శ్రీనగర్‌ జైలులో సెల్‌ఫోన్లు, జిహాదీ సాహిత్యం | NIA raids Srinagar central jail, seizes phones, Pakistani flag and jihadi material | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ జైలులో సెల్‌ఫోన్లు, జిహాదీ సాహిత్యం

Published Tue, Mar 13 2018 3:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

NIA raids Srinagar central jail, seizes phones, Pakistani flag and jihadi material - Sakshi

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని సెంట్రల్‌ జైలులో జాతీయ దర్యాప్తు విభాగం (ఎన్‌ఐఏ) జరిపిన ఆకస్మిక సోదాల్లో పెద్ద మొత్తంలో సెల్‌ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఐపాడ్, పెన్‌డ్రైవ్, పాకిస్తాన్‌ జాతీయ జెండా బయటపడ్డాయి. ఈ జైలులో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. డ్రోన్ల నిఘా మధ్య, సిబ్బంది జైలు బ్యారక్‌లతోపాటు ఆవరణను క్షుణ్నంగా గాలించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద 25 సెల్‌ఫోన్లు, కొన్ని సిమ్‌ కార్డులు, 5 మెమరీ కార్డులు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక ఐపాడ్,  జిహాదీ సాహిత్యంతో కూడిన కీలక పత్రాలు, పాక్‌ జాతీయ పతాకం లభ్యమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement