్ణప్ప వద్ద డ్రై వర్గా పని చేసేవాడన్నారు, గొడవలు రావడంతో పని మానేశాడన్నారు. ఆ తర్వాత హఠాత్తుగా కనిపించకుండాపోయాడన్నారు, ఎప్పటికయినా వస్తారని ఇన్నేళ్లు వేచి చూసామని, ఇంతలోనే అతను హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారని వివరించింది. నిందితుడు కృష్ణప్ప ఫిల్టర్ ఇసుక దందా నిర్వహిస్తూ ఎదురు తిరిగినవారిని హత్యచేసేవాడని ఆమె ఆరోపించింది. సాక్ష్యాలను, శవాలను మాయం చేయడానికి తన వద్ద పని చేసే కూలీలను ఉపయోగించుకునేవాడని పేర్కొంది. -
జైల్లో హలో..హలో
ఖైదీలకు ఫోన్ సౌకర్యం నెల్లూరు(క్రైమ్) : చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీల్లో మానిసిక బాధను తగ్గించడంతో పాటు మానసిక పరివర్తన పెంపొందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందన్నారు. వొడాఫోన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుని రెండు ల్యాండ్లైన్లను కారాగారంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఖైదీ నెలకు ఎనిమిదిసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చన్నారు. ఖైదీలు తాము మాట్లాడే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోను నంబర్లను జైలు సిబ్బందికి అందించాలన్నారు. వారు ఆ నంబర్లను రిజిస్టర్ చేసుకుంటారన్నారు. ఖైదీలు మాట్లాడే ప్రతి మాటా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుందన్నారు. ఇప్పటికే చర్లపల్లి, చెంచల్‌గూడ, రాజమండ్రితో పాటు పలు కేంద్ర కారాగారాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ సౌకర్యం కల్పించడంపై ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కారాగారంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే ఆ శాఖ డీజీ కృష్ణంరాజు పర్యటన ఉన్న దృష్ట్యా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచిం చారు. ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన పాతజైలును సందర్శించారు. పాతజైలును త్వరలోనే సీకా (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్)గా మార్చనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోని జైలుశాఖ అధికారులకు, సిబ్బందికి ఇకపై నెల్లూరులోని సికాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆయన జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్‌తో మాట్లాడారు. ఐజీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. -
ఎక్కడి దొంగలు అక్కడికే!
-
హౌస్‌ఫుల్
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతోంది. దీంతో సెంట్రల్ జైలు హౌస్‌ఫుల్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులు, సిబ్బంది రోజురోజుకు పెరుగుతున్న ఖైదీల సంఖ్యను చూసి తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా కడప కేంద్ర కారాగారంలో వెయ్యి మంది ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, మంగళవారం ఖైదీల వివరాలను గమనిస్తే పరిమితికి మించి ఉన్నారు. మొత్తం 1491 మంది కేంద్ర కారాగారంలో ఉన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌తోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు మొత్తం కలిపి 181 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర కారాగారంలో 577 మంది పురుష జీవిత ఖైదీలు, 53 మంది మహిళా జీవిత ఖైదీలు ఉన్నారు. 842 మంది రిమాండ్ పురుష ఖైదీలు ఉన్నారు. 15 మంది రిమాండ్ మహిళా ఖైదీలు ఉన్నారు. మిగిలిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు రిమాండ్‌లో ఉన్నారు. జీవిత ఖైదీలకన్నా రిమాండ్ ఖైదీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా 842 మంది రిమాండ్ ఖైదీలలో కేవలం ఎర్రచందనం కూలీలే 540మంది ఉండడం విశేషం. వీరందరికీ బ్యారక్‌లలో, బ్లాక్‌లలో సౌకర్యం కల్పించడం జైలు అధికారులకు తలనొప్పిగా మారింది. వాటర్ ట్యాంకు ఉన్నా మంచినీటి కొరత కూడా ఉంది. నెల రోజుల నుంచి ఈ సంఖ్య ఇంచుమించు కొనసాగుతోంది. ఇరవై రోజుల కిందట చిత్తూరు జిల్లా నుంచి ఒకేసారి 200 మందికిపైగా ఎర్రచందనం కూలీలను రిమాండుకు తరలించడంతో వారిని ఇక్కడ ఉంచేందుకు అవకాశం లేక జైలు అధికారులు తమ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో కొంతమంది రిమాండ్ ఖైదీలను ఆయా ప్రాంతాల్లోని జైళ్లకే తరలిస్తున్నారు. -
నిర్మాత గాజుల నాగేశ్వరరావు కన్నుమూత
నిర్మాత గాజుల నాగేశ్వరరావు (50) ఆదివారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాఘవేంద్ర సినీచిత్ర పతాకంపై ‘సిబీఐ అరెస్ట్ వారెంట్, సెంట్రల్ జైల్’ అనే చిత్రాలను నిర్మించారు నాగేశ్వరరావు. తెలుగు చలన చిత్ర నిర్మాతల సంఘం ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేసింది. -
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల తిరుగుబాటు
-
తన్నుకుంటే.. తగ్గిస్తారు..
సాధారణంగా ఖైదీల సత్ప్రవర్తనను చూసి, వారి జైలు శిక్షను తగ్గించడం లేదా విడుదల చేయడం వంటివి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. కానీ.. థాయ్‌లాండ్‌లోని క్లాంగ్ప్రెమ్ సెంట్రల్ జైలులో మాత్రం అంతా రివర్స్. ఇక్కడ ఖైదీలు వేరొకరిని చితక్కొడితే.. జైలు శిక్షను తగ్గిస్తారు! నిజ్జంగా నిజం. ఇక్కడ ఖైదీలు తమ జైలు శిక్షను తగ్గించుకోవాలనుకున్నా.. పెరోల్ కావాలనుకున్నా జైలులో జరిగే కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. విదేశీ కిక్బాక్సర్లపై విజయం సాధిస్తే.. వారి కోరిక నెరవేరినట్లే. అందుకే ఈ సెంట్రల్ జైలులో నిర్వహించే ‘ప్రిజన్ ఫైట్’కు తెగ డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ఖై దీలు కిక్ బాక్సింగ్‌ను నేర్చుకుంటారు. ఈ పోటీల్లో గెలుపొందితే.. వారికి ప్రైజుమనీని ఇవ్వడంతోపాటు అధికారులు జైలు శిక్షను కొంతకాలం తగ్గిస్తారు. అయితే.. ఈ శిక్ష తగ్గింపు ఎవరికిపడితే వారికి ఇవ్వరట. జైలులో మంచిగా ఉన్నవారికే అవకాశమట. 2013 జనవరిలో ఈ తరహా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎందుకిదంతా అంటే.. 1774లో థాయ్‌లాండ్ వీరుడు నాయ్ ఖనోంటోమ్ బర్మా జైలులో ఉన్నప్పుడు అక్కడి రాజు ఆదేశానుసారం ఇలాగే 9 మంది వీరులను ఓడించి.. జైలు నుంచి విడుదల పొందాడట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీరిక్కడ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
సెంట్రల్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ
-
జిల్లాలో సెంట్రల్ జైలు నిర్మాణానికి చర్యలు
గన్నవరం, న్యూస్‌లైన్: జిల్లాలో సెంట్రల్ జైలు నిర్మాణానికి అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని జైళ్ళ శాఖ డెరైక్టర్ జనరల్ పి.కృష్ణంరాజు తెలిపారు. స్థానిక సబ్‌జైలును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. జైలు పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ఇక్కడ కల్పిస్తున్న భోజన, వసతి సదుపాయలు గురించి ఖైదీల వద్ద ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కేసరపల్లి సమీపంలో సెంట్రల్ జైలు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆ స్థలాన్ని ఐటీపార్కుకు కేటాయించడంతో జైలు నిర్మాణం నిలి చిపోయిందన్నారు. జైలు నిర్మాణానికి అనువైన స్థలం దొరక్కపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు. ఇందుకోసం నున్న, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను పరిశీలించాల్సి ఉందన్నారు. విజయవాడ జైలును అభివృద్ధి చేయడంతో పాటు ఆదనపు బ్యారెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 జైళ్ళలో పూర్తిస్థాయి లో భోజనం, వసతి సదుపాయాలను సమకూర్చటంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో అధునీకరణ పనులను చేపడుతున్నామని చెప్పారు. సిబ్బంది కొరతను నివారించేందుకు కొత్తగా ఎం పికైన 533 మంది మహిళా సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి త్వరలో పోస్టింగ్‌లు ఇస్తున్నట్లు తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ళశాఖ డీఐజీ నరసింహం, జిల్లా జైళ్ళశాఖ అధికారి ఎస్కె.నబీఖాన్, విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఈశ్వరయ్య, స్థానిక సబ్‌జైలర్ యు.ఉపేంద్రరావు పాల్గొన్నారు. -
హమ్మ.. తోట..
ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలు చేసి పోలీసుల అదుపులో ఉన్న తోట వెంకట రమణ శుక్రవారం కోర్టు వద్ద పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. కడప సెంట్రల్ జైలులో ఉంటున్న తోట వెంకట రమణను కోర్టులో హాజరు పరిచేందుకు శుక్రవారం ఎస్కార్టుతో కోడూరుకు తీసుకు వచ్చారు. కోర్టు ఆవరణంలో ఎస్కార్టును తోసేసి పారిపోతుండగా పట్టుకుని స్థానిక పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. - న్యూస్‌లైన్, రైల్వేకోడూరురూరల్ -
ఖైదీలు చేసిన వస్తువుల విక్రయం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు సెంట్రల్ జైలులోని ఖైదీలు తయారు చేసిన వస్తువుల విక్రయాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. సెంట్రల్ విశ్రాంతి భవనంలో ఉంచిన ఈ స్టాల్స్‌ను కార్మిక సంక్షేమ న్యాయమూర్తి మంజు ల ప్రారంభించారు. అనంతరం జైలు ఆవరణలో ఖైదీల బంధువుల కోసం విశ్రాంతి గదిలో ఫ్రీడమ్ అమ్మ క్యాంటీన్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాలాన్ని వృథా చేయకుండా జైలులోపల లెదర్ చెప్పులు, షూలు, కీచైన్, బెల్టు వంటివి తయారు చేయడం అభినందనీయమన్నారు. అలాగే జైలు ఆవరణలో ముళ్లంగి, ఉర్లగడ్డలను పండించి స్టాల్స్‌లో ఉంచారన్నారు. ఖైదీల కోసం ఈ నెల 8వ తేదీన బార్బర్ షాప్, పురుషుల బ్యూటీ పార్లర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రజలకు తక్కువ ధరకు విక్రయించేందుకు జైలు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మదురైలో మహిళల కోసం ప్రత్యేక జైలును ఏర్పాటు చేస్తున్నారని ఇందుకోసం అక్కడ అవసరమైన ఫర్నీచర్ పూర్తిగా ఖైదీలు తయారు చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన క్యాంటీన్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఖైదీల బంధువులకు అవసరమైన ఆహారం, తిను బండారాలను ఈ క్యాంటీన్లో ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఖైదీలు తయారు చేసి స్టాల్స్‌లో ఉంచిన వస్తువులను ఆమె పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్ కరుప్పన్, అడిషనల్ సూపరింటెండెంట్ క్రిష్ణకుమార్, మహిళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, జైలు అధికారులు పాల్గొన్నారు. -
సెంట్రల్ జైల్లో గం‘జాయ్’
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :అనేక నేరాలకు క్షణికావేశమో, విచక్షణాజ్ఞానాన్ని నశింపజేసే మత్తో కారణమవుతుంటాయి. నేరాలకు పాల్పడి, శిక్షలు పడ్డ వారిని చెడునడత నుంచి తప్పించి, సంస్కరించడమే జైళ్ల లక్ష్యం. అయితే అలాంటి చోటే ఖైదీలకు మాదకద్రవ్యాలు యథేచ్ఛగా అందుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలకు గంజాయి సరఫరా అయిన ఘటనలే ఇందుకు సాక్ష్యం. కాసులకు కక్కుర్తిపడి కొందరు అధికారులు, సిబ్బంది ఈ అక్రమానికి పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తనిఖీల్లో బయటపడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడమూ ఇందుకు కారణమవుతోంది. జైలు గార్డుల్లో కొందరు రాత్రి షిఫ్ట్‌లకు వెళ్లే సమయంలో గంజాయిని బూట్లలో, తినుబండారాల్లో పెటి లోపలికి చేరవేస్తున్నారు. 50 గ్రాముల గంజాయిని జైలులోకి తరలిస్తే గార్డుకు రూ.500 చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇలా తరలించిన గంజాయిని లోపల నమ్మకస్తులైన ఖైదీల ద్వారా బీడీల్లో కూరి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గంజాయి కూరిన రెండు బీడీలు రూ.50, నాలుగు బీడీలు రూ. 100 చొప్పున అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ, తెలంగాణ ప్రాంతాల నుంచి.. జిల్లాలోని ఏజెన్సీ నుంచి, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయిని కొంతమంది గార్డుల ద్వారా జీవిత ఖైదీలకు అందజేస్తారు. గంజాయి గార్డుల ద్వారానే కాక ఖైదీలకు బంధువులు ఇచ్చే తినుబండారాల ద్వారా కూడా సరఫరా అవుతోంది. జైల్లో ఉన్న ఒక ఖైదీని చూసేందుకువచ్చిన బంధువులు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి ఉన్నట్టు అధికారులు తనిఖీలలో గుర్తించారు. దీనిపై అధికారులు ఖైదీపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 23న రాత్రి డ్యూటీకి వెళ్లిన వార్డర్ నెంబర్ (168) సీహెచ్ రమేష్ 150 గ్రాముల గంజాయితో పట్టుపడ్డాడు. మెయిన్గేట్టు వద్ద విధులు నిర్వహిస్తున్న చీఫ్ హెడ్ వార్డర్ సుబ్రహ్మణ్యం రమేష్‌ను తనిఖీ చేయగా అతడి బూట్లలో గంజాయి లభించింది. గతంలో ఇలాంటి సంఘటలు అనేకం జరిగినా అధికారులు ముద్దాయిలు, వార్డర్ల వద్ద లంచం తీసుకుంటూ వాటిని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన శక్తివేలు అనే ముద్దాయికి హై సెక్యూరిటీ వార్డు బ్లాక్ వద్ద రెండో టవర్ నుంచి నరేష్ అనే వార్డర్ సెల్ ఫోన్ అందించిన సంఘటన కూడా జైలు సిబ్బంది లంచగొండితనానికి ఉదాహరణ. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు ముద్దాయి శక్తివేలు నుంచి, వార్డర్ నరేష్ నుంచి లంచం తీసుకుని వదిలి వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డర్‌పై విచారణ జరుగుతోంది.. ఈ నెల 23న శనివారం సెంట్రల్ జైల్లోకి గంజాయిని తీసుకువెళుతున్న వార్డర్‌కు మెమో ఇచ్చాము. దీనిపై విచారణ జరుగుతోంది. జైల్లోకి వెళ్లే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి వారినీ క్షుణంగా తనిఖీ చేసి పంపుతున్నాం. ఎవరి వద్దనైనా మాదకద్రవ్యాలు లభిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జైల్ లోపల గంజాయి అమ్మకాలు జరగడం లేదు. గస్తీని ముమ్మరం చేశాం. - కె.న్యూటన్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ -
బళ్లారి సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ
సాక్షి, బళ్లారి : బళ్లారిలోని సెంట్రల్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న బిజాపూర్ జిల్లా సింధిగి తాలూకా గుండిగి గ్రామానికి చెందిన రేబన్న (21), అయ్యాళప్ప (23) ప్రహారీ గోడ దూకి చాకచక్యంగా తప్పించుకున్నారు. సెంట్రల్ జైలులో 5-డీ బ్లాకులో ఉంచిన ఈ ఇద్దరు ఖైదీలు కిటికీలు పగులగొట్టి, పంచెలను తాడుగా చేసుకుని ప్రహరీగోడ ఎక్కి (20 అడుగుల ఎత్తు ఉన్న), అక్కడి నుంచి దూకి తప్పించుకుని పరారయ్యారని జైలు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు హొస్పేటలో హత్య కేసుకు సంబంధించి 2012 నుంచి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలు తప్పించుకున్నారని తెలిసిన వెంటనే జైళ్ల శాఖ డీఐజీ విశ్వనాథయ్య బళ్లారి సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. జైలు ప్రహారీ గోడ చుట్టూ కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఖైదీలు పరారయ్యారన్నారు. ఇందుకు బాధ్యులైన విశ్వనాథ్, కృష్ణ హుయిలగోళ అనే ఇద్దరు గార్డులను సస్పెండ్ చేశామన్నారు. ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలా ఉండగా ప్రహారీ గోడకు విద్యుత్ వైర్లు అమర్చినప్పటికీ, వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతోనే ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రహారీ గోడకు ఉన్న విద్యుత్ వైర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని పసిగట్టిన ఖైదీలు కట్టుకున్న పంచెలనే తాడుగా ఉపయోగించి తప్పించుకున్నారు. 700 మంది ఖైదీలు జైలులో ఉంటే వారిని కాపలా కాయడానికి ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఎలా కాపలా కాయాలని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్, డీఎస్పీలు జైలను పరిశీలించి వివరాలు సేకరించారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యుకుహరం
కడప అర్బన్, న్యూస్‌లైన్: క్షణికావేశంలో చేసిన నేరానికి జీవిత ఖైదు పడిన ఎంతో మంది కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. తమ శిక్షాకాలంలో సత్ప్రవర్తనతో మెలిగి అధికారులు తయారు చేసే సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో చేరి జైలు నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవనం గడపాలని భావించేవారు అనేకమంది ఉన్నారు. చాలామంది ఖైదీల్లో పూర్తి పరివర్తన వచ్చినా అసలు జైలు నుంచి విడుదలయ్యేంత వరకైనా ప్రాణాలతో ఉంటామా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురై ఏ క్షణాన ప్రాణాలు గాలిలో కలుస్తాయోనని భయపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 మంది అనారోగ్యంతో మృత్యువాతపడ్డారు. ఖైదీలు సరాసరిన నెలకొక్కరు అనారోగ్యంతో ప్రాణాలొదులుతున్నా జైలు అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. జైలులో ఖైదీలు ఆకస్మికంగా ఎందుకు మరణిస్తున్నారనే విషయంపై ప్రత్యేక దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జైలులో అన్ని రకాల ఖైదీలకు కలిపి ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఒకే ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఉదయం 9 గంటలకు వచ్చి హడావుడిగా వైద్యపరీక్షలు నిర్వహించి మధ్యాహ్నానికంతా వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కానీ జైలు అధికారులు మాత్రం ఉన్న ఒక వైద్యుడు ఉదయం 9 నుంచి వైద్యసేవలు అందిస్తున్నారని, మందుల కొరత లేదని చెబుతున్నారు. అధికారుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి తేడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వివిధ విద్యాసంస్థల్లో, ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లే కడప కేంద్ర కారాగారంలో కూడా తరచుగా వైద్య శిబిరాలు నిర్వహించి వారిని వే ధిస్తున్న వ్యాధులను గుర్తించి మందులు అందజేయడమో లేదా మెరుగైన వైద్యానికి సిఫార్సు చేయడమో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇటీవల ఖైదీల సంక్షేమ దినోత్సవం రోజున ఖైదీలందరి తరపున ఓ వృద్ధ ఖైదీ ఇంత పెద్ద కేంద్ర కారాగారంలో ఒకే వైద్యుడు ఉన్నారనీ, మందులు లేవని సాక్షాత్తు కలెక్టర్ కోన శశిధర్‌కు విన్నవించుకున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి డాక్టర్ల నియామకం, మందుల సరఫరా, ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జీవితఖైదీలలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఖైదీల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు 2012 మార్చి 13న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సుంకమ్మ గుడి సమీపంలో కొత్త కొట్టాలు నివాసి కె.మల్లికార్జున(36) (సీటీ నంబర్ 4316) అదే నెలలో 26వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి నగరం, లాలయ్యకుంటకు చెందిన సుధా అలియాస్ సుధాకర్(33) 2013 జనవరి 7వ తేదీన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం ఈడిగవీధికి చెందిన ఈడిగ చప్పల నాగేంద్రయ్య(61) (సీటి నంబర్ 3776) జూన్ 8వ తేదీన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వరయ్య మండలం మందిగప్ప గ్రామానికి చెందిన తెల్లికి వెంకటేసు(28) సెప్టెంబర్ 23న తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా, తిరుత్తణి మండలం మద్దారు గ్రామానికి చెందిన ఏ.చక్రవర్తి(35) సెప్టెంబర్ 21న కర్నూలు జిల్లా రుద్రవరం మండలం, చెరవాలి గ్రామానికి చెందిన మాలకుడాల రాముడు అలియాస్ స్వామిదాస్(58) సెప్టెంబర్ 27న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పాలకుబస్టాండు, పూలమార్కెట్ వీధిలో నివసిస్తున్న గోవిందు అలియాస్ జి.కుమార్ (సీటీ నంబర్ 928) అక్టోబర్ 7న కర్నూలు జిల్లా వెలుగొడు మండలం గట్టితాండ గ్రామానికి చెందిన తోట చెంచు మద్దిలేటి అలియాస్ మద్దెలగోడు (41) (సీటీ నంబర్ 8602) ఆదివారం తెల్లవారుజామున 3.30గంటలకు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తికి చెందిన కొర్రపాడు బాలకొండయ్య(42) (సీటీ నంబర్ 3917) ఒకే డాక్టరే ఉన్నారు కేంద్ర కారాగారంలో దాదాపు 1100 మందికి పైగా ఖైదీలున్నారు. వీరందరిని చూసేందుకు ముగ్గురు వైద్యులు అవసరం. కేవలం ఒక్కరే అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్‌ను కలిసి వైద్యులను పంపించాలని కోరాం. ప్రతి శనివారం రిమ్స్‌లో కొందరు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. - వెంకటరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం. -
జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు
రాంచీ: రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశానికి రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలు సోమవారం వేదికగా నిలిచింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అదే జైలులో ఖైదీగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో అరగంట పాటు సంభాషించారు. భేటీ ప్రాధాన్యం ఏమిటీ? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఇది పూర్తిగా వ్యక్తిగతం అంటూ అభిజిత్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ తగిన విధంగా స్పందించింది. ఆ పార్టీ నేత సిద్ధార్థ్నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల విషయంలో లాలూ వెన్నంటి ఉంటామని చెబుతూ ఆయనతో భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. -
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, రాజమండ్రి : విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్‌పై ఓ కేసులో నిందితులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్, మరో విలేకరి ఎం.సోమరాజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక కేంద్ర కారాగారం వద్ద ఉన్నారు. దినచర్యలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జైలు ముందుండగా, కొందరు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. ఎక్కువ మంది ఉండడంతో వారు ప్రధాన కేసులో నిందితులనే భావంతో ఫొటోలు తీసేందుకు సోమరాజు, ప్రసాద్‌లు ముందుకు వచ్చారు. పోలీసు వాహనం దిగిన నిందితులు వెనువెంటనే ఆ ఇద్దరిపై దాడి చేశారు. గరగ ప్రసాద్‌ను దారుణంగా కొట్టారు. కెమేరా లాక్కుని, అనుచిత పదజాలంతో దూషించారు. కెమేరాను జైల్లోకి తీసుకుపోయారు. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడంతో వారిద్దరూ భయభ్రాంతులకు గురయ్యారు. జైలు అధికారుల సాయంతో కెమేరాను బయటకు రప్పించగలిగినా, విలువైన ఫొటోలున్న మెమొరీ కార్డులను మాత్రం నిందితులు తస్కరించి, సాయంగా వచ్చిన తమ వారితో మాయం చేశారు. కుట్రపూరిత దాడి వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణపై ఉప్పాడ వద్ద జరిగిన దాడి కేసులో ఈ నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న ఈ ఏడుగురిని రిమాండుకు తరలిస్తుండగా, ‘సాక్షి’ పాత్రికేయులు తారసపడగానే.. సహచరులతో గుర్తుపట్టి.. ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఈ దాడిని పాత్రికేయులు తీవ్రంగా ఖం డించారు. అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తిని కలిసి సంఘటనను వివరించారు. దాడికి బాధ్యులైన వారిని వదిలేది లేదని ఎస్పీ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ బందన సురేష్, బందన రమణ, బందన నందీప్, వేలుగు సూరిబాబు, ఉమ్మిడి బాగర్తి, కారె పెంటయ్య, మెరుగు కృష్ణలతో పాటు వీరికి సాయంగా వచ్చి, దాడికి పాల్పడ్డ మరికొందరిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు సీఐ కేటీవీ రమణారావు తెలిపారు.ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి ఈ దాడిని ఖండించారు. -
కలగానే కేంద్ర కారాగారం
నగర శివారులో సారంగపూర్ వద్ద గల జిల్లా జైలును కేంద్ర కారాగారంగా (సెంట్రల్ జైలు) మార్చాలన్న అంశం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. స్థల సేకరణ అంశం కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. రెవెన్యూ అధికారులనుంచి స్పందన కరువైందని తెలుస్తోంది. సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : గతంలో జిల్లా జైలు ఖిల్లాలో ఉండేది. తర్వాత సారంగాపూర్ వద్ద 56 ఎకరాల స్థలాన్ని సేకరించి నూతన జైలును నిర్మించారు. ఇందులో 15 ఎకరాలను వ్యవసాయం, సిబ్బంది నివాసాల కోసం కేటాయించారు. 2007లో జైలును ఖిల్లా నుంచి సారంగపూర్‌కు మార్చారు. అన్ని హంగులతో నిర్మించిన ఈ జైలును సెంట్రల్ జైలుగా అప్‌గ్రేడ్ చేయాలని జైళ్ల శాఖ గతంలో ప్రతిపాదనలు పంపింది. గతేడాది ఉన్నతాధికారులు జిల్లా జైలును సందర్శించి వసతుల గురించి తెలుసుకున్నారు. సెంట్రల్ జైలుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్ జైలుకు వంద ఎకరాలు అవసరమని పేర్కొన్న అధికారులు కావాల్సిన భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే జిల్లా జైలుకు స్థలం కేటాయించే విషయంలో రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లా జైలులో ప్రస్తుతం 389 మంది ఖైదీలున్నా రు. దీనిని సెంట్రల్ జైలుగా మార్చితే రాష్ట్రంలో వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందినవారిని ఇక్కడికి తరలిస్తారు. ఇలా తరలిస్తే ఖైదీల కుటుంబ సభ్యులకు వారిని కల వడానికి సమయంతోపాటు ప్రయాణ భార మూ తగ్గుతాయని అధికారులు భావించారు. ఇదే ఆలోచనతో గతంలో కొందరు ఖైదీలను చర్లపల్లినుంచి నిజామాబాద్ తరలించారు. మరికొందరిని తరలించడానికి వీలుగా సెంట్ర ల్ జైలుగా మార్చాలని ప్రతిపాదనలు పంపా రు. పలువురు జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ఇందుకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా రు. తమవారు ఇక్కడికి వస్తే కలుసుకోవడం తేలికవుతుందని వారి ఆశ. అధికారుల నిర్లక్ష్యం తో అవి ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి. కాగా సారంగపూర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని జైలుకు కేటాయించకుండా కుంటిసాకులు చెబుతున్న రెవెన్యూ అధికారులు, అదే భూమిని రియల్టర్లు కబ్జా చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
సైకో జయ శంకర్ చిక్కాడు
ఐదు రోజుల పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సైకో జయ శంకర్ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడో కాదు పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలోని కూడ్లు చెరువు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరు, న్యూస్‌లైన్ : పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ అలియాస్ శంకర్‌ను ఓ ఫోన్ కాల్ పట్టిచ్చింది. దీంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు-హొసూరు రోడ్డులోని కూడ్లు గేట్ సమీపంలో చెరువు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో అతనిని శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ రహస్య ప్రాంతానికి తరలించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ... ‘తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన జయ శంకర్ మీద ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో అనేక హత్యలు, లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు డ్రైవర్‌గా పని చేసే వాడు. ఈ నెల 1న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బెంగళూరు నగర, బెంగళూరు సీసీబీ, చిత్రదుర్గ, శిర, బిజాపురలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేకృబందాలు ఇతని కోసం గాలించాయి. ఇతని ఆచూకీ కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పది వేల పోస్టర్లను అతికించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో 75 వేల కరపత్రాలు ముద్రించి పంచి పెట్టారు. ఎట్టకేలకు కూడ్లు గేట్ వద్ద పట్టుబడ్డాడు’ అని వివరించారు. జయ శంకర్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు. జైలు నుంచి అతను 30 అడుగుల గోడ దూకడానికి గ్లౌజ్‌లు, దుప్పటి ఉపయోగించాడని చెప్పారు. జయశంకర్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారని అడిగినప్పుడు, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇన్ఫార్మర్ పేరు చెప్పడానికి నిరాకరించారు. ఇన్ఫార్మర్కు తాము ఒక మొబైల్ ఇచ్చామని చెప్పారు. జయ శంకర్ నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, అదే రోజు జైలులోని గార్డెన్లో ఆ తాళం చిక్కిందని వివరించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. శంకర్ పోలీసు దుస్తులలో పారిపోలేదని, నైట్ డ్రెస్‌లో తప్పించుకున్నాడని తెలిపారు. అదే డ్రెస్‌తో శుక్రవారం పట్టుబడ్డారని అన్నారు. పోలీసులకు అభినందనలు.... మంత్రి జార్జ్ బెంగళూరు పోలీసులు సమర్థంగా పని చేశారని, అందువల్లే శంకర్ చిక్కాడని హోం మంత్రి జార్జ్ తెలిపారు. శంకర్ తప్పించుకోవడానికి జైలు సిబ్బంది సహకరించారని వెలుగు చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు అందిస్తామని తెలిపారు. రూ.100 ఇచ్చి నీరు, భోజనం కావాలన్నాడు: నరేంద్ర పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో కూడ్లు చెరువు ఉంది. కూడ్లు గేట్ కూడా సమీపంలోనే ఉంది. చేపలు పట్టేవారు చెరువు పక్కన చిన్న గుడిసె వేసుకున్నారు. చేపలు తగ్గిపోవడంతో ఆరు నెలల నుంచి ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు. గుడిసెకు కనీసం తలుపులేదు. శుక్రవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న నరేంద్ర, బాబు తదితరులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న శంకర్ తాగడానికి నీళ్లు కావాలని, ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేశాడు. అక్కడికెళ్లి ఇక్కడెందుకున్నావని వారు ప్రశ్నించగా, తాను తమిళనాడుకు చెందిన డ్రైవర్‌నని, ప్రమాదం జరగడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని వచ్చానని చెప్పాడు. కాళ్లు, చేతులకు గాయాలుండడంతో వారూ నిజమనుకున్నారు. వారికి రూ.100 నోటు ఇచ్చి భోజనం తెచ్చివ్వాలని కోరాడు. అదే సమయంలో బనశంకరిలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేయాలనడంతో బాబు అతనికి మొబైల్ ఇచ్చాడు. తర్వాత బాబు భోజనం తీసుకురావడానికి వెళ్లాడు. ఐదే నిమిషాల్లో పోలీసులు వచ్చి గుడిసెలోకి చొరబడిఅతని కాళ్లు, చేతులు కట్టి వేశారని నరేంద్ర మీడియాకు చెప్పాడు. తరువాత అతను సైకో శంకర్ అని తమకు తెలిసిందన్నాడు. ఆరు జీపులలో పోలీసులు వచ్చి శంకర్‌ను తీసుకు వెళ్లారని నరేంద్ర వివరించాడు.