హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సంకుల సమరమే
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది.
ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్...
గర్హీ సంప్లా కిలోయీ
హుడా కంచుకోట
రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్‌స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.
బద్లీ బీజేపీకి గట్టి పరీక్ష
బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్‌దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు.
హోదాల్ బరిలో పీసీసీ చీఫ్
ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్‌కు టికెటిచి్చంది.
హిస్సార్
బీజేపీకి జిందాల్ సవాల్!
అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్‌నివాస్ రారా బరిలో ఉన్నారు.
తోశాం
వారసత్వ పోరు
కాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.
కైతాల్
బరిలో సుర్జేవాలా జూనియర్
కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది.
జూలానా
హై ప్రొఫైల్ పోరు
ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.
అంబాలా కంటోన్మెంట్
కాంగ్రెస్‌కు ఇంటి పోరు
బీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
ఉచానా
జేజేపీ అడ్డా!
మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.
లడ్వా
సీఎం సైనీకి పరీక్ష!
గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.
ఎలెనాబాద్
ఐఎన్‌ఎల్‌డీకి అగి్నపరీక్ష
జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment