
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించింది. అందులో కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ పటేల్ నగర్ నుంచి, ఆప్ నుంచి హస్తం గూటికి చేరిన అల్కా లాంబా చండీ చౌక్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు బీజేపీ భారీ ప్లాన్‌తో బరిలోకి దిగుతోంది. రానున్న 20 రోజుల్లో 5 వేల ర్యాలీలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలోని టాప్ 100 మంది నేతలు రోజుకు సుమారు నాలుగు ర్యాలీలు నిర్వహించేలా, ప్రతి ర్యాలీకి 200 మందిలోపే ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రచించింది.
Comments
Please login to add a commentAdd a comment