jihadi
-
ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఫైర్..
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా జిహాద్ పిలుపు ఇవ్వడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ తీరు అసాధారణ ప్రవర్తనలా ఉందని, ఆయన పదవికి ఏమాత్రం తగనిదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. కశ్మీరీ కోసం నిలబడిన వారు జిహాద్ చేస్తున్నారని, ప్రపంచం వారిని పట్టించుకోకపోయినా పాకిస్తాన్ కశ్మీరీలకు బాసటగా నిలుస్తుందని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాము జిహాదీలకు మద్దతిస్తామని, తమతో అల్లా సంతోషంగా ఉండేదుకు తాము ఇలా చేస్తున్నామని ఇమ్రాన్ పేర్కొన్నారు. పొరుగు దేశంలా పాకిస్తాన్ వ్యవహరించడం లేదని రవీష్ కుమార్ మండిపడ్డారు. బాహాటంగా జిహాద్‌కు పిలుపు ఇవ్వడం అసాధారణ ప్రవర్తనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి వేదిక నేపథ్యంలోనూ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే బాధ్యతారాహిత్య ప్రకటనలు చేశారని రవీష్ కుమార్ ఆరోపించారు. -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు. -
శ్రీనగర్ జైలులో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలులో జాతీయ దర్యాప్తు విభాగం (ఎన్ఐఏ) జరిపిన ఆకస్మిక సోదాల్లో పెద్ద మొత్తంలో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఐపాడ్, పెన్‌డ్రైవ్, పాకిస్తాన్ జాతీయ జెండా బయటపడ్డాయి. ఈ జైలులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. డ్రోన్ల నిఘా మధ్య, సిబ్బంది జైలు బ్యారక్లతోపాటు ఆవరణను క్షుణ్నంగా గాలించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద 25 సెల్ఫోన్లు, కొన్ని సిమ్ కార్డులు, 5 మెమరీ కార్డులు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక ఐపాడ్, జిహాదీ సాహిత్యంతో కూడిన కీలక పత్రాలు, పాక్ జాతీయ పతాకం లభ్యమయ్యాయి. -
'ఆ రాక్షసికి తల్లయినందుకు బాధగా ఉంది'
'నాకో రాక్షసి పుట్టింది... జిహాదీతో ఆమె పెళ్లి ఆపేందుకు చైన్లతో కట్టేసి కూడ ప్రయత్నించాను. కానీ ఆపలేకపోయాను. చివరికి ఆమె అనుకున్నట్టుగానే సిరియా చేరిపోయింది' అంటూ ఐసిస్ పోస్టర్ గర్ల్ తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. ఇరవై ఏళ్ళ ఫాతిమా ధర్ఫరోవా సిరియా ప్రయాణాన్ని ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఫాతిమా సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా పోస్టులు చేసేదని తల్లి శాఖ్లా బోఖరోవా వెల్లడించింది. పారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను, రష్యన్ పర్యాటక విమానం కూల్చిన వారిని ఫాతిమా కీర్తించడం రష్యన్లకు ఆగ్రహం తెప్పించిందని, అతివాద ఇస్లామిక్ నియామకుడి ఆకర్షణలో పడి, నాలుగో భార్యగా మారిన కూతురి పై ఆ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తల్లీ ఇటువంటి రాక్షసులకు జన్మనివ్వాలని అనుకోదని, నిజంగా ఇటువంటి భూతానికి తల్లినైనందుకు చింతిస్తున్నానని బొఖరోవా అంది. ఒక ఉగ్రవాదికి తల్లిగా జీవించడం కంటే మరణించడం మేలని ఆవేదన వ్యక్తం చేసింది. 2014 లో సిరియాకు చేరిన 17 ఏళ్ళ సామ్రా కేసినోవిక్, ఆమె స్నేహితురాలు సబీనా సెలిమోవిక్ ఐఎస్ఐఎస్ పోస్టర్ గర్ల్స్ గా మారారు. ఆ తర్వాత జిహాదీల చేతిలో తీవ్రంగా హింసకు గురై హతమయ్యారు. ఇప్పుడు తన కూతురికీ అదే దుస్థితి దాపురిస్తుందని ఆ తల్లి తీవ్రంగా రోదిస్తోంది. ఫాతిమా చిన్నతనం నుంచి తనతో ఎంతో సన్నిహితంగా, ప్రేమగా ఉండేదని చెప్పింది. అయితే సైబీరియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాతే ఆమెలో ఎంతో మార్పు వచ్చిందని, సిరియా పారిపోయిన తన పెద్ద కూతుర్ని తిరిగి చూడగలనా అంటూ శాఖ్లా బోఖరోవా ఆవేదన చెందుతోంది. 'అక్కడ ఫాతిమా నిజంగానే ఓ రిక్రూటర్ గా ఉంటే... తూటాలకు బలవ్వక తప్పదు. ఉగ్రవాదులు ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టరు. ఆమె జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు. యూనివర్శిటీకి వెళ్ళిన తర్వాతే ఫాతిమాలో పూర్తిగా మార్పు చోటు చేసుకుంది. కనీసం కుటుంబంతో కలసి పండుగ చేసుకోవడానికి కూడ నిరాకరించేది. ఆమెలో రోజురోజుకూ వచ్చిన మార్పు చివరికి జిహాదీల వద్దకు చేర్చింది' అంటూ ఫాతిమా తల్లి రోదించింది. 'ఓసారి అబ్దుల్లా మా కుమార్తెను పెళ్ఙ చేసుకుంటానని పర్మిషన్ అడిగాడు. అప్పటికే ముగ్గురు భార్యలున్నారని, ఒక్కొక్కరికీ ముగ్గురు చొప్పున పిల్లలు కూడ ఉన్నారని చెప్పాడు. దాంతో నేను అస్సలు ఒప్పుకోలేదు. ఫాతిమా తనను ప్రేమిస్తోందని, తాను కూడ ఫాతిమాను ఇష్టపడ్డానని అబ్దుల్లా చెప్పాడు. నా కూతురితో మాట్లాడి ఆమె పెళ్లి నిర్ణయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. ఆమె ఉగ్రవాది కాకుండా కాపాడేందుకు ప్రయత్నించినా నా మాట వినలేదు. ఇక నా కూతుర్ని ఈ జన్మలో చూడలేను' అంటూ ఫాతిమా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. -
ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని
లండన్: యువతీ యువకులు పెద్ద ఎత్తున ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా బాటపడుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్న ప్రస్తుత తరుణంలో ఓ పాఠశాల విద్యార్ధిని.. కరడుగట్టిన జీహాదీని పెళ్లాడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన అమీరా అబ్బాసీ వయసు 16 ఏళ్లు. ఇంకా స్కూలింగ్ కూడా పూర్తికాలేదు. లండన్‌లో నివసిస్తోన్న ఆమె.. గత ఫిబ్రవరి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కొద్ది కాలానికి ఆమె జాడను కనిపెట్టిన నిఘావర్గాలు.. ఇద్దరు స్నేహితులతో కలిసి అబ్బాసీ సిరియాకు వెళ్లి ఐఎస్‌లో చేరినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, శనివారం నాడు ఆమె ఆస్ట్రేలియా జాతీయుడైన జీహాదీని పెళ్లాడినట్లు తెలిసింది. సదరు ఆస్ట్రేలియన్ జీహాదీ మామూలు వ్యక్తేమీకాదు.కరడుగట్టిన ఉగ్రవాది. ఐఎస్ విడుదల చేసిన పలు వీడియోల్లో తరచూ కనిపిస్తూంటాడు. పేరు అబ్దుల్లా ఎల్మిర్. రెండేళ్ల కిందట సిడ్నీలోని ఓ మాంసం దుకాణంలో పనిచేశాడు. ఆ తరువాత సిరియాకు వెళ్లి ఇస్లామిక్ జీహాదీగా మారిపోయాడు. అబ్బాసీతో తన వివాహం నిజమేనని ఇంటర్నెట్ ద్వారా తెలిపాడు ఎల్మిర్. అంతేకాదు.. లండన్‌లోని బకింగ్‌హం ప్యాలెస్.. వాషింగ్టన్‌లోని వైట్హౌజ్లపై ఐఎస్ఐఎస్ జెండా అధికారికంగా ఎగిరేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఆ క్రమంలో ఎన్ని దాడులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించాడు. ట్యునీషియాలో 36 మంది బ్రిటన్ పౌరుల్ని మట్టుబెట్టిన సోదర జీహాదీ చర్యను సమర్థిస్తూ బ్రిటిషర్లకు హెచ్చరికలు పంపాడు.