list release
-
పెళ్లినాటి ప్రమాణాలు
‘పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లయిన మరుసటి రోజే కనిపించవు’ అనే చమత్కారం మాట ఎలా ఉన్నా నవ వధువు సుచీత ముఖర్జీ మాత్రం పెళ్లినాటి ప్రమాణాల విషయంలో పక్కాగా ఉంది. పెళ్లిమండపంలో ఆహ్వానితుల సమక్షంలో చాంతాడంత పొడవు ఉన్న పెళ్లి ప్రమాణాల లిస్ట్ చదవడం మొదలు పెట్టింది. ‘ఇవి నెరవేర్చడం అంత సులువేమీ కాదు’ అని చదవడం మొదలు పెట్టింది. అవి విని పెళ్లికి వచ్చిన వాళ్లు నవ్వులే నవ్వులు. చివరికి వరుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 17.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘ఈ వీడియో సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదుగానీ పెళ్లి మండపంలో ఇలా చదవడం ఒక ట్రెండ్‌గా మారనుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే! భారత్ నుంచి మాత్రం..
లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది.ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్ఏంజెలెస్ నిలిచాయి. సర్వే ఎలా చేశారంటే.! ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్ ఉపాసన దత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు. మన నగరాలు చౌక ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి. టాప్–10 ఖరీదైన నగరాలు ఇవే 1. న్యూయార్క్ (అమెరికా) 1. సింగపూర్ 3. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) 4. హాంకాంగ్ 4. లాస్ ఏంజెలెస్ (అమెరికా) 6. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 7. జెనీవా ( స్విట్జర్లాండ్) 8. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) 9. పారిస్ (ఫ్రాన్స్) 10. కోపెన్హగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) -
46 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మరో 46 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. దీంతో బీజేపీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఈ అభ్యర్థులతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న 16 స్థానాల అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. బిహార్ కోసం ప్రకటించిన తాజా లిస్టులో రాష్ట్రమంత్రి నంద కిషోర్ యాదవ్, నితీశ్ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎం పార్టీలు కలసి పొత్తు గా ఏర్పడి, బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తు న్నాయి. మొత్తం 243 స్థానాలకుగానూ బీజేపీ 110, జేడీయూ 115, వీఐపీ 11, హెచ్ఏఎం 7 సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాగా మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అసెంబ్లీ సీట్లు కేటాయించి బరిలో దించవద్దని నిర్భయ జ్యోతి ట్రస్టు బిహార్‌లోని రాజకీయ పార్టీలను కోరింది. -
54 మందితో కాంగ్రెస్ జాబితా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించింది. అందులో కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ పటేల్ నగర్ నుంచి, ఆప్ నుంచి హస్తం గూటికి చేరిన అల్కా లాంబా చండీ చౌక్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు బీజేపీ భారీ ప్లాన్‌తో బరిలోకి దిగుతోంది. రానున్న 20 రోజుల్లో 5 వేల ర్యాలీలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలోని టాప్ 100 మంది నేతలు రోజుకు సుమారు నాలుగు ర్యాలీలు నిర్వహించేలా, ప్రతి ర్యాలీకి 200 మందిలోపే ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రచించింది. -
ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు. టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఈ మేరకు భారత్‌లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ .. ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరారు. ఆయన సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ లెక్కగట్టింది. అదానీ గ్రూప్.. ఎయిర్‌పోర్టులు మొదలుకుని డేటా సెంటర్ల దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం ఆయనకు కలిసివచ్చింది. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా సోదరులు మూడో స్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 2019లో 8 శాతం క్షీణించి 452 బిలియన్ డాలర్లకు తగ్గింది. టాప్ 100 సంపన్నుల్లో సగం మంది నికర సంపద గణనీయంగా తగ్గింది. ► ఈసారి కనీసం 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారిని ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో చేర్చింది. గతేడాది ఇది 1.48 బిలియన్ డాలర్లు. ►2019 జాబితాలో ఆరుగురు కొత్తగా చోటు సాధించారు. అల్కెమ్ ల్యాబరేటరీస్‌కి చెందిన సింగ్ కుటుంబం, బైజు రవీంద్రన్ (బైజూస్), మహేంద్ర ప్రసాద్ (అరిస్టో ఫార్మా), మనోహర్ లాల్.. మధుసూదన్ అగర్వాల్ (హల్దీరామ్ స్నాక్స్), రాజేష్ మెహ్రా (జాక్వార్), సందీప్ ఇంజినీర్ (ఆస్ట్రల్ పాలీ టెక్నిక్) వీరిలో ఉన్నారు. పన్ను చెల్లించే కోటీశ్వరుల్లో 20 శాతం పెరుగుదల న్యూఢిల్లీ: పన్ను చెల్లించే ఆదాయం రూ.కోటికిపైగా కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య 2018–19లో 20 శాతం పెరిగి 97,689కు చేరుకుంది. 2017–18లో వీరి సంఖ్య 81,344గానే ఉండేది. కార్పొరేట్, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), వ్యక్తుల గణాంకాలనూ కూడా కలిపి చూస్తే పన్ను వర్తించే ఆదాయం రూ.కోటిపైన ఉన్న రిటర్నుల సంఖ్య 2018–19లో 1.67 లక్షలకు చేరింది. 19 శాతం పెరిగింది. -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
ఢిల్లీలో త్రిముఖ పోరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పొత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌ల మధ్య నెలలుగా సాగుతున్న చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ కూడా సోమవారం ఆరు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ ఆసక్తి చూపినా, పంజాబ్, హరియాణ, చండీగఢ్ల్లోనూ పొత్తు ఉండాల్సిందేనంటూ ఆప్ పట్టుబట్టింది. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. పొత్తు కుదుర్చుకునేందుకు ఎన్నోసార్లు చర్చలు జరిపినా విషయం కొలిక్కిరాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. గతంలో ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ నుంచి, తూర్పు ఢిల్లీ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. దక్షిణ ఢిల్లీలో బరిలో దింపిన బాక్సర్ విజేందర్ 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతక విజేత. బీజేపీ కూడా తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. గతంలోనే ఆ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్‌ను, న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖిని బీజేపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో మోదీ గాలి వీచిన కారణంగా ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థులు.. ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బల్వీర్ సింగ్ జఖర్ గత గురువారమే నామినేషన్ దాఖలు చేయగా, పత్రాలను అసంపూర్తిగా నింపడంతో మరోసారి నామినేషన్ వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆయనను కోరింది. బల్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆప్ అభ్యర్థులందరూ సోమవారం నామినేషన్లు వేశారు. వీరందరూ వేర్వేరు చోట్ల నామినేషన్లు వేయగా, ఆప్ కీలక నేతలు వారి వెంట వచ్చారు. అంతకుముందు అభ్యర్థులందరూ రోడ్ షోలు నిర్వహించారు. మా ప్రభుత్వ విజయాలను వివరిస్తాం: షీలా ఢిల్లీలో, కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తామని ఈశాన్య ఢిల్లీ అభ్యర్థిని, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ చెప్పారు. ఢిల్లీలో జరగనున్న త్రిముఖ పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీలో, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. -
20 మందితో బీజేపీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో 20 మంది అభ్యర్థులను జాబితాను భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్‌నడ్డా ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 86 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. -
మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్‌గుప్తాలు టీడీపీ తరఫున పోటీచేస్తారని బుధవారం ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీడీపీ పోటీ చేయాలనుకుంటున్న 14 స్థానా ల్లో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టయింది. సామ ఎల్బీనగర్ స్థానాన్ని ఆశించగా, ఆయన్ను ఇబ్ర హీంపట్నం అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. ఇదేందబ్బా? ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ స్థానాలను అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నా రు. ఇబ్రహీంపట్నం స్థానా న్ని ఆశించిన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ బుధవారం మధ్యాహ్నమే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అదే స్థానాన్ని ఆశించిన మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్రనగర్ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ సైతం ఆ స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సీటును అనూహ్యంగా టీడీపీకి కేటాయించడంతో వారిద్దరూ ఆందోళన చెందుతున్నారు. -
టీఆర్ఎస్ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు?
టీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి.. రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌ను వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్‌గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్‌లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్రావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. అభ్యర్థుల తాజా జాబితా ఇదీ మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్ – దానం నాగేందర్ -
సీపీఐ అభ్యర్థులు..
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానా ల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండ మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయాబాయి లు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి బుధవారం జాబితా విడుదల చేశారు. అనంతం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను గద్దె దింపాలనే ఉద్దేశం తో మహాకూటమి ఏర్పాటైందని, సీట్ల కేటాయింపు లో కొంత అసంతృప్తి ఉన్నా కూటమి గెలుపు కోసం వాటిని పక్కన పెట్టినట్లు తెలిపారు. తమకు కేటా యించిన మూడు సీట్లే ఫైనల్ అని, నల్లగొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామే తప్ప మరోసారి కాంగ్రెస్‌తో సీట్ల గురించి మాట్లాడేది లేదన్నా రు. చాడ వెంకట్‌రెడ్డిపై రెబెల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్‌రెడ్డి విషయాన్ని ఆ పార్టీ పెద్దలు చూసుకోవాలన్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తమకు కేటాయించిన 3 సీట్ల నుంచే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. -
దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు అదృష్టం దక్కింది. కాంగ్రెస్ గొంతుకగా, టీపీసీసీలో తెరవెనుక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన శ్రవణ్‌కు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో శ్రవణ్‌తో పాటు మరో 9 మంది అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఇందులో చాలా మంది పాతకాపులే ఉన్నారు. జాబితాలో జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్), రమేశ్‌రాథోడ్ (ఖానాపూర్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (ధర్మపురి), విష్ణువర్ధన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), సి.ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు) ఉన్నారు. దీంతో కాంగ్రెస్ బుధవారం నాటికి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఇందులో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే 33 ఓసీ, 15 బీసీ, 15 ఎస్సీ, 8 ఎస్టీ, 4 మైనార్టీలున్నారు. ఓసీల్లో 29 మంది రెడ్డి కులస్తులకు టికెట్లివ్వగా, ముగ్గురు వెలమలు, ఒక బ్రాహ్మణ నేతకు అవకాశం దక్కింది. బీసీల్లో అత్యధికంగా ఆరు స్థానాలు మున్నూరుకాపులకు కేటాయించారు. నాలుగు సీట్లు గౌడ్లకు, యాదవ, పద్మశాలి, విశ్వకర్మలకు ఒక్కోటి చొప్పున ఇచ్చారు. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఇప్పటివరకు ప్రకటించినవి కాకుండా 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండటం, సామాజిక కోణంలో హైకమాండ్ ఈ స్థానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పొన్నాలకు మొండిచేయి పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ భంగపాటే ఎదురైంది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం, తాను ఆశిస్తున్న జనగామను టీజేఎస్‌కు కేటాయిస్తారన్న ప్రచారం జరగడంతో ఆయన మంగళవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, వయసు ఎక్కువ అయిందనే కారణంతోనే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించారనే చర్చ జరుగుతోంది. పొన్నాల సేవలను పార్టీలో ప్రత్యేకంగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెబెల్స్ బెడద.. రెండో జాబితాలో ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి, మేడ్చల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బరి లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ టికెట్‌ను ఆశించిన తోటకూర జంగయ్య యాదవ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్ టికెట్‌ను రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ హరినాయక్ వర్గీయులు గాంధీభవన్‌లో ఏకంగా ఆమరణ దీక్షకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి విషయంలో బీసీ కోటాలో సురేందర్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక్కడ టికెట్ ఆశించిన మరో నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రెబెల్‌గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన సుభాష్‌రెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకు న్నా అధిష్టానం మొండిచేయే చూపింది. -
కాంగ్రెస్ జాబితాకు అడ్డొచ్చిన అష్టమి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఈనెల 2న వెలువడనుంది. వాస్తవానికి గురువారమే తొలి జాబితా విడుదల చేయాల్సి ఉన్నా.. అష్టమి కావడంతో శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం రాహుల్ ఆమోదముద్ర వేస్తారని, శుక్రవారం తొలి జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో కాంగ్రెస్ పోటీ చేయనున్న స్థానాల్లో 2/3వ వంతు.. అంటే దాదాపు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. మిగిలిన జాబితాను మరో దఫా విడుదల చేస్తారని, అది ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే.. లేదంటే ఆ తర్వాత వస్తుందని తెలుస్తోంది. ఆశావహుల్లో ఉత్కంఠ ఇన్నాళ్లు ఎలాగొలా నెట్టుకొచ్చినా టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ పోటీ చేస్తుందని భావించిన వాటిలో 50కిపైగా స్థానాల్లో పెద్దగా సమస్యలు లేకున్నా మిగిలిన చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు నుంచి 30 మంది దాకా కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే అంచనాతో తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారు. అటు ఏఐసీసీ పెద్దలు, ఇటు టీపీసీసీ ముఖ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు వారంతా టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారా.. జాబితాలో తమ పేరు వస్తుందా లేదా అనే ఉత్కంఠలో గడుపుతున్నారు. -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు. -
‘నీతి’ ఆరోగ్య సూచీలో కేరళ టాప్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్య సూచీలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. వైద్యసదుపాయాలు, శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు, సంపూర్ణ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకుల రిపోర్టు’ పేరుతో నీతి ఆయోగ్–ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఇటీవల వైద్యప్రమాణాలు మెరుగుపరుచుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. జాబితాలో దారుణమైన పనితీరును కనబరిచిన రాష్ట్రాలుగా రాజస్తాన్, బిహార్, ఒడిశా నిలిచాయి. ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మెరుగైన వైద్యవసతులు కల్పిస్తున్న జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని.. ఈ జాబితా విడుదల సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. జాబితాలో తొలిస్థానంలో నిలవటం.. ఎల్డీఎఫ్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. తొలి మూడు తుది మూడు కేరళ బిహార్ పంజాబ్ రాజస్తాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ -
జిల్లా ఓటర్లు 29,55,432
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొత్తం 29,55,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుçషులు 14,93,260, మహిళలు 14,61,951, ఇతరులు 221 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.మల్లీశ్వరిదేవి సోమవారం తన చాంబర్లో విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రత్యేక ఓటరు నమోదు చేపట్టామన్నారు. ఇందులో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 ద్వారా 36,224 దరఖాస్తులు రాగా.. ఇందులో 33,886 ఆమోదించామని ఆమె తెలిపారు. 2,338 తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఫారం–7 ద్వారా అభ్యంతరాలు స్వీకరించగా 12,955 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 12,098 ఆమోదించామన్నారు. 817 తిరస్కరణకు గురయ్యాయన్నారు. జిల్లాలో 1,902 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతివెయ్యి మంది పురుష ఓటర్లకు 979 మంది మహిళా ఓటర్లు, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు 680 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 5,805 మంది చనిపోయిన, 1,508 మంది శాశ్వతంగా గ్రామం వదిలివెళ్లిన, 6,303 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.