బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment