న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ వరసగా రెండోసారి డకౌట్ అయింది. ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడింది. వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీ అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1998–2013 సంవత్సరం మధ్యలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ రాజధాని కళను సంతరించుకుంది. అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆ పార్టీ పునాదుల్నే కదిలించేసింది.
చివరికి పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో వెల్లువెత్తిన నిరసనలకు కేవలం కాంగ్రెస్ పార్టీ బహిరంగ మద్దతు తెలిపింది. ఢిల్లీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కలసి పోటీ చేసింది. అందులో 66 మంది కాంగ్రెస్ తరపున, మరో నలుగురు ఆర్జేడీ తరఫున బరిలో దిగారు. అందులో కాంగ్రెస తరఫున పోటీలో నిలిచిన 66 మందిలో 63 మంది అభ్యర్థులు కనీసం 5శాతం ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్లు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment